చెప్పాలని ఉందా? – 1
ఏమేమి చెప్పచ్చు?
పుస్తకాల గురించిన సమాచారాలు ఏవైనా! అంతర్జాలంలో పుస్తకాలపై ఏదో వ్యాఖ్యానం మీకు నచ్చిందా? మీ అభిమాన రచయిత గురించి కొత్తగా ఏదో వార్త తెల్సిందా? మీరు ఏదైనా పుస్తకం కోసం వెదుకుతున్నారా? మీరు చాన్నాళ్ళుగా వెదుకుతున్న పుస్తకం దొరికిందా? మీరు తరచుగా వెళ్ళే పుస్తకాల షాపులో డిస్కౌంట్లు ఇస్తున్నారా? పుస్తక ప్రదర్శనలు ఎక్కడ, ఎప్పుడు జరుగుతున్నాయో మీకు తెల్సా?
అయితే.. చెప్పాలని ఉంది అంటూ.. మీకు తెల్సినది ఇక్కడ తెలియజేయండి. సమాచారాన్ని పెంచుకోండి.
ఎలా చెప్పాలి?
ఇక్కడో వ్యాఖ్య పెట్టేయండీ.. అంతే!
Achilles
@మెహెర్: Thanks for the link!
kalpana
మెహర్,
ఆకలి ని మా నాన్నగారు రెంటాల గోపాల కృష్ణ అనువాదం చేశారు. నేను చదివాను. ప్రస్తుతం కాపీలు అందుబాటు లో లేవనుకోండి.
మెహెర్
“హెండర్సన్ ది రైన్ కింగ్” నవల వికీ లింకు చూస్తోంటే, సాల్‌బెల్లో వ్యాసం ఒకటి తగిలింది. రచనల్లో ప్రతీకల్ని (సింబల్స్‌ని) అతిగా వెతుక్కునే జాడ్యాన్ని చర్చిస్తున్నాడు. బాగుంది.
😀
Indeed! 🙂
అదే కదా విషాదం!
విజయవర్ధన్
@సౌమ్య: నా దగ్గర వున్న ప్రతి నవోదయ వారు 2007లో తెచ్చిన మూడవ ముద్రణది. బహుశా దాని తర్వాత కూడా ముద్రించివుంటారు. బెంగుళూరులో చౌడయ్య హాలు దగ్గర్లో తెలుగు గ్రంథాలయం వుంది. వారి దగ్గర మంచి పుస్తకాలు చాలా చూసినట్టు గుర్తు. ఇది కూడా దొరకవచ్చేమో. కావలిస్తే నా దగ్గర వున్న ప్రతిని చదవడానికి తీసుకోవచ్చు.
Sreenivas Paruchuri
Thats one of the most brilliant essays I read in Telugu. raa.raa captured Lukacs’ arguments in “Der historische Roman” (1937, I think the English title reads: The Historical Novel) so well. The whole collection is brilliant for that matter. You may differ with him on one or other essay (e.g whether his criticism on #digambara kavulu# was too harsh, etc.), but undoubtedly a original thinker and who could write well.
Yes, #kollaayi gaTTitEnEmi# is in-print. In fact, in two editions; one from Visalandhra and the other from Navodaya Publishers, Vijayawada. I recommend the later for it contains extra material.
సౌమ్య
రా.రా. సారస్వత వివేచన మొదలుపెట్టాను. అందులో ’కొల్లాయి గట్టితే నేమి’ పై వ్యాసం చదువుతున్నాను. ఈ నవల కథ చదువుతున్నంత సేపూ – భైరప్ప కన్నడ నవల – ’దాటు’ అదేపనిగా గుర్తొస్తోంది, ఎందుకో గానీ. అది అటు పెడితే, ఈ నవల ఇప్పుడు ముద్రణలో ఉందా? డీఎల్‍ఐ సైటులో ఈబుక్ ఉందేమో చూస్తున్నా కానీ, మహీధర అని కొడితే – నళినీమోహన్ గారిది, జగన్మోహనరావు గారిది – చెరో పుస్తకం కనబడుతున్నవి తప్ప రామ్మోహనరావు గారివి ఏవీ కనబడలేదు 🙁
Achilles
ఉంది ఉంది, చెప్పాలని ఉంది! ఎందుకో ఈ కోట్ ను ఇక్కడ పంచుకోవాలని ఉంది!!
Meet Pat Condell: http://patcondell.net/
“Hi I am Pat Condell. I don’t disrespect your beliefs and I don’t care if you are offended. Cheers”
— An Infidel!
Hari
ఈ కామెంటు ఇక్కడుంచాల్సిదొ కాదో తెలియదు. దీన్ని ఇక్కడుంచాల్సిన పని కూడా లేదు, దీని మీద చర్య తీసుకుంటే చాలు. ఈ వెబ్సైట్లో ‘మా అతిథులు ‘ విభాగంలో మార్తాండ పేరుకు ఉన్న లంకె కొంచెం సరిదిద్దగలరు. If you are just trying to be tongue-in-cheek in planting the link for ప్రవీణ్ పీడిత సంఘం here, I am perfectly OK with it. However, as much as I enjoy reading these guys, I enjoy the original works of the man himself. సరైన లంకె ఇస్తే అప్పుడప్పుడు అయ్య వారి రాతలు కూడ చదివి ఆనందిస్తా.
పుస్తకం.నెట్
@Hari: అది తప్పు లంకె అన్నది గమనించలేదు. ప్రస్తుతానికి ఆ లంకెని తొలగించాము. ఆయన బ్లాగు/సైటు లంకె మీకు తెలిసిన పక్షంలో మాకు తెలిపితే అప్డేట్ చేస్తాము.
telugu4kids
http://kottapalli.net is a very interestng initiative.
I hope more people talk about it and in more detail.
same about http://manchipustakam.in/
It would be very useful to add a more detailed description of books and if possible, reader reviews.
Is there a way to order books online from these websites?
http://www.arvindguptatoys.com/ is very interesting. Thanks.
Srinivas
కామేశ్వర రావు గారికి
http://www.arvindguptatoys.comలో పిల్లల పుస్తకాలు చూసారా? అన్నీ కథలు కావు కాని, తల్లిదండ్రులు చూసి తీరాల్సిన వెబ్‌సైటు
కామేశ్వర రావు
ఈ నెల పిల్లల గురించి ఫోకస్ కాబట్టి నాకు తెలిసిన ఒక మంచి పిల్లల ఈ-పత్రిక గురించి ఇక్కడ పరిచయం చేస్తున్నాను. అది కొత్తపల్లి (http://kottapalli.in). ప్రతి నెలా కొత్త సంచికతో వస్తోంది. ఇందులో పిల్లలు రాసిన కథలు, పిల్లల కోసం పెద్దలు రాసిన కథలు, అనువాద కథలు, నాటికలు అవీ ఉంటున్నాయి. సరదా కథలు, ఫేంటసీ కథలు, నీతి కథలు అన్ని రకాలూ ఉంటున్నాయి. బొమ్మలతో ఉండడం అదనపు ఆకర్షణ.
మా అమ్మాయికి కథలు చెప్పడానికి, ఒక కథల పుస్తకం అయిపోయి మరో కథల పుస్తకం దొరికే వరకూ, ఈ కొత్తపల్లి పత్రిక నాకు మంచి backupగా ఉపయోగపడుతోంది!
మెహెర్
హిందూ లిటరరీ సప్లిమెంట్‌లో మొన్న జె.డి.శాలింజర్ మీద వచ్చిన వ్యాసం చదివాకా వ్యాసరచయిత ప్రదీప్ సెబాస్టియన్ మీద ఆసక్తి కలిగింది. ప్రతీ నెలా మొదటి ఆదివారంనాడు వచ్చే ఈ సప్లిమెంట్‌ను పాత ఆఫీసులో పనిచేసేటప్పుడు తరచూ చూసేవాణ్ణి. దీని ద్వారా కొంతమంది మంచి రచయితలు పరిచయమయ్యారు. ఈ మధ్య ఎందుకనో కుదరటం లేదు. ఇప్పుడు ఈ రచయిత రాసినవి ఇంకేమన్నా ఉన్నాయా అని ఆన్‌లైన్‌లో వెతుకుతూ హిందూ లిటరరీ సప్లిమెంట్ ఆర్కైవ్స్‌లోకి దారితీసాను. అందులో ఈయన “ఎండ్ పేపర్” అనే ఒక ధారావాహిక శీర్షిక నిర్వహించేవాడు. వ్యాసాలు ఇప్పుడే చదవటం మొదలుపెట్టాను. పుస్తకాల గురించేగాక పుస్తక పఠనానుభవాల గురించి కూడా పంచుకున్నాడు రచయిత. వ్యాసాలెలా వున్నా (చదివినందాక అయితే బానేవున్నాయి), కొంతమంది కొత్త రచయితలూ పుస్తకాల గురించి తెలుసుకోవచ్చుననిపిస్తుంది.
(పైన ఇచ్చిన గూగుల్ సెర్చ్ లింక్‌లో అన్ని వ్యాసాలూ కనిపించటం లేదనుకుంటా. వాటిని, పైనే ఇచ్చిన హిందూ ఆర్కైవ్స్ లింకులోకి వెళ్ళి, 2002 ఏప్రిల్ 7వ సంచిక నుంచీ ప్రారంభమైన “ఎండ్ పేపర్” శీర్షిక క్రింద చూడవచ్చు.)
shekar
nenu racina deergha kavitha ‘naa desam’ pusthakaanni pdf lo pampaalani vundi. ee prapancham gurinchina naa abhiprayaalanu panchukuni, andari spandana chudaalani vundi
నిరంజన్
భార్య,భర్తల మధ్య,కుటుంబసభ్యుల మధ్య ,బిజినెస్ పార్టనర్స్ మద్య వివాదాల తలెత్తినప్పుడు,ఏ రెండు అక్షరాల మాట అద్భుతాలను చేయగలదో తెలుసుకొవాలనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం డా .బి.వి.పట్టాభిరాం గారు వ్రాసిన “కమ్యూనికేషన్స్ మీ విజయానికి పునాది”.ఈ పుస్తకంలో “సంభాషణ ఎలా ప్రారంభించాలి?ఏమిటి?ఎప్పుడు?ఎందుకు?ఎవరు?ఎక్కడ?ఎలా మాట్లాడాలి? వంటి విషయాలు ,ఎలా మాట్లాడకూడదు? ఆసెర్టివ్ వంటి విషయాలు ప్రాక్టికల్ గా చర్చించాఈ పుస్తకంలొ “ఆరు బంగారు సూత్రాలు” అనే విభాగం నాకు బాగా నచ్చింది.సంభాషణ ప్రారభించేటప్పుడు గరాటు పద్దతి నాకు నచ్చిన మరో అంశం.ప్రతి ఒక్కరు చదవాల్సిన ఒక మంచి పుస్తకాన్ని అందించిన రచయితకు క్రుతజ్ఞతలు.
Tata Ramesh Babu
nenu racina deergha kavitha ‘naa desam’ pusthakaanni pdf lo pampaalani vundi. ee prapancham gurinchina naa abhiprayaalanu panchukuni, andari spandana chudaalani vundi
నిరంజన్
మీరు మీ మాటల్తో ఎదుటి వారిలో ప్రేరణ కలిగించాలనుకొంటున్నారా? వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి,పదును పెట్టి,నైపుణ్యం కల వారుగ తీర్చిదిద్దటానికి ఏది ఉపయోగపదుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా?అయితే మీరు డాబి.వి.పట్టాభిరాం రచించిన “మాటే మంత్రము” పుస్తకాన్ని చదవాల్సిందే.
వారు ఈ పుస్తకంలో మాటలు మంత్రాల్లాగ ఏ విధంగా పని చేస్తాయి? కమ్యూనికేషన్ “9సి” టెక్నిక్స్,కమ్యూనికేషన్ పద్దతులు,బాడీ లాంగ్వేజి,పబ్లిక్ స్పీకింగ్ యెలా?,టెలిఫోన్ మానర్స్,వినడం,Transactional Analysis,కమ్యూనికేషన్ స్థితులు,కమ్యూనికేషన్ గాప్,ఎమోషనల్ ఇంటలిజెన్స్ గురుంచి ప్రాక్టికల్ గా వివరించారు.ఈ పుస్తకంలో “నేను క్షెమం ,మీరు క్షెమం ” అన్న విభాగంలోని కమ్యూనికేషన్ లోని మూడు స్థితుల కు సంబందించిన అంశం బాగా నచ్చింది.ప్రత్యేకించి కమ్యూనికేషన్ గాప్ వల్ల వచ్చె అనర్థాలను వివరిస్తూ పోలీసు శాఖలోని ఒక సంఘటన ద్వారా వివరించిన తీరు బాగా నచ్చింది.సరళమైన పదాలతో ,చక్కని బొమ్మలతో,మంచి ఉదహరణలతో తేలికగా అర్థమయ్యేలా ఈ పుస్తకాన్ని రూపొందిచినందులకు రచయుతకు ధన్యవాదాలు.
పుస్తకం.నెట్
“ఎన్.టి.ఆర్ పురాణ పాత్రలు” – పుస్తక పరిచయ కార్యక్రమం టివి నైన్ లో ప్రసారం అవుతోంది ఇప్పుడు.
సౌమ్య
J.D. Salinger is no more. News here
సౌమ్య
యస్! ఉంది! 🙂
అమేజాన్ కిండిల్ కి పోటీగా భారతీయ సంస్థ ఇన్ఫీబీమ్ ’పై’ వచ్చేస్తోంది. వెల కిండిల్ కన్నా చౌక.
ఇక్కడున్న వారిలో చాలామందికి ఆసక్తి ఉన్నట్లుంది కనుక – డిటైల్స్ తెల్సుకోండి..
కొంత పరిచయం ఇక్కడ.
సౌమ్య
Eric Segal – known mostly for his ‘Love Story’ is dead….
News here
kumar
DR.SOMA RAJU SUSILA GARI ILLERAMMA KATHALU NAAKU CHAALA NACHINDI. VARIDE CHINNA PARISRAMALU, PEDDA KATHALU EKKADA DORUKUTHUNDO CHEPPAGALARAA? I M TRYING FOR THAT FROM ALMOST A YEAR.
KINDLY SHARE THE INFORMATION.
పుస్తకం.నెట్
గురజాడ కథానికలు పై టీవీ నైన్ లో పుస్తక పరిచయ కార్యక్రమం వస్తోంది.
సౌమ్య
పాతకాలం నాటి ప్రముఖ రచయిత్రి గురించి మాలతి గారి వ్యాసం, ఆవిడ బ్లాగులో: ఇక్కడ చూడొచ్చు.
పుస్తకం » Blog Archive » పుస్తకం.నెట్ మొదటి వార్షికోత్సవం
[…] చెప్పాలని ఉందా? […]
perugu
MUSEINDIA.COM WEB JOURNAL POETS MEET IN HYD ON 10.01.2010 AT NGRI
The noted Indian English poet/writer, US-based Meena Alexander happens to be in town and she will be participating in Muse Meet. Dr Shiv K Kumar and Mr I V Chalapathi Rao will be the other important guests at the event. This is followed by: release of Dr Kumarendra Mallick’s book of poems
“Letter to an Imaginary Friend and Other Poems”
Comments on the book by Mr I V Chalapathi Rao, Guest of Honour
Readings from the book by Sujatha Gopal and Upendra Rawal
– Entry through invitation only!
perugu
Ninnane ee book release Chennai lo jarigindi..!
7 January 2010, 5 pm
Release of the book ‘Vaikunta Perumal Temple’
Interpreted by D. Dennis Hudson
Dr.Romila Thapar delivered the 3rd D.Dennis Hudson Memorial
Annual Lecture on “Cyclical and Linear time in Ancient India”
GHV PRASAD
Neenu yee madhyane “OKA YOGI ATHMAKATHA” ane goppa pusthakam chadivaanu. EE pustakam Paramahamsa Yogananda raasaaru. Deene telugu anuvaadam chaala baagundi. Goppa yogula gurinchi, Yogananda kalusukunna prasidhamaina vyakthula gurinichi, aadhyathmakamaina vishayala gurinichi chaala baaga raasaaru. Ofcourse, old pusthakaamaina neenu ee madhyane chadavanu kabatti naa abhiprayam teliyachestunna.
GHV PRASAD,TIRUPATI, DT. 71-01-2010
ajay prasad
please give us your email id so that i can send one attachment.
pustakam.net
@Ajay Prasad: You can send a mail to editor@pustakam.net
సౌమ్య
Crossword బెంగలూరు లో రెండు ఈవెంట్స్ గురించి ఇప్పుడే మెట్రో ప్లస్ బెంగళూరు ఎడిషన్ లో చదివాను:
౧. భారత దేశం లో మొదటి నెరేటివ్ జర్నలిజం పత్రిక (అంటే ఏమిటో నాకర్థం కాలేదు) “The Caravan” ఆవిష్కరణ, అలాగే, నెరేటివ్ నాన్ ఫిక్షన్ రైటింగ్ ఇన్ ఇండియా అన్న విషయం పై చర్చ. పాల్గొనే వారు: రామచంద్ర గుహ, వివేక్ షాన్ బాగ్, కారవాన్ ఎడిటర్ – అనంత నాథ్, దేప్యుతి ఎడిటర్ వినోద్, మరో ఎడిటర్ అంజుం హసన్.
తేది: జనవరి పది, సాయంత్రం ఆరున్నరకి.
లొకేషన్: క్రాస్వర్డ్, ముప్పై రెండు, ఎసిఆర్ టవర్, రెసిడెన్సీ రోడ్, బెంగళూరు.
౨. రచయిత్రి, కవయిత్రి రూత్ పదేల్ (http://www.ruthpadel.com) తో రీడింగ్ సెషన్ మరియు చర్చ – టోటో ఫండ్స్ అండ్ ఆర్ట్స్, బ్రిటిష్ కౌన్సిల్ మరియు అసోసిఅషణ్ ఆఫ్ బ్రిటీష్ స్కాలర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈవెంట్ ఇది.
తేది: జనవరి ఎనిమిది, సాయంత్రం ఏడు గంటలకి
లొకేషన్: క్రాస్వర్డ్, ముప్పై రెండు, ఎసిఆర్ టవర్, రెసిడెన్సీ రోడ్, బెంగళూరు.
మెహెర్
అజంతావి ఇంకో మూడు కవితలు: http://www.scribd.com/doc/24803813/Ajanta2
నాకో వివరం కావాలి. నాకంటే నాక్కాదు, నాకు తెలిసినాయనకి. ఆయన చాలా యేళ్ళ క్రితం “ఆకలి” అనే ఒక అనువాద నవల చదివారట. అది గ్రంథాలయ ప్రతి కావడం వల్లనూ, అందులో మొదట కొన్ని పేజీలూ చివర కొన్ని పేజీలూ చినిగిపోవటం వల్లనూ, ఆయనకు అది అనువాద నవల అనైతే తెలిసింది గానీ, మూల రచయిత ఎవరూ, అనువాదం ఎవరు చేసారూ అన్నది తెలియరాలేదు. ఆయన చెప్పిన ఇతివృత్తం ఆధారంగా నేను మూల రచయిత ఎవరూ, నవల ఏంటన్నది కనుక్కోగలిగాను:
రచయిత నార్వేకు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత: Knut Hamsun : http://en.wikipedia.org/wiki/Knut_Hamsun
రచన: Hunger: http://en.wikipedia.org/wiki/Hunger_(novel)
ఇదైతే తేలింది గానీ, తెలుగులోకి అనువదించిన వారెవరన్నది అంతుపట్టలేదు. ఎవరికన్నా తెలిస్తే చెప్పండి.
మెహెర్
అజంతావి నాలుగు కవితలున్న సాఫ్టుకాపీ దొరికింది:
http://www.scribd.com/doc/24798612/Ajanta
PETHAKAMSETTY VENKATESWARA RAO
I AM SEARCHING FOR BOOK WHICH CONTAINS THE INFORMATION ABOUT “VOORI PERU DANI VISISHTATA” [NAME OF THE VILLAGE/TOWN/CITY AND ITS IMPORTANCE/HOW THE NAME CAME TO THAT STATION] IN TELUGU LANGUAGE. KINDLY PROVIDE THE INFORMATION IF ANYBODY KNOWS ABOUT THAT INFORMATION/BOOK.
THANK YOU
P.VENKATESWARA RAO
PENRAO@YAHOO.CO.IN
విజయవర్ధన్
ప్రతి ఆదివారం TV9లో పుస్తక పరిచయ కార్యక్రమం ప్రసారమవుతోంది (ఉదయం 11.30 నుంచి 11.45 వరకు). ఈ ఆదివారం అరుణ్ సాగర్ గారి పుస్తకం “మేల్ కొలుపు” పరిచయం ప్రసారమయ్యింది. ఈరోజు కార్యక్రమంలో సినీ నటుడు తనికెళ్ల భరణి పాల్గొన్నారు.
విజయవర్ధన్
విజయవాడ పుస్తక ప్రదర్శనలో జనవరి 4న జరుగనున్న “(ఇం)కోతి కొమ్మచ్చి” అంకిత సభ సమైక్యాంధ్ర ఆందోళనకారుల బందు వల్ల రద్దు చేయబడింది. బాపు, రమణ గార్లు తమ ప్రయాణం రద్దు చేసుకున్నారు. “Walk for books” కార్యక్రమానికి హాజరుకావలసిన వరప్రసాద రెడ్డి గారు కూడా తమ ప్రయాణం రద్దు చేసుకోబోతున్నారని తెలిసింది.
అరిపిరాల
అంతర్జాలంలో ఉచితంగా ఈ-పుస్తకాలు దొరికే చోటు.. ఇందులో చదివేవి, వినేవి కూడా వున్నాయి. ఇన్ని పుస్తకాలను ఇలా సేకరించి పెట్టిన మహనీయులకి శతకోటి వందనాలు.
http://www.gutenberg.org/wiki/Main_Page