చెప్పాలని ఉందా?-2
ఏమేమి చెప్పచ్చు?
పుస్తకాల గురించిన సమాచారాలు ఏవైనా! అంతర్జాలంలో పుస్తకాలపై ఏదో వ్యాఖ్యానం మీకు నచ్చిందా? మీ అభిమాన రచయిత గురించి కొత్తగా ఏదో వార్త తెల్సిందా? మీరు ఏదైనా పుస్తకం కోసం వెదుకుతున్నారా? మీరు చాన్నాళ్ళుగా వెదుకుతున్న పుస్తకం దొరికిందా? మీరు తరచుగా వెళ్ళే పుస్తకాల షాపులో డిస్కౌంట్లు ఇస్తున్నారా? పుస్తక ప్రదర్శనలు ఎక్కడ, ఎప్పుడు జరుగుతున్నాయో మీకు తెల్సా?
అయితే.. చెప్పాలని ఉంది అంటూ.. మీకు తెల్సినది ఇక్కడ తెలియజేయండి. సమాచారాన్ని పెంచుకోండి.
ఎలా చెప్పాలి?
ఇక్కడో వ్యాఖ్య పెట్టేయండీ.. అంతే!
ఇప్పటి వరకూ వచ్చిన వ్యాఖ్యలను ఇక్కడ చూడండి..
కౌటిల్య
వేణు గారూ, రవి గారూ…ముందు నా ఆలస్యానికి మన్నించాలి..ఈ మధ్య నేను కాస్త బిజీగా ఉండి ఇటుకేసి రావటంలేదు….
వేణు గారూ, రఘువంశం మీకు మొత్తం కావాలా…మొత్తం ఐతే దేవనాగరిలోనే ఉంది,అర్థతాత్పర్యాలు ఉండవు… అది నా దగ్గర రెండో కాపీ ఉందో లేదో చూడాలి…కాదు, తెలుగులిపిలోది కావాలంటే ఆరుసర్గలే ఉంది…ఇక్కడా అర్థతాత్పర్యాలు ఉండవు…మల్లినాథసూరి వ్యాఖ్య రెంటిలోనూ ఉంటుంది…..కాని, నాకు తెలిసి అన్నిటికన్నా బెటరు, అప్పట్లో వావిళ్ళవారు వేసిన ఒక పుస్తకం ఉంది.అది ఇప్పుడు ఆర్షవిద్యాభారతి వాళ్ళు వేశారు…అందులో చక్కగా అర్థ తాత్పర్యాలూ,ఆపేక్ష,సైద్ధాంతిక నిరూపణా ఉన్నాయి…
రవి గారూ, ఆ పుస్తకం చాలా అరుదుగా దొరుకుతుందండీ…వావిళ్ళవాళ్ళ దగ్గర కూడా లేదంట ప్రతి…వావిళ్ళవాళ్ళు పది సంవత్సరాలనుంచీ వెతుకుతున్నారట ఆ పుస్తకం కోసం…నాది ఇస్తానన్నాను…త్వరలో మార్కెట్లోకి కొత్త ప్రింటుగా రావచ్చు..అచ్చయ్యాక తప్పకుండా మీకు తెలియజేస్తాను….
శాయి
DLIలో
Shri_Bhagavadgeetha_Sri_Ramachandrananda_Sawraswathi_Krutha_Andhrateekatatparya_Bashatraya_Vevarana_Sahithamu
ravi
@ కౌటిల్య గారు మీరు చెప్పిన భగవద్గీత పుస్తకం(శంకర,రామనుజ,మధ్వ భాష్యాలతో వున్నది) ఆ బుక్ డిటైల్స్ చెప్పగలరా?
ravi
@ కౌటిల్య గారు మీరు చెప్పిన భగవద్గీత పుస్తకం(శంకర,రామనుజ,మధ్వ భష్యలథో వున్నది) ఆ బుక్ దితైల్స్ చెప్పగలరా?
ravi
కాళోజి నారయణ రావు గారి నా గొడవ ,ఇదీ నాగొడవ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా?నేను చాలా చోట్ల ప్రయత్నిచాను కాని ఎక్కడ దొరకలేదు, మీలో ఎవరిదగ్గరైనావుంటే తప్పకుండా చెప్పండి,ప్లీజ్
murthy
ఈమధ్య నేను విజయవాడలో కొన్న పుస్తకాల జాబితా!
మిధునం (రోజుకి ఒక కధ మాత్రమే పొదుపుగా)
వనవాశి
జంగిల్ బుక్
రష్యన్ చరిత్ర కధలూ గాధలూ అలెక్సేయొవ్
కశ్మీర రాజ తరంగిణి కథలు – ఎమెస్కొ, మరియూ మరికొన్ని ఇతర నవలలు
హిమగిరివిహారం – తపోవన్ మహరాజ్
క్రియాయోగం స్వామి శివానంద (తెలుగు అనువాదం)
ఆంధ్రయోగులు షస్ఠమ భాగము
రమణులు చెప్పిన కధలు
లెనిన్ సెంటర్ వంశీ లో చందమామలు పాతవి ఉన్నాయి నేను నా చిన్నప్పటి కాలానివి (1986) తీసుకొన్నా 1970 నుంచీ ఇంచుమించుగా ఉన్నాయి. రేటు మాత్రం రిబేటు లేని బాటా రేటు.
ఎంత పాత అయితే అంత రేటు ఎక్కువ (పుస్తక(ం.నెట్) ప్రియులు మూలంగా రేటు పెరుగుతున్నాయేమో నని నా డౌటు. ఇంకా కొనాలని ఉన్నాగానీ, ఈ సారి కి సరి. (మనసేమో నీ కోసం పరుగులెడతది చిల్లి కాసైనా … )
శశిధర్ పింగళి
మీలో ఎంతమందికి తెలుసో తెలియదు. సినీనటుడు కొంగర జగ్గయ్య మంచి కవి. చక్కటి చిక్కటి భాషలో పద్యాలు విద్యార్థి దశలోనే వ్రాసారట. నాదగ్గర కొన్ని వున్నాయి తరవాత వ్రాస్తా వాటి గురించి. అయితే ఆయన రవీంద్రనాథ్ ఠాగోర్ గీతాంజలిని చాలా అంటే చాలా చక్కటి భాషా, భావాలతో తెనుగించారు. నాకు ఎంత ప్రయత్నం చేసినా దొరకలేదు. అసలు అచ్చులో కొచ్చిందో లేదో కూడా తెలియదు. ఎప్పుడో సుమారు 20 ఏళ్ళక్రితం ఒక వారపత్రికలో సమీక్షచూసాను అంతే. ఎవరికైనా తెలిస్తే చెప్పి పుణ్యకట్టుకోండి దయచేసి. — శశిధర్ పింగళి
murthy
ఆముక్తమాల్యద వచనం లో దొరుకుతుందా చెప్పిపుణ్యం కట్టుకోండి.
ఆముక్తమాల్యద ను గూర్చి ఉన్న లంకే ఇక్కడ http://amuktamalya.blogspot.com/
మెహెర్
I think “The Congress” is most Chekhovian of all of Borges’ stories, particularly the ending replete with Chekhovian sadness. Wonderful! I’ve found a translation online by Norman Thomas di Giovanni, which is collaborated with Borges himself. So, sharing it:
http://www.autodidactproject.org/other/borges3.html
Borges about this story:
and
I haven’t found in it any Kafka, but there sure is a lot of Chesterton. The slightly farcical meetings of “the congress” here resemble the meetings of “anarchist council” in the Chesterton’s novel “The Man Who was Thursday”.
The epigraph of the story is translated in to English thus:
Don’t shy away from googling for details while reading the story. One has to get the flavor of Buenos Aires (where the story takes place), which is a must for story’s enjoyment.
Raja
Hi Friend,
This is Raja writing on behalf of WHAT (We Help And Teach).
Firstly, thanks for posting our event information in your site some time ago (http://pustakam.net/?p=5501).
Now, we are in the process of setting up second center of our WHAT-Vignana Vikasam Project, in a village named Bodapalem and looking for ppl who can donate a book.
More details on this are at: http://wehelpandteach.org/projects/vignanavikasam-2.html
If required, I can forward a mail which we sent to all our members..
Regards,
Raja
Raghu
VIPULALO MASA PATRIKALO CHALA MANCHI MANCHI KATHALU PRATI NEL NELA VASTUNTAYI. TELUGU KATHALATO PATU, PRAPANCHA BHASHALA ANUVADA KATHALU VASTAYI. DAYACHESI ANDARU CHADAVANDI. MANCHI PATRIKALANU PROTSAHINCHANDI.
రాజేంద్రకుమార్ దేవరపల్లి
@నారాయణ: పూర్తయ్యిందా సారు?ఇక్కడ వెయిటింగు
రాజేంద్రకుమార్ దేవరపల్లి
@ఉష: రెడ్డి రాఘవయ్య గారు కూడా బాలలసాహిత్యానికి విస్తృతమైన సేచచేస్తున్నారు ఆయన ఈ పరిశోధకుల దృష్టికి రాకపోతే తప్పు ఆయన్ది మాత్రం కాదు.
రాజేంద్రకుమార్ దేవరపల్లి
@dvrao: అయ్యా మీరు ఇచ్చిన లంకె పనిచెయ్యటం లేదు.అది ఇన్ ఫిడిల్ తెలుగు అనువాదం పై వచ్చిన సమీక్షే కదా?
dvrao
ఈ కధ చదవక పోతే మంచి కధ మిస్సవుతారు. అల్లం శేషగిరి రావు గారి జ్ఞాపకాలు ‘నవ్య’ లో వచ్చింది. అలాగే ఆయన రాసిన ‘చీకటి’ కధ ప్రచురించారు. ఇక్కడ చదవండి.
http://www.navyaweekly.com/2011/jun/29/page22.asp
ramesh
Hi
Me want the details regarding music directors book at Hyderabad.
dvrao
ఎం.ఎస్. రెడ్డి ఆత్మకధ ‘ఇదీ నా కధ’ లోని చిన్న భాగం ఆంధ్రజ్యోతి లో ఈ రోజు వచ్చింది. ఆరోజుల్లోని స్టార్లు, వాళ్ళ ఇగో లు, నిర్మాత ల పాట్లు బాగా రాసారు. ఇక్కడ చదవండి.
https://www.andhrajyothy.com/navyaNewsShow.asp?qry=2011/jun/9/navya/9navya1&more=2011/jun/9/navya/navyamain&date=6/9/2011
dvrao
తాలిబాన్ పై వచ్చిన ఒక పుస్తకం పై సమీక్ష
http://www.vaartha.com/content/20875/in-side-person.html
రమణ
@సౌమ్య : మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కధలు విశాలాంధ్ర లో దొరుకుతాయి. డిజిటల్ లైబ్రరీ లో కూడా దొరుకుతాయి.
Sowmya
ఒక స్నేహితురాలి సందేహం:
మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు నవలలు, కథలు, వ్యాసాలు, సినిమా పాటలు కాక, కవిత్వం కూడా రాసారా? రాస్తే ఎక్కడ దొరుకుతుంది? అని.
మీకెవరికన్నా తెలిస్తే చెప్పగలరు.
వేణు
@కౌటిల్య: కౌటిల్య గారూ, ఈ మధ్య నేను కాళిదాసు ‘రఘువంశం’ గురించి వెతుకుతున్నానండీ. మీ దగ్గరున్న వావిళ్ళవారి ప్రచురణ ఇవ్వగలరా?
సత్యవతి కొండవీటి
పూర్ణిమ గారూ
పుస్తకం నెట్ లో మీ పుస్తక సమీక్షలు చదువుతుంటాను.
చాలా బాగా రాస్తారు.
అన్ని పుస్తకాలు ఎలా చవగలుగుతున్నారా అని ఆశ్చర్యం వేస్తుంది.
మీ సమీక్ష లు భూమిక లో వెయ్యాలని,భూమిక పాఠకులకు వాటిని అందుబాటులోకి తేవాలని నాకు చాలా కోరికగా ఉంది.
వేరే రచయితలవి అయితే కాపీ రైట్స్,వాళ్ళ అనుమతులు వగైరాలుంటాయి.
నేను మీరు రాసినవే అడుగుతున్నాను.
మీ అభిప్రాయం తెలపండి.
సత్యవతి కొండవీటి
sarma .C.B
Paravastu Chinnaya Suri rachana NEETI CHANDRIKA yekkada dorukutumdi Dayacheysi cheppandi.
dvrao
సీమ కధలపై ఒక వ్యాసం ఇక్కడ…
http://www.suryaa.com/main/showLiterature.asp?cat=6&subCat=1&ContentId=19369
Chandrasekhar
@srinivasa chary: Srinivasa Achary garu: Nenu translate cheyagalanu. Machchuki oka kavita pampinchandi. Nachchitey, munduki saagudaam.
Chandra
You can see 150 covers of Lolita from 33 countries @
http://www.dezimmer.net/Covering%20Lolita/LoCov.html
Kiran Kumar
@కౌటిల్య: Sir, munduga respond ainanduku naa danyavadalu. KNY Patanjali navalikalu konni oke pustakam ga print chesarata. dantlo oka dayyam atma kada, pilaka tirugudu puvvu, veera bobbili, veta katalu etc., vunnai. a book gurinchi emina teliste cheppandi. naaku telugu lo ela type cheyyalo teliyadu. plz excuse me. thank you once again.
కౌటిల్య
కిరణ్ గారూ! మీరు చెప్తున్న పుస్తకం నాకు తెలియదండీ! ఒకవేళ పతంజలి మహర్షి రచనలైతే తెలుగులో ఇప్పుడు దొరకటం కష్టం….దేవనాగరిలో కావాలంటే చౌకంబా,వారణాసి వారి దగ్గర దొరుకుతాయి..
కౌటిల్య
ఈ ఆదివారంసంతలో నా కలెక్సను…
౧)రఘువంశ మహాకావ్యం – మొత్తం ౧౯ సర్గలూ ఉన్నాయి,మల్లినాథసూరి వ్యాఖ్యానంతో – వావిళ్ళవారిది – దేవనాగరిలో ఉంది – ముద్రణా కాలం :1941.
౨)నంది తిమ్మన “పారిజాతాపహరణం” – వావిళ్ళ వారిది – ఉత్పల వేంకట నరసింహాచార్యులుగారి పీఠికతో- ప్రతిపదార్థ తాత్పర్యాలు లేవు – ముద్రణా కాలం :1937.
౩)శ్రీ కుల్లూకభట్ట విరచిత మన్వర్థముక్తావళి(మనుస్మృతి వ్యాఖ్యానం) – దేవనాగరిలో ఉంది – ప్రకాశకులు,ముద్రణాకాలం తెలియట్లేదు.
౪) వావిళ్ళవారి “సులక్షణ సారము”, “లఘు సిద్ధాంత కౌముది” – ముద్రణ: 1945.
౫) రఘువంశం,నాలుగవ సర్గ – మల్లినాథసూరి వ్యాఖ్య, వేదం వెంకటరాయ శాస్త్రి గారి తెలుగు ప్రతిపదార్థ తాత్పర్యాలతో – ముద్రణ : 1980
౬) నోరినరసింహ శాస్త్రి “కర్పూరద్వీప యాత్ర” – త్రివేణీ పబ్లిషర్స్,మచిలీపట్నం – 2003 ముద్రణ – ఇది అప్పట్లో ఎనిమిదవ తరగతి వారికి ఉపవాచకంలా ఉంది….ః)
*ఈ ఏడు పుస్తకాలూ ఒక్కళ్ళ దగ్గరే కొన్నాను…మొత్తం ధర : నూట డెబ్భైరూపాయలు…ః)
*వీటిలో వావిళ్ళవారి రఘువంశం,పారిజాతాపహరణం,కర్పూరద్వీపయాత్ర అవిల్రెడీ నా దగ్గర ఉన్నాయి..ఎవరన్నా కావాలంటే ఇవ్వగలను…
Kiran Kumar
@కౌటిల్య: daya chesi evaryna naaku patanjali rachanalu ane pustakam ekkada
labyam avutundo cheppagalara. naa email chirunama – kiranmrp@gmail.com.
Kiran Kumar
daya chesi evaryna naaku patanjali rachanalu ane pustakam ekkada
labyam avutundo cheppagalara. naa email chirunama – kiranmrp@gmail.com.
కౌటిల్య
ఈ రెణ్ణెల్లనుంచీ ఏమేం పుస్తకాలు కొన్నానో మీకు చెప్పలేదు కదా! ఫిబ్రవరి వరకే చెప్పాననుకుంటా…ఇదిగో ఈ రెణ్ణెల్ల లిస్టుతో మీ ముందుకొచ్చేస్తున్నా…..కాని చాలా బోలెడు కొన్నా,కాబట్టి ఇంతకు ముందులా ప్రతి పుస్తకం గురించీ వివరంగా రాయలేను..ముఖ్యం అనుకున్నవి రాస్తా..సరేనా…..ః)
౧)మొట్టమొదటగా మార్చి రెండో వారంలో హైదరాబాదులో వావిళ్ళ వాళ్ళ ప్రెస్సుకి వెళ్ళా…..చాలా కొనుక్కొచ్చుకున్నా,కొత్తపాత పుస్తకాలు కలిపి వెయ్యి పైనే బిల్లు చేశా…ః)….వాటిల్లో కొన్ని – మనుచరిత్ర,ఆముక్త మాల్యద సటీకా తాత్పర్యం, చాలా బుల్లి బుల్లి కథల పుస్తకాలు, బకించంద్ర కపాలకుండల(అనువాదం),విజ్జలదేవి, కాటూరి వెంకటేశ్వరరావు గారి ముగ్గురు మూర్తులు,వేదం వెంకటరాయశాస్త్రి గారి రచనలు కొన్ని…ఇలా బోలెడు…ః)
౨)తర్వాత ఒకటి,రెండు వారాలు పాతపుస్తకాల సంతకి వెళ్ళటం కుదర్లా….తర్వాత తిరుపతి వెళ్ళి అక్కడా(టిటిడి లో) ఒక వెయ్యి బిల్లు చేశా….ః)….సంగీత సౌరభం(మూడు భాగాలు),చిలకమర్తి వారి నాటకాలు అన్నీ,కొన్ని సంహితలు,ఆర్ష విజ్ఞాన సర్వస్వం- అరణ్యకాలు,విద్వాన్ విశ్వం పంచతంత్రం, వగైరా వగైరా….
ఇక తర్వాత కొన్న పాత పుస్తకాలు రచయిత వారీగా చెప్పుకొస్తా….
౩)అడివి బాపిరాజు గారి కోనంగి,నారాయణరావు.వీటితో ఆయన “నరుడు”,”శైలబాల” తప్ప అన్నీ నా దగ్గ్రరకి వచ్చేసినట్టే…ః)
౪)చిలకమర్తి వారివి – అసలు రెండ్రోజుల్లోనే వీరి రచనల్లో చాలా భాగం దొరికాయి…..నాటకాలన్నీ టిటిడి లో కొన్నా….నవ్వులగని, చిత్రకథా గుఛ్ఛము,వినోదములు,ప్రహసనములు,గణపతి,చమత్కారమంజరి,మణిమంజరి,విష్ణువర్ధనుడు,సుధాశరశ్చంద్రము,రామచంద్ర విజయం,హేమలత,రాజస్థాన కథావళి,దాసీకన్య, సౌందర్య తిలక వచ్చేశాయి….ఇంకా అహల్యాబాయి,రాజరత్నం,కృష్ణవేణి,సువర్ణగుప్తుడు ఇవి వస్తే చిలకమర్తివారివి అన్నీ వచ్చేసినట్టే….ః)
*సౌందర్యతిలక నా దగ్గర రెండు కాపీలు ఉన్నాయి. ఎవరికన్నా కావాలంటే ఇస్తాను…
౫)మల్లాది వసుంధర గారివి – పాటలి,నరమేధం,తంజావూరుపతనం,సప్తపర్ణి,రామప్ప గుడి,యుగసంధి ఇంతకు ముందే కొన్నా…మొన్న మరో రెండు దొరికాయి..త్రివర్ణపతాక,దూరపుకొండలు…ఇంకా వంకరగీతలు,అనంగలేఖ వస్తే వీరివి కూడా పూర్తైనట్టే….
*యుగసంధి రెండు కాపీలున్నాయి,కావాలంటే ఇవ్వగలను.
౬)కాళ్ళకూరి నారాయణరావు గారి “వరవిక్రయం”, “మధుసేవ”…. కందుకూరి వీరేశలింగం గారి “రాజశేఖర చరిత్రము”…..రావిశాస్త్రి గారి “నిజం”…..భానుమతమ్మ “అత్తగారూ-నక్సలైట్లూ”……మునిమాణిక్యం నరసింహారావు గారి “వక్రరేఖ” (ఇది కూడా నా దగ్గర ఉంది, ఎవరికైనా కావాలంటే ఇవ్వగలను)….ముదిగొండ శివప్రసాద్ “దశాశ్వమేధ్”….గోపీచంద్ “అసమర్థుని జీవయాత్ర”…..బుచ్చిబాబు గారి రెండు కథల సంపుటాలు,(వీరివి ఇంకా కొన్ని అమ్మే అతని దగ్గర ఉన్నాయ్, “చివరకు మిగిలేది” etc…కావాలంటే చెప్పండి)….. “కన్యాశుల్కం తొలి మలి కూర్పుల తులనాత్మక పరిశీలన” నరాల వీరయ్య ( ఇది కూడా ఎవరన్నా కావలంటే ఇవ్వగలను)…. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి “కథా పుష్కరిణి” (తితిదే ప్రచురణ)
౭) పురాణం పిచ్చయ్య శాస్త్రి గారి ” సహస్ర శిరఛ్ఛేద అపూర్వ చింతామణి”…ఉత్పల వేంకటరంగాచార్యుల గారిచే పరిష్కృతం…ఇది అసలు ప్రతి….తర్వాత ఈ కథని చాలా మంది పెంచి రాశారు, అవే ఇప్పడు మార్కెట్లో దొరుకుతున్నాయి…ఈ ప్రతి ఎస్.వి.గోపాల్ అండ్ కో, మదరాసు వారిచే 1962 లో ప్రచురించబడింది…ఇది పదకండవ ఎడిషన్..మొదటిది ఎలా ఉంటదో మరి…ః)
౮)దివాకర్ల వేంకటావధాని గారి ” సాహిత్య సోపానములు” “నన్నయ భట్టు” …
౯) తిరుపతి వేంకట కవుల “పాండవోద్యోగం”, పైడిపాటి లక్ష్మణకవి “ఆంధ్రనామ సంగ్రహం”(సటీకా తాత్పర్యం)….. కనపర్తి అబ్బయామాత్యుని “అనిరుద్ధ చరిత్రం”, నంది మల్లయ – ఘంట సింగయ ల ” ప్రబోధ చంద్రోదయం”.( ఈ రెండూ సాహిత్య అకాడెమీ ప్రచురణలు)…
౧౦) ఇక వావిళ్ళ వారివి బోలెడు మంచి పుస్తకాలు దొరికాయి..
అ) ఆంధ్ర మహా భారతము – 1959 ప్రచురణ – ఒక్క శాంతి పర్వం తక్క మిగతా ఆరు భాగాలు దొరికాయి – చాలా చక్కగా ఉన్నాయి ప్రతులు – ధరః నాలుగు వందలు.
ఆ) మారన ” మార్కండేయ పురాణము” – 1927
ఇ) రంగనాథ రామాయణము, ద్విపద – 1933
ఈ) భగవద్గీత – చాలా అద్భుతంగా ఉంది. భగవద్గీతని ఇలా ఎవరూ వేసి ఉండరేమో…..ప్రతి శ్లోకానికి టీక ఇచ్చి తరువాత వరసగా మతత్రయ భాష్యానుసారంగా, అంటే శంకర( అద్వైత), మధ్వ(ద్వైత), రామానుజ(విశిష్టాద్వైత) భాష్యాలననుసరించి తాత్పర్యం ఇవ్వబడింది….మతత్రయాల్లో ఉన్న అర్థం అంతా మనకి ఇక్కడ తెలిసిపోతుంది… – 1931
ఈ మూడూ కలిపి రెండు వందల రూపాయలకి కొన్నాను…
ఉ) విద్యానాథ కృత ” ప్రతాప రుద్రీయం” – రత్నాపణ సహితం( సవ్యాఖ్యానం) – ఎప్పటి నుంచో వెతుకుతున్నాను ఈ పుస్తకం కోసం. ఇది నా సంస్కృతం ఎమ్మే సిలబస్సు..చూడగానే ఎగిరి గంతేశా….వాడు చెప్పిన రేటు విని మరో రెండు గంతులేశా…ః)……అక్షరాలా ఇరవై ఐదు రూపాయలు…..:D….1962
ఊ)అధర్వణాచార్య కృత ” అధర్వణకారికావళి” – టీకా విమర్శన సహితం – ధర కొంచెం ఎక్కువే పెట్టాః వంద రూపాయలు….1967
ఋ) అడిదము సూరకవి “చంద్రాలోకము”, లింగమగుంట తిమ్మకవి ” సులక్షణ సారము” – ధరః ఒక్కోటీ ముఫ్ఫై – 1966
ౠ) తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారి ” నన్నెచోడుని వస్తు కవిత”.
౧౧) ఇంకా కొన్ని సంస్కృత గ్రంథాలు(దేవనాగరి లో) దొరికాయి – వావిళ్ళ వారి ” రఘువంశ” కావ్యం(మొత్త ౧౯ సర్గలూ ఉన్నాయి, మల్లినాథ సూరి వ్యాఖ్యతో,1955 – చౌకంబా వాళ్ళ కాళిదాసు ” విక్రమోర్వశీయం”( సవ్యాఖ్యానం), వరరుచి “ప్రాకృత ప్రకాశం”, సిద్ధాంత కౌముది(చతుర్థ భాగం) – అన్నీ అరవైల్లో ముద్రితమైనవే – ఈ నాలుగూ కలిపి వంద రూపాయలకి కొన్నాను…ః)
౧౨) ఇంకా విశ్వనాథ వారి “ఆంధ్ర ప్రశస్తి”, “ప్రళయనాయడు”….
౧౩) ఇంకో మంచి పుస్తకం – అన్నీ జానపద గీతాలు – నిజానికి ఇవి నాలుగు పుస్తకాలు, అన్నిటినీ కలిపి పుస్తకం ఓనరు(గాడేపల్లి వెంకట లక్ష్మీనరసమాంబ గారు,1931) ఒకటిగా చేసినట్టున్నారు, నాలుగూ దాదాపు పందొమ్మిదొందల ఇరవైల్లో ముద్రితమైనవే….సీత సమర్త, ఊర్మిళాదేవి నిద్ర, లంకాయాగము,సుభద్ర సారె,కుమార్తెను అత్తవారింటికి పంపేప్పుడు పాడే పాట,కోవెల రాయబారం, లక్ష్మీదేవి వర్ణన,మేలుకొలుపులు,తులసి గోవిందనామాలు,రామ మానసపూజ, శ్రీకృష్ణుని చల్దులు, కొన్ని తత్త్వపు పాటలు,…….
ఇదండీ, ఈ రెణ్ణెల్ల కలెక్సను….వచ్చేవారం నుంచీ ఎప్పటిదప్పుడు రాసేస్తానేం….
బొల్లోజు బాబా
@dv rao gaariki
కాశీయాత్ర చరిత్ర పుస్తకం అద్భుతంగా వుంటుంది. సుమారు నూట ఎనభై సంవత్సరాల క్రితం నాటి తెలుగు దేశపు తీరుతెన్నులు, ఆచార వ్యవహారాలు, రోడ్లు, ప్రయాణ సాధనాలు, మనుషుల ప్రవర్తనలు, ఊళ్లు, మతసామరస్యం, పండుగలు, గుళ్ళు గోపురాలు ఒకటేమిటీ అప్పటి ప్రపంచమే మనముందుంటుంది, సరళమైన భాషలో, ఆశక్తి కలిగించే కధనంతో.
ఈ మధ్యకాలంలో నన్ను బాగా కదిలించిన పుస్తకం ఇది.
కొన్ని ఊహలు విపరీతంగా ఉన్నప్పటికీ, అప్పటికి అవి నవీన పోకడలు కావచ్చనిపించింది.
బొల్లోజు బాబా
ఈ క్రింది లింకులో ఆపుస్తకం పి.డి.ఏఫ్ రూపంలోదొరుకుతుంది
http://www.archive.org/details/kasiyatracharitr020670mbp
సౌమ్య
“The Hindu” పత్రికలో పుస్తకాల గురించి వచ్చే వ్యాసాలు, కాలంస్ అన్నీ ఈ లంకెలో చదవొచ్చని ఇవ్వాళే గమనించాను. అందుకని ఈ వ్యాఖ్య..
http://www.thehindu.com/arts/books/
dvrao
@dvrao:
పై లింక్ పనిచెయ్యకపోతే ఇది ట్రై చెయ్యండి
http://www.vaarttha.com/pdf_files/131858.pdf