BACK TO SCHOOL – వ్యాఖ్యలు దిద్దబడతాయి ఇకపై

స్కూల్ అంటే మనలో చాలా మందికెందుకంత చిరాకు? స్కూల్ నుండి కాలేజీలోకి అడుగుపెడుతున్నామంటే ఎందుకంత ఉత్సాహం? స్కూల్లో అయితే అన్నీ ఒక క్రమపద్ధతిలో జరగాలి, ఒకరు పర్యవేక్షిస్తుండగా జరగాలి. క్లాసులో టీచర్, లంచ్‍లో ఆయాలు, గేటు దాటాలంటే వాచ్‍మెనులు, ఇంటికెళ్ళేటప్పటికి పెద్దవాళ్ళు ఎవరో ఒకరు, ఆఖరికి ఆటలు ఆడుకోవాలన్నా పి.టి సారో / మేడమో! అందుకే స్కూల్ అయ్యిపోయిందంటే సంకెళ్ళేవో తెగినంత ఆనందం. ఇన్నాళ్ళు మన మీదున్న “ఇది ఇలానే చెయ్యాలి” అనే నియమాల నుండి విముక్తి. కాలేజీల్లోనూ కొన్ని నిబంధనలుంటాయి, వాటితో ఆడుకోవడం ఒక సరదా! తర్వాత అసలైన ప్రపంచంలోకి వచ్చాక ఎన్నో కట్టుబాట్ల మధ్యలో ఉంటూనే మన స్వాతంత్ర్యం మనకుంటుంది. మన స్కూల్లో నేర్పబడిన, నేర్చుకున్న క్రమశిక్షణకి అసలు పరీక్ష ఇప్పుడే!

Alas! We forget that freedom is like alcohol, it should be taken in moderation. ఆ సమన్వయం పాటించే ఆలోచన మనకి రాదు. కాస్త ఓపిక పట్టే గుణం అసలే లేదు. చెప్పదల్చుకున్నది చెప్పలేకపోతున్న నిస్సహాయతలో విషయాన్ని పక్కకు నెట్టి, ఆక్రోశాన్ని వెల్లిబుచ్చడమే తప్ప! అసభ్య పదజాలంతో, అమర్యాదకర భాషతో!

Small wonder that there is frustration all around. Intelligent men are prone to get violent in their words; and the unintelligent tend to become violent in their deeds. – Nani A. Palkhivala

అందుకే ఇకపై పుస్తకం.నెట్ లో ప్రతీ కమ్మెంట్ పర్యవేక్షింబడుతుంది. ప్రత్యక్షరమూ మాకు “సబబు”గా తోస్తేనే అది అందరి ముందుకూ వస్తుంది. అభ్యంతరకర వ్యాఖ్యాలు ఎటూ రావు, మిగితా వాటిలో ఎదుటి “మనిషి”ని చులకన చేసే ఏ పదం కనిపించదు. మనసూ, మస్తిష్కం కదిలించబడ్డం వల్ల కలిగిన ఏ స్పందనైనా విడుదల చేయటంలో మాదే తుది నిర్ణయం! (కొన్ని సార్లు జాప్యమూ జరగవచ్చు, అర్థం చేసుకోవాలి తప్పదు మరి! వీలైనంత వరకూ అలా జరక్కుండా చూసుకోడానికి ప్రయత్నిస్తాం! ) ఆన్సర్ పత్రంలో తప్పుగా రాసిన ప్రతీ అక్షరాన్ని “ఎర్ర” పెన్నుతో దిద్దటం జరుగుతుంది.

అదీ కాక, మీ వ్యాఖ్యలను అనుమతించే ముందు, మీ ఈమేల్ ఐడి వెరిఫై చేయబడుతుంది. మీ వ్యాఖ్యల వల్ల ఎలాంటి ఇబ్బందికి గురైనవాళ్ళు వచ్చినాసరే, పుస్తకం.నెట్ తో ఉన్న మీ వ్యాఖ్య వివరాలు వారికి ఇవ్వబడతాయి. మీరు రాసే ప్రతీ అక్షరానికి పూర్తి బాధ్యత మీదే!

‘ఎందుకిదంతా? ఎవరి వల్ల?’
We’ve met the enemy and he is us.

(“చంచలం మైదానం” పోస్టులో వచ్చిన వ్యాఖ్యలు ఒక పబ్లిక్ ఫోర్ంలో వచ్చినవే అయినా, అందులో పుస్తకం.నెట్ నిర్వాహకులుగా మా ప్రమేయం ఏమీ లేకపోయినా, ఈ సైటు బాధ్యత మా మీద ఉంది కావున, రభస మా కళ్ళ ముందు జరిగింది కనుకా, కలిగిన అసౌకర్యానికి చింతుస్తున్నాం! ఖండిస్తున్నాం!)

– పుస్తకం.నెట్

You Might Also Like

27 Comments

  1. sandra742

    Hi! I was surfing and found your blog post… nice! I love your blog. 🙂 Cheers! Sandra. R.

  2. Marthanda

    వాళ్ళు నా చేత మాట్లాడించ లేదు. “కులం పేరుతో బురద జల్లే వాళ్ళ ప్రైవసీ గురించి పుస్తకం.నెట్ బాధ్యత తీసుకోవలసిన అవసరం లేదు” అని చెప్పడానికి నేను సమాధానం వ్రాసాను. పుస్తకం.నెట్ నిర్వాహకులకీ, నాకూ వ్యక్తిగత సంబంధం ఏమీ లేదు. కులం పేరుతో విమర్శలు లాంటి సందర్భాలు తప్ప ఇతర సందర్భాలలో ఐ.పి. అడ్రెస్ లు బయట పెట్టడం జరగదు. ఆ అవసరం పుస్తకం.నెట్ వాళ్ళకి లేదు అని స్పష్టంగా చెప్పగలను.

  3. krishnaveni

    “ఈ విషయంలో పుస్తకం.నెట్ వాళ్ళకి పాలసీ పేరుతో ప్రశ్నలు అడగడం అనవసరమా, అవసరమా అన్నది నాకు సంబంధించింది. “కులం పేరుతో బురద జల్లే వాళ్ళ ప్రైవసీ గురించి పుస్తకం.నెట్ బాధ్యత తీసుకోవలసిన అవసరం లేదు” నిజమే దానికి బాధ్యత తీసుకోమని నేనూ అనటం లేదు. ఆ వివాదం గురించి మాట్లాడలంటె చాలా బ్లాగ్ల్ ఉన్నయ్యి. అక్కడ మాట్లాడుకొందాం.

    నేను పుస్తకం నిర్వాహకులను మాత్రమే అడుగుతున్నది, రీడర్స్ IP, addressలు షేర్ చేసుకోవటానికి, మీ పాలసీ ఏమిటి అని?

    కొందరికి తెలుగు అర్ధం కావటం లేదు కాబట్టి, ఇంగ్లిష్ లో, “Does pustakam.net have any written polacies and/or procedures to share their readers IP Addresses with other fellow readers? This question, I am asking the Pustakam.net organizers “only” as a reader, to get to know their policies”

    పాలసీ అంటూ ఏమీ లేకపోతే, నాకు నచ్చిన పుస్తకం మీద నాకు నచ్చినట్లు వ్రాసిన ఆయిన/ఆమె IP అడ్డ్రెస్స్ కావాలి ఇస్తారా, ఇలా ఇవ్వటానికి నిభంధనలు ఏమయినా ఉన్నాయ్యా?

    పుస్తకం నిర్వాహకులు సమాధానం ఇవ్వగలరా, లేక మార్థాండ తోనే మాట్లాడించటం పాలసీ లో భాగమా? :))

    మాడరేషన్ పెట్టి, అడగను వాళ్లు సమాధానాలు ఇస్తుంటే, అనవసరం గా దూరి, దానిని allow చేయటం కూడా మాడరేషన్ లో భాగమేనా?

  4. Marthanda

    కులం పేరుతో బురద జల్లిన వ్యక్తి యొక్క ఐ.పి. అడ్రెస్ లీక్ చెయ్యడం ఏమాత్రం తప్పు కాదు. ఈ విషయంలో పుస్తకం.నెట్ వాళ్ళకి పాలసీ పేరుతో ప్రశ్నలు అడగడం అనవసరం. SMF లాంటి ఫోరం సాఫ్ట్ వేర్స్ వాడే వాళ్ళకి కూడా ఐ.పి. అడ్రెస్ లు కనిపిస్తాయి. పుస్తకం.నెట్ కమర్షియల్ వెబ్ సైట్ కాదు. ఐ.పి. అడ్రెస్ లు లీక్ చేస్తే వాళ్ళకి ఏమి వస్తుంది? ఈ విషయం ఇంతకు ముందే స్పష్టంగా చెప్పాను. కులం పేరుతో బురద జల్లే వాళ్ళ ప్రైవసీ గురించి పుస్తకం.నెట్ బాధ్యత తీసుకోవలసిన అవసరం లేదు.

  5. krishna

    మార్థాండా, నేను అడుగుతున్నది, పుస్తకం లాంటి సైట్ లకు వాళ్ల వాళ్ల రీడర్ల IP అడ్డ్రెస్స్ లు షేర్ చేసుకోవటానికి, సాధారణం గా ఓ పాలసీ అంటూ ఉంటుంది, అలాంటిది ఏమయినా ఉన్నదా అని? ప్రస్తుతానికి నాకో రీడర్ ip అడ్డ్రెస్స్ కావాలి, కావాలంటె, ఏ మెయిల్ కు మెయిల్ పంపాలి? form ఏమైనా fill చెయ్యలా? రుసుం ఎమైనా ఉన్నదా దానికి అని?
    నేను అడిగిన (IP) ఇవ్వటానికి వాళ్ల పాలసీ ఏమిటి అని? చూడబొతే పుస్తకానికి మీకు అనుబంధం బాగానే ఉన్నట్లువుంది. మీరేమయినా వాళ్ల admin అయితే(మాత్రమే) ఆ పాలసీ ఎమిటొ తెలిస్తే చెబుతారా?

    నేను కేవలం ఓ పాఠకుడుగా ప్రశ్న అడుగుతున్నాను, నిర్వాహకులను (మాత్రమే). దానికి మీరు నిర్వాహకులు కాకపొతే ఆ పాలసీ గురించి సమాధానం ఎల చెప్పగలుగుతున్నారు?, దీని (పాలసీ) గురించి మీదగ్గర డాక్యుమెంట్ ఎమైనా ఉంటే షేర్ చేసుకోగలరా? లింక్ ఇచ్చినా పర్వాలేదు. (may be I have missed it, on this site)

    ఇక IP లు బయటపడతాయి అని భయపడే వాడిని మాత్రం నేను కాదు అని చెప్పగలను. దానికి తొడలు మాత్రం కొట్టమని అడగవద్దు. :))

  6. చివుకుల కృష్ణమోహన్‌

    మా వెబ్సైటు. మా ఇష్టం. నచ్చితే రండి. లేకుంటే రాకండి. అన్న విషయాన్ని బాగా చెప్పారండి. పెద్దగా కామెంటినా కామెంటకున్నా పుస్తకాన్ని తరచు దర్శించేవాళ్ళలో ఒకడిని. పుస్తకం తాలూకు ఆశయాలూ, ఆకాంక్షలనుంచి చాలా దూరంగా జరిగే పాలసీ మార్పు ఈ నిర్ణయమనుకుంటా. ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో మీ సాధకబాధకాలు చాలా ఉండే ఉంటాయి – మీ ముందుండే తోవల్లో సులభమైన తోవని ఎన్నుకొని, పుస్తకాన్ని మన వేదికనుంచి, మీ బ్లాగుగా మార్చేసారు. అభినందనలు.

    రెండవ విషయం. మీరు మరీ ఎక్కువ బాధ్యతను నెత్తికి ఎత్తుకున్నారేమో. ఎందుకంటే ఇకమీద ప్రచురింపబడే ప్రతీ వ్యాఖ్యకూ వ్యాఖ్యాత కాకుండా మీరే బాధ్యత వహిస్తున్నారుగా. ఇప్పటిదాకా ఇలా ఎలా రాసారంటూ వ్యాఖ్యాతని అడిగేవాళ్ళంతా ఎలా ప్రచురించారని మిమ్మల్నే ప్రశ్నిస్తారు. ఆ బాధ్యత మీమీదనెత్తుకున్న మీరు వ్యాఖ్యలని అనుమతించే ముందు ఎలా ప్రవర్తిస్తారో ఆలోచించడం అంత కష్టం కాదు.

    మూడు. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ వచ్చి నాకు కావల్సిన వారి మెయిలు ఐ.డి. తీసుకోవడం చాలా సులభం చేసిపెట్టారండీ. అశ్లీల పదాలున్న కామెంట్లని మోడరేట్ చెయ్యడానికీ, మీరు తీసుకున్న ఈ నిర్ణయానికీ మధ్య చాలా తేడా ఉందనుకుంటాను.

    ఏమైనా ఒక సమూహం పాల్గొనే ఒక వేదికని నిర్వహించే విధానం ఇదేనంటారా?

    దీనంతటికీ మీదగ్గర ఒక సులభమైన, సమాధానం ఉందండీ. అది మీకు గుర్తు చేస్తాను. ఇది మా వెబ్సైట్. మేము దీనిని మాకు నచ్చినట్టు నడుపుకుంటాము. ఇదే సమాధానం ఇంతకు ముందు మన కూడలి వారు కూడా ఒకసారి చెప్పినట్టు గుర్తు. (రాకేశ్వరరావుగారూ! ఉంది చూసారూ!!) ఒకవేళ అదే మీ సమాధానమైతే ఈ వ్యాఖ్యని ప్రచురించనక్కరలేదు. కాదేమో అన్న ఆశతో వ్యాఖ్యానిస్తున్నాను.

    నా స్నేహితుడొకసారి అన్నాడులెండి – ఒకవేళ మనమీ స్వాతంత్ర్యానికి అర్హులం కాకపోతే, దానిని మనం కోల్పోక తప్పదు అని.
    చివరిగా… నేను మహేష్ గారి వివాదానికి సంబంధించి ఏ విధమైన వ్యాఖ్యనూ చేయలేదు. ఇక్కడ నేను కేవలం పుస్తకం అభిమానిగా నా అభిప్రాయాన్ని పంచుకున్నాను. దీనిలో వాక్యాలనుంచి నేను ఆయనపక్కో, వెనకో, ముందో,ఎదురో ఉన్నాననే ఎక్స్ట్రా పొలేషన్లు చేయవద్దని ప్రార్థన.

  7. Marthanda

    పుస్తకం.నెట్ వాళ్ళకేమీ హిడెన్ అజెండా లేదు. వాళ్ళ తరపున ఎవరైనా సమాధానం చెప్పొచ్చు. తప్పుడు సమాచారం వ్రాసే వాళ్ళు తమ ఐ.పి.లు బయట పడతాయని భయపడితే వాళ్ళకి ఎవరూ సహాయం చెయ్యాల్సిన అవసరం లేదు.

  8. krishna

    మార్తాండా, నేను అడుగుతుంది పుస్తకం నిర్వాహకులను వాళ్ల పాలసీల గురించి. దానిని బట్టి పుస్తకానికి రావలో, వద్దో, వస్తే కామెంట్ వేయాలో వేయకూడదో నిర్ణయించుకుంటాం.

  9. Marthanda

    ఐ.పి.లు అమ్ముకోవలసిన అవసరం పుస్తకం.నెట్ వాళ్ళకి లేదు. పుస్తకం.నెట్ కమర్షియల్ వెబ్ సైట్ కాదు. naukri.com లాంటి కమర్షియల్ వెబ్ సైట్లు ఈ-మెయిల్ అడ్రెస్ లని స్పామర్లకి అమ్ముతాయి. ఐ.పి. అడ్రెస్ లు అమ్మితే ఎవరు కొంటారు? కులం పేరుతో దూషించిన వ్యక్తిని తప్పు పట్టకుండా అలా దూషించిన వ్యక్తి యొక్క ఐ.పి. బయట పెట్టిన వాళ్ళది తప్పు అనడం హాస్యాస్పదం.

  10. krishna

    అలగే,మాకు నచ్చని వాఖ్యలు వ్రాసే వాళ్ల IP అడ్డ్రెస్స్ లు కావాలంటే, ఎక్కడ కొనుక్కొవాలి (సారీ, షేరింగ్ కు ఎవరిని అడగాలి), చలానా లాంటిది ఎమైన కట్టాలో తెలియచెస్తే బాగుంటుందేమో కదా!!

    P.S., ఇప్పుడు నా IP అడ్డ్రెస్స్ అమ్ముకొంటరా? అలా అమ్ముకోవటానికి ఎమైనా నా అనుమతి కావలా, అమ్ముకోవటం ద్వారా వచ్చిన రాయల్టీ (డబ్బు రూపం లో కానీ, ఇంకో రూపం లో కానీ) లో, నా కేమయినా వాటా ఇస్తారా?

  11. అబ్రకదబ్ర

    ఎటూ నియంత్రణొకటి పెడుతున్నారు కాబట్టి, చర్చకి సంబంధం లేని వ్యాఖ్యల్ని – అవెంత సభ్యమైన భాషలో ఉన్నా – నిరాకరించే విషయాన్ని కూడా పరిశీలించండి.

  12. Marthanda

    సింధు వ్రాసిన వ్యాసం మొత్తం చదివితే ఆమె చలం గారి సాహిత్యాన్ని బూతుతో పోల్చినట్టు అనుమానం వస్తుంది. KNT శాస్త్రి తీసిన “తిలదానం” సినిమాలో కూడా బూతు లేదు. కేవలం బ్రాహ్మణత్వ సంప్రదాయాలకి వ్యతిరేకంగా సినిమా తీసినందుకే ఆ సినిమాని సెన్సార్ చేశారు. బూతు లేకపోయినా సామాజిక కట్టుబాట్లని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సినిమాలు తీస్తే సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వరు. “తిలదానం” సినిమా కూడా సామాజిక కట్టుబాట్లని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీసినదే. సామాజిక కట్టుబాట్లపై వ్యతిరేకత చూపించే డిగ్రీలో “తిలదానం” సినిమాకీ, “మైదానం” నవలకీ మధ్య పెద్ద తేడా లేకపోవచ్చు. అయినా సెన్సార్ బోర్డ్ వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనే పాయింట్ ఇక్కడ అనవసరం. ఎందుకంటే కొన్ని విషయాలని సెన్సార్ బోర్డ్ వాళ్ళు అంగీకరించకపోయిన అందులో కొంతైనా న్యాయం కనిపిస్తుంది. నేను “తిలదానం” సినిమా కథ పత్రికలలో చదివాను. ఆ కథ గొప్ప కథే. ఆ కథలో తండ్రి పక్కా సంప్రదాయవాద బ్రాహ్మణుడు, కొడుకు కులం కట్టుబాట్లని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైరుధ్యాలు లేని సమాజం స్థాపన కోసం నక్సలైట్ ఉద్యమంలో పని చేసే వ్యక్తి. సెన్సార్ బోర్డ్ లో కూడా కులం కంపు ఉండడం వల్ల “తిలదానం” సినిమాని సెన్సార్ చేశారు. సెన్సార్ బోర్డ్ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు వ్రాయడం అనవసరం అని సింధుకి ఎందుకు అనిపించలేదు? సెన్సార్ బోర్డ్ వాళ్ళు కూడా ఈ సమాజంలోని సభ్యులే. మెజారిటీ ప్రజలలో ఉన్న సంకుచిత నమ్మకాలు సెన్సార్ బోర్డ్ సభ్యులలో కూడా ఉండగలవు, ఈ విషయం సింధుకి తెలియదు అనుకోవాలా?

  13. కె.మహేష్ కుమార్

    @మార్తాండ: మీరు సిందుగారి వ్యాఖ్యానాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారనిపిస్తోంది.”ఐనా ‘మైదానం’ తీస్తే movie మొత్తం censor ఐపోతుంది.” లాంటి కొన్ని వాక్యాలు బహుశా మీకు ఆ భావనని ఇచ్చుండొచ్చు.

    ప్రస్తుతం ఉన్న సెన్సారు నిబంధనల ప్రకారం ఎవరైనా యావరేజ్ ఫిల్మ్ మేకర్ మైదానం (కేవలం భౌతికజగత్తులో జరిగిన ఘటానగా)తీస్తే ఖచ్చితంగా సెన్సార్ అవుతుంది. అందుకు చర్యల్ని కాకుండా భావనల్ని చిత్రీకరించగలిగే స్థాయి సినీదర్శకులు బహుశా మనకు లేకపోవడమే కారణమవుతుందేతప్ప, చలం మైదానం బూతవుతుందని కాదు అర్థం.

    ఒక ఉదాహరణ చెబుతాను. ఫ్రాన్జ్ కాఫ్కా రాసిన ‘మెటామార్ఫాసిస్’(http://en.wikipedia.org/wiki/The_Metamorphosis) లో ఒక మనిషి పురుగుగా మారిన తరువాత తన జీవితంలో వచ్చే మార్పు కథాంశం. ఎవరూ ఈ కథను సినిమాగా తియ్యలేరు అనేది కొన్నేళ్ళుగా సాగిన వాదన. ఎందుకంటే it defies all possible existing film grammar at this point. కానీ 2007 లో అనుకుంటాను ఒక రష్యన్ దర్శకుడు ఈ చిత్రాన్ని తీశాడు. Unbelievable! amazing!! ఫిల్మ్ టెక్నాలజీలో తేడా రాకపోయినా ఈ దర్శకుడు తన imagination ఈ కథను ఎంత బలంగా చిత్రీకరించాడంటే…కూర్చుని చూడాల్సిందే.అలాంటి vision ఉన్న దర్శకుడు మనకు దొరికితేగానీ మైదానం సినిమాగా రాలేదు. మామూలువాళ్ళు తీస్తే మాత్రం వచ్చినా ఖచ్చితంగా సెన్సార్ చెయ్యబడుతుంది.

  14. Marthanda

    సింధు చలం గారి సాహిత్యాన్ని అనవసరంగా బ్లూఫిలింస్ తో పోల్చడం అభ్యంతరకరంగానే ఉంది. అందుకే నేను ఆమెని విమర్శించాను. చలం గారిని ఒక prophetగా, messiahగా ఆరాధించే నాకు అతని పై చేసే వ్యక్తిగత విమర్శలకి అభ్యంతరం చెప్పే హక్కు ఉంది. నేను చలం గారి సాహిత్యాన్ని పూర్తిగా చదివాను. అతని సాహిత్యానికి బ్లూఫిలింస్ తో పోలిక ఉందని నేను అనుకోను.

  15. కె.మహేష్ కుమార్

    @గోపాలరాజు/భాస్కర రామరాజు: నా వ్యాఖ్యకు అశ్లీలత ఆపదించడం అసంబద్ధం. నేనిచ్చిన వివరణ psycho analysis లో భాగంగా Oedipus complex (http://en.wikipedia.org/wiki/Oedipus_complex) కి సంబంధించింది. సాహితీవిమర్శనలో సైకో అనాలసిస్ ఒక tool. ఆ ప్రాతిపదికన నేను చేసిన విశ్లేషణను మీరు బూతు అనుకుంటే అది మీ ఇష్టం.ఆ హక్కు మీకుంది.

    విషయ చర్చలు మానేసి వ్యక్తిగత నిందలు చేస్తే ఎవరైనా ఎందుకు అంగీకరించాలి? నన్నుగానీ పుస్తకం సంపాదకులనుగానీ నిందించడం ఆమోదయోగ్యం కాదు. మీరు చేసింది అదేకాబట్టే పరిస్థితి ఇంతవరకూ వచ్చిందని గ్రహించగలరు.

  16. పుస్తకం.నెట్

    గోపాలరాజు గారు:

    మీరు ఉదహరించిన దానినే తీసుకుంటే, ఓ మనిషి అభిప్రాయంతో (వ్యక్తిగతంగా మేం విభేదించినా) మాకు సమస్యలు లేవు. ఓ అభిప్రాయాన్ని సైటులో ఉంచుతున్నాం అంటే దానిని మేం ఆమోదిస్తున్నాం అని కాదు. ఆ అభిప్రాయాన్ని వ్యక్త పరిచే తీరును బట్టే మాకు సమస్యలు వస్తున్నాయి. వారు ఒకటి అన్నారు, మీరు దాన్ని విమర్శించారు. అది కాదు మా సమస్య. మీరు విమర్శించిన తీరు. మీరు ప్రతిపాదించిన దాన్ని మాత్రమే విమర్శించి ఉంటే, మాకు ఏ అభ్యంతరాలు ఉండేవి కావు.

    మీరు అడిగారు కావున, మా విధానాన్ని స్పష్టం చేశాం. And whatever we’re doing is not to show your ownership on the site. We’re more than happy to be without constraints. అలా అని చూస్తూ చూస్తూ, సైటులో అభ్యంతరకర వ్యాఖ్యలని ఉంచబోము.

    చావాకిరణ్ గారు,

    “వ్యాఖ్యాతలు మరీ అంత విజ్ఞత లేని వాళ్లు కాదు.” – మేమూ ఆ విషయాన్ని నమ్మటానికే ప్రయత్నించాము. అందుకే ఆర్నెళ్ళ గడువులో ఈ ప్రతిపాదన చేయలేదు. కళ్ళ ముందు నిజాన్ని గుడ్డిగా విస్మరించలేకపోవటంతో ఇప్పటికైనా ఈ చర్య తీసుకున్నాం.

    “స్వేచ్చ లేని చోట జనాలు ఎందుకు వ్యాఖ్యానిస్తారు?” – అది జనాలకే వదిలేద్దాం.

    “అయినా ఎన్ని వాఖ్యాలు అని మోడరేట్ చేస్తారు?” – వచ్చినన్ని, మాకు కుదిరినన్నీ..

    “ఇదేమీ మీకు ఫుల్ టైం జాబ్ కాదు కదా.” – Thank God! At least somebody has an understanding of that.

    “You are simply building a platform, rest is given to mature readers” – That is where it is hurting us more. We wanted it to be open platform, but that said we can’t let it go filthier. We understand that this not one man’s show, and we don’t want anybody hesitating to write for pustakam because they may have to face “obscene” content.

    ప్రభాకర్ గారు,

    పై చెప్పినట్టు, అభిప్రాయలతో మాకు సమస్యలు లేవండీ.. వాడే భాషపైనే, వాటిని వ్యక్తపరిచే తీరు పైనే!

  17. Prabhakar Mandaara

    “…మీ అభిప్రాయాలతో నేను ఏమాత్రం ఏకీభవించక పోయినా
    మీ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేసే మీ హక్కు ను గౌరవిస్తాను. దానిని కాపాడేందుకు నా శాయశక్తులా పోరాడుతాను….” (?)
    That is the spirit.

    ప్రత్యేకించి బ్లాగులు, వెబ్ పత్రికలు నిర్వహించేవాళ్ళకి ఆ స్పిరిట్ తప్పకుండా వుండాలి.
    ప్రచురించినా ప్రచురించక పోయినా అన్ని కామెంట్స్ ని మీరు చదవనైతే చదువుతారు కదా. !
    ఆ పనే పాఠకులు చేస్తారు. మీ లాగే పాఠకులు కూడా అన్నీ చదివి అర్ధం లేని వాటిని విసర్జిస్తారు.
    ఇందులో ఆంత హైరానా పడవలసిన్దేముంది.?

  18. chavakiran

    ఇది చాలా చెత్త నిర్ణయం.
    వ్యాఖ్యాతలు మరీ అంత విజ్ఞత లేని వాళ్లు కాదు. స్వేచ్చ లేని చోట జనాలు ఎందుకు వ్యాఖ్యానిస్తారు ? అయినా ఎన్ని వాఖ్యాలు అని మోడరేట్ చేస్తారు? ఇప్పుడంటే ఒకటి రెండు వ్యాఖ్యలు కాబట్టి పర్వాలేదు, కాని తరువాత నిజ్జంగా పుస్తకం పేరు ప్రఖ్యాతలు పెరిగి పొయ్యి ఎక్కువ కామెంట్లు వస్తే? ఇదేమీ మీకు ఫుల్ టైం జాబ్ కాదు కదా. ప్రతి వ్యాఖ్యా ఒక ఉదయించే సుర్యుడు, అరచేత్తో అయ్యగారు నిద్రలేచేదాకా సుర్యుణ్ని ఆపితే ఎలా ? తుఫాన్ వచ్చినప్పుడే ఇంకొంచెం గట్టిగా ఉండాలి. You own pustakam.net not the content here – relaize it ASAP. dont’ worry too much about everything happens here. You are simply building a platform, rest is given to mature readers, if they want kathakkali they can play kathakkali on this platform or Ramayana if they want Ramayana.

    alas

  19. గోపాలరాజు

    అదే నిజమైతే నేను చం”చలం” టపాలో మహేష్ కుమార్, మార్తాండ లకు ఇచ్చిన సమాధానాల్ని ఎందుకు ప్రచురించలేదు?
    మహేష్ రాసిన -మగపిల్లలు ఎప్పుడూ తల్లి పట్ల చాలా పొసెసివ్ ప్రవర్తిస్తారు. తండ్రి తల్లి పక్కన చేరడాన్ని సహించలేరు. తల్లి స్పర్శకోసం, ప్రేమకోసం తండ్రితో పోరాడతారు.(మీరు దాన్ని కామించటం, శారీరకంగా లొంగదీసుకోవటం అన్నారు) తండ్రి నుంచీ తల్లిని కాపాడాలనుకుంటాడు.

    అనే మాటల్లో తప్పుకనపడని మీకు, నా పోష్టులో ఏమి తప్పుకనిపించిందీ?

    This is your site, you are the Admin for the site, you can filter the comments as you like. I dont have any problem with that, but at the end of the day, try to justify yourself. Be clear to yourself. You dont have to be answerable to me but.

    Every writer and reader cannot be a Katti Mahesh Kumar. Try to respect the reader.

  20. సుజాత

    అభిప్రాయాలతో విభేదించడం వేరు, అది సరైన పద్ధతిలో వ్యక్తీకరించలేక అసంబద్ధ దాడులకు తెగబడటం వేరు.
    చక్కని నిర్ణయం తీసుకున్నందుకు అభినందనలు! సుజాత

  21. srinu.kudupudi

    mee nirnayam bagundi.

  22. kudupudi. srinu

    మీ నిర్ణయం బాగుంది.కానీ నిష్పక్షపాతం గా ఉండాలి ,అసభ్యతను ఖండించాలి కానీ అసలు విసయాన్ని దాచొద్దు .అవసరమైతే అసభ్య పదాలని ఎడిట్ చేసి వాళ్ళ ఆవేదనని ప్రచురించండి .

  23. సింధు

    “పుస్తకం” ప్రస్థానంలో చెప్పుగోదగ్గ మైలురాయి ఇది.

    అయితే నా వైపు నుండి ఒక విన్నపం: ” పోస్టుకు సంబంధం లేని, లేదా పోస్టును, రచయిత ఉద్దేశాన్నీ వక్రీకరిస్తూ వచ్చిన వ్యాఖ్యలని ఉపేక్షించవద్దని మనవి.”

    మీరు “దిద్దుబాటు” నిర్ణయానికి కారణం చెప్పారు. బావుంది. అలాగే, నా మనవికి కారణం కూడా చెప్తున్నాను. ” చం’చలం’-మైదానం ” పేరుతో నేను రాసిన వ్యాసానికి స్పందిస్తూ ఒక పెద్దమనిషి.. ‘ వాళ్ళ ఊరిలో పోలీస్ స్టేషన్ వెనుక బూతు సినిమాల థియేటర్ పై ఉన్న ఆగ్రహాన్నీ, దాన్ని వ్యతిరేకించని వారిపై [ఆ ప్రేక్షకపాత్రధారుల్లో ఆయనకూడా ఒకరైనప్పటికీ] ఆగ్రహాన్నీ కూడా నాపైనె వెళ్ళగక్కారు. “అరుంధతి” చిత్రానికి సెన్సార్ సర్టిఫికేషన్ లో నా ప్రమేయం ఎంతమాత్రం లేదూ అని నేను మొత్తుకున్నా, ఆయన లక్ష్యపెట్టాకుండా, తన అసంబద్ధ వ్యాఖ్యాస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు.

    దీనికి కలత చెంది మీ దృష్టికి తెచ్చే ఉద్దేశ్యంతోనే ఈ వినతి.

  24. Vamsi

    very true@”Small wonder that there is frustration all around. Intelligent men are prone to get violent in their words; and the unintelligent tend to become violent in their deeds”…and @చెప్పదల్చుకున్నది చెప్పలేకపోతున్న నిస్సహాయతలో విషయాన్ని పక్కకు నెట్టి, ఆక్రోశాన్ని వెల్లిబుచ్చడమే తప్ప!

    to check the validity of above statements, plz read the post once again:)..

    –Vamsi
    P.S: I hope my comment gets pass marks:D(btw, how many marks should i get…is it 35% or 100% or some magic number decided by moderators:p)
    P.S1: I hope I conveyed what i “really” wanted to “at this moment”…perhaps i should ponder over, as suggested by moderators, on what to convey and how to convey for 2 days (some magic number…perhaps moderators should suggest a number for this too) and then come back and write the comment…
    P.S2: what a coincidence… just read this article then read this post…
    http://thedailytamasha.wordpress.com/2009/06/18/rediff-message-board-gets-first-ever-decent-comment/
    P.S3: do “P.S”‘s also go through moral-police??..ouch…sorry they are called moderators…right??;p

  25. గీతాచార్య

    భేషైన నిర్ణయం. అసంబద్ధ రాతల్ని తగ్గించవచ్చు. కానీ వ్యతిరేక వ్యాఖ్యల పైన నిష్పక్షపాతంగ వ్యవహరిస్తారని ఆశిస్తూ…

    గీతాచార్య

  26. పుస్తకం.నెట్

    గోపాలరాజు గారు:

    ఇది ఏ ఒక్క వ్యక్తిని సమర్థించడానికో తీసుకున్న నిర్ణయం కాదు. ఇది ఏ ఒక్క వ్యక్తినో అడ్డుకొనే లేక కాపాడే ప్రయత్నం కాదు. విభేధించడం పై కానీ, నిలదీయడం పై కానీ, ఒకరిని ప్రశ్నించడం పై కానీ మాకు అభ్యంతరాలు లేవు. అలా అని అసభ్యంగా రాస్తే మాత్రం ఆ వ్యాఖ్యలకి ఇక్కడ చోటుండదు.

  27. గోపాలరాజు

    అనగా కత్తి లాంటి మేధోవేత్తలు పండితులు రాసినవి ప్రచురిస్తారు, దాన్ని నిలదీసిన వాళ్ళ వ్యాఖ్యల్ని ఆపేస్తారన్నమాట. బాగుంది. నవతరంగం కత్తి వారిదైపోయింది. ఇక ఇప్పుడు పుస్తకం కూడా అన్నమాట. ఇక మాలాంటి వాళ్ళు ఇటువైపుకి రావడం అనవసరం అన్నమాట.
    బాగుంది. కానివ్వండి.
    జై కత్తి. జై భజన.

Leave a Reply