సంతాపం: ఆలూరు భుజంగ రావు (1928-2013)

ప్రముఖ రచయిత, అనువాదకుడు ఆలూరి భుజంగరావు గారు మరణించారు. వారి కుటుంబానికి పుస్తకం.నెట్ సంతాపం తెలియజేస్తోంది.

రాహుల్ సాంకృత్యాయన్, ప్రేం చంద్ వంటి ప్రముఖుల రచనలను ఆయన తెనిగించారు. కథా రచయిత “శారద” (నటరాజన్) రచనలు వెలుగులోకి రావడానికి ఎంతో కృషి చేశారు. భుజంగరావు గారు 2012 బ్రౌన్ పురస్కార గ్రహీత.

ఆయన గురించిన వికీ పేజీ ఇక్కడ. (ఆయన గురించి వివరంగా తెలిసినవారెవరైనా వివరాలను చేర్చి ఆ పేజీని పరిపూర్ణం చేయగలరు.)

వివిధ పత్రికల్లో ఆయన్ని గురించి వచ్చిన నివాళి వ్యాసాలు:

ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఇక్కడ. నమస్తే తెలంగాణ పత్రిక వారి వ్యాసం ఇక్కడ.

అలుపెరగని పోరాట యోధుడు ‘ఆలూరి’ : సాక్షి-గుంటూరు ఎడిషన్ వార్త

వారి గురించి గతంలో వచ్చిన కొన్ని వ్యాసాలు:

వీరు వెలువరించిన “సాహిత్య బాటసారి శారద” పుస్తకం గురించిన పరిచయం “నేను-మీరు” బ్లాగులో ఇక్కడ చూడవచ్చు.

ఆలూరి భుజంగరావు గారి “గమనాగమనం” నుండీ కొన్ని పేరాలు. – “అంతరంగం” బ్లాగు వ్యాసంలో చదవండి.

ఆయన హిందీ నుండి తెలుగులోకి “ప్రాక్పశ్చిమ దర్శనాలు” పేరిట అనువదించిన రాహుల్ సాంకృత్యాయన్ పుస్తకం ‘దర్శన్‌ దిగ్దర్శన్‌ ‘ గురించిన పరిచయం ప్రజాశక్తి పత్రికలో ఇక్కడ. ఈ పుస్తకం గురించే ఆంధ్రభూమిలో వచ్చిన పరిచయం ఇక్కడ.

ఆయన అనువదించిన మరో పుస్తకం “సింహావలోకనం” గురించి ఆంధ్రభూమి పత్రికలో ఇక్కడ.

(ఇక్కడ జత చేసిన ఫొటో ఆంధ్రజ్యోతి వ్యాసం నుండి సంగ్రహించబడినది.)

You Might Also Like

One Comment

  1. తమ్మినేని యదుకుల భూషణ్.

    పుస్తకం లో ఆలూరి భుజంగ రావు గారి గురించి స్మరించుకోవడం సముచితం. ఆయనతో కొద్ది సేపు మాట్లాడాను
    ( బ్రౌన్ అవార్డు గురించి) ; ఆయన నవ్వుతూ తన దీర్ఘాయువు గురించి తలచుకున్నారు. నేను ఆయన తో (ముఖ్యంగా అనువాద పద్ధతుల మీద) పెద్ద ఇంటర్ వ్యూ చేద్దామనుకున్నాను, కానీ పెద్ద వయసులో ఇబ్బంది పెట్టడం దేనికి అని విరమించుకున్నాను.మొన్న రాత్రి కవి మిత్రుడు వెంకట యోగి నారాయణ స్వామి ద్వారా ఆయన మరణ వార్త తెలుసుకొని ఖిన్నుడయాను. ఆయన అనువాదాలను నేటి తరం చదివి నలుగురితో పంచుకోవడమే ఆయనకు మనం ఇవ్వగల నిజమైన నివాళి.

Leave a Reply