చర్చ గ్రూపు జనవరి 2016 సమావేశం – ఆహ్వానం

బెంగళూరులో ప్రతినెలా జరిగే “చర్చ” గ్రూపు వారి జనవరి 2016 సమావేశానికి ఆహ్వానం ఇది. వివరాలు:

తేదీ: జనవరి 9,2016
సమయం: సాయంత్రం 5:15
స్థలం: మెకానికల్ ఇంజనీరింగ్ (ఐ.ఇ.ఎస్సి ) డిపార్టుమెంటు యొక్క MMCR లో

విషయం: పి.సత్యవతి గారి, ఈ క్రింద ఇచ్చిన ఐదు కధలపై చర్చ. kathalu: మంత్రనగరి, నేనొస్తున్నాను, ఇల్లలకగానే పండగౌనా?, గోధూళివేళ, మాఘ సూర్యకాంతి

ప్రశ్న(లు):
1. గడచిన రెండు దశాబ్ధాలలో స్త్రీలు కొంతమేరకు “ఉన్నత విద్య / ఆర్ధిక స్వావలంభన” సాధించిన తరువాత కుడా, కుటుంబ జీవనంలో ( మగవారి దృక్పధంలో ) ఆశించిన మార్పు రాకపోవడానికి గల కారణాలు ఏమిటి? ఒకవేళ ఊహకు మించి/ఆశించిన దానికంటే ఎక్కువ మార్పు సంభవించిందని నమ్మినట్లయితే, దానిని బలపరుస్తూ తగిన వివరణ/ఉదాహరణనిస్తూ, పైన పేర్కొన్న “రెండు విషయాలే” దానికి సాధ్యం చేశాయా లేక మరేమైనా ఇతర కారణాలున్నాయా తెలపండి.
2. గడిచిన అర శతాబ్ద కాలంతో పోలిస్తే, ప్రస్తుత కాలంలో మధ్య తరగతి కుటుంబాల ఆలోచన, విధివిధానాలు, నమ్మకాలు ఏమైనా మార్పుకు లోనవడం జరిగిందా? ఈ ప్రశ్నకు సమాధానం ఈ ఐదు కధలను ఆధారం చేసుకుని చెప్పండి.

You Might Also Like

2 Comments

  1. Venkat

    మీరు తారీకు ఒక్కసారి పరీక్షించండి. ఎందుకో నాకు సందేహంగా వున్నది.
    జనవరి 9,2015 అని పెట్టారు, సరైదేనా?

    1. సౌమ్య

      Thanks. Changing now.

Leave a Reply