మీరేం చదువుతున్నారు?

పుస్తకాలు తరచుగా చదువుతున్నా, పేజీలకి పేజీలు సమీక్షలు రాసే ఓపికా, తీరికా లేని వారి కోసం ఈ పేజీని నిర్వహిస్తున్నాము. ఈ వారంలో మీరే పుస్తకాలు చదివారు, వాటిని గురించి ఓ రెండు ముక్కలు ఇక్కడ comments రూపంలో పంచుకోవచ్చు.   ఈ నమునాలో వివరాలు చెప్తే సులువుగా ఉంటుంది.

పుస్తకం పేరు:
రచయిత:
భాష:
వెల:
అంతర్జాలంలో ఈ పుస్తక వివరాలు:
పుస్తకం పై మీ అభిప్రాయం:

పాత వ్యాఖ్యలను, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చును.

203 Comments

  1. Gireesh K.

    ప్రస్తుతం కులదీప్ నయ్యర్ ఆత్మకథ “Beyond The Lines” చదువుతున్నాను. ఇపుడు ఉన్న సీనియర్ జర్నలిస్టులలో ప్రముఖుడు, దేశ విభజనకు ప్రత్యక్ష్ సాక్షి మరియు, భారతదేశపు పరిణామాన్ని అధికారపీఠానికి అతిసమీపం నుంచి చూసిన వ్యక్తి కావడంతో, ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి ఇన్నాళ్ళూ కనిపించని కథలేమన్నా దొరుకుతాయెమోనని (శ్రీశ్రీ) ఆశగా చదవడం మొదలుపెట్టాను. ఇంతవరకు పూర్తి చేసిన దాంట్లో, నెహ్రూ-ఎడ్వినా ప్రేమాయణం మరియు లాల్ బహదూర్ శాస్త్రి మరణం తప్పించి ఇంకేమీ ఆసక్తి కలిగించలేదు. అదికూడా, తను చెప్పినదానికన్నా దాచిపెట్టిందే ఎక్కువనిపించింది. పాత్రికేయ నిబద్ధతను పక్కకు నెట్టి అధికార పీఠానికి దగ్గరగా మసులుకున్న తీరు, అందుకు ఆయన ఇచ్చుకున్న వివరణ నన్ను నిరాశకు గురి చేసాయి. జాతీయ పాత్రికేయులపై, వారి నిబద్ధతపై నాకున్న అభిప్రాయం మరింత గట్టి పడింది.

    1. Purnima

      I thought of reading this book, but somehow never was convinced that this would be a genuine account.

      Some excerpts from this book may be found here:

      http://www.outlookindia.com/article.aspx?281456

  2. Sowmya

    చాలా రోజుల తరువాత విశ్వనాథ వారి “హాహాహూహూ” నవల మళ్ళీ చదివానివ్వాళ. మొదటిసారి చదివి ఇప్పటికి దాదాపు పదేళ్ళు కావొస్తోంది. అయినా, కథ ఇంకా బాగా గుర్తుందని అర్థమైంది ఇవ్వాళ చదువుతూంటే :-). నాకు చాలా ఇష్టం ఈ నవల. విశ్వనాథ వారి రచనల్లో- లోతైన పరిశీలనలు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అలాంటివి ఈ పుస్తకంలో కూడా ఉన్నాయి. అవి కాక, గొప్ప క్రియేటివిటీ కూడా ఉందీ నవల్లో. ఇంకా ఈ నవల కొనసాగి ఉంటే బాగుణ్ణు అనిపిస్తుంది నాకు. ఈ నవల గురించి, దీని అంగ్లానువాదంతో సహా – వేల్చేరు నారాయణ రావు గారు 1981లో Journal of South Asian Literature లో రాసినట్లు గూగుల్ సర్చి వలన తెలిసింది. (http://www.jstor.org/stable/i40039207). ఈ నవల జ్యోతి వార పత్రికలో సీరియల్ గా వచ్చిందని చదువరి గారి బ్లాగులో ఒకసారి వ్రాశారు. వివరాలు ఎవరికన్నా తెలిస్తే తెలుపగలరు. ప్రెస్-అకాడెమీ ఆర్కైవులలో చదివేందుకు దొరుకుతుందేమో చూడాలి అప్పుడు! ఇవ్వాళ చదివిన దానిలో మధ్య మధ్యన కొన్ని పేజీల్లేవు. కథ మొత్తంగా గుర్తుంది కనుక, పూర్తి చేయగలిగాను.

    1. Sreenivas Paruchuri

      <> Without checking to the above mentioned blog … It was serialized in the period 1979-80 or 1980-81 in Andhrajyoti Weekly. That was the first time I read it.

      In recent years VNR revised the 1981 translation and essay. He also translated VSN’s “veeravalluDu” and published in the same journal, along with a long essay.

      Regards, Sreenivas

      P.S. “vishNuSarma ingleeshu chaduvu” is the 3rd book translated by VNR.

    2. సౌమ్య

      Thank you for the information Sreenivas garu. Will see if I can get access to the Journal here. Do you remember the Year in which revised versions of VNR’s articles came? I only found 1981 versions on JSTOR search page.
      I could not find AJ Weekly of that period on Press Academy website. But, found the book on DLI now.

  3. pavan santhosh surampudi

    కింగ్స్ ఆఫ్ కశ్మీర పేరిట జె.సి.దత్ అనువదించిన కల్హణ విరచిత కశ్మీరరాజతరంగిణి అనువాదం చదువుతున్నాను. నాకు కశ్మీరమంటే ఏదో తెలియని వింత ఆకర్షణ. అందుకే ఇలా ఏదోటి వెతికి చదువుతూంటాను. దురదృష్టవశాత్తూ నాకు సంస్కృత భాష రాకపోవడంతో ఇలా అనువాదాలు చదవవలసి వస్తోంది.

  4. pavan santhosh surampudi

    వల్లంపాటి వెంకట సుబ్బయ్య “కథాశిల్పం” పూర్తైంది. ఈ పుస్తకం నాలో శిల్పం అంటే ఇలా ఉండాలి లాంటీ భావాల్ని బీజాలుగా వేశేసిందేమోన్నని భయం పట్టుకుంది. దాంతో రీఫ్రెష్ అవడానికి గురువుగారు శ్రీ వల్లూరి విజయ హనుమంతరావుగార్ని అడిగి మరీ హాయిగా మధురాంతకం రాజారాం “కథాయాత్ర” తీసుకుని చదువుతున్నాను. ఇప్పటికే ఒకసారి చదివేసినా, కథా శిల్పం లాంటి బరువైన పుస్తకం తర్వాత ఇలాంటి హాయైన లైటర్ వీన్ పుస్తకం చదవడం ఆరోగ్యానికి మంచిది అనిపిస్తోంది. 🙂

  5. లలిత (తెలుగు4కిడ్స్)

    ఈ మధ్య కాలంలో చదివిన పుస్తకాలు అన్నీ ఆంగ్లమే:
    The Home and the World, The Razor’s Edge, Of Human Bondage.
    మూడూ చాలా తృప్తినిచ్చాయి. The Home and The World మరొక సారి చదవాలి.
    చివరికి వచ్చే సరికి కొంచెం అసహనంగా చదివాను.
    బిమల పాత్ర సగంలో చిరాకు పుట్టించింది. నిఖిల్ పాత్ర ద్వారా రచయిత ఒక విలువని సజీవంగా చూపించదల్చుకున్నట్టనిపించినిది. పాత్రగా చూడలేకపోయాను. సందీప్ పాత్ర లాంటి వారిని కాస్త దగ్గరగా చూసినందువల్ల ఆ పాత్రని పాత్రగా చూడగలిగాను. టాగోర్ అంత చక్కగా పాత్రను present చెయ్యగలగడాన్ని appreciate చెయ్యగలిగాను. బిమల పాత్ర కూడా కొంచెం అలాగే అర్థం చేసుకోవచ్చేమో కానీ ఆమె బేలతనాన్ని భరించలేకపోయాను.
    ఇలాంటి కొన్ని prejudices ఉన్నా స్నేహితులతో చర్చించడం వల్ల, ఆ చర్చల్లో నాకు తోచిన విషయాల వల్ల మళ్ళీ ఒక సారి objective గా చదవాలి అనిపిస్తోంది.

  6. సౌమ్య

    పి.సత్యవతి గారి చిన్న నవల – “మర్రినీడ”, ఆ పుస్తకంతో జతచేసిన రెండు కథలు “నిజాయితీ”, “సుడిగాలి” చదివాను. నాకు సత్యవతి గారి కథావస్తువులు, శైలి నేను చదివిన తెలుగు కథల్లో విలక్షణంగా అనిపిస్తాయి (నచ్చుతాయి కూడా). అఫ్కోర్సు, నేను “మంత్రనగరి” సంకలనం మినహా వేరే కథలూ చదవలేదనుకోండి వారివి, అది వేరే సంగతి. ఆట్టే విశ్లేషణలూ గట్రా చేశే శక్తి నాకు లేదు కానీ, పుస్తకం నాకు బాగా నచ్చింది. మరీ తీవ్ర వాదోపవాదాలూ అవీ ఏవీ లేకపోయినా, ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి కథలు – అందుకే నాకు నచ్చింది అనుకుంటాను ఈ పుస్తకం. ఏకబిగిన చదివి ముగించినా, బాగుందని మళ్ళీ చదవడం మొదలుపెట్టా 🙂 …

    1. సౌమ్య

      పి.సత్యవతి గారివే వ్యాసాలు “రాగం భూపాలం” సంకలనం చదవడం మొదలుపెట్టాను. మొదటి మూడు వ్యాసాలు చదివాను – ముగ్గురు ఫెమినిస్టు రచయిత్రుల గురించి, వారి మూడు పుస్తకాల గురించి ఆ పుస్తకాల్లోని అంశాల గురించి వివరిస్తూ రాశారు. వ్యాసాలు మూడు నాకు చాలా నచ్చాయి. అసలు పుస్తకాలు చదివితే నాకు అర్థం అవుతాయో లేదో చెప్పలేను కానీ, సత్యవతి గారి పరిచయాలు మాత్రం చాలా సరళంగా ఉన్నాయి.

    2. Gowri Kirubanandan

      పి. సత్యవతి గారి రచనలు నాకు చాల ఇష్టం. ఆమె కథలు సూపర్ మాం సిండ్రోం, దేవుడు, ఒక రాజు ఒక రాణి, భాగం ఇలా కొన్ని కథలను తమిళంలో అనువదించాను. సత్యవతి గారి నవలలు ప్రస్తుతం మార్కెట్ల్ లో అందుబాటులో లేవు. మర్రి నీడ మీరు నాకు స్పేర్ చేయగలరా? భద్రంగా తిరిగి ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను.
      tkgowri@gmail.com, 97910 69485

    3. సౌమ్య

      Gowri garu: I have a library copy. I will see if I can scan the story and email it to you soon.

  7. Purnima

    మంటో రచనల రుచి తగిలాక అనువాదాలతో సరిపెట్టుకోలేక, అరబిక్ రాక చాలా అది అయిపోతుంటే, గుడ్‍-రీడ్స్.కామ్ లో ఒక పుణ్యాత్ముడు మంటో రచనల హిందిలో కూడా లభ్యమవుతున్నాయనీ, ఢి్ల్లీలోని రాజకమల్ ప్రకాశన్ వారి వద్ద లభించచ్చొననీ ఉప్పందించటంతో, వారినే ఆశ్రయించాను ఆన్-లైన్లో. పంపడానికి పదిహేనురోజులు పట్టినా, మొత్తానికైతే మంటో రచనల సంకలనం ఐదు పుస్తకాలు నిన్నే చేరాయి.

    నాకు అమితంగా నచ్చిన “షియా హాషియే” తృప్తిగా చదువుకొని, ఆ పై మిగితా కథలను మొదలెట్టాను. బాగున్నాయి. అక్షరాలే బొత్తిగా చలిచీమల్లా ఉన్నాయి పేజీ మీద. అన్నీ కాకపోయినా, ఆయన కథలన్నా చదవాలని పట్టుబట్టాను. కష్టమైన ఉర్దూ పదాలకు సరళమైన అర్థాలు కింద ఇవ్వడం వల్ల బానే చదవగలుగుతున్నాను.

  8. రవి

    “నా తెలంగాణా కోటి రతనాల వీణ” అన్న దాశరథి కృష్ణమాచార్యుల వారి యాత్రాస్మృతి చదువుతున్నాను. సినిమా రచయితగా తప్ప ఈయన గురించి, ముఖ్యంగా ఈ పుస్తకం గురించి ఇన్నాళ్ళు తెలియనందుకు నా మీద నాకు సిగ్గుగా ఉంది.

    1. Purnima

      మీకు తెలీదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు చదువుతున్న పుస్తకం చాలా బాగుంటుంది. అది కాగానే ఆయన కవితల సంపుటులు – ఈ మధ్యనే మళ్ళీ ముద్రితమైనాయి – చదవండి. మీకు నచ్చవచ్చు. మొన్నామొన్నటి వరకు ఆ సంపుటాలు అన్ని పుస్తక కేంద్రాల్లో లభ్యం.

    2. pavan santhosh surampudi

      దీన్ని చదివాకా దాశరథి రంగాచార్యుల “నా జీవనయానం” చదివితే మరింత సమగ్రంగా అనిపిస్తుంది. ఎంతైనా తమ్ముడు అన్నగురించి చెప్పడం సహజం కదా. పైగా ఆ ఆత్మకథ చాలా చాలా బాగుంటుంది కూడాను. ఇక ఈ పుస్తకంలో కొన్ని విషయాలు జంబుల్ అయినట్టుగా అనిపించింది. అవన్నీ ఆ పుస్తకంతో పూరణ అవుతాయి.

    3. రవి

      నా జీవనయానం చదువుతున్నాను. కృష్ణమాచార్యులు గారు ప్రధానంగా కవి కాబట్టి ఆయన పుస్తకం యాత్రాస్మృతి కవితాత్మకంగా ఉంది. రంగాచార్య గారి పుస్తకం జీవిత వాస్తవాలను ప్రతిబింబించే కథలా ఉంది. తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాలివి.

  9. SRIKAR

    Reading: I too had a dream – Verghese Kurien…..The person behind Operation Flood and Milk man of India.

  10. Purnima

    నేనేం చదవటం లేదీ మధ్య! (ఇదియున్నూ బడాయిగా వినిపిస్తే, ఇహ నేను చేసేది ఏమీ లేదన్న మాట.) రోజూ పొద్దున్నే మాత్రం కాల్వినో రాసిన “డిఫికల్ట్ లవ్స్”కథ ఒక్కోటీ చదువుతున్నాను. కాల్వినో రాక్స్! పీరియడ్.

  11. pavan santhosh surampudi

    ప్రస్తుతం వల్లంపల్లి వెంకటసుబ్బయ్య వ్రాసిన “కథాశిల్పం” చదువుతున్నాను. ఆ తర్వాత వరుసగా వేదం వారి “కథాసరిత్సాగరం”, “జెన్ కథలు”, ఆపై శ్రీనివాస శిరోమణి “రామాయణం” ఉన్నాయి లైన్లో. ఎన్నాళ్ల నుంచో చదవాలనుకుంటున్నవెన్నో ఉన్నాయి. “కథాశిల్పం” మాత్రం చాలా కష్టంగా సాగుతోంది. చదివడం నెమరు వేసుకోవడం జీర్ణించుకోవడం, మళ్లీ చదవడం నెమరు వేసుకోవడం జీర్ణించుకోవడం. అదీ పద్ధతి:)

    1. pavan santhosh surampudi

      ఎవరైనా ఓ అనుమానం తీర్చాలని అడుగుతున్నాను.
      కథలు చదువుతూ, కొన్ని కథలు వ్రాస్తూ ఉన్న నాకు కథాశిల్పం లాంటి విమర్శ చదవడం వల్ల ఏదైనా ఫ్లెక్సిబిలిటీ కోల్పోతానా? ఇలానే ఉండాలి. ఇలానే వ్రాయాలి అన్న ధోరణిలోకి వెళ్లిపోతానా?
      మొదలెట్టగానే ఈ ప్రశ్నలు ముసురుకున్నాయి.

    2. Dr. Murthy Remilla

      కథాశిల్పం లాంటి విమర్శ చదవడం వల్ల ఏదైనా ఫ్లెక్సిబిలిటీ కోల్పోతానా? @ పవన్ గారూ,

      … అది ఒక రకంగా అవునేమో అనిపిస్తుంది కానీ, ఎలా రాయకూడదో కూడా తెలుస్తుంది అనేది ఆ నాణేనికి ఇంకో కోణం అనిపిస్తుంది.

  12. సౌమ్య

    కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ “నిర్జన వారధి” చదువుతున్నాను. ఉద్యమ కాలంలో వాళ్ళ జీవితాలు, ఆ తరువాత కుటుంబ జీవితంలో కల్లోలాలు తట్టుకుని ఆవిడ నిలబడ్డ విధానం – చాలా స్పూర్తిదాయకంగా అనిపించింది. నా వంతుగా నేను ఈ పుస్తకాన్ని మా అమ్మకి పంపాలని నిశ్చయించుకున్నాను. అద్భుతమైన పుస్తకం. పుస్తకం ఇటీవలే విడుదలైంది. కినిగె లో ఆన్లైన్/ఆఫ్లైన్ కొనుగోలుకి లభ్యం.

    1. సౌమ్య

      Communist Movements of the 50s, in Andhra Pradesh.

    2. Sreenivas Paruchuri

      కొండపల్లి కోటేశ్వరమ్మ గారి పుస్తకం నచ్చినట్లయితే, ఇది కూడా చూడండి. “మనకు తెలియని మన చరిత్ర: తెలంగాణా రైతాంగ పోరాటంలో స్త్రీలు ఒక సజీవ చరిత్ర”, 1986. H.B.T. వాళ్ళు ఈ మధ్య మరలా ముద్రించారు. మంచి పుస్తకం. అప్పట్లో బాగా చప్పుడు చేసిన పుస్తకం కూడాను. — శ్రీనివాస్
      P.S. I know who is going to follow up to this message about the availability of its recent edition :).

    3. సౌమ్య

      Sreenivas garu: Thanks for the information. Will search for the book.

  13. రవి

    అష్టావక్ర అని యండమూరి వీరేంద్రనాథ్ నవల – రెండు భాగాలు చదివేశా. ఒక్క ఊపున చదివించింది. బాఘా చెవిలో పూలు పెట్టాడు. అయితే మెలోడ్రామా పండించడంలో యండమూరి తర్వాతే ఎవరైనా.

    1. pavan santhosh surampudi

      రెండు భాగాలేంటండోయ్. నాకు తెల్సినంతవరకూ తులసీదళానికి తులసి దానికి అష్టావక్ర కొనసాగింపులు. మధ్యలో ఈ అష్టావక్ర రెండు భాగాలేంటండీ?

    2. రవి

      తులసి కి అష్టావక్ర కొనసాగింపు కాదండి. “తులసి” లో దొరకని సమాధానాలకు అష్టావక్రలో జవాబులు చెప్పాడట రచయిత. 🙂

      అష్టావక్ర రెండు భాగాలేనండి. ఇప్పుడు రెండూ కలిపి ఒక భాగం పబ్లిష్ చేశారేమో నాకు తెలీదు. నా వద్ద ఉన్నది పాత ఎడిషన్.

    3. pavan santhosh surampudi

      ఏమోలెండి మీరన్నదే అయుండొచ్చు. కాని, తులసీదళం కన్నా తులసి బావుంటుంది తులసి మీద అష్టవక్ర అంత బావోదు. నేను చదివినంతలో అష్టావక్ర ఒక్కటిగానే ప్రచురించారు.

  14. సౌమ్య

    ఇక్కడ నేను తప్పిస్తే ఎవరూ వ్యాఖ్యలు రాస్తున్నట్లు లేదు? 🙂

    అక్క మహాదేవి వచనాల ఆంగ్లానువాదాల కోసం వెదుకుతూ ఉంటే, డి.శేషగిరి రావు అనువాదం దొరికింది. 200 పైగా వచనాల అనువాదాలు ఉన్నాయి కానీ, అనువాదం ఆంగ్ల పాండిత్య ప్రదర్శనలా మిగిలిపోయినట్లు తోచడం, దానితో పాటు అనువాదకుడి సొంత భావాలు అనువాదంలోకి జొప్పించినట్లు అనుమానం కలగడం వల్ల – నాకీ పుస్తకం నచ్చలేదు. ఈ అనువాదకుడు డిల్లీలోని ఎవరో ప్రకాశకులకి స్వదస్తూరీలో సంతకం చేసి ఇచ్చిన కాపీ జర్మనీలో మా లైబ్రరీలో కనబడ్డం మాత్రం విచిత్రమే! 🙂

    ఎలాగైనా, తొమ్మిదొందల సంవత్సరాల నాడే నాకు ఇప్పటికీ రాడికల్గా తోచే భావాలు వీటిల్లో ఉన్నట్లు అనిపిస్తోంది… కనుక, ఎలాగైనా తప్పకుండా ఇంకాస్త చదవాలి అని నిర్ణయించుకున్నాను. అలాగే, ఎందుకు ఫెమినిస్టులు తరుచుగా ఈవిడ పేరు ప్రస్తావిస్తారో కొంచెం అర్థమైంది.

    1. సురేశ్ కొలిచాల

      అక్కమహాదేవి వచనముల తెలుగు అనువాదములను చదువ ప్రయత్నించితిరా? మచ్చుకు మఠం వీరయ్య అనువాదము ఈ కింది విలాసమున కలదు:
      http://archive.org/details/akkamahadevivach025743mbp

  15. సౌమ్య

    ఇటీవల కాలక్షేపం నవలా పఠనంలో కొనసాగుతూ యండమూరి, మధుబాబు వీళ్ళ నవలలు చదువుతూ, ఆట్టే ఆలోచించకుండా ముందుకు పోతూ ఉండగా మధ్యలో కొన్ని నవలలు మామూలు కాలక్షేపాన్ని మించి ఆకట్టుకున్నాయి. అవి –
    1) వారసులు – మాదిరెడ్డి సులోచన. (http://kinige.com/kbook.php?id=878name=Varasulu)
    2) సీక్రెట్ ఆఫ్ ది నాగాస్ – అమీష్. గతంలో వచ్చిన immortals of meluha కి ఇది సీక్వెల్. రచనా శైలి అంత గొప్పగా లేదు కానీ, బాగా ఇమాజినేటివ్ గా రాశాడు. అందుకని నాకు నచ్చింది.
    3) Unbearable Lightness of being – Milan Kundera – ఉందో లేదో తెలియని ఆ కథ గానీ, కథనం గానీ, పాత్రల చిత్రణ గానీ – ఏదీ నచ్చకపోయినా నాకీ పుస్తకం నచ్చింది – రచయిత తాత్విక వాక్యాల వల్లా, ఇలాంటి కథలోనూ సమర్థవంతంగా చేర్చిన హాస్య వ్యంగ్యాల వల్ల.

  16. సౌమ్య

    కినిగె.కాం లో యండమూరి నవలల పర్వం మొదలవడంతో – “నిశబ్దం నీకూ నాకూ మధ్య”, “ఆనందో బ్రహ్మ” చదివాను. మొదటిది నాకంత నచ్చలేదు. రెండవది చివరిదాకా ఆపకుండా చదివించింది కానీ, అలాగని నాకు విపరీతంగా నచ్చిందనీ అనలేను. చదివించే గుణం బాగా ఉందంతే.

    1. రవి

      నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య – ఈ నవల పరిస్థితులు 1980 ల కాలం నాటివి. అప్పట్లో వచ్చే ప్రతీకారం నేపథ్య సినిమాల మధ్య ఐడెంటిటీ క్రైసిస్ తో నలిగి పోతున్న చాలామంది – పిల్లల నుండి యూత్ వరకు ఈ నవల్లో హీరో పాత్రను తమతో ఐడెంటిఫై చేసుకున్నారు. వాళ్ళల్లో భవదీయుడొకడు. 🙂 ఇప్పుడు నవ్వొస్తుంది.

    2. pavan santhosh surampudi

      నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య నాకూ అంతగా నచ్చలేదు. కాని హీరో పాత్ర చిత్రణ మాత్రం విపరీతంగా నచ్చేసింది. ఆ పాత్ర మాత్రం ఆ కాలానికి ఓ కొండగుర్తు, పుట్టుమచ్చ అనిపించింది చదూతూంటే.

  17. సౌమ్య

    “Deep Focus: Reflections on Cinema” అన్న సత్యజిత్ రాయ్ వ్యాసాల సంకలనం చదువుతున్నాను. వ్యాసాలు బాగానే ఉన్నాయి కానీ, “వావ్” మొమెంట్స్ చాలా తక్కువ. అయితే, ఫొటోలు, మధ్యమధ్యలో రాయ్ గీసిన బొమ్మలూ మాత్రం ఈ పుస్తకాన్ని ఆయన అభిమానుల వద్ద తప్పనిసరిగా ఉందవలసిన పుస్తకంగా చేస్తాయని నా అభిప్రాయం.

  18. R

    w/oకారా బెటర్ హాఫ్

    ఆయన ప్రసిద్ధ తెలుగుకథకుడు.
    కథానిలయం పేరిట కథలకు కోవెలకట్టినవాడు.
    కథారచనను ‘యజ్ఞం’లా నిర్వహించినవాడు.
    పాఠాలు చెప్పడం, కథలు రాయడం మాత్రమే తెలిసిన మనిషి.
    ఆయనే కారామాస్టారిగా అందరికీ సుపరిచితులైన కాళీపట్నం రామారావు.
    ఆయన జీవిత సహచరి సీతామహాలక్ష్మి.
    వారి అరవై ఆరేళ్ల దాంపత్యజీవితం గురించి, ఆలుమగలు ఎలా ఉంటే కుటుంబం ఒద్దికగా నిలుస్తుందో తెలియజేశారు సీతామహాలక్ష్మి.

    మిగతాది ఇక్కడ

    http://sakshi.com/Main/WeeklyDetails.aspx?Newsid=45413&Categoryid=11&subcatid=19

  19. సౌమ్య

    వోల్గా, వసంత కన్నాభిరాన్, కల్పన కన్నాభిరాన్ లు సంకలనం చేసిన “మహిళావరణం” చదువుతున్నా. 19వ, 20వ శతాబ్దాలకు చెందిన, తెలుసుకోవలసిన మహిళల గురించిన సంక్షిప్త పరిచయాలు ఉన్నాయి ఇందులో. జాబితాలో సంపాదకుల పక్షపాతం ఉన్నట్లు అక్కడక్కడా తోచినా కూడా, ఇందులో రాసిన వారిలో చాలా మంది చరిత్రలు నాకు స్పూర్తివంతంగా అనిపించాయి.

    ధరంవీర్ భారతి నవలిక “సూరజ్ కా సాత్వ ఘోడా” కు తెలుగు అనువాదం “సూర్యుడి ఏడవ గుర్రం” చదువుతున్నాను. అంతకు ముందే శ్యాం బెనెగల్ ఈ నవలిక ఆధారంగా అదే పేరుతో తీసిన హిందీ సినిమా చూసి ఉన్నా కనుక, కథ తెలుసు కానీ, చూస్తున్నప్పటి కంటే చదువుతున్నప్పుడు ఇంకా ఆసక్తికరంగా ఉంది నాకు.

  20. NM

    Wrt to “Groucho Marx’s letters”, Like to know
    if there are any similar kind of books by telugu authors?

    Are there any good memoirs of bureaucrats by telugu authors?
    ( besides the PVRK’s )

    Can anyone list out some good books for students of Comp Science?
    ( non-academic)

    1. Purnima

      >> Wrt to “Groucho Marx’s letters”, Like to know if there are any similar kind of books by telugu authors?

      I’m not sure. I wanna rule out such a possibility, but for all I know there could be someone to the likes of Groucho. One way to figure that is to make a list of personalities with exceptional sense of humour and if they ever had inclination towards letter writing and then check if those were published. Simple, ain’t it? 🙂

      >> Can anyone list out some good books for students of Comp Science?
      ( non-academic)

      I’m not too sure, again. I might suggest works like “Mythical Man Month” by Fred Brooks or Quality Software Management – 3 volumes by Weinberg or Pragmatic Programmer or the likes. If you can be a bit more verbose about what kind of books that you’re looking for, might get easy to suggest.

  21. లలిత (తెలుగు4కిడ్స్)

    శ్రీపాద వారి కథలు చదువుతున్న విషయం ఇంతకు ముందే వ్రాశాను. కథనం చదివిస్తోంది. అప్పటి పరిస్థితులు కాస్త తెలుస్తున్నాయి. కథలు ఆ పరిస్థితులను చూపించే దృక్కోణం కూడా బావుందనిపిస్తోంది. ఐతే, ప్రస్తుతం పిల్లలకి వేసవి సెలవులు ఉన్న సమయంలో నాకు కాస్త light hearted విషయాల మీద మనసు పోతోంది. అంతే కాదు తెలుగులో మనసుని ఆహ్లాదపరిచే కథలు చదవాలన్న నా కోరిక ఈ కథల వల్ల తీరట్లేదు. ఆ విషయం పక్కన పెడితే, కథ పేరు చూసి కథాంశం అప్పటి సాంఘిక పరిస్థితుల గురించి వ్రాసిన విషయమై ఉండకపోవచ్చుననుకుని “తులసి మొక్కలు” కథ ఎంచుకున్నాను చదవడానికి. అది కూడా సాంఘిక సమస్య వస్తువుగా తీసుకుని వ్రాసినదే ఐనా, కథంతా చదివాక ఆ కథకి శ్రీపాద వారు ఎంచుకున్న పేరు నన్ను ఆలోచింపచేసింది. నాకు ఆ శీర్షికలో చాలా ఔచిత్యం కనిపించింది. ఇంకోలా పేరు పెట్టి ఉండే అవకాశం ఉండచ్చు. కానీ ఆయన పరిస్థితుల మూలంగా ఒక వ్యవస్థకు అలవాటు పడిన వారిని కించపరచకపోవడం నచ్చింది. ఇది నిజంగా జరిగిన కథ అవునో కాదో ఎవరైనా చెప్పగలరా? కొన్నిటికి ఆయన జరిగిన కథ అని వ్రాశారు. ఈ కథకి అలా వ్రాయలేదు. నిజంగా జరిగినదే ఐతే బాగుండును. కాకున్నా, ఆయన వీరేశలింగం గారి ఆలోచనలను చక్కగా present చేసినట్లనిపించింది. అప్పటి పరిస్థితులలో సంఘ సంస్కర్తలు ఎంత మంది ఉన్నారో అందరివీ ఒకే అభిప్రాయాలు కావు అన్నది నిజం. అందరూ ఒకేలాంటి సంస్కరణలు ఆశించలేదు, ఆశించినా వారు ఎన్నుకున్న మార్గాలు ఒకటి కావు. ఎన్నుకున్న మార్గాలు ఒకటైనా అభిప్రాయ భేదాలు లేకపోలేవు. అన్నిటికీ మంచి వారందరూ మానవమాత్రులే. కాని కొన్నేళ్ళ తర్వాత వారు చేసిన మంచి పనులకంటే వారిలో ఉన్న లోపాలు (లేదా మనం లోపాలు అనుకునేవి) మాత్రమే ఎంచుకుని వాటిని భూతద్దంలో చూపిస్తుంటే బాధ వేస్తుంది. “తులసి మొక్కలు” కథే కాదు ఇప్పటి వరకూ నేను చదివిన అన్ని కథలూ, ఆ నాటి సమాజ పరిస్థితుల దృష్ట్యా అవసరమైన మార్పులను, అవి ఆ మార్పులు రావలిసిన విధానాలను, అవి రేపిన ఆలోచనలను ఆరోగ్యకరమైన కోణంలో చూపించినట్లనిపించి తప్పక చదవాల్సిన కథలు అని మరొక్క సారి చెప్పాలనిపిస్తోంది.

  22. Gowri Kirubanandan

    వేముల ఎల్లయ్య గారి “కక్క ” నవల కోసం వెతుకుతున్నాను, తమిళంలో అనువదించడం కో సం. పుస్తకం స్పేర్ చేయగలిగితే మరీ సంతోషం. లభించే విధం తెలిపినా కృతజ్ఞురాలిని.

  23. రవి

    శీరిపి ఆంజనేయులు గారు (1891-1974) ఒకనాటి పెద్ద భూస్వామి, మధురకవి, మహాదాత, అనంతపురం లో విజ్ఞానవల్లికా గ్రంథమాల పేరిట ముద్రణాలయాన్ని స్థాపించిన సాహిత్యప్రేమికుడు, పత్రికాధిపతి. ఈయన రచించిన విద్యానగరచరిత్రము అద్భుతమైన చరిత్ర పుస్తకం. విజయనగర రాజుల వంశానికి చెందిన మొన్నటి తరం ప్రతినిధి, ఆనేగొంది సంస్థానాధీశుడు అయిన రాజారంగదేవరాయల వారిని కలిసి సమాచారం సేకరించి, ఇంకా అనేకానేక శాసనాలు, ప్రబంధాలు చదివి, అందులోని వివరాలు కూర్చి, న్యూనిజ్, నికోల్ కాంటె, అబ్దుల్ రజాక్, ఫెరిస్తా వంటి పాశ్చాత్య చారిత్రకుల విజయనగర రాజచరిత్రను క్రోడీకరించి అపూర్వమైన ఈ పుస్తకాన్ని వ్రాశారు. చరిత్ర మీద ఆసక్తి ఉన్న వారికి, తెలుగులో అప్పటమైన విజయనగర రాజులచరిత్రను తెలుసుకోవాలనుకుంటున్న వారికీ కరదీపిక ఈ పుస్తకం. ఈ రచయిత వచనరచన ఆహ్లాదకరము, నిసర్గమనోహరమూను. మా ఇంట్లో చివర్లు చిరిగిన ఈ పాతపుస్తకం చూసి, కొంచెం బాధగా ఉండేది. ఇప్పుడు DLI లో దొరుకుతోంది అని తెలిసింది. హరిహర రాయలు, బుక్కరాయలతో మొదలెట్టి తిరుమల రాయలకు తర్వాత కూడా జరిగిన విజయనగర రాజుల గురించి, వారి కాలంలో సామాజిక, సాంప్రదాయ, సాహిత్య విషయాల గురించి తెలుసుకోవాలంటే ఇది అద్భుతమైన పుస్తకం.

    1. రవి

      ఈ పుస్తక రచనాకాలం 1928.

  24. లలిత (తెలుగు4కిడ్స్)

    శ్రీపాద గారి “పుల్లంపేట జరీచీర” పుస్తకం చదువుతున్నాను. కథలంటే ఈ మధ్య కాలంలో చదివిన వాటి వల్ల ఎక్కువ ఆశలు పెట్టుకోవట్లేదు. ముఖ్యంగా ఎవరైనా ఎంత ఎక్కువ పొడిగితే అంత తక్కువ అంచనా వేసుకుని చదవాలని ప్రయత్నిస్తున్నాను. ఈ పుస్తకం కోసం ఎదురు చూస్తూ అమరావతి కథలు చదవడం మొదలు పెట్టాను. అవి మరీ చిన్నగా అనిపించాయి. అందువల్ల శ్రీపాద వారి కథల నిడివి చూసి కొంచెం ఉత్సాహం వచ్చింది. ఆయన అనుభవాలూ జ్ఞాపకాలూ చదివి ఉన్నాను కనుక నిడివి ఎక్కువ వల్ల నాణ్యత తగ్గదనే నమ్మకం కుదిరి ఉండడం వల్ల ఆశగా అనిపించినా ఎక్కువ ఊహించుకోకుండానే చదువుతున్నాను. తీరిక దొరికినప్పుడల్లా చదువుతూ ఇప్పటికి తొమ్మిది కథలు పూర్తి చేశాను. ఒకటి మటుకు నిజం. ఆయన కథ నడిపే తీరు వల్ల కథ మొదలు పెట్టాక ఆపబుద్ధి కావటంలేదు. ఒక వేళ ఆపవలసి వస్తే మళ్ళీ అవకాశం వెతుక్కుని తీరిక చేసుకుని కథ పూర్తి చెయ్యడం, మనస్సాగక ఇంకొకటి మొదలు పెట్టడం, అది పూర్తి చెయ్యలేకపోతే మళ్ళీ ఆత్రపడడం, ఇలా నడుస్తోంది. ఈ మధ్యలో ఇలా అనిపించిన కథలు చాలా తక్కువ. సాగర సంగం కథ, చలిచీమలు కథా సంభాషణలతో మొదలయ్యి సంభాషణలే ఎక్కువ ఉండి దృశ్యం ఊహించుకోవడానికి (ముఖ్యంగా ఎక్కువ పరిచయం లేని వాతావరణం కనుక కూడా) కష్టపడవలసి వచ్చింది. చలం అభిమానులు నన్ను మన్నించాలి. కానీ శ్రీపాద వారి కథలు ఒకటి రెండు చదివితే ఆ నాటి స్త్రీల పరిస్థితి, ఆలోచనలూ, వారి transition చక్కగా కళ్ళకు కట్టాయి. చలం కథల్లో ఆయన స్వంత సంఘర్షణ కనిపిస్తే శ్రీపాద వరి కథలలో అవగాహన కనిపించింది. ఆశావహంగా ముగింపులు ఉండడం కూడా (కొన్ని సార్లు అనుకున్న విధంగానే కాకపోయినా) అందుకు సహకరించి ఉండవచ్చు. ఈయనని ఒక్క భాష పరంగానే ఎందుకు గుర్తు చేసుకుంటారు (నేను చదివినంత వరకూ) అని అనుమానం వచ్చింది నాకు. చరిత్ర పాఠాలు (ప్రాంతీయ సాంఘిక పరిస్థితులు, మార్పులు, సంఘర్షణలకు సంబంధించి) అనిపించింది, ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి కథలు ఇంతవరకూ చదివినవి. ఇవి మనం తప్పక చదివి తీరాల్సిన కథలు. ఐనా నేను మిగిలిన కథల గురించి అవి చదివేంతవరకూ అభిప్రాయం ఏర్పరుచుకునే సాహసం చెయ్యను. కానీ చదివాక వాటి గురించి వ్రాయకుండా ఉండలేకపోతే వ్రాసి నా అభిప్రాయాలు పంచుకుంటాను.

    1. M.V.RAMANARAO.

      చలం,శ్రీపాదలను పోల్చలేము.ఎవరి ప్రత్యేకత వారిదే.చలం ది crusading spirit అనుకోవచ్చును.తెలుగులో గొప్ప కథా రచయితల గురించి రాస్తే వీరి ఇద్దరి పేర్లూ తప్పక ఉంటాయి.అయితే శ్రీపాదవారి భాషగురించి ఎక్కువగా పేర్కోడానికి కారణమేమంటే ఇదివరకు,తెలుగు ఇళ్ళలో చక్కటి,స్వచ్చమైన,తెలుగు నుడికారంతో మాట్లాడు కొనే భాషలో ఆయన రాసే వారు.మళ్ళీ మల్లాదిరామకృష్ణశాస్త్రి గారి రచనల్లో ఆ భాష,నుడికారం కనిపిస్తాయి.

  25. సౌమ్య

    సెలవులో కొనసాగుతూ ఉండగా చక్కటి పుస్తకాలు కొన్ని చదివాను.

    1) ఒక స్నేహితురాలికోసం గుల్జార్ సినిమా ఆంధీ స్క్రీంప్లే కొన్నాను. ఇంతలోపు నేను తిరగేద్దాం అని తెరిచి ఆపకుండా చదివాను. నాకు చాలా నచ్చింది కథనం.

    2) “Stupid Guy Goes to India” అని ఒక గ్రాఫిక్ నవల చదివాను. Yukichi Yamamatsu అన్న జపనీస్ మంగా కామిక్ రచయిత తమ కామిక్స్ ఇండియాలో అమ్మాలన్న లక్ష్యంతో మన దేశానికి వస్తాడు. ఆంగ్లం రాదు, హిందీ రాదు…భారత దేశం గురించి తెలిసిందీ చాలా తక్కువ. ఈ నేపథ్యంలో అతనికి కలిగిన అనుభవాల సారాంశం ఈ పుస్తకం. అతని అభిప్రాయాలకి ఎంత విలువివ్వాలి వంటి చర్చలు పక్కన పెడితే, పుస్తకం చాలా ఎంటర్టైనింగ్!

    3) Chetan Bhagat “Revolution 2020” చదివాను. ఎప్పట్లాగే, కాలక్షేపానికి బాగుంది.

    4) ప్రస్తుతానికి Bob Hope రాసిన My Life in Jokes ని తిరగేస్తున్నాను. తన ఆత్మకథ కాదు కానీ, బాల్యం, యవ్వనం ఇలా వర్గీకరించి అతను తన జీవితం గురించి చెప్పుకున్న హాస్య వాక్యాల సంకలనం. బాగుంది.

  26. bhavani

    nice to see this page .telugu sahityam ante pichi .second time Narayanarao by Adavibapirajugaru chaduvutunnanu .

  27. Rk

    Currently reading ” పింజారి ” on legendary Burra Katha artist Nazar.
    Interesting. Could have been better with some editing.
    Anyway,Interesting. – Rk.

    ” పింజారి ” మహా వాగ్గేయకారుడు షేక్ నాజర్ ఆటో బయో గ్రాఫి
    సేకర్త డాక్టర్ అంగడాల వెంకటరమణ మూర్తి

  28. సౌమ్య

    మొన్నొక రోజు నా స్నేహితురాలికోసమని చెప్పి పందొమ్మిదేళ్ళ వయసులో H.Y.Sharada Prasad గారు “క్విట్ ఇండియా” ఉద్యమ సమయంలో జైలుకి వెళ్ళినప్పుడు రాసిన డైరీ A Window on the wall: Quit India Prison Diary of a 19-Year-Old కొన్నాను. సరే, తనని కలిసేలోపు అందులో ఏముందో చూద్దామని తెరిచాను. చిన్న పుస్తకమే కావడంతో త్వరగానే అయిపోయింది. ఆసక్తి కరమైన పుస్తకం.

    డైరీగా నాకు మామూలుగానే ఉంది కానీ, రెండు విషయాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి.
    1) ఈ డైరీ రాసినది ఒక పందొమ్మిదేళ్ళ యువకుడు అంటే నమ్మడం కష్టం. నా మట్టుకు నాకు ఎవరో బాగా జీవితానుభవం ఉన్న వారు రాసినట్లు అనిపించింది.
    2) పుస్తకానికి సంపాదకత్వం వహించిన Sugata Srinivasaraju గారి పనితీరు. ఇలాంటి పుస్తకాల్లో మధ్యమధ్యలో వచ్చే పోయే వాళ్ళు ఎవరో అర్థం కాక చాలాసార్లు గింజుకునేదాన్ని. అలాగే, వాళ్ళు ఒక్కోసారి “ఆ విషయం” అంటూ దేన్ని గురించి చెబుతున్నారో కూడా అర్థమయ్యేది కాదు. ఇందులో చాలా వివరంగా… వివరాలు తెలిసిన ప్రతి చోటా నోట్లు ఉన్నాయి. కనుక, ఉత్తరాల కాంటెక్స్ట్ స్పష్టంగా అర్థం అవుతుంది. అంతే కాక, మధ్యలో వచ్చిన పేర్ల గురించి సంక్షిప్త పరిచయాలు కూడా రాయడంతో ఇంకా చాలా విషయాలు తెలిసాయి. ఉదా: శారదా ప్రసాద్ గారి అమ్మగారి గురించి చదివాక అబ్బురంగా అనిపించింది. లేఖా సాహిత్యం, డైరీలు వంటివి పబ్లిక్ ప్రచురణకి పెట్టేముందు ఇలాంటి ఏడిటింగ్ ఎంతో ఉపకరిస్తుందని నాకు అనిపించింది.

  29. పూడూరి రాజిరెడ్డి

    “వేయి పడగలు” చదువుతున్నాను.
    నిజానికిది ఎప్పుడో చదవాల్సింది. ఎనిమిదేళ్ల క్రితం చేతిలోకి వచ్చినప్పుడు సైజు పరంగానూ, భాషా పరంగానూ భయమేసి వదిలేశాను.
    2010 బుక్ ఫెయిర్లో కొన్నాక కూడా మళ్లీ ముట్టుకోవడానికి ఇన్ని నెలలు పట్టింది. ఇప్పుడైనా మొదట్నుంచీ చదవడం లేదు. సగంలోంచి మొదలుపెట్టి, తుదికి వచ్చాను. మళ్లీ ఇందులో కూడా ఒక అధ్యాయం వదిలేశాను.
    ఇప్పుడు మళ్లీ మొదట్నుంచీ వెళ్లి, దాన్ని కూడా పూర్తిచేయాలి.
    కథ కన్నా, వాదోపవాదాలే ముఖ్యం కాబట్టి కంటిన్యుటీ సమస్య ఏమీ ఉండదనిపిస్తోంది. ఒకవేళ నేను పూర్తి చేయకపోయినా, ఇప్పటివరకు అందింది కూడా తక్కువేమీ కాదు.

    పాఠకుడిని ఈడ్చుకెళ్లే శైలి కాదు “విశ్వనాథ”ది. మనమే ఆయన మీది గౌరవంతో వెంట నడవాలి. ఓపికతో వెళ్లగలిగితే మాత్రం చాలా విషయాలు చెబుతాడు. నా వరకు, నా ఎన్నో భావనలకు ఆలంబనగా నిలవగలిగే పుస్తకం ఇది. సిసలైన ‘విప్లవ’ రచన ఇది.

    1. మైథిలి

      
 మీరు చెప్పే మాటలకి ఖచ్చితంగా విలువ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను..ఇంకొంచెం చెప్పకూడదా?

  30. సౌమ్య

    గత వ్యాఖ్య లో ప్రస్తావించిన గెలీలియో జీవితం నాటకం పూర్తి చేశాను. నన్ను బాగా ఆలోచింపజేసింది. ఇందులో సంభాషణలు నాటకీయంగా ఉన్నా (నిజ జీవితంలో ఇంత పొడవు భారీ డైలాగులు చెప్పుకుంటారంటే నేను నమ్మలేను), బాగా ఆలోచనలో పడేశాయి. రచయితకి ఉన్న హిడెన్ ఎజెండాల గురించి ఒక పక్షపాత ధోరణి లేకుండా ఈ నాటకాన్ని ఆస్వాదించగలిగితే, దీనిలో జనాలని ప్రభావితం చేయగల అంశాలు చాలా ఉన్నాయని నా అభిప్రాయం.

    ముక్కోతి కొమ్మచ్చి – ఇన్నాళ్ళకి ఒక స్నేహితురాలి పుణ్యమా అని చదవగలిగాను. నాకు చాలా నచ్చింది. నాతో పాటు ఎల్లకాలం ఉంచుకునే పుస్తకాల్లో మిగితా కోతికొమ్మచ్చి భాగాలతో పాటు దీన్ని కూడా చేర్చుకున్నాను. కొమ్మ కొమ్మకీ అంత వేగంగా ఎగురుతున్నా కూడా ఎక్కడా పట్టుతప్పని చాకచక్యం ఆయనది. ఎక్కడున్నా ఆయనకో నమస్కారం!

    ప్రస్తుతం గాంధీ మనవడు (మణిలాల్ కుమారుడు) అరుణ్ గాంధీ మరో ఇద్దరితో కలిసి రాసిన “The Untold story of Kasturba: wife of Mahatma Gandhi” చదువుతున్నాను. పుస్తకం పేరుకి జీవిత చరిత్రే అయినా, కాల్పనికతా, నాటకీయతా బాగానే ఉన్నట్లు తోస్తోంది…వర్ణనల్లో. ఇప్పటిదాకా మట్టుకు నాకు ఇంకా గాంధీ కథే చదువుతున్నట్లు ఉంది. పోను పోను మరేవన్నా బా గురించి ఎక్కువగా చెబుతారేమో చూడాలి.

  31. సౌమ్య

    సెలవులో ఉండడం వల్ల, అచ్చం నిజం చిన్నప్పటి సెలవుల్లా ఆట్టే ఏదీ చేయకుండా గడుపుతున్నా కూడా, అనుకోకుండా వివిధ పుస్తకాల గురించి పరిచయం అయ్యాక, చదవడం మొదలుపెట్టాను. ప్రస్తుతానికి రెండు:

    1) Siddartha -Herman Hesse
    చాలా రోజుల్నుంచీ, చాలా మంది దీని గురించి చెబుతూ ఉన్నా ఏమిటో చదవాలి అనిపించలేదు… మొన్న చదివాను. పుస్తకం నాకు ok-ish అని మాత్రమే అనిపించింది. బొత్తిగా ఆ తరహా కథలు చదవని భారతీయులకీ, అటుపై, ఇక్కడి తాత్విక చింతన గురించి ఏమీ తెలియని విదేశీయులకీ మాత్రం బాగా నచ్చుతుందేమో అనిపించింది. అలాగని నాకేదో మహా తెలుసని కాదు. ఉదా: “ఒక యోగి ఆత్మకథ” లో మరింత లోతు ఉందనీ, అంత ప్రభావవంతంగా ఈ పుస్తకం నాకు అనిపించలేదు అని మాత్రమే చెబుతున్నాను. పుస్తకం చదువుతున్నంత సేపు – ఉపేంద్ర కన్నడ సినిమా “ఉపేంద్ర” బాగా గుర్తొచ్చింది. (దయచేసి సినిమా చూడనివారు వచ్చి తిట్ల దండకం అందుకోకండి). నిజానికి పుస్తకం కంటే ఆ సినిమా ఈ సంగతులు ఇంకా తేలికైన భాషలో (ఏమాటకామాటే, పుస్తకంలో భాష కూడా తేలిగ్గా, సులభ గ్రాహ్యంగా ఉంది) చెప్పినట్లు అనిపించింది.

    2) Life of Galileo – Bertolt Brecht

    ఇంకా పావు వంతు కూడా చదవలేదు…కానీ, ఇప్పటికే ఈ పుస్తకం నాకు విపరీతంగా నచ్చింది. ఇది గలీలియో జీవితంపై రాసిన ఒక నాటకం.

  32. Nalam Ravindranath

    CHRIS BOHJALIAN’S SKELETONS AT THE FEAST is a good novel about last days of World War II (in January 1945), we can not just write it off as yet another novel about world war II. It throws new light on a few aspects of Super powers of those days.

  33. సౌమ్య

    మమత బెనర్జీ తొంభైల్లో తన జీవితానుభావల్ను చెబుతూ రాసిన “Struggle for existence” చదువుతున్నాను, మా లైబ్రరీ పుణ్యమా అని. (అవును, ఆవిడలా TV షో మధ్యలోంచి వెర్రికేకలు పెడుతూ వెళ్ళిపోయాకే ఆ మాత్రం కోపం అదుపుచేసుకొని నటించలేని ఈవిడేమి రాజకీయ నాయకురాలూ? అనిపించీ… ఆవిడ గతం గురించి తెలుసుకోవాలని చదవడం మొదలుపెట్టాను). సరిగ్గా ఆ తరహా అసహనంలోనే సాగుతోంది. ఈ పుస్తకం కథ ఆల్రెడీ ఈవిడ రాజకీయాల్లోకి వచ్చేశాక మొదలవుతుంది. కనుక, ఆవిడ మొదటి పేజీ నుంచే యాంటీ-లెఫ్ట్. ఇప్పటిదాకా చదివినంతలో – అది తప్పితే ఇంకేమీ లేదు…కంయూనిస్టులంత రాక్షసులు లేరు…మేము మాత్రం సంఘంకోసం పాటు పడుతున్నాం అని పదే పదే, వివిధ సంఘటనల సాయంతో చెప్పడం తప్ప.
    మొన్నీమధ్య విడుదలైన ఆవిడ మరో స్వీయ కథనం గురించి కూడా రివ్యూల్లో ఇలాగే చదివాను – అదంతా పరనిందా, ఆత్మ-జస్టిఫికేషనూ అని. ఈ పుస్తకాల కంటే ఈవిడ బయోగ్రఫీ ఏదన్నా ఉంటే దాన్ని చదవడం నయం ఏమో అనిపిస్తోంది!

  34. Purnima

    Had a fab weekend, in terms of reading:

    Introduced “A Mighty Heart”, just now. Though it leaves me disappointed, definitely a thought provoking book.

    Read, long pending Abhinav Bindra’s A Shot at History! Enjoyed it to the core. Realized I haven’t been reading much on sports, these days. Can’t wait to jot down thoughts on this book.

    Skimmed through – because there isn’t much to read, it’s a post-card collection – Bijoya Ray Remembers Satyajit Ray At Work. I was recently introduced to the genius of Ray’s work and I was only glad to know about him a bit more.

  35. పద్మవల్లి

    Reading “Buddha in the Attic” by Julie Otsuka. Very interesting.

    1. Dr.Thandu Murali Mohan

      Book:”Asalem Jarigindante” by Sri.PVRK Prasad.Senior eminent IAS (Rtd)officer-IAS oficer ante devaduthalu ga bhavistamu.Ananthamaina adikaraDarpam tho meligi prajalaku dooramaite, kondaraithe,prajallo mamekamai nithyam prajasamkshemam korevaru kondaru vari vandanalu..Rendavakovaku chendinavaru Prasad garu Ayana anubhavala samharame ee pusthakam.EE rachanalo athyantha pardarshakatha kanipinchina,idi chavuthunte oka fiction kante adbuthanga achyaramu kaluguthundi, Entho mandi Mukyamanthrulatho pani chesinia anubhavalaharamlo,PV gari tho panichesinina kalamu,PV garu PM ga vunnappu athyantha daggaraga parisheelinche adrustam PRasad garikedakkindi.PVRK garu TTD EO panicheyadamu oka adrustam ayanagaru anukunte anthakante goppa adrustam PV gari tho daggaraga panicheyadam anukuntanu.PVRK gariki entho runapadivuntam manamantha a charithra antha manaku kallaku kattinattu.Anthyantha nijayithi gala IAS ooficeralalo PVRK garu okaru.meeru maakeppudu adarshame.Mee sevalu retiraina kuda edo virupanga ee samajaniki chikatsa cahidamulu andinchi dhanyulukandi Sir.Mee guidence maa keppudu avasaramenani gurthichandi danyajeevulukandi.rochu rajakeeyala prakshalanalo mee vanthu pathra rajakeeyalloki vellakundane nirvahinchandi.Sisalaina Manvatha vadiki e padavaulu avasaram ledu.Mee sevalu yuvatharanikentho margadharshakamavvali sir.Prathi pourudu chaduvalsini rachane idi.Emesco Prachuran.Price:150/- nenu cheppaglanu mansakshiga ee pusthakamu vela kattina….viluva kattalemu.This is one of the best books which inspired me a lot after gandhigari”My Experiments with Truth” Thank You My dear SIr.I want to grow up my child in your path. If at all I get chance I want salute to your feet..

Leave a Reply