పుస్తకం.నెట్ తొమ్మిదో వార్షికోత్సవం

ఇవ్వాళ్టితో పుస్తకం.నెట్ మొదలుపెట్టి తొమ్మిదేళ్ళు పూర్తవుతుంది. ముచ్చటగా పదో ఏట అడుగుపెడుతుంది. ఇన్నాళ్ళ మీ ఆదరాభిమానాలకు ఎలా ధన్యావాదాలు చెప్పుకోవాలో తెలియడంలేదు. పుస్తకాలను అభిమానించి, ఆదరించేవారు ఇంకాఇంకా పెరుగుతూనే ఉండాలని ఆశిద్దాం.
ఇప్పటివరకూ నిర్విఘ్నంగా కొనసాగడమే ఒక ఎత్తు. గత రెండేళ్ళగా పుస్తకం.నెట్ కొంచెం వేగం తగ్గిందనిపించినా, ఈ ఏడాది సగటున వారానికో వ్యాసంతో మీముందు నిలిచింది. ఎప్పటిలానే ఈ ఏడాది గణాంకాలను చూస్తే:
ఈ ఏడాది వచ్చిన వ్యాసాలు: 102
మొత్తం ఇప్పటివరకూ
వచ్చిన వ్యాసాలు: 1965
కామెంట్లు: 9587
హిట్లు: 1619093
ఈ ఏడాది క్రమంగా వ్యాసాలు పంపిన కొల్లూరు సోమశంకర్ గారికి, నాగిని కందాల గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు.
ఇన్నేళ్ళ మన ప్రయాణాన్ని వీడియో రూపంలో ఇక్కడ చూడవచ్చు.
అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!
— పుస్తకం.నెట్
Leave a Reply