ఈ నెల ఫోకస్: తెలుగు కవిత్వం

“సామాన్యుడి అవగాహనకు అందుబాటులో లేని విషయాన్ని అందిస్తుంది కనుకనే కవిత్వం ఆవశ్యకత. అందుకే అది నిత్యనూతనంగా అద్భుతంగా ఉంటుంది. సామాన్యుడి చెప్పలేని విషయాలు చెప్పగలదు కనుక, మూగవానికి మాటలు వచ్చినంత అద్భుతంగా ఉంటాయి. అనిర్వచనీయమైన విషయాలు కవి వచించగలడు కనుకనూ, మిగితావాళ్లు ఆ భాషకి మూగవాళ్లు కనుకనూ, కవిత్వమంటే మహా నిశ్శబ్ధాన్ని బద్దలు కొట్టుకు వచ్చే “మూగవాని కేక” అని కూడా నిర్వచించచ్చు!” – కవి ఇస్మాయిల్.

కవిత్వం – మనం అనుభూతించగలిగీ బయటకు వ్యక్తీకరించలేని భావాలను మనకి పునఃపరిచయం చేస్తుంది. అందుకే ఒక్క సారి చదివి పక్కకు పెట్టేసేది కవిత్వం కాదనిపిస్తూ ఉంటుంది. ఒక్కో సారి, ఒక్కో దృక్కోణాన్ని పరిచయం చేస్తూ ఉంటుంది. మనలో మనకే తెలీకుండా మూలన పడి ఉన్న భావాలకి ఒక కొత్త ఊపిరిని ఇస్తాయి. స్తబ్ధత ఏర్పడ్డ భావాలకి కదలికని అందిస్తుంది కవిత్వం. నవ్వు గానో, బాధ గానో బయటకు రప్పిస్తుంది.

అలా మీతో పాటు నిలిచిపోయిన తెలుగు పద్య, గేయ, వచన కవితలను అందరితో పంచుకునే వీలుగా ఈ నెల ఫోకస్ కు: “తెలుగు కవిత్వం” ఫోకస్ అనే అంశాన్ని ఎంపిక చేశాము. కావ్యాలూ, కవిత్వాలూ, తెలుగు కవుల పరిచయాలే కాక, ఓ కవిత మీతో ముడిపడిన వైనాన్ని కూడా తెలియజేయవచ్చు. మీ వ్యాసాలను editor@pustakam.net కు పంపగలరు.

గమనిక: తెలుగు కవితల పై కాని వ్యాసాలను కూడా ఈ నెలలో ప్రచురిస్తాము. అందుకు ఎలాంటి అడ్డంకులు లేవు.

అభినందనలు!
పుస్తకం.నెట్

You Might Also Like

3 Comments

  1. తెలుగు కవిత్వం తో నా డీలింగ్స్… « sowmyawrites ….

    […] చేయలేరు కానీ, సెప్టెంబర్లో పుస్తకంలో “తెలుగుకవిత” అని ఫోకస్ ప్రకటించి, అదలా అక్టోబర్ […]

  2. కవిత్వం తో నా డీలింగ్స్… « sowmyawrites ….

    […] చేయలేరు కానీ, సెప్టెంబర్లో పుస్తకంలో “తెలుగుకవిత” అని ఫోకస్ ప్రకటించి, అదలా అక్టోబర్ […]

  3. పుస్తకం » Blog Archive » ఈ నెల ఫోకస్: తెలుగు కవిత్వం

    […] గత నెల “తెలుగు కవిత్వం” ఫోకస్‍ను ఈ నెల కూడా కొనసాగిస్తున్నాం. ఈ అంశం పై మీ వ్యాసాలను editor@pustakam.net కి పంపగలరు. […]

Leave a Reply