మీరేం చదువుతున్నారు?
పుస్తకాలు తరచుగా చదువుతున్నా, పేజీలకి పేజీలు సమీక్షలు రాసే ఓపికా, తీరికా లేని వారి కోసం ఈ పేజీని నిర్వహిస్తున్నాము. ఈ వారంలో మీరే పుస్తకాలు చదివారు, వాటిని గురించి ఓ రెండు ముక్కలు ఇక్కడ comments రూపంలో పంచుకోవచ్చు. ఈ నమునాలో వివరాలు చెప్తే సులువుగా ఉంటుంది.
పుస్తకం పేరు:
రచయిత:
భాష:
వెల:
అంతర్జాలంలో ఈ పుస్తక వివరాలు:
పుస్తకం పై మీ అభిప్రాయం:
శారద
బహుమతి కథ:
రంజని-నందివాడ భీమారావు పోటీల్లో బహుమతులు పొందిన కథల సంపుటి. ఇలాటిదే ఇంతకు ముందు ప్రచురణ “మంచి కథ” లోని కథలతో పోలిస్తే ఈ కథలు కొంచెం వెలవెలపోతాయి. పదేళ్ళల్లో కథకుల స్థాయి దిగజారిందేమోనన్న అనుమానం రాక పోలేదు. ఏదో ఒకటి రెండు కథల్లో తప్పితే అన్ని కథల్లోనూ “అమెరికా-డబ్బూ-కొడుకులూ-కోడళ్ళూ” విలన్లు! వస్తువులోకానీ శైలిలోకానీ ఏ మాత్రం వైవిధ్యం లేని కథలు!
Death of a Red Heroine-Qui Xialong
వివిధ ప్రదేశాల గురించీ, ప్రజల జీవన శైలి గురించీ నేర్చుకోవాలంటే మిస్టరీ నవలలే బెస్టు అన్నారు స్కాట్ లేండు కి చెందిన ఇయాన్ రాంకిన్- హిందూ పేపర్ తో ఒక ఇంటర్వ్యూలో. ఆయన కూడా చాలా మంచి మిస్టరీలూ రాసారు. పై పుస్తకం చదివినప్పుడు నాకా మాటే గుర్తొచ్చింది. షాంగ్-హాయి నగరంలో హత్యకు గురైన ఒక యువతి గురించి. చాలా బాగుంది.
ప్రస్తుతం చదువుతున్నవి:
శ్రీసుభా కథలు,
“వేలాడిన మందారం” (జ్వాలా ముఖి).
మంచి మంచి తెలుగు పుస్తకాలు తెప్పిస్తున్న మా చార్ల్స్-స్టర్ట్ కౌన్సిల్(అడిలైడ్) లైబ్రరీకి మళ్ళీ మళ్ళీ జేజేలు!
శారద
Purnima
రెండు బెమ్మాండమైన పుస్తకాలు చదివాను. ర
౧. Feet of Clay by Anthony Storr – ఇది సైకాలజికి సంబంధించిన పుస్తకం. “గురువు”లుగా వ్యవహరింపబడి, ఒక ఫాలోయింగ్ దక్కించుకొని, మంచికో చెడుకో ప్రజల్ని ప్రభావితం చేసిన కొంతమంది పై చేసిన మానసిక విశ్లేషణ. వీరందరికి మానసిక పరంగా ఎక్కడెక్కడ సామ్యాలున్నాయో సునిశితంగా చర్చించే పుస్తకం. చాలా విషయాలు తెల్సుకునే వీలు కల్పిస్తుంది. కాకపోతే అంత తేలిక పఠనం కాదు. కాస్త ఓపిగ్గా చదువుకోవాలి.
౨. In Arabian Nights by Tahir Shah – Fictionకి, Non-Fictionకి మధ్య ఉన్న గీతను చెరిపేస్తూ, వాస్తవానికీ, అద్భుతానికీ వారధి కట్టేస్తూ మాటలతో సరికొత్త ప్రపంచం సృష్టించగల ధీరుడెవరయా అంటే తాహీర్! ఆయన పుస్తకాల్లో నాకు తేలిగ్గా లభ్యమైన పుస్తకం ఇదే కనుక, దీనితో మొదలెట్టాను. చెప్పటం మొదలెడితే ఆపను. అందుకని రెండు ముక్కలు: చెప్పుకోడానికి ఇది మొరక్కో దేశంలో రచయిత నివసించినప్పటికి విశేషాలు. ’ట్రావెల్’ అని వర్గీకరించచ్చు. కానీ, అనేక లేయర్స్ లో విపరీతంగా richగా ఉంటుంది. ఆ సంపదంతా ఒక్కసారి పఠనంలో దొరకదు. వీలైనంత త్వరలో ఒక పరిచయ వ్యాసం రాయడానికి ప్రయత్నిస్తాను.
Purnima
గిరీష్ గారు: నేను విశాలాంధ్ర, అబిడ్స్ లో కొన్నానండి. నేను వెళ్ళిన పూట, అప్పుడే కొత్త బండిల్స్ వచ్చాయి. నేను అందులోవి ఒకటి ఇవ్వమంటే, పాత పుస్తకాలే అని అరలోంచి తీసిచ్చారు. సులభంగానే దొరకొచ్చు, ప్రయత్నిస్తే.
రెండో సంపుటి కూడా వచ్చినట్టుంది. ఇది నేను కొనలేదు. మీరు ప్రయత్నించి చూడండి. దొరక్కపోతే నాకో మెయిల్ చేయండి.
Gireesh K.
@Purnima
“కరుణశ్రీ సాహిత్యం” ఎక్కడ దొరుకుతుందో దయచేసి చెప్పగలరా?
Ravindranath Nalam
Visalandhra Book House , Bank street, Hyderabad has published in October 2010 Karuna Sree Saahityam No. 1 and named it as UDAYA SREE and priced at RS. 200.
It is a compendium of 5 parts. It does contain his wonderful work PAAKIPILLA in page 77
The web site of Visalandhra: http://www.visalaandra.com
email: visalaandhraph@yahoo.com
Phone numbers 2474 4580 / 24735905
Gireesh K.
నండూరి వారి విశ్వదర్శనం మొదలు పెట్టి, సగం చదివాక, చదివినదాన్ని రివైండ్ చేసుకొవడానికి చిన్న విరామమిచ్చి, ఇప్పుడే “ఫ్రీడం అట్ మిడ్నైట్” మొదలు పెట్టాను. ఈ పుస్తకం చదివిన ప్రతిసారీ నన్ను ఆశ్చర్య పరుస్తూనే ఉంటుంది!
Ravindranath Nalam
అంతర్జాలం లో viswadarsanam దొరుకుతుందా?
సౌమ్య
గత మూడు వారాల్లో చదివినవి/చదువుతున్నవి:
1) చార్వాకం – బి.రామకృష్ణ : నేనింకా చార్వాకం గురించి చెబుతారనుకున్నా. ఉపనిషత్తులు, పురాణాల నుంచి నాస్తికవాదాన్ని సమర్థించే శ్లోకాలు మాత్రం సేకరించి, అర్థాలు చెప్పి ఆగిపోయారు!!
2) నా రేడియో అనుభవాలు-జ్ఞాపకాలు: శారదాశ్రీనివాసన్ : బాగుంది. ఇదివరకే పుస్తకం.నెట్ లో దీని గురించి చర్చించాను.
3) A Larger memory: Ronald Tokaki: మొదలుపెట్టి చాలారోజులైనా, ఈమధ్యే పూర్తి చేశాను. అద్భుతమైన పుస్తకం!
4) The Seventh Seal – Ingmar Bergman: ఇది ఆ సినిమా స్క్రీంప్లే. నాకు విపరీతంగా నచ్చింది.
5) The Father – August Strindberg: ఇది బెర్గ్మాన్ ని చాలా ప్రభావితం చేసిన అగస్ట్ స్ట్రిండ్బర్గ్ రాసిన నాటకం. సంభాషణలు, మానసికోద్వేగాల చిత్రణ చాలా నచ్చాయి.
6) మరపురాని మాణిక్యాలు – బ్నిం : అద్భుతమైన పుస్తకం. ఆంగ్లేయులైన తెలుగు వాళ్ళకి తెలుగుని మళ్ళీ పరిచయం చేసేందుకు సరైన పుస్తకం!
చదువుతున్నది:
1) The Magic Lantern-An Autobiography: Ingmar Bergman ఆత్మకథ. బాగుంది.
2) The Stronger – August Strindberg (నాటకం)
కనుగొన్నవి: బెర్గ్మాన్ స్క్రీంప్లేలు కొన్ని, స్ట్రిండ్బర్గ్ నాటకాలు కొన్నీనూ!!
మధురిమ
Markus Zusak’s “The Book Thief” చదవడం మొదలుపెట్టాను. మొదలుపెట్టినప్పుడు ఉన్న enthusiasm, పుస్తకం సగం పూర్తయ్యేసరికి సన్నగిల్లింది.కాసేపు దాన్ని పక్కన పెట్టి, శ్రీ శ్రీ గారి “అనంతం” మొదలుపెట్టాను.
Purnima
ఇక్కడో వ్యాఖ్య పెట్టడానికి బద్ధకించాను గానీ, ఈ మధ్యలో పుస్తక పఠనం బాగానే సాగింది.
మొన్నే శారదా శ్రీనివాసన్ గారి పుస్తకం గురించి కబుర్లాడుకున్నామా? ఆ వెంటనే కినిగె.కాంలో బ్నిం గారి పుస్తకం మరోటి చదివాను. చదివాననే కన్నా తిరగేసాను అని చెప్పాలి. పుస్తకం అలాంటిది మరి. చక్కని బొమ్మలు, చిక్కని కవితలు, చూచాయిగా పరిచయాలు.. ఎవరివనుకున్నారు? మన తెలుగు ప్రముఖులవి. మంచి ప్రయత్నం. తెలుగును మర్చిపోతున్న తెలుగువారికి బహుమతి ఇవ్వాల్సిన పుస్తకం.
పనిలో పని.. ఇంకో తెలుగు పుస్తకం గురించి. ఇది మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథల పై వచ్చిన పరిశోధనా గ్రంధం. నాకు అదృష్టం ఎక్కువై నా కళ్ళబడింది. చాలా బాగుంది. త్వరలో పరిచయం చేయాలని ప్రయత్నం.
ఇహ, ఇంగ్లీషు విషయానికొస్తే..
Ray Bradbury’s Zen in the art of writing: ఇది ఉత్త పుణ్యానికి చదవటం మొదలెట్టాను. అలా అయిపోయిందంతే. కాబోవు రచయితల కోసం అవునో, కాదో తెలీదు గానీ, రచనవ్యాసంగంపై ఒక రచయిత ఇష్టంగా చేసిన వ్యాఖ్యానంగా చదువుకుంటుంటే భలే బాగుందనిపించింది.
The Reader: ఇదేమో కేట్ విన్స్ లెట్ సినిమా! అల్లెప్పుడో రివెల్యూషనరీ రోడ్ చదివా కదా, ఇదీ పట్టుకొచ్చుకున్నా మొన్న బెంగుళూరు పోయినప్పుడు. బాగుంది కానీ బాలేదు. పోనీ, బాలేదు కానీ బాగుంది. అలాంటి తికమకకు గురి చేసింది. సినిమా చూసాను, వెనువెంటనే. కేట్ మాత్రం నన్ను వదిలిపెట్టటం లేదు, వారమవుతున్నానూ.
I’m not hanging noodles on your ears: హిహిహి.. అనగా, రష్యన్‍లో నేను మీ చెవిలో పూలు పెట్టటం లేదని అర్థం. తమాషాగా ఉంది కదూ. పుస్తకం మొత్తంగా ఇలాంటి జాతీయాల గురించే! ప్రపంచ భాషల్లోని జాతీయాలను ఏరి కోరి ఒక దగ్గర పొందుపరిచారు. నాకేంటో అమాంతంగా ’లింగ్విస్టిక్స్’ మీదకు మనసు పోతోంది. మంచిదే! మనిషిని అర్థం చేసుకోడానికి భాష కూడా సాధనం అవుతుందిగా.
ఇది కాక, Zen and the art of motorcycle maintenance పునఃప్రారంభించాను. మూడేళ్ల కిందటి కన్నా ఇప్పుడు ఇంకా బాగా అర్థం అయ్యిపోతుందేమోనని అనుమానం వేసేస్తుంది. ఇలాంటి పుస్తకాలను జీర్ణించుకునేది ఎన్నిటికో? ఆ పై ఆచరణలో పెట్టటం ఇంకెప్పటికో..
తాజాగా..వేడిగా.. ఇప్పుడే ’త్రివేణి’ పత్రికలో ’జనవరి 1984′ సంచిక పూర్తిచేసాను. అనుకోడానికి ఒక్కో వ్యాసమో, కవితో, కథో గానీ..చాలా విషయాలూ, విశేషాలు తెల్సిపోయాయన్న భ్రమ కలిగిస్తోంది. అందుకని చక్కా ఓ రెండు రోజులుపోయాక, అప్పుడు తీరిగ్గా పరిచయం చేసేంత ధైర్యం కలిగితే.. చేసేస్తా..
ఇతి వార్తాః!
Gireesh K.
ప్రస్తుతం చదువుతున్నది – “Interpreter of Maladies” by Jhumpa Lahiri. మొదటి కథ చదవగానే ఇక పుస్తకాన్ని వదలబుద్దెయ్యలేదు…. ఇంతవరకూ ఈమె రచనలు ఎలా మిస్సయ్యానా అనిపించింది. శైలి ఎంతో సరళంగా, హృద్యంగా ఉంది. అదే ఊపులో Namesake చదివే ప్రయత్నంలో ఉన్నాను!
అన్నట్లు బెంగుళూరు బుక్ ఫెస్టివల్ కి ఎవరైనా వెళ్ళారా? నేను నిన్న వెళ్ళాను, విశాలాంధ్ర వారి స్టాలు కనపడలేదు!!!
మూర్తి
డా. ముదిగొండ శివ ప్రసాద్ గారి అల్లూరు కధలు ఈ నెల (సెప్టెంబర్)ఆంధ్రభూమి మినీ నవల గా వచ్చింది. చాలా బాగున్నాయి.అమరావతి కధలు, గోదావరి కధలు లాగానే మంచి భావుకత కలిగిన కధలు. చదివి కామ్మెంట్లు రాయని వారికి పుస్తకం.నెట్ వెంటనే కనెక్ట్ అవకుండుగాక. 🙂
సౌమ్య
గత మూడు వారాల్లో చదివినవి:
౧. .౩౮ కాలిబర్ కథలు: ఎమ్బీయస్ ప్రసాద్. : కాలక్షేపానికి బాగున్నాయ్.
2. శేఖర్తూన్స్, బ్యాంక్ బాబు – శేఖర్ కార్టూన్స్ సంకలనాలు : నాకు చాలా నచ్చాయి రెండూను.
౩. గణితం అతని వేళ్ళ మీది సంగీతం – కందుకూరి రమేష్ బాబు : ఆట్టే ఆకర్షించలేదు.
4. టాంజేనియా తీర్థయాత్ర – గొల్లపూడి : కొంచెం నిరాశ పరచినా, టాంజేనియా గురించి తెలుసుకోవడానికి బాగుంది.
5) Beating around the Bush – Art Buchwald : చాలా బాగుంది.
ఇక పనిలో భాగంగా చదివిన/తిరగేసిన పుస్తకాలు:
1) Measuring Second Language Vocabulary Acquisition – James Milton : నా అభిప్రాయంలో ఈ అంశం గురించి చాలా వివరంగా సమకాలీన పరిశోధనలను కూడా కలిపి వివరించిన పుస్తకం ఇది.
2) Solr 1.4 Enterprise Search Server – David Smiley and Eric Pugh : ఇది కూడా, Solr వాడకం గురించి చాలా వివరంగా రాయబడ్డది.
డా. మూర్తి రేమిళ్ళ
మిత్రులారా,
The Lost Brahmin అనే నవల ఎవరిదగ్గరైనా వుంటే షేర్ చెయ్యగలరు . ఎక్కడా దొరకడం లేదు . ఎక్కడైనా దొరుకుతుంటే చెప్పినా సరే .
డా. మూర్తి రేమిళ్ళ
pingali sasidhar garu,
‘అమనస్కుడు’ pdf pampagalaru. naa mail id : murthyremilla@antrix.gov.in
indulo pedithe chala mandiki vupayoga padutundemo !
కౌటిల్య
ఇవ్వాళే గురజాడగారి “కన్యాశుల్కం” చదివాను….ఎప్పుడూ ఆ కాన్సెప్టే నాకు ఎక్కక ఇంతవరకు ముట్టుకోలేదు.ఇవ్వాళ యాథలాపంగా తీసి చదివాను…గట్టిగా రెండు గంటలు పట్టింది…. అన్నీ అప్రస్తుత ప్రసంగాలూ, అనవసర పాత్రలూ….నాటకం నడక మహా దరిద్రంగా ఉంది…ఆ రోజుల్లో సోషల్ రిఫార్మింగు పేరు పెట్టుకుని హిట్టయ్యి ఉండవచ్చుగాక, ఇప్పుడు చదివి ఆనందించడానికి అందులో పసా లేదు…..మనకి ఉపయోగపడే విషయం ఒక్కటీ లేదు, అవసరమైన సబ్జెక్టు అంతకన్నా లేదు.ఇక ఎంటర్టైనుమెంటు విషయమా పదిపాళ్ళు ఉందేమో.(బూతులూ,పనికిమాలిన రసిక చేష్టలూ నచ్చేవారి సంగతి చెప్పలేను)…. కొన్ని పాత్రల చిత్రీకరణైతే అధ్వాన్నంగా ఉంది…విలనీ భావాల్ని అంత విపులంగా,గొప్పగా నాటకమంతా చెప్పి, చివర్లో మూణ్ణాలుగు మంచిమాటలు చెప్తేమాత్రం ఏం లాభం, అంతా రసభంగం కదూ…..
ఇక భాష…వ్యవహారికం, వ్యవహారికం అని మొత్తుకున్నారు కొంతమంది పీఠికల్లో…నాకైతే ఎక్కడా కనపళ్ళా..సాధారణంగా నాకు గంట పట్టాల్సిన పుస్తకం, గుణించుకు చదివేపాటికి రెండుగంటలు పట్టింది….అన్నీ కొకిబికి సంభాషణలు, మామూలు మానవుడికి అర్థంకానే కావు…..పైగా ఆ కాలపు బ్రాహ్మల ఇళ్ళల్లో మాట్లాడే భాషే వ్యవహారికం కాబోలు వాళ్ళ దృష్టిలో…. ఒక్కోచోట అసలు డైలాగులు అర్థంకాక జుట్టు పీక్కున్నాను….పైగా పుస్తకం నిండా వైదిక,నియోగపు గోల…..వెకిలీ,బూతులూ…
ఒక్క మధురవాణి పాత్ర మాత్రం ఔచిత్యం అంత తగ్గకుండా నడిచింది…..కొన్ని చోట్ల మంఛి హాస్యపు చమక్కులు బాగున్నాయి…అంతకు మినహా సరుకేమీ లేని పుస్తకం…..రెండవ కూర్పే ఇంత అందంగా ఉంటే మొదటికూర్పు ఇంకెంత అందంగా ఉందో!
అది చదివాక, “కన్యాశుల్కం” సినిమా డౌన్లోడు చేసుకు చూశా… పుస్తకం కన్నా సినిమా వందరెట్లు నయమనిపించింది…. గోవిందరాజుల సుబ్బారావు, సావిత్రి, సీయస్సార్ ల నటనకోసం అయినా సినిమా చూడొచ్చు.సుబ్బారావుగారి నటన అద్భుతం……అప్రస్తుత ప్రసంగాలు, అనవసరమైన పాత్రలు తీసేసి కొంచెం ప్రేక్షకుడికి దగ్గరవ్వటానికి ప్రయత్నించారు…
తా.క. పుస్తకం చదివాక నాకు కలిగిన భావాలు రాశాను. గురజాడవారిని విమర్శించాలని కాదు…ఆయన అభిమానులెవరన్నా నొచ్చుకుని ఉంటే మన్నించాలి….నేను మామూలు పాఠకుణ్ణి మాత్రమే.లోతులు తరచి చూసి ఎనాలసిస్ లు చెయ్యలేను…
murthy
@ శారద గారు.
పిలకా గణపతి శాస్త్రి గారివి మెత్తం 4 నవలలు అనుకొంటా, విశాలనేత్రాలు చాలా బాగుంటుంది.(నాలుగు నవలలూ నాదగ్గర ఉన్నాయి)మీకు విశాలనేత్రాలు నచ్చితే మిగతా వివరాలు కావాలంటే మీకు నేను చెప్పగలను.
మెహెర్
బోర్హెస్ ఇంటర్వ్యూలు చదువుతున్నాను. నబొకొవ్ లాగా మరీ కరకుగా బయటపడిపోడు గానీ, నచ్చని రచయితల రెప్యుటేషన్లు తీసిపడేయడంలో బోర్హెస్ కూడా పైకి కనిపించినంత మెతకేం కాదు. ఆ నచ్చని రచయితల విషయంలో కూడా యిద్దరి జాబితాల్లో చాలా పోలికలుండటం విశేషం. ఉదా: పౌండ్, ఎలియట్, హెమింగ్వే, టాగోర్, నెరుడా…
Borges:
He didn’t even respond to a telegram sent by Neruda requesting a meeting with “Argentina’s greatest poet”. His reason was: “Of course I couldn’t see the ambassador of a Communist government”
Nabokov:
As for the assessment of each other, we know what Nabokov thought of Borges:
But we don’t see anywhere what Borges thought of Nabokov. There’s only one laconic mention of Nabokov in Borges’ non-fiction, in an essay about Dostoyevsky. It goes like this:
Here, he didn’t seem to like Nabokov’s assesment of Dostoyevsky.
శారద
“విముక్త” -ఓల్గా కథలు
“నిర్ణయానికి అటూ ఇటూ”- ఇంద్రగంటి జానకీ బాల- చాలా బాగుంది. త్వరలో పరిచయం చేయాలని ఆశ.
“విశాల నేత్రాలు”- పిలకా గణపతి శాస్త్రి-ఇప్పుడే మొదలు పెట్టాను.
ఇంకా లైబ్రరీ నించి తెచ్చినవి
“పేగు కాలిన వాసన”, “సరదా కథలు”,”బంధితులు”.
సౌమ్య
చదివినవి:
1) సరిహద్దు – సాయి బ్రహ్మానందం గొర్తి కథలు : మొత్తంగా చూస్తే, కథాంశాలు బాగున్నాయి. ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. కథనం బోరు కొట్టకుండా ఉంది.
2) Through the language glass – why the world looks different in other languages: Guy Deutscher.
– కొంచెం సీరియస్ విషయమే అయినా, పుస్తకం సాఫీగా, పరిశోధనా ఫలితాలను సైతం మామూలు మనుషులకి అర్థం అయ్యేలా చెబుతూ, మధ్య మధ్యన ఆసక్తికరమైన పిట్టకథలతో సాగింది..నాకు చాలా నచ్చింది.
అప్పుడప్పుడూ చదువుతున్నవి:
1) మహామహిళ – భానుమతి స్మారక సంచిక
2) సినీ గీత వైభవం – ఎస్.వీ.రామారావు
(పుస్తకాలు రెండూ నేను ఊహించినంత గొప్పగా లేవు కానీ, నా మట్టుకు నాకు దాచుకోదగ్గవే, ముఖ్యంగా మొదటిది)
చదవలేక….
సాహిత్యమంటే ఏమిటి – వాడ్రేవు చినవీరభద్రుడు : నిజానికి పుస్తకంలో రాసిన వారెవరి గురించీ నాకేమీ తెలియదు కనుక, కుతూహలం కొద్దీ చదవడం మొదలుపెట్టాను. అయితే, ఏమిటో, నాకు ఈ శైలిలో క్లిష్టత ఎక్కువనిపించింది. చెప్పాల్సింది సూటిగా చెప్పక అయోమయానికి గురి చేస్తున్నట్లు (పోనీ, నేనే గురౌతున్నట్లు) అనిపించి….ఆపేశాను..ఇప్పటికి.
Purnima
ఎంతో చదివేస్తాననుకున్నాను గాని, ఒక పుస్తకం మాత్రమే పూర్తి చేయగలిగాను.
The Road by McCarthy. చాలా బాగుంది. నాకూ నచ్చింది. త్వరలో పరిచయం చేయాలని ఉద్దేశ్యం.
Murthy
ఈ పేజీ లోకి ఎవరూ రావట్లేదు ఎందుకో మరి 🙁
murthy
శశిధర్ పింగళి గార్కి,
మీ పిడిఎఫ్ అందినది. కృతజ్జతాభివందనములు. నమస్తే
Purnima
“But what can I do here to kill time? Fall in love?”
Yo. Read Steve Toltz. Head over heels, again and again.
శశిధర్ పింగళి
మూర్తిగారూ.. pdf పంపుతున్నాను చదువుకోండి
murthy
@ శశిధర్ పింగళి గారు.
అమనస్కుడు పుస్తకం పేరు లాగే పుస్తకం ఆసక్తికరంగానే ఉంది. విజయవాడ నవోదయాలో దొరుకుతుందంటారా. మీకు సావకాశం ఉంటే పి.డి.ఎఫ్. పంపగలరు. నా id chinni_murty@yahoo.com
శశిధర్ పింగళి
ఇప్పుడే పది నిమిషాల క్రితం ‘అమనస్కుడు’ అనే పుస్తకం చదవటం పూర్తి చేశాను.ఈపది నిమిషాలూ ఏమీ చెయ్యలేక, ఏమిచెయ్యాలో తోచక నిశ్చెష్టుడిలా ఉండిపోయి, అంతరం నుండి ఇప్పుడే తేరుకుని అంతర్జాలంలో ప్రవేసించాను మళ్ళీ మనుషుల్లో పడటానికి.
ఇది సత్యాన్వేషకుల కోసం, తనని తాను తెలుసుకోవాలనే కోరికతో సాధకుడు ఎలా సాధన చేయాలో చాల వివరంగా వ్రాయబడిందిన పుస్తకం. అర్థం కానివిషయాలు లేవుగానీ కొంచెం శ్రమతో అర్థం చేసుకోవాల్సిన విషయాలున్నై. భావరహిత స్థితికి చేరుకోవటం ఎలా, ఎంత సాధన చేయాలి, అనందం అంటే ఎమిటి దాని స్వరూపం ఎలావుంటుంది మొదలైనవి చాల విశదంగా వివరించబడిన పుస్తకం.
ఇందులో ని భాష చాలా సరళం గానూ, సుందరంగానూ వుడి పాఠకుణ్ణి చదివింపచేస్తుంది.
రచయిత డా||. కభంపాటి పార్వతీకుమార్, ధనిష్ట ప్రచురణలు, విశాఖపట్నం.
ఆసక్తి వుంటే చెప్పండి pdf పంపగలు.
డా. మూర్తి రేమిళ్ళ
Sasidhar Garu,
i am re-requesting you to send me the pdf to murthyremilla@yahoo.com
pavan santhosh surampudi
నాకూ ఆసక్తి ఉంది
ఇది నా మెయిలు pavansanthosh57@gmail.com
సౌమ్య
గత రెండు వారాల్లో చదివినవి:
౧)తొలి తెలుగు వ్యంగ్య చిత్రాలు – తలిశెట్టి రామారావు : తొలినాటి కార్టూన్లే అయినా, ఎనభై ఏళ్ళు దాటినా, కాలదోషం పట్టనివి.
2) రాం గోపాల్ వర్మ – నా ఇష్టం : బాగుంది, కాలక్షేపానికి చదవడానికి
3) సిరివెన్నెల తరంగాలు : పుస్తకం గురించి కొన్ని రోజుల క్రితం పుస్తకం.నెట్ లో రాసాను.
4) సాయంకాలమైంది- గొల్లపూడి: నాకు చాలా నచ్చింది. త్వరలో దీని గురించి పుస్తకంలో రాస్తాను
5) కల్నల్ సి.కె.నాయుడు – సి.కె.వెంకటేష్: నాయుడు గారి గురించి ఒక సంక్షిప్త పరిచయంగా చాలా బాగుంది కానీ, ఇంకా సమగ్రంగా రాసి ఉండాల్సింది అనిపించింది.
6) అనువాద సమస్యలు – రా.రా. : పుస్తకం ఆపకుండా చదివించిందే కానీ, చాలా కంప్లైంట్లు ఉన్నాయి. చదివి రెండు వారాలవుతున్నా ఇంకా, దీని గురించి ఎవరితో ఒకరితో చర్చిస్తూనే ఉన్నా. వివరంగా త్వరలోనే రాస్తాను.
చదవలేక ఆపేసినది:
7) మో నిషాదం : పోస్ట్ మాడర్నిజంకి నేను సిద్ధంగా లేను కాబోలు.
చదువుతున్నది:
8) సరిహద్దు – సాయి బ్రహ్మానందం గొర్తి కథలు : బోరు కోట్టకుండా ఉండేందుకు చదువుకునేందుకు బాగున్నాయి.
Purnima
కథల జాతర్లో ఉన్నాను. ఎటు చూసినా కథలే. అన్నీ పూర్తిగా చదవలేదు గాని, పుస్తకాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి కాబట్టి, ఇప్పుడే ఆ వివరాలు పంచుకుంటున్నాను.
Folktales from India – A.K.Ramanujan: మూడేళ్ళ కింద పరిచయమైన పుస్తకం. ఎందుకు బద్ధకించానో ఇన్నాళ్ళు. ఇవ్వాలే కొన్నాను. భారతీయ జానపద కథలు. చదివినట్టు కాదు, వింటున్నట్టు ఉంది. సాహిత్యప్రియుల వద్ద తప్పనిసరిగా ఉండాల్సిన పుస్తకం. చదవే ఉద్దేశం లేకపోయినా, కలెక్షన్ లో ఉండాల్సిన పుస్తకం.
Book of Fantasy: ఎడిటర్ల పేర్లలో బోర్హెస్ పేరు కనిపించగానే ఆసక్తి కలిగి చూసాను. ప్రపంచ సాహిత్యంలో ఉన్న ఫాంటసీ కథల సంకలనం. కొన్ని మాత్రమే – పేజీ, రెండు పేజీలకు మించని – కథలే చదివాను. తలతిరిగే కథలు. కొన్ని అర్థమై ఆ భావం మింగుడుపడ్డానికే గంటలు పట్టింది. కథలు రాయడం పై ఆసక్తి ఉన్నవారికి highly recommended. కథాంశాలను విస్మరించినా, కథనాల కోసం చదవాలి.
Nirmod Flipout – Etgar Keret: ఈ పుస్తకం కూడా మూడేళ్ళ ముందు పరిచమయినదే. రచయిత ఒక్క పుస్తకం కూడా చదకముందే అభిమాని అయ్యిపోతే, ఇహ చదివాక ఏం అవ్వగలం? అని ఆలోచిస్తున్నాను. ఇజ్రాయిల్ వర్థమాన రచయిత. యుద్ధాలలో మునిగి తేలినవాడు. ఎవడో నింపాదిగా చుట్ట కాల్చుకుంటున్నాడన్న ధోరణిలో కొంప తగలడిపోతున్న విషయాన్ని సెలవిచ్చే రకం. నవ్విస్తూనే ఏడిపించే రకం. ఇన్నాళ్ళు చదవని పాపానికి ఇప్పుడు ఏడుగురితోనైనా చదివించాలని వ్రతం పట్టాను. (మీరు గాని చదివేట్టు అయితే లెక్కల్లో వేసుకుంటా, ఒక ముక్క చెప్పండయ్యా/అమ్మా!)
Petty Monsters – Kelly Link: ‘Hey.. I, usually, hate your type. But you know what, I love it when it comes from you!’ అని చెప్పాలనిపించే రచనలు. ఉన్న తొమ్మిది కథల్లో మూడేమో చదివాను. బాగున్నాయి. ఇలాంటి దెయ్యం కథలు చదవటం సాధారణంగా ఇష్టపడను. ఈవిడ రాసిన వేరే కథలు ఇంకా బాగుంటాయని విన్నాను. చూడాలి.
Does He know a mother’s heart మధ్యలో ఉన్నాను. కష్టంగా ఉంది. మతగ్రంధాలను ఉటంకిస్తూ చేసే విశ్లేషణ. త్వరత్వరగా నడవడం లేదు.
akondisundari
hi freinds
nenu sannapu reddy gari kottha duppati chaduvuthunnanu.
rayalaseema karuvu thelisidi chala thakkuva anpinchindi
chakkani saili lo sutiga rasaru
o henry 70 kadhalu modalu petta tarvatha naa abhiprayam cheptha
లలిత (తెలుగు4కిడ్స్)
ముళ్ళపూడి రమణ గారి సాహితీ సర్వస్వంలోని కథా రమణీయం రెండు భాగాల్లో కథలూ కొద్ది కొద్దిగా చదువుతున్నాను. ఏ విధమైన అభిప్రాయమూ ఇంకా ఏర్పరుచుకోలేకుండా ఉన్నాను. అభిమానులెవ్వరూ నన్ను తిట్టుకోవద్దు. నేను కుదురుగా కూర్చుని చదివి అభిప్రాయం వ్యక్తం చెయ్యగలగడం కోసం ఎదురు చూస్తున్నాను.
Jhumpa Lahiri వ్రాసిన Namesake చదువుతున్నాను. చాలా వివరంగా వర్ణనలు (విదేశంలో బెంగాలీ ఆడపడుచు అనుభవాలు) ఉండడంతో మొదట్లో నా దృష్టి విషయం పై అంతగా ఆనలేదు. మెల్లగా మొదలయ్యి emotion అలా తెలియకుండానే కళ్ళలో నీళ్ళు తెప్పించినంత పని చేసెదాక వచ్చాక పుస్తకం పక్కన పెట్టి మళ్ళొక సారి ఆలోచించడం మొదలు పెట్టాను. అన్ని పుస్తకాల లానే ఇదీ నెమ్మదిగా చదివి ఎప్పటికో నా అభిప్రాయం వివరంగా తెలియ జేస్తాను.
సౌమ్య
చదివినవి:
1. పతంజలి తలపులు : కే.ఎన్.వై.పతంజలి గారి గురించి వివిధ వ్యక్తులు రాసిన వ్యాసాలు. నేనాయన రచనలేవీ చదవలేదింకా. కావల్సినంత కుతూహలం రేకెత్తించాయ్ ఈ వ్యాసాలు. కొన్ని మాత్రం, మరీ భట్రాజు పొగడ్తల్లా అనిపించాయి.
2. శబ్బాష్‌రా శంకరా -తనికెళ్ళ భరణి.: చాలా బాగుంది.
3. విన్నకోట రవిశంకర్ “వేశవి వాన” : ఇది కూడా నాకు చాలా నచ్చింది.
4. దేవదాసీ వ్యవస్థ – వకుళాభరణం లలిత : శైలితో పాటు, అసలు ఆర్గనైజేషన్ కూడా నచ్చక, ఆపేశాను.
చదువుతున్నవి:
చాప్లిన్ ఆత్మకథతో కొనసాగుతూనే, అప్పుడప్పుడూ “A Larger Memory” అన్న వివిధ జాతుల అమెరికన్ల అనుభవాల సంకలనం మొదలుపెట్టాను. రచన: రొనాళ్డ్ టొకాకి. చాలా విషయాలు తెలుస్తున్నాయి. మంచి చరిత్ర పుస్తకం!
Purnima
చదవిన పుస్తకం ఒకటి: ముక్కోతి కొమ్మచ్చి.
చదువుతూ… ఉన్నది: బూదరాజు గారి మరువరాని మాటలు. (తెలుగు సాహిత్యంలోని ’కోట్స్’ ఉంటాయిందులో..)
కొనుకున్నవీ.. త్వరలో చదవబోతున్నదీ..
కరుణశ్రీ సాహిత్యం -1 : ఉదయశ్రీ. అక్టోబర్ 2010లో వచ్చిందట ఈ పుస్తకం. కనిపించగానే కొనేసాను. చదవటానికి చాలా కష్టపడతానని అనుకున్నాను. కాని తేలిగ్గానే సాగిపోతుంది. కవితలు చాలా నచ్చుతున్నాయి.
పాలగుమ్మి పద్మరాజుగారి కథలు చదివాను కొన్ని. ఆయన రచనల్లో నాల్గవ భాగం (వ్యాసాలు-కవితలు) కొన్నాను. ఇంకా తెరవలేదు.
జాషువ రచనల్లో గబ్బిలం, ఖండకావ్యాలు తీసుకున్నాను. పద్యాలు చదవడంలో చాలా ఇబ్బంది పడుతుంటాను. కాని ఎలా అయినా చదవాలన్న పట్టుదలతో తెచ్చాను.
’యాకుబ్’ అన్న కవితో పరిచయం పై చెప్పిన బూదరాజుగారి పుస్తకం వల్ల కలిగింది. ఆయన కవితల సంకలనం ఒకటి కొన్నాను. చదివినంత వరకూ చాలా నచ్చాయి.
చౌదరి జంపాల
@kothapalli ravibabu:
గంగినేని వెంకటేశ్వరరావుగారి పాము-నిచ్చెన నా చిన్నప్పుడు చదివాను. ఈ పుస్తకానికి ఏదో బహుమతి కూడా వచ్చినట్లు గుర్తు (విశాలాంధ్ర నవలల పోటీ?). ఎర్రజండాలు కూడా చాలా ప్రఖ్యాతి వహించిన పుస్తకమే.
kothapalli ravibabu
pustam peru; paamu=nichena
writer; gangineni venkateswararao
language ; telugu
not available in antharjalam
my opinion on it; the novel is unique in its style. it is written in the form of letters written by different characters to other charecters set in 1951 and 1952. it consists of several social movements and political movements of that time and the reaction of the characters to them.
the writer also wrote the actual stories of martyrs of telengana peasants struggle by name ERRA JANDALU.He died in his old age on 30th of last month at his native place VINUKONDA of guntur district
సౌమ్య
గత నెల-నెలన్నర రోజుల్లో చదివినవి:
తనికెళ్ళ భరణి – పరికిణీ, నక్షత్ర దర్శనం (రెండూ నాకు నచ్చాయి)
సి.రామచంద్రరావు “వేలుపిళ్ళై కథలు” – కొన్నిసార్లు చదివినా బోరు కొట్టవనుకుంటాను చాలా మట్టుకు. కానీ, అందరి మాటలూ వినీ వినీ పెరిగిన ఆంచనాలను అందుకోలేకపోయాయి.
చిన్నరావూరులోని గయ్యాళులు: అనువాదంలో వాక్య నిర్మాణం మూలంగా నాకు చాలా కష్టంగా అనిపించి, దాదాపు పక్కన పెట్టేశాను.
చదువుతున్నవి:
చార్లీ చాప్లిన్ ఆత్మకథ: అద్భుతం.
తెలుగులో కవితా విప్లవాల స్వరూపం – వేల్చేరు నారాయణరావు : బాగుంది.
జోగినీ వ్యవస్థ : వకుళాభరణం లలిత – శైలి అంత చదివించేలా లేదు. కానీ, చాలా పరిశోధన చేసి రాసినట్లున్నారు.
Purnima
Oh.. it’s been eons that I updated this page. Here I come..
My Life and Art with Charlie Brown.. autobiographical essays from the creator of Peanuts. A WoW book! Forget about peanuts, forget about comics.. if you’re least bit creative in any darn field and wanna derive inspiration from a guy who has done the thing he loved the most, for 50 years.. every single day – this is the book.
The little world of Don Camillo by Giovanni Guereschi – If you’re a Mullapudi fan and have read Kothi Kommacchi well enough, you don’t need any further introduction of the book. To others, this is the piece of work that inspired the movie, buddhimantudu. I can’t believe I’ve my hand s on it.. kinda disappointed with translation, but not an iota of doubt that G.G ROCKS!
Portraits of Marriage by Sandor Marai – Have mixed feelings about the book. It seems like one-hell-of a book at times and then, it is so darn lengthy and dry, to complete it is in itself a challenge. After all, it is two broken marriages tale put in 3 long monologues. Some fun, I should say!
Vallampati Kathalu – rented this book on Kinige. Read couple of stories and was thoroughly disappointed – which I was expecting anyway.
Malladi Ramakrishna Sastri Kathalu – Here’s the man for me in Telugu literature. What he writes and the way he writes – aah! Without reading enough, I’ve had this complaint against Telugu lit, that it doesn’t provide me with what I’m hungry to read. Malladi does serve me.. right! Glad, I’m reading him!
Plots and Characters – A Screenwriter on Screenwriting by Millard Kaufman: Surprise that I chose to open this book. Double surprised I’m half way through it! Kaufman has some magic, I presume.