2012 బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డు

(వివరాలు తెలిపినందుకు తమ్మినేని యదుకుల భూషణ్ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)
*******

ఈ ఏడాది సి.పి.బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డుల తాలూకా ప్రకటన ఇది.

ఇస్మాయిల్ అవార్డు -2012

తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు రామినేని లక్ష్మి తులసి ఎంపికైంది. ఆధునికత, పాదరసంలా మెదిలే భావగతులను అలతి అలతి పదాలతో పట్టుకురావడంలో అనితర సాధ్యమైన నేర్పు నేటికాలపు కవులనుండి ఈమెను ఎడంగా నిలబెడతాయి. గతంలో పాలపర్తి ఇంద్రాణి, గోపిరెడ్డి రామకృష్ణారావు, గరికపాటి పవన్‌కుమార్, పి.మోహన్‌,వైదేహి శశిధర్, గండేపల్లి శ్రీనివాస రావు,పద్మలతలకు ఈ అవార్డ్ లభించింది.

బ్రౌన్ పురస్కారం-2012

అనువాదాల్లో ఎక్కడా అనువాదకుడు కనిపించరాదు , మూల రచయితే మూల విరాట్టుగా భాసించాలి. ఈ శిల్పం తెలిసిన ఆలూరి భుజంగ రావుగారు, మహాపండితులు రాహుల్ సాంకృత్యాయన్ చారిత్రక నవలా సాహిత్యంతో పాటు తత్వ శాస్త్రాలను కూడా సమర్థంగా తెనిగించారు. వీరి కృషికి గుర్తింపుగా నందన నామ సంవత్సరానికి గాను బ్రౌన్ పండిత పురస్కారాన్ని వీరికి ప్రకటిస్తున్నాము.వీరు శారదకు (నటరాజన్) ఆత్మీయ స్నేహితులు, శారద సాహిత్యం వెలుగులోకి రావడానికి ఎంతో కృషి చేశారు .వీరి ప్రస్తుత నివాసం గుంటూరు.

You Might Also Like

2 Comments

  1. vivekananda talakola

    విజేత లిద్దరికి అభినందనలు

  2. రఘోత్తమ రావు

    ఇస్మాయిల్ అవార్డ్ను సాధించిన లక్ష్మీతులసి రామినేనికి అభినందనలు.

Leave a Reply to vivekananda talakola Cancel