తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు – మీ ఎంపిక

రీడింగ్ లిస్టులు ఎన్ని చూడలేదని – ఇరవైల్లో చదవల్సినవి, అరవైల్లో చదవల్సినవి, చనిపోయేలోపు చదవాల్సినవి – ఉఫ్! ఊపిరాడనివ్వకుండా ఇన్నేసి రీడింగ్ లిస్టులు! వాటిని చూసినప్పుడల్లా చదవాల్సిన మహాసాగరం చాలా ఉందే అని బెంబేలు పడిపోవడం. అన్నీ కాకపోయినా, అప్పుడొకటి అప్పుడొకటి తెలీని ఆణిముత్యాలు చదవడం వీటి వల్ల లాభం.

ఇంగ్లీషులో రీడింగ్ లిస్టులు బాగా కనిపిస్తున్నాయి. వాటిని గురించిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా, “మరి, మన తెలుగులో?!” అన్న ప్రశ్న ఉదయించకతప్పదు.

ఇంతకీ అందరూ తప్పక చదవవలసిన అత్యుత్తమ తెలుగు పుస్తకాలు ఏవని మీరనుకుంటున్నారు? మీ వయస్సు, పఠనానుభవాలు, సాహిత్యాభిలాషను బట్టి మీరు ఏ ఏ తెలుగు పుస్తకాలను చదవమని రికెమండ్ చేస్తారు? వాటిని ఈ కింది ఫార్మాట్ లో రాసి, ఇక్కడే వ్యాఖ్యల రూపంలో వేయండి. వాటిని గురించిన ఆలోచనలూ పంచుకోవాలంటే, ఒక వ్యాసం రాసి, మాకు పంపగలరు.

మీ రీడింగ్ లిస్ట్ ను ఈ కింది విధంగా రాయండి:

*మీ రీడింగ్ లిస్ట్ లో ఎన్ని పుస్తకాలున్నాయి:
*ఎలాంటి సాహిత్యాన్ని పరిగణించారు? (ప్రబంధాలూ, కావ్యాలు, వ్యవహారిక భాషలో వచ్చిన సాహిత్యం.. ఇలా!)
*ఎలాంటి సాహిత్యాన్ని విస్మరించారు?
*ఏ కాలానికి సంబంధించిన పుస్తకాలు పరిగణిస్తున్నారు? (గత శతాబ్ధం, ఈ శతాబ్ధం, అంతకు ముందు.. ఇలా!)
*ఏ రచనాసంవిధానానికి సంబంధించినవి? (కవితలు, కథలూ, నవలలూ.. ఇలా)

పైన వచ్చిన సమాధానాలకు అనుగుణంగా మీ రీడింగ్ లిస్ట్ కి పేరు పెట్టండి. (ఉదా: ఇరవైయ్యో శతాబ్ధంలో వచ్చిన పది అత్యుత్తమ కవితా సంపుటాలు.)

౧. పుస్తకం పేరు: రచయిత / కవి
౨. పుస్తకం పేరు: రచయిత / కవి
౩. పుస్తకం పేరు: రచయిత / కవి
.
.
.
.

ముఖ్య గమనిక: మీరు రాసే ఈ చిట్టా, పూర్తిగా మీ అనుభవాలను, ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఉండనివ్వండి. ఇది అందరి ఆమోదం కోసం. ఒకరి అభిప్రాయాలను మరొకరు తెల్సుకోవడం కొరకే! తెలీని పుస్తకాలను తెల్సుకోవడమే!

పుస్తకం.నెట్ లో ఎప్పుడూ వచ్చే ఫోకస్ అంశాలకు భిన్నం ఇది. పుస్తకాల లిస్ట్ తయారుచేయడం కోసం, సమయాన్ని, శ్రమనీ వెచ్చించాల్సిన ఉంటుంది కాబట్టి, ఈ రీడింగ్ లిస్ట్ అంశానికి సమయనిబంధనలూ లేవు. తీరిగ్గా కూర్చొని, ఆలోచించి, మీ చిట్టాను పంచుకోండి.

ఎదురుచూస్తూ ఉంటాం!

పుస్తకం.నెట్

You Might Also Like

18 Comments

  1. రమణ

    ఇప్పటి వరకు చదివిన పుస్తకాల్లో బాగా నచ్చినవి ఇవి. కావ్యాలు, ప్రబంధాలు, పద్య సాహిత్యం చదవలేదు. కవితలు, కధలు, వ్యాసాలు కూడా పెద్దగా చదవలేదు.

    1.చివరకు మిగిలేది – బుచ్చిబాబు
    2.నేనూ-చీకటి – కాశీభట్ల వేణుగోపాల్
    3.అంపశయ్య – నవీన్
    4.హిమజ్వాల – వడ్డెర చండీదాస్
    5.అసమర్ధుని జీవయాత్ర – గోపీచంద్
    6.అనుక్షణికం – వడ్డెర చండీదాస్
    7.అల్పజీవి – రావిశాస్త్రి
    8.తపన – కాశీభట్ల వేణుగోపాల్
    9.తెరవని తలుపులు – కాశీభట్ల వేణుగోపాల్
    10.దిగంతం – కాశీభట్ల వేణుగోపాల్
    11.అంతర్ముఖం – యండమూరి
    12.అతడు అడవిని జయించాడు – కేశవరెడ్డి
    13.కాలాతీత వ్యక్తులు – పి.శ్రీదేవి
    14.మైదానం – చలం
    15.మళ్ళీ వసంతం – ఆర్.యస్.సుదర్శనం
    16.వ్యక్తిత్వంలేని మనిషి – కొమ్మూరి వేణుగోపాలరావు

    17.కన్యాశుల్కం – గురజాడ అప్పారావు

    18.బుచ్చిబాబు కధలు
    19.కాశీభట్ల వేణుగోపాల్ కధలు
    20.గోపీచంద్ కధలు

    21.అమృతం కురిసిన రాత్రి – తిలక్

    22.స్త్రీ – చలం
    23.సాక్షి వ్యాసాలు – పానుగంటి
    24.బుచ్చిబాబు సాహిత్య వ్యాసాలు
    25.నవీన్ సాహిత్య వ్యాసాలు

  2. బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్

    ఇప్పటిదాకా చదివిన పుస్తకాల్లో నాకు బాగా నచ్చినవి
    1.కృష్ణపక్షం – దేవులపల్లి కృష్ణశాస్త్రి
    2.మహాప్రస్థానం -శ్రీశ్రీ
    3.వేయిపడగలు – విశ్వనాథ సత్యనారాయణ
    4.కన్యాశుల్కం – గురజాడ అప్పారావు
    5.మధురాంతకం రాజారాం కథలు ( అన్నీ ) – మధురాంతకం రాజారాం
    6.దగాపడిన తమ్ముడు – బలివాడ కాంతారావు
    7.అస్తిత్వనదం ఆవలి తీరాన – మునిపల్లె రాజు
    8.అంతర్ముఖం -యండమూరి వీరేంద్రనాథ్
    9.విజయానికి ఐదు మెట్లు – యండమూరి వీరేంద్రనాథ్
    10.పద్మవ్యూహం (నాటిక) -ఎల్.బీ.శ్రీరాం

  3. karthik

    @shailaja:
    in 10 th class i read “barister parvatesam” naval many times, it is the 10th class telugu nondetailed text. very funny, very intresting I always love this noval, and i am on another computer so i can’t write in telugu

  4. కోడీహళ్లి మురళీమోహన్

    పైన murali mohan గారి వ్యాఖ్యలో పేర్కొన్న మా పసలపూడి కథలు వ్రాసింది వంశీగారనుకుంటాను.

  5. కోడీహళ్లి మురళీమోహన్

    నేను చదివిన పుస్తకాలలో నాకు నచ్చిన పుస్తకాలు ఇవి.

    1.మహాప్రస్థానం – శ్రీశ్రీ
    2.త్వమేవాహమ్ – ఆరుద్ర
    3.శివభారతము – గడియారం వెంకటశేషశాస్త్రి
    4.నాదేశం నా ప్రజలు – గుంటూరు శేషేంద్ర శర్మ
    5.వేయిపడగలు – విశ్వనాథ సత్యనారాయణ
    6.కన్యాశుల్కం – గురజాడ అప్పారావు
    7.గబ్బిలం – గుఱ్ఱం జాషువా
    8.కొయ్యగుర్రం -నగ్న ముని
    9.అత్తగారికథలు – భానుమతి రామకృష్ణ
    10.మైదానం – గుడిపాటి వెంకటాచలం
    11.పాకుడురాళ్ళు – రావూరి భరద్వాజ
    12.ప్రతాపరుద్రీయం – వేదం వెంకటరాయశాస్త్రి
    13.హంపీ నుంచి హరప్పాదాక – తిరుమల రామచంద్ర
    14.వీరేశలింగ యుగము – సర్దేశాయి తిరుమలరావు
    15.శతపత్రము – గడియారం రామకృష్ణ శర్మ
    16.ఇద్దరమ్మాయిలు ముగ్గురబ్బాయిలు – ముళ్ళపూడి వెంకట రమణ
    17.తాకట్టులో భారతదేశం – తరిమెల నాగిరెడ్డి
    18.నా వాఙ్మయ మిత్రులు – టేకుమళ్ల కామేశ్వర రావు
    19.అతడు ఆమె – ఉప్పల లక్ష్మణ రావు
    20.ఉత్తమ నాయకత్వం – బుడ్డిగ సుబ్బరాయన్

    ఈ జాబితాను ఇంతంకంటే కుదించలేక పోతున్నాను. పై పుస్తకాలు నాకు స్ఫురించిన క్రమంలో వ్రాసిందే కాని వాటి ఉత్తమత్వం ఆధారంగా కాదని మనవి.

    1. అశోక్

      నమస్తే సర్ , త్వమేవాహం పుస్తకం ఎక్కడా దొరకడం లేదు, దయచేసి ఆ పుస్తకం pdf లో ఏమైనా దొరికే అవకాశం ఉంటే తెలియజేయండి. ధన్యవాదాలు

  6. murali mohan

    Malladi krishnamurthy vari ” maa pasalapudi kathalu’ oka manchi kathala samputi “

  7. కల్హార

    నేను చదివిన అతి తక్కువ పుస్తకాల్లో బావున్నాయనిపించినవాటిల్లో ప్రస్తుతం గుర్తుకొచ్చినవి కొన్ని:
    ౧. అమృతం కురిసిన రాత్రి
    ౨. కన్యాశుల్కం
    ౩. బుచ్చిబాబు కథలు
    ౪. అసమర్ధుని జీవయాత్ర
    ౫. చలం మ్యూజింగ్స్
    ౬. చలం ప్రేమలేఖలు
    ౭. స్వీట్ హోమ్ – రంగనాయకమ్మ
    ౮. యండమూరి షార్ట్ స్టోరీస్
    ౯. మధురాంతకం రాజరాం కథలు
    ౧౦.తిలక్ కథలు
    ౧౧.పాలగుమ్మి పద్మరాజు కథలు
    ౧౨.చివరకు మిగిలేది

  8. venkatrao.n

    నాకు తెలుగు లో నచ్చిన నవల రావిశాస్త్రి గారి’ రాజు మహిషి ‘.ఆ తర్వాత ఇక కళ్యాణరావు గారి ‘అంటరాని వసంతం ‘

  9. జంపాల చౌదరి

    @సుధాకర బాబు:

    ఈ వికి జాబితా తయారీకి సారథ్యం వహించిన కాసుబాబు మీరేనా?

  10. shailaja

    నాకు తెలుగు భాష లో ఎప్పటికి మర్చిపోలేని నవల, ఎన్ని సార్లు చదివిన ఇంకా కొత్తగా అనిపించి నవ్వు తెపించే నవల మొక్కటి నరసింహ శాస్త్రి గారు రచించిన బారిష్టర్ పార్వతీశం.
    దీని తరువాత నేను చదివిన తెలుగు నవల, చిలకమర్తి గారు రచించిన గణపతి అనే నవల.

    నాకు తెలిసినంత వరకు ఈ రెండు నవలలు నవ్వులు విరజల్లె తెలుగు రచన సుమాలు

  11. సుధాకర బాబు

    http://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%81%E0%B0%96%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AE%E0%B1%88%E0%B0%A8_%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%AA%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%9C%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE

    http://te.wikipedia.org/wiki/ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

    చూడండి. “ఈమాట” జాబితా, ఆకాశవాణి “శతవసంత సాహితీ మంజీరాలు” జాబితా కూడా ఇందులో కలుపబడినాయి.

  12. Anwar

    తెలుగు పుస్తకాలు అంటే తెలుగులొ కి అనువాదం అయినవి కూడా వొస్తాయా ?

    1. సౌమ్య

      @Anwar: ప్రస్తుతానికి అనువాదాలు పక్కన పెడదాము. ఏమంటారు?

  13. విజయవర్ధన్

    @జంపాల చౌదరి: చాలా మంచి సమాచారం అందించారు. ధన్యవాదాలు

  14. జంపాల చౌదరి

    @జంపాల చౌదరి:

    >> 2002 డిశంబర్లో, ప్రయాగ వేదవతి, నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణిలో ఒక ప్రత్యేక కార్యక్రమంగా తెలుగులో 100 మంచి పుస్తకాలను ఎంచుకొని, ప్రతి పుస్తకంపైన ఒక ప్రసంగం చేయించారు.

    పై వాక్యాన్ని సరిదిద్దుకోవాలి: శత వసంత సాహితీ మంజీరాలు పుస్తకంలో ప్రచురించిన ప్రసంగాలు డిశంబరు 2002లో ప్రారంభం కాలేదు. పుస్తకం డిశంబరు 2002లో ప్రచురించబడింది కాని ఈ ప్రసంగాలు 1999 జులై 1న మొదలై 2002 మే వరకు ధారావాహికగా ప్రతి గురువారం ఉదయం విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారమయ్యాయట. 75మంది సాహితీవేత్తలు ఈ ప్రసంగాల్ని చేశారు. ప్రయాగ వేదవతిగారు (స్టేషన్ డైరెక్టర్), నాగసూరి వేణుగోపాల్‌ (ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్)లను సంపాదకులుగా పుస్తకంలో పేర్కొన్నారు. వేదవతిగారి ముందు మాట బట్టి, ఈ ప్రోగ్రాం నిర్వహణ వేణుగోపాల్ గారిదని అనుకొంటున్నాను. మా పట్టిక వెలువడిన వెంటనే వేణుగోపాల్ గారిదగ్గర్నుంచి ఒక ఉత్తరం అందుకొన్నట్లు గుర్తు.

    1. సౌమ్య

      ఇటీవలే సాక్షి సండే మేగజీన్ లో కూడా ఒక జాబితా తయారు చేశారు…

  15. జంపాల చౌదరి

    1999లో, ఇరవయ్యో శతాబ్దపు ఆఖరు సంవత్సరంలో, కొంతమంది సాహిత్యాభిమానులం ఒక వంద ముఖ్యమైన పుస్తకాల పట్టిక తయారు చేయడానికి ప్రయత్నించాం. అప్పటి తెలుసా ఇంటర్నెట్ వేదికలో సభ్యుల్నీ, (http://groups.yahoo.com/group/telusa/message/2317), ఇతర సాహితీ అభిమానుల్నీ సంప్రదించాం. వేల్చేరు నారాయణరావు గారు, (అప్పుడు డెట్రాయిట్‌లో ఉన్న) చేకూరి రామారావు గారు ఈ చర్చల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. వారిద్దరూ, ఈమాట వ్యవస్థాపక సంపాదకుల్లో ఒకరైన కె.వి.ఎస్.రామారావు, పరుచూరి శ్రీనివాస్, కన్నెగంటి చంద్రశేఖర్, నేను కలిసి – చాలా చర్చల తర్వాత – చివరి పట్టిక తయారుచేశామని జ్ఞాపకం.

    ఈ పట్తిక మొదటిసారి సిన్సినాటిలో జరిగిన 12వ తానా మహాసభల సావెనీరు “తెలుగు పలుకు”లోనూ, ఈమాట జులై 1999 సంచికలోనూ (http://www.eemaata.com/em/issues/199907/836.html) ప్రచురింపబడింది. నవీన్ అంపశయ్య ఈ పట్టికలో ఉండాల్సిందని అందరమూ అభిప్రాయపడ్డాం కాని, ఏదో పొరపాటువల్ల ఆ పుస్తకం ఈ పట్టికలో చేరలేదు.

    2002లో కథానిలయం చూడడానికి వెళ్ళినప్పుడు, అక్కడ సేకరించి ఉంచిన పుస్తకాల గురీంచి చెబుతూ కారా మాస్టారు, చేరా-నారా లిస్టులో ఉన్న 100 పుస్తకాలూ ఆ గ్రంథాలయంలో ఉన్నాయని చెప్పారు. 1999లో వచ్చిన ఈ పట్టిక తెలుగునాట చేరా-నారా లిస్టుగా పేర్కొంటున్నారని అప్పుడే తెలిసింది. ఈ పట్టికను తానా లిస్టుగా ప్రస్తావించటమూ నాకు తెలుసు.

    1999 చివర్లో ఆంధ్రజ్యోతి దినపత్రిక వేయేళ్ళ తెలుగు సాహిత్యంలో ఉన్న ఆణిముత్యాలు అన్న పేరుతో ఇంకో 100 పుస్తకాల పట్టిక వచ్చింది.

    2002 డిశంబర్లో, ప్రయాగ వేదవతి, నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణిలో ఒక ప్రత్యేక కార్యక్రమంగా తెలుగులో 100 మంచి పుస్తకాలను ఎంచుకొని, ప్రతి పుస్తకంపైన ఒక ప్రసంగం చేయించారు. ఈ ప్రసంగాలన్నీ 2002 చివర్లో శత వసంత సాహితీ మంజీరాలు అన్న పేరుతో ఒక పెద్ద పుస్తకంగా ఆంధ్రప్రేదేశ్ లైబ్రరీ అసోసియేషన్ ప్రచురించింది.

Leave a Reply