ఈవెనింగ్ అవర్లో హరిమోహన్ పరువు గారితో
రాసిన వారు: ప్రియాంక (ఈవెనింగవర్.కాం)
***********************
ఫిబ్రవరి ఇరవైయవ తారీఖున ఈవెనింగ్‍అవర్ బుక్‍స్టోర్ మరియు గ్రంథాలయం లో మొదటి సారి జరిగిన “Meet the Author” ఈవెంట్ లో హరి మోహన్ పరువు (Hari Mohan Paruvu) గారు విచ్చేశారు. హరిమోహన్ గారు పుస్తకాలు వ్రాయటానికి ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు లో పని చేసారు. మరియు క్లబ్ క్రికెటర్ కూడా. మనం రంజీ ట్రోఫి గెలుచుక్కన్నప్పటి టీం లో మెంబెర్. వీరి మొదటి పుస్తకం “The Men Within”. “ది మెన్ వితిన్” పుస్తకం ఒక క్రికెటర్ కి, ఒక మేనేజ్మెంట్ విద్యార్థికి, ఒక సాధారణమయిన స్టూడెంట్ కీ-అందరికి నచ్చేట్లు గా ఉంది. తప్పని సరిగా చదవవలసిన పుస్తకాలలో ఒకటి.
ముందుగా చెప్పినట్టు హరి మోహన్ గారు ఖచ్చితంగా 6:15 PM కి వచ్చేశారు. నిజం చెప్పాలి అంటే శ్రోతలే ఆలస్యంగా వచ్చారు. హరిమోహన్ గారు చాలా Down to earth personality. రావటం తోనే ఆర్భాటం ఏమి లేకుండా మీటింగ్ మొదలుపెడుదామా అని అడిగి ఇంకా శ్రోతలు ట్రాఫ్ఫిక్ లో ఉన్నారు అని చెప్పేసరికి కొంచెంసేపు వారి కోసం ఆగుదామా అని వారే ఆఫర్ చేసారు. ఈ లోపల అప్పటికే వచ్చిన మేమంతా హరి మోహన్ గారి ని అనేకమయిన ప్రశ్నలు వేసాము.
కొన్ని ప్రశ్నలు వాటి జవాబులు:
పుస్తకం ఎలా ప్రచురింపబడుతుంది ? దాని జర్నీ ఏమిటి ?
మొట్టమొదటగా రచయిత వ్రాసిన కథ ని ఎడిటర్ అఫ్ పబ్లిషింగ్ హౌస్ చదువుతారు. హరిమోహన్ గారి ప్రకారం మనం ఎంత త్వరగా మన కథ ని పబ్లిషర్లకి పంపుతామో చాలా సార్లు అంత కంటే త్వరగా రిజెక్షన్ లెటర్స్ వస్తాయి. ఒక్కొక్క కథ ని మనకి వచ్చిన రెస్పాన్స్ బట్టి ఒక వంద రెండు వందల సార్లు అయిన రివ్యూ చేస్తాము అన్నారు. ఈ ప్రాసెస్ లో మనం చాలా సార్లు నిరుత్సాహ పడడానికి ఆస్కారం ఉంది కానీ కొంచెం బ్రేక్ తీసుకుని మళ్లీ కొనసాగించమని అన్నారు. ఇలా వ్రాత పర్వం సాగాక చివరకి రచయిత మరియు పబ్లిషింగ్ హౌస్ యొక్క ఎడిటర్ ఒక ఫైనల్ వెర్షన్ కి చేరుకుంటారు. ఇంకా అప్పుడు ప్రింటింగ్, పుస్తకం యొక్క ఆవిష్కరణ మొదలయిన కార్యక్రమాలు అన్ని మొదలు అవుతాయి.
ఏదన్నా పుస్తకాన్ని మూవీ గా తియ్యాలి అంటే రచయిత దగ్గరకి వెళ్ళాలా లేక పబ్లిషర్ దగ్గరకా ?
పబ్లిషర్ దగ్గరకి వెళ్ళటమే ఉత్తమం. చాలా వరకు రచయితలు మనకి కాంటాక్ట్ కి దొరకరు. చాల సార్లు పుస్తకం యొక్క మూవీ రైట్స్ కూడా పబ్లిషర్స్ దగ్గరే ఉంటాయి. కాబట్టి ముందు పబ్లిషర్ ని సంప్రదించడమే మేలు.
ఇలా ఎన్నో ప్రశ్నలతో ఒక గంట ఎలా గడిచిందో కూడా తెలియలేదు. ప్రశ్నల తరువాత హరి మోహన్ గారు తన మొదటి పుస్తకం “ది మెన్ వితిన్” లో ఆయనకి బాగా నచ్చిన కొన్ని భాగాలు చదివి వినిపించారు. ఆయన కథనం ఎంత బాగుందో చెప్పడం కూడా అంత బాగుంది. తరువాత ఆయన విడుదలకు సిద్ధంగా ఉన్న రెండో పుస్తకం లో కొన్ని బాగాలు కూడా చదివారు. Sneak Preview అన్నమాట. హరి మోహన్ గారి రెండో పుస్తకం “If you love someone… ” March 5 న 6 PM బంజారాహిల్స్ ల్యాండ్ మార్క్‍లో ఆవిష్కరింపబడింది.
We take this opportunity to thank Mr. HariMohan for humbly complying to our request and honouring all of us and EveningHour with his gracious presence. We wish him lots of good luck for his second book and for all the great books to come by.
Leave a Reply