చంద్రలత పుస్తకాల ఆవిష్కరణ – ఆహ్వానము
చంద్రలత రచించిన రెండు పుస్తకాలు – దృశ్యాదృశ్యం, To Tell a Tale ల ఆవిష్కరణ సాహితీమిత్రులు, ప్రభవ సంస్థల ఆధ్వర్యంలో జరుగనుంది.
ఈ రెండు పుస్తకాలలోనూ ఉన్న అంతః సూత్రం, పునర్నిర్మాణం. చారిత్రక విధ్వంసాలలోంచి,వికృత విఘాతాల్లోంచి తలెత్తిన విషాదసంధర్భాలను ఎదురొడ్డి, ఎవరికి వారు పునర్మించుకొనే క్రమంలో, ఆయా రచయితల రచనలు వారి సమాజాల్లో, బలమైన భౌద్ధిక భూమిక ను ఏర్పరచాయి. గాయాల్లోంచి తేరుకొని, మరింత కొత్త ఉత్సాహంతో పునర్నిర్మించుకొనే క్రమంలో చేసిన పునర్నిర్వచనాలివి. గుంథెర్ గ్రాస్ (జర్మన్), అంబర్తోఈకో (ఇటాలియన్) కథనాలు, ప్రపంచయుద్ధాల తరువాతి పునర్నిర్మాణంలోంచి ఊపిరిపోసుకొంటే, మార్క్వెజ్ (స్పానిష్) కథనం నియంత్రత్వాల్లోంచి, అంతర్యుద్ధాలలోంచి, విదేశీవ్యాపారాల దౌష్ట్యాలలోంచి, స్వేచాసమజాల కోసమై మొలకెత్తిన ఆలోచన. గోపీచంద్,కృష్ణారావు(తెలుగు) ల కథనాలు స్వతంత్రానంతర పునర్నిర్మాణంలోని భ్రమలను పటాపంచలు చేసాయి. ఆనాటి తెలుగు సమాజ పునర్నిర్మాణంలో వ్యక్తి సమర్థత, సమాజసమర్థతల అవసరాన్ని నొక్కి చెప్పాయి. యుద్ధాలు, సామ్రాజ్య పాలన, వ్యాపారాలు, అభివృధ్ధి, మంచీచెడు కారణం ఏదైనా, దేశం ఏదైనా, కాలం ఏదైనా అవాంఛనీయమయ్యే చలనాలలోంచి, అనివార్యంగా,అవసరం గా, సహజంగా తలెత్తే,పునర్నిర్మాణ ప్రయత్నాలకు ఫలితాలకు , భాతీతమైన నవలాకథనాలు బలమైన ఉదాహరణలు.ఇక, చంద్రలత తెలుగునవల స్వాతంత్రాంతర ఆదర్శ వాదాలలోని,శాస్త్రీయ సాంకేతిక అభివృద్ధి కలిగించిన నిర్వాస పరిస్థితి ని, పునారావాసాన్ని, పునర్నిర్మాణంలోని సున్నితాంశాలను తెలుపుతుంది. ఈ పునర్నిర్మాణ నవలాకథనాలలోని మూలసూత్రం మానవ స్పృహ, మానవ స్పర్శ!
కార్యక్రమం వివరాలు:
తేదీ: ఏప్రిల్ 21, 2019
సమయం: సాయంత్రం ఆరు గంటలకి
వేదిక:శిఖర స్కూల్, ప్రజాశక్తి నగరం, మొగల్రాజపురం, విజయవాడ
ఇతర వివరాలకి జతచేసిన ఆహ్వాన పత్రం చూడండి.
(వార్త అందించిన వారు: ప్రభవ ప్రచురణలు, అనిల్ అట్లూరి)
Leave a Reply