పుస్తకం.నెట్ ఎనిమిదో వార్షికోత్సవం

మరో సంవత్సరం గడిచింది. పుస్తకం.నెట్‌కు ఎనిమిదేళ్ళు నిండి, తొమ్ముదో ఏడులోకి ప్రవేశించింది.
పుస్తకం.నెట్‌ను ఇన్నాళ్ళూ ఆదరించి, అభిమానించిన అందరికీ ధన్యవాదాలు. కేవలం పుస్తకాలకే పరిమితమైన సైట్‌ను ఇన్నేళ్ళు నిర్విఘ్నంగా సాగడమనేది మేము దీన్ని మొదలెట్టినప్పుడు ఊహించనేలేదు.
గత సంవత్సరం, అనివార్య కారణాల వల్ల, పుస్తకం.నెట్ చాలా మందకోడిగా నడిచింది. ఇప్పటివరకూ అతి తక్కువ వ్యాసాలు వచ్చిన ఏడాది ఇదే! ఈ ఏడాది పుస్తక పరిచయాల పరంపర ఆగకుండా చూసినవారి ముఖ్యులు – నాగిని, కొల్లూరు సోమశంకర్, లక్ష్మిగార్లు. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు.
ఆ సంగతి గణాంకాల్లో చూస్తే:
ఈ ఏడాది వచ్చిన వ్యాసాలు: 73
మొత్తం ఇప్పటివరకూ
వచ్చిన వ్యాసాలు: 1863
కామెంట్లు: 9367
హిట్లు: 1504958
సుధీర్ఘ ప్రయాణాల్లో ఇలాంటి ఒడిదుడుకులు సహజం. గడిచిన ఏడాది మందకోడిగా సాగినా, ఈ ఏడాది మరింత ఉత్సాహంతో పుస్తకం.నెట్ కొనసాగగలదని ఆశిస్తున్నాం. అందుకు మీ అందరి సహాయసహకారాలు ఉంటాయని ఆశిస్తున్నాం. ఇన్నేళ్ళల్లో మీరందంచిన స్పూర్తే మమల్ని ముందుకు నడిపిస్తుంది. అందుకు మనస్పూర్తిగా ధన్యవాదాలు.
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
Leave a Reply