విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలు(ప్రింటు పుస్తకాలు)ఇప్పుడు మీ కినిగె.కామ్‌లో

ప్రకటన పంపినవారు: కినిగె.కామ్

తెలుగువారికి తొలి జ్ఞానపీఠాన్ని అందించిన కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి అద్భుత రచనలు ఇప్పుడు కినిగెలో ప్రింటు బుక్సుగా లభిస్తున్నాయి. కినిగె ద్వారా ఆర్డరు చేసుకొని పుస్తకాలను మీ ఇంటికే తెప్పించుకోండి!

విశ్వనాథ వారి ఏ రచన అయినా సరే భారతీయ ఆత్మను, జీవుని వేదనను ప్రతిబింబించేదే. ప్రతీ అక్షరంలోను అసాధారణ ఊహాశక్తిని, అద్భుత రచనాశైలిని నింపి పాఠకుల హృదయాలలోకి పరుగులెత్తించగలిగిన శక్తి ఆయన సొంతం. తెలుగు సాహితీవనంలో విశ్వనాథవారు స్పృశించని ప్రక్రియలేదు. ఆయన రచనలు ఏ విభాగానికి ఆ విభాగంగా కినిగెలో సెట్లుగా లభ్యమవుతున్నాయి.

విశ్వనాథ సత్యనారాయణ సంపూర్ణ నవలా సాహిత్య నిధి

పాశ్చాత్యులుచే వక్రీకరించబడిన భారత రాజవంశముల నిజచరిత్రను తెలియజేయడానికి విశ్వనాథ వారు ఎంచుకున్న వినూత్న మార్గం పురాణవైర గ్రంథమాల నవలలు. తెలుగు వారి మహాభారతంగా కీర్తించబడే వేయిపడగలు, కడుపుబ్బా నవ్విస్తూ ఆలోచింపజేసే విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు ఏకబిగిన చదివించే ఏకవీర వంటి మొత్తం 57 నవలలు కలిసి 50 పుస్తకాల సెట్టుగా లభ్యమవుతోంది.

ప్రత్యేకంగా ఆర్ట్ పేపర్ పై ముద్రించబడి, హార్డ్‌బౌండ్ తో రూపొందించబడిన లిమిటెడ్ ఎడిషన్ నవలల సెట్ విశ్వనాథ సత్యనారాయణ సంపూర్ణ నవలా సాహిత్య నిధి  హార్డ్‌బౌండ్ ఎడిషన్ కూడా కినిగెలో అందుబాటులో ఉంది.

విశ్వనాథ సత్యనారాయణ సంపూర్ణ విమర్శ గ్రంథ నిధి

మన కావ్యాలలోని అందాలను, విశేషాలను, కవుల చమత్కారాలను వివరించే  సాహిత్య సురభి, అల్లసాని వాని అల్లిక జిగిబిగి, కావ్యపరీమళము మొదలైన 10 విమర్శ గ్రంథములు మనల్ని ప్రాచీన కావ్యాల సౌందర్యపులోతుల్లోకి తీసుకువెళతాయి.

కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి పద్య సాహిత్య నిధి

నది నడకవంటి కిన్నెరసాని పాటల సొగసు తెలుగు వారి అదృష్టం, ఇక ఆంధ్ర ప్రశస్తి, గిరికుమారుని ప్రేమగీతాలు, విశ్వనాథ మధ్యాక్కరల వంటి ఎన్నెన్నో కావ్యాలతో పాటు అసంపూర్ణమే అయినా మనోహరమైన విశ్వనాథ వారి ఆత్మకథ కూడా ఈ సెట్టులో లభిస్తుంది.

శ్రీ విశ్వనాథవారి సంపూర్ణ నాటక సాహిత్య నిధి

అంతా నాటకమే, అనార్కలీ, వేనరాజు, గుప్తపాశుపతమ్ వంటి 15 సాంఘిక, చారిత్రక, పౌరాణిక, సంస్కృత నాటకములు, నందికంత పోతరాజు, యక్షుడి అప్పు వంటి 16 నాటికలు ఈ సెట్టులో లభిస్తాయి.

 

You Might Also Like

7 Comments

  1. sreedhar Rao T.

    naaku cheliyali katta navala pampinchagalaru.vivaraalu sreedhar.tholeti.1967@gmail.com ku telupagalaru.

  2. KIRAN KUMAR SAHU

    వేయి పడగలు పుస్తకాన్ని పంపించాలని కోరుకుంటున్నాను
    నా అడ్రస్ : KIRAN KUMAR
    C/O MOHAN RAO
    BRAHMAN BAZAR, MADHIRA 507203
    Ph :99480 29581

  3. P MOHANA RAO

    వేయి పడగలు పుస్తకాన్ని పంపించాలని కోరుకుంటున్నాను
    నా అడ్రస్ : P MOHANA RAO
    49 – 7 – 8/7, GURU KRUPA
    LALITHA TEMPLE STREET,
    AKKAYYAPALEM,
    VISAKHAPATNAM – 530 016
    Ph : 9985 490 204

  4. రామమోహనరావు ఆచంట

    వాసుదేవ. నా పేరు రామమోహనరావు ఆచంట. నివాసం గన్నవరం, కృ.జి. నాకు విశ్వనాథ ారి శ్రీద ్రామాయణ కల్పవృక్షంలోని బాలకాండ, అయోధ్యకాండ పంపించగలరు. ఖరీదు వివరములు rammrao123@gmail.com కు తెలియజేయగలరు.

    భవదీయుడు. …రామ మోహనరావు ఆచంట

  5. చీమలమరి రామారావు.

    నమస్కారం. నా పేరు చీమలమర్రి రామారావు Rtd teacher. గండి పాలెం.నెల్లూరు జిల్లా. నాకు సమీరకుమార విజయం అను పుస్తకం విపిపి ద్వారా పంప గలరు.కృతజ్ఞతలు.

  6. VR Murthy

    నమస్తే, నా పేరు మూర్తి . నేను విశాఖపట్టణం జిల్లాలో జర్నలిస్టుగా గా పని చేస్తున్నాను. నాకు విశ్వనాథ సత్యనారాయణ గారి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం పుస్తకం అందించగలరు. పుస్తకం పంపుటకు ప్రయత్నించ గలరు. కృతజ్ఞతలు.

  7. Lakshmisujatha DIVAKARLA

    నమస్తే, నా పేరు లక్ష్మీ సుజాత. నేను పశ్చిమ గోదావరి జిల్లాలో టీచర్ గా పని చేస్తున్నాను. నాకు విశ్వనాథ సత్యనారాయణ గారి పుస్తకం వేయి పడగలు అందించగలరు. పై పుస్తకం పంపుటకు ప్రయత్నించ గలరు. కృతజ్ఞతలు.

Leave a Reply