పుస్తకం
All about booksవార్తలు

September 16, 2012

వెయ్యి టపాల పుస్తకం.నెట్

మూడు సంవత్సరాల తొమ్మిది నెలల ముందు పుస్తకాలపై ఇష్టం, కొంచెం ఉత్సాహం పెట్టుబడిగా మొదలైన “పుస్తకం.నెట్”లో నేటికి వెయ్యి టపాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పుస్తకాన్ని ఆదరించి, అభిమానించిన ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాము.

’పుస్తకం’ మొదలుపెట్టేటప్పుడు నెలకి రెండు-మూడు వ్యాసాలు వస్తే బ్రహ్మాండం అనుకున్నాం. అలా అనుకోడానికీ లెక్కలేసుకున్నాం – పుస్తకాలు అసలే ఎక్కువగా చదవరు. చదివినా సినిమాలపై రాసినట్టు పుస్తకాలపై చకచకా రాయలేరు. రాసినా మనబోటి అనామక సైటుకు పంపడానికి ఆసక్తి చూపకపోవచ్చు. మా లెక్కలన్ని తారుమారు చేస్తూ, ఒక ప్రాంతీయ భాషలో నిర్వహించబడే సైటులో, కేవలం పుస్తకాలకి మాత్రమే సంబంధించిన సైటులో 1355 రోజుల్లో వెయ్యి టపాలు వచ్చాయంటే అది బ్రహ్మాండానికే బ్రహ్మాండం! మొదటి నెల నుండి ఇప్పటి వరకూ ప్రతి నెలా కనీసం ఇరవై వ్యాసాలు వస్తూనే ఉన్నాయి. ’పుస్తకం.నెట్’ అనే ఆలోచనకు ఇంతగా ఊతం ఇచ్చినందుకు మనసారా నమస్కరించటం తప్ప మరేం చెయ్యలేం. ఇప్పుడు ’1000’ అనే సంఖ్యకు ఉబ్బితబ్బిబైపోతున్నందుకు ఈ “ధన్యవాదాల” పరంపర. మొదటి రోజులనుండి బాలరిష్టాలంటే ఏంటో తెలీనంతగా ఆదరించబడింది పుస్తకం.నెట్. ఇట్లాంటి ప్రయత్నాల్లో ఒకరో-ఇద్దరో అధిక భాగం “కాంట్రిబ్యూట్” చేస్తుంటారు. అలాంటిది ఇక్కడ వ్యాసాల సంఖ్యలో సైటు నిర్వాహకుల పాత్ర ఇరవై శాతానికి మించి ఉండదు. ఎవరో ఒకరు ఎప్పుడోకప్పుడు తలా ఓ చేయి వేస్తూ పుస్తకం.నెట్ నిత్యకళ్యాణం-పచ్చతోరణంగా ఉండేందుకు సహకరించారు. అందుకు శతసహస్ర వందనాలు.

పోయిన వారంలోనే పుస్తకం హిట్లు ఏడు లక్షలు దాటాయి. ఈ సంఖ్యలని మైల్-స్టోన్లగా భావిస్తున్నామని కాదుగానీ ’పుస్తకం’కు లభిస్తున్న ఆదరణనూ విస్మరించలేకపోతున్నాం. “మీరే లేకపోయుంటే ఇది ఇందాక వచ్చేది కాదు.” అని చెప్పటానికి వీలు కల్పించే అవకాశాలివి.

మున్ముందు కూడా ’పుస్తకం.నెట్’కు ఆదరాభిమానాలు ఇలానే ఉండాలని మనసారా అభిలషిస్తూ..

-పుస్తకం.నెట్About the Author(s)


14 Comments


 1. G.sai kamesh

  1000 టపాలు పూర్తి అయిన సంధర్భంలో శుభాకాంక్షలు…chala anandamgaa undi


 2. పుస్తకం .నెట్ కు అభినందన మందారములు .చాలా సంతోషం గా ఉంది


 3. వెయ్యి టపాలు పూర్తయిన సందర్భంగా హృదయపూర్వక అభినందనలు.


 4. పుస్తకం.నెట్ రోజు రోజుకీ ప్రాచుర్యమవడం, చదివే + రాసే వారి స్నాఖ్య పెరగడం చాలా సంతోషం. కానీ, నిర్వాహకులకి ఒక సూచన.

  చాల మంది కొత్త కొత్త భావాలూ, విషయాలు వెల్లడిస్తున్నారు కానీ ఒక్కోసారి ఇంగ్లీష్ లో తెలుగు టైపు చెయ్యడం వాళ్ళ ఆ భావాలు ఖూనీ అయిపోతున్నాయి.

  తెలుగు టైపు రైటర్ facility, అంటే గూగుల్ transliterate లాంటిది పుస్తకం.నెట్ లో link chesi provide చేస్తే ఈ అందమైన, భావాలు మరింత అందం గా వెలువడతాయి. మోడల్ కి eemaata .com వాళ్ళు పెట్టిన facility చూడవచ్చును. వీలు వెంబడి ప్రయత్నించగలరు.


  • Yenduko Pustakam.net vaaru naa request ki yemee reply ivvaledu ! ante background lo work chestunnaaru anukovaalaa ?


  • సౌమ్య

   మూర్తి గారికి: లేదండీ…సమయాభావం వల్ల ఇంకా అలాంటి ప్రయత్నాలేవీ చేయడం లేదు. ఏదన్నా చేస్తే మీకు తెలియజేస్తాము.


 5. చంద్రహాస్

  రోజూ e-mail check చేసుకుంటున్నట్లే, పుస్తకం.నెట్ కూడా open చేసి కొత్తగా ఏం వుందీ రోజు అని చూడటం దాదాపు నా దినచర్యలో భాగమయిందీమధ్య. సౌమ్య, పూర్ణిమలు చేస్తున్న కృషి అనంత శ్లాఘనీయం (మరీ పాత వాసన కదూ? పొగడటానికి వాడుక భాష చాలడం లేదులా వుంది. Thanks అంటేనే మెరుగేమో.) Thanks. And hearty congratulations on reaching the milestone. Keep going.


 6. very happy to see “1000 hits” and wishing a “superhit” of 1000 x 1000 for pustakam.net


 7. prasanna

  pustakam.net – congratulations, and wish you many more achievements and success.


 8. ఏల్చూరి మురళీధరరావు

  అవిస్మరణీయ సహస్ర రచనోత్సవ శుభవేళ విజ్ఞ సంపాదకులకు, విద్వద్రచయితలకు, వివిదిషువులకు శుభాకాంక్షలు !


 9. Madhu

  Pustakam.net is doing a great job. It brought many people to the Telugu literature. If we do not visit you miss something in a day. Dr Chowdary V Jampala introduced me this web site with his review of Naminee o pudingi.. From that day onwards, I will see the website regularly and introduced to many of my friends, by forwarding the interesting readings. I was able to test my skill of reviewing “teacher KATHA- kamamishu”.


 10. పుస్తకానికి contribute చేయలేనందుకు కాస్త సంకోచంగా ఉన్నా, అనేకులు ముందుకు నడిపిస్తున్నందుకు ఆనందంగా ఉంది. నిర్వాహకులకు అభినందనలు.


 11. నేను సైతం పుస్తకం.నెట్టుకు టపాలు ఐదు అందజేశాను.
  పుస్తకం లక్షలాది పోస్టులకు, కోట్లాది హిట్టులకు ఎదుగుతుందని మనసారా కోరుకుంటూ..
  శుభాకాంక్షలతో
  సూరంపూడి పవన్ సంతోష్  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Ngugi Wa Thingio’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Nguigi Wa Thiongio) రాసిన Education for a national culture అన్న వ్యాసం గు...
by అతిథి
0

 
 

నీల :: కె. ఎన్. మల్లీశ్వరీ

వ్యాసకర్త : జయశ్రీ నాయుడు దాదాపుగా ఆరు వందల పేజీల కథా గమనాన్ని సమీక్ష గా కుదించాలంటే ...
by అతిథి
0

 
 

గడ్డి పూలు – గుండె సందుక

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ************** పూల మనసుల్లోకి … శాంతి ప్రబోధ కథా సంపుటి “గడ్డి పూల...
by అతిథి
1

 

 

On Writing: Stephen King

Written by: K.S.M Phanindra Books that teach writing are often very dry and I deliberately avoid them. I have read a couple of them and liked some of them a lot. Two of my favorites are “Telling Writing” by Ken Macr...
by అతిథి
1

 
 

నా 2017 పుస్తక పఠనం

మరో ఏడాది ముగుస్తోంది. ఈ ఏడాదిలో చదివిన పుస్తకాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవడాన...
by సౌమ్య
1

 
 

పుస్తకం.నెట్ తొమ్మిదో వార్షికోత్సవం

ఇవ్వాళ్టితో పుస్తకం.నెట్ మొదలుపెట్టి తొమ్మిదేళ్ళు పూర్తవుతుంది. ముచ్చటగా పదో ఏట అడ...
by పుస్తకం.నెట్
0