క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ ద్వారా రచనల పునరావిష్కరణ – ఆహ్వానం
విజయవాడలో నశీర్ అహమ్మద్ మరియు రహంతుల్లా గారి రచనలు CC-BY-SA 4.0 లైసెన్స్ ద్వారా పునర్విడుదల కార్యక్రమం తాలుకా ఆహ్వాన పత్రం ఇది.
వివరాలు అందిస్తున్నవారు: రహ్మానుద్దీన్ షేక్
***
నమస్కారం!
సయ్యద్ నశీర్ అహమ్మద్ గారు అంతో శ్రమ కూర్చి భారతీయ, మరీ ముఖ్యంగా తెలుగు ముస్లింల గురించి అద్వితీయమైన పుస్తకాలు మనందరికీ అందించారన్న విషయం తెలిసిందే. టిప్పు సుల్తాన్, తుర్రేబాజ్ ఖాన్ లాంటి మహామనుషుల గురించి ఈయన రచనలు చదవకపోతే బహుశా సరియయిన రీతిలో తెలిసేది కాదేమో! తెలుగులో ఇలాంటి సాహిత్యాన్ని మనకు అందించి మహాయజ్ఞమే చేసారు నశీర్ అహమ్మద్ గారు. అయితే ఈ పుస్తకాల పరిమితి కేవలం కొద్ది మందికే కాకుండా ప్రపంచం నలుదిశలా వ్యాపించాలనే ఆకాంక్షతో ఈ పుస్తకాలను వికీసోర్స్ వేదికగా అంతర్జాలంలో అందుబాటులో ఉంచాలని రహంతుల్లా గారు సంకల్పించారు. ఆ సంకల్పం ఫలితంగానే ఈ నెల 14 న విజయవాడ లోని స్వాతంత్ర్య సమరయోధుల గ్రంథాలయంలో ఈ పుస్తకాల స్వేచ్ఛా లైసెన్స్ కు అనుగుణంగా పునర్విదుదల కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలోనే రచయితలకూ, విద్యార్థులకూ, పరిశోధకులకూ, ప్రచురణ కర్తలకూ, పాత్రికేయులకూ నకలు హక్కులు, స్వేచ్ఛా సమాచారం మొ॥ విషయాలపై అవగాహనా సదస్సు కూడా ఉంటుంది. కార్యక్రమ వివరాలు పోస్టర్ లో చూడగలరు.
ఆసక్తి ఉన్నవారికి వికీపీడియా, వికీసోర్స్ పనితనంపై అవగాహన సదస్సు కూడా జరుగుతుంది.
**
Leave a Reply