పదాలతో ఆడుకుంటూ, పాటలతో తెలుగు హృదయాలను ఆకట్టుకుంటూ చివరి వరకు అవిశ్రాంతంగా ఆగని కలంతో, అలుపెరుగని బలంతో సాగిన వేటురి వారి పాట రచనా స్రవంతిలో ఎన్నో మణిపూసలు, మరెన్నో మెరుపులు, కొత్త మలుపులు, కొన్ని గవ్వలు. పాన్ డబ్బా నుంచి పండితుల వరకు ఆకట్టుకునే రచనలు చేయడం కష్టం, చేసి మెప్పించడం కష్టతరం. అయినా “పట్టుదలే వుంటే కాగలడు మరో బ్రహ్మ- కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు” అని అంటూ, అనిపిస్తూ సాగిన మహామనీషికి, మహా నిగర్వికి, పుస్తకం.నెట్ వ్యాస ప్రచురణ ఆపడం కాదు, ఇంకా సృజనాత్మకతతో ఇంకెంతో స్ఫూర్తితో తెలుగులో రాయడం, పంచడం, అందరికీ అందించడమే నిజమైన నివాళి, అతనికి ఆత్మశాంతి, అనిపిస్తుంది.
========
విధేయుడు
శ్రీనివాస్
Srinivas Nagulapalli