మా గురించి / About us

పుస్తకం.నెట్ గురించి:పుస్తకం.నెట్ ప్రపంచ సాహిత్యంపై పుస్తకప్రియుల వ్యాఖ్యానాన్ని తెలుగు, ఆంగ్ల భాషల్లో అందించే అంతర్జాలపత్రిక.పుస్తకాల పై సమీక్ష, విమర్శ, పరిచయ వ్యాసాలే కాక రచయితలతో ఇష్టాగోష్టి, ప్రచురణకర్తలతో, పుస్తకవిక్రేతలతో మాటా-మంతీ, పుస్తకప్రియత్వాన్ని చాటి చెప్పే వ్యాసాలెన్నో ఇక్కడ చోటు చేసుకుంటాయి.

పుస్తకం.నెట్‍ ముఖ్యోద్దేశ్యం పాఠకులు తమ మాటల్లో తాము చదివిన పుస్తకాల గురించి అందరితో పంచుకోవడం. పుస్తకాలను ఇష్టంగా చదువుకోవడమనేదే ఇక్కడ ప్రాధమిక అర్హత. మా ఆంతర్యం, జార్జ్ ఆర్వెల్ మాటల్లో.

Nearly every book is capable of arousing passionate feeling, if it is only a passionate dislike in some or the other reader, whose ideas about it would surely be worth more than those of a bored professional. – George Orwell

పుస్తకం.నెట్‍లో  రాసేవాళ్ళల్లో వృత్తిరిత్యా  ఇంజినీర్లు, డాక్టర్లు, రచయితలు ఉన్నా వారంతా ముందుగా పుస్తకాభిమానులు.

పుస్తకం.నెట్ జనవరి ఒకటి, 2009న ప్రారంభమయ్యింది.  సౌమ్య వి.బి, పూర్ణిమ తమ్మిరెడ్డి దీన్ని నిర్వహిస్తున్నారు. సాంకేతిక సాయం చేస్తున్నవారు పొద్దు.నెట్.

మమల్ని సంప్రదించాల్సిన చిరునామా:  editor@pustakam.net

About pustakam.net:

Pustakam.net is a web magazine dedicated to commentaries -primarily in Telugu and occasionally in English- on world literature, by booklovers.

Apart from the book reviews and book introductions, the site also covers interactions – personal or email – with writers, booksellers, book publishers and  news about the book world.

The prime motivation behind the pustakam.net has been to provide a platform to a common reader to voice his opinion of the books (s)he has read and showcase his love for books.

The regular contributors to pustakam come from varied professional backgrounds including engineers, doctors, writers, journalists and many more. Regardless what they do for a living, they all are book lovers.

pustakam.net has gone live on Jan’01, 2009. Sowmya VB and Purnima Tammireddy do the needful to keep the site running, while poddu.net provides necessary technical support background.

Contact us: editor@pustakam.net


155 Comments

  1. Krishna Rao Maddipati

    ఈ వ్యాఖ్య ఇక్కడ పోస్టు చెయ్యాలన్న ఉద్దేశంతో చేస్తున్నది కాదు. కేవలం సరదా కోసం మాత్రమే!

    “పుస్తకం.నెట్‍లో రాసేవాళ్ళల్లో వృత్తిరిత్యా ఇంజినీర్లు, డాక్టర్లు, రచయితలు ఉన్నా వారంతా ముందుగా పుస్తకాభిమానులు.”

    మరి వైద్యులను (Physicians) మరచిపోయారే!

  2. .mannava satyam

    పుస్తకం నెట్ : కు
    నమస్కారములు
    పుస్తక పఠన ప్రయోజనము గురించి భారతీయ మేధావులు , మహనీయులు చెప్పిన సూక్తులన్నీ ఒకచోట ఎక్కడైనా ఉంటే లింక్ ఇవ్వగలరని ప్రార్ధన ..
    ఇతర దేశాల మేధావుల సూక్తులే అన్నీ చోట్ల నెట్ లో కనపడు తున్నాయి..
    దయచేసి దీని మీద దృస్తి పెట్టగలరని ప్రార్ధన….

  3. Suresh

    అయాన్ రాండ్ పుస్తకాలూ తెలుగులో ఎక్కడ దొరుకుతాయి ప్లీజ్ చెప్పండి

Leave a Reply