నరదేవుడి కథ

ఇజ్రాయెల్ కు చెందిన చరిత్రకారుడు యువల్ నోవా హరారీ వ్రాసిన Sapiens, Homo Deus అన్న రెండు పుస్తకాలు బహుళ ప్రజాదరణని పొందాయి. ఈ పుస్తకాల్లో మానవ చరిత్రనీ, భవిష్యత్తునీ ‘భావవాదపు…

Read more

ఇంద్రగంటి సాహిత్య సంచారం

ముత్తాతగారు సంస్కృత‌ వైయాకరణ సార్వభౌములు. రాజాస్థాన విద్వాంసులు. తాతగారు వ్యాకరణ పండితులే కాక సంస్కృతంలో గొప్ప కవి. తండ్రిగారికి తన బిడ్డని కూడా అటువంటి పండితుణ్ణి చెయ్యాలనే సంకల్పం. కుర్రవాడికి కోనసీమలో…

Read more

దూత మేఘము – విశ్వనాధవారి నవల

మేఘదూతంలోని మేఘం ఒట్టి ‘ధూమజ్యోతిస్సలిలమరుతాం సన్నిపాతః’ మాత్రమే. అంటే పొగా, నిప్పూ, నీరూ, గాలీ యొక్క కలయిక మాత్రమే. ఈ యక్షుడే కామార్తుడై, చేతన కలిగినదానికి, చేతన లేనిదానికీ మధ్య భేదం గ్రహించలేకపోతున్నాడు. పైగా ఆ మేఘం మగ మేఘం. అతనికో భార్య కూడా ఉంది. విద్యుల్లేఖ/సౌదామని – అంటే మెరుపుతీగ. ఆ కావ్యం అంతా శృంగారమయంగా ఉంటుంది. భార్య ఉన్నా కూడా ఈ మేఘుడు వెళ్తూ, వెళ్తూ దారిలో పల్లెలు తగిలితే ఆ పల్లెల్లో ఉండే స్త్రీల అమాయికమైన చూపులతో ఆదరించబడతాడు. ఉజ్జయిని వంటి పట్టణాలలో అయితే మెరుపుతీగలవంటి కన్నెలతో వినోదిస్తాడు. వాళ్ళు తమ కురులకి వేసుకునే ధూపాలతో వృద్ధిపొందుతాడు. దారిలో ఉండే నదులు శృంగార స్వరూపిణులై ఈ మేఘుడికి కనువిందు చేస్తూ ఉంటాయి.

Read more

తెలుగు కథలూ – నా అనుభవాలూ, అభిప్పరాయాలూ

కథలంటే ‘కాంతా సమ్మితాలు’. ఇంటావిడ సరైన సమయం, అయ్యగారి ‘మూడూ’ కనిపెట్టి, ప్రేమగా టిఫిన్ చేసిపెట్టి, మంచి కాఫీ ఇచ్చి, కిక్కెక్కేలా కబుర్లు చెప్పి – అప్పుడు టెండరు పెడుతుందే, అలా ఉండాలి కథంటే. తొందరపడి ముందే మేటరు లీకైతే అంతే సంగతులు…

Read more

మహాభారతానికి ఒక పంచనామా – పర్వ

ప్రసిద్ధ కన్నడ రచయిత ఎస్.ఎల్.భైరప్ప గారి ‘పర్వ’ నవల చదవడానికి నాకు ప్రేరణ కలిగించింది కత్తి మహేష్ కుమార్ గారి ఈ టపా. పుస్తక సమీక్షలు నాకు కొత్త కాబట్టి సమీక్షించే…

Read more