పుస్తకం
All about books


In The Spotlight 
 
 

 
4
comments
కవితలు - పద్యాలు

రావి రంగారావు మినికవితలు-పరిశీలన

Posted  January 3, 2010  by  అతిథి

వ్యాసం రాసినవారు: శైలజామిత్ర మినీ కవిత్వం అనగానే “The terrible brevity of life could demand more brevity of language”,” Poets are men who refuse to utilize language” అనే మాటలు గుర్తుకొస్తాయి.  వచనకవిత్వంలో అస్పష్టత, అనవసరమైన పొడిగింపు ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో మినీ కవిత్వం మనసుకు ఆహ్లాదాన్ని కలుగజేస్తోంది..కొందరు పత్రికల్లో స్పేస్ ఫిల్లింగ్ కు ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నా, మొత్తానికి  మినికవిత కవిత్వానికే నేడు ఆదర్శంగా నిలిచింది. ఇక నేటి […]

Full Story »

 
1
comments
పుస్తకలోకం

నన్ను ప్రభావితం చేసిన పుస్తకాలు

Posted  July 1, 2012  by  అతిథి

రాసిన వారు: రాంకి రాంకి – వ్యవసాయశాస్త్రంలో పట్టభద్రులై అభిరుచి కొద్దీ పత్రికారచనలోకి వచ్చారు. ప్రస్తుతం వీక్షణం సహాయ సంపాదకులుగా ఉన్నారు. ఈ వ్యాసం మొదట వీక్షణం పత్రిక జనవరి 2010 సంచికలో ప్రచురితమైంది. వ్యాసాన్ని పుస్తకం.నెట్లో తిరిగి ప్రచురించడానికి అనుమతించిన వీక్షణం సంపాదకులకి ధన్యవాదాలు – పుస్తకం.నెట్ ************** ‘ఆచరణ నుండి జ్ఞానం పుడుతుంది. ఆ జ్ఞానం కొత్త ఆచరణకు దారితీస్తుంది. కొత్త ఆచరణ మరింత కొత్త జ్ఞానానికి మరింత మెరుగైన ఆచరణలకు దారితీస్తుంది. జ్ఞానం […]

Full Story »

 
8
comments
పుస్తకలోకం

నెమరేసే పుస్తకాలు

Posted  October 17, 2010  by  రవి

చదవడం – ఈ విషయంలో చిన్నతనంలో నాకో అలవాటు ఉండేది. అదేమంటే, మిరపకాయబజ్జీలు కొన్నా కూడా ఆ బజ్జీల పొట్లం తాలూకు పేపరులో ఏదో విషయం ఉందన్న కుతూహలం. ఆ కుతూహలంతో కనబడిన పుస్తకాన్నల్లా చదివేవాణ్ణి. భోంచేసేప్పుడు కూడా పుస్తకం కరదీపంలా చేతిలో ఉండాలి. లేపోతే ముద్ద దిగదు. అయితే కండిషనేమంటే చదివే కంటెంటు మొత్తం తెలుగులో ఉండితీరాలి. ఆ అలవాటు నాకు ఉద్యోగంలో స్థిరపడిన రెండేళ్ళకు నన్ను వీడి వెళ్ళిపోయింది. కారణం – ఓషో. ఏ […]

Full Story »

 
9
comments
కవితలు - పద్యాలు

శ్రీ శ్రీ మహా ప్రస్థానం: కథనం,కదనం

Posted  January 12, 2010  by  అతిథి

రాసిన వారు: తమ్మినేని యదుకులభూషణ్ (ఢెట్రాయిట్ లో జరిగిన సభలో ఈ ఉపన్యాసం వీడియో ప్రదర్శించారు. శ్రీశ్రీ శత జయంతి సందర్భంగా ఈ వ్యాసం. – పుస్తకం.నెట్ ) ******************************************** శబ్దార్థాలు ప్రతి పదానికి అర్థం ఉంది.కానీ,ప్రాథమిక స్థాయిలో ప్రతి పదమూ ఒక శబ్దమే. కొత్తగా కవిత్వం రాస్తున్న వారు శబ్దం మీద మోజుతో దడెం హెచ్చుతగ్గుగా పదప్రయోగం చేస్తారు.అర్థగౌరవం వారికి ఆమడ దూరం. కవిత్వం ప్రధానంగా అర్థ ప్రధానం. సంగీతం ప్రధానంగా నాద ప్రధానం. శబ్దం […]

Full Story »

4
comments
ఆంగ్లం

The Lover’s Dictionary: A Novel

Posted  March 25, 2014  by  Purnima

పోయినవారంలో ఒకరు ఓ అమ్మాయి, అబ్బాయి మధ్యనున్న అపార్థాలను నాకు అర్థమయ్యేలా చెప్పడానికి ఒక పిట్టకథ చెప్పారు. మొదట బానే ఉందనిపించిందిగానీ, బైరాగి ఎక్కడో రాసినట్టు తర్వాతి రెండు రోజుల్లో  “తరంగాల తాడనలా (దాని) అర్థోద్ధతి సహించాను.” ఆ మూడ్ నుండి బయటపడ్డానికి ఆన్‍లైన్‍లో ఏదో చదవబోతే  “ది పారిస్ రివ్యూ”లో వచ్చిన ఈ ఇంటర్వ్యూ తగిలింది. ఆమె రాసిన కథలెలా ఉంటాయోగానీ, ఆమె చెప్పిన కబుర్లు మాత్రం బాగా నచ్చాయి.  అసలు ఆమె కథల పుస్తకం కొనాలనే […]

Full Story »

 
2
comments
జీవిత చరిత్రలు

మహానటి సావిత్రి : వెండితెర సామ్రాజ్ఞి-1

Posted  October 10, 2011  by  తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Who is the most respected woman figure in the entire history of Telugu film industry ? అని ఎవఱైనా తెలుగువాళ్ళని అడిగితే మనం చెప్పుకోక తప్పని పేరు మహానటి సావిత్రిది. ఆ విధంగా తెలుగువాళ్ళకి అభినయకళాపరంగా ఒక గొప్ప వారసత్వాన్ని ప్రసాదించి మన సంస్కృతిని పరిపుష్టం చేసిపోయిన మహామహురాలు ఆమె. ఆమె అందఱిలో ఒకఱు కారు. అందఱికీ కలిపి ఒక్కఱే. మహానటి గుఱించి మా తరంలోనే తెలిసింది తక్కువంటే ఇహ ఈ […]

Full Story »

 
23
comments
తెలుగు

కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణశాస్త్రి స్వీయచరిత్ర

Posted  March 27, 2010  by  మెహెర్

స్వీయకథనాల విషయంలో నచ్చడానికీ నచ్చకపోవడానికీ పుస్తకపరమైన కారణాలేం చెప్పలేం. ఎందుకంటే మనకు వాటిలో మిగతా పుస్తకాల్లా ఒక కల్పితప్రపంచం గానీ ఒక ఆలోచనాధార గానీ కనిపించదు, ఒక వ్యక్తి కనిపిస్తాడు. నిజాయితీగా రాసినంతవరకూ, ఆ వ్యక్తిని బట్టే అతని కథనం నచ్చడమూ నచ్చకపోవడమూ జరుగుతుంది. “ఫలానా వ్యక్తి స్వీయకథనం నాకు నచ్చలేదూ” అంటున్నానంటే “ఫలానా వ్యక్తి నాకు నచ్చలేదూ” అంటున్నట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలా సదరు వ్యక్తి నచ్చనపుడు ఇక ఆ స్వీయకథనంలో నిజాయితీ వున్నా దాన్ని […]

Full Story »

1
comments
ఆంగ్లం

Stiff: The Curious Lives of Human Cadavers – Mary Roach

Posted  October 16, 2017  by  అతిథి

వ్యాసకర్త: Naagini Kandala ****************** Stiff: The Curious Lives of Human Cadavers, అమెరికన్ రచయిత్రి మేరీ రోచ్ 2003లో రాసిన పుస్తకం. నాన్ ఫిక్షన్ విభాగానికి చెందిన ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు దీనికి నోట్ వద్దులే అనుకున్నాను. కానీ పుస్తకం ముగించాక ఆ అభిప్రాయం మార్చుకోడానికి కారణం రచయిత మేరీ రోచ్. మిగతా దేశాల సంగతి ప్రక్కన పెడితే మన భారతీయ సంస్కృతిలో మరణం అనేది ఒక సెన్సిటివ్ సబ్జెక్టు. మాట్లాడటానికి సహజంగా ఎవరూ […]

Full Story »

0
comments
పుస్తక ప్రదర్శన

హైదరాబాద్ బుక్ ఫెయిర్ -2015 వివరాలు

Posted  November 22, 2015  by  పుస్తకం.నెట్

ఏటేటా జరిగే హైదరాబాదు పుస్తక ప్రదర్శన ఈ యేడు 18-27 డిసెంబర్ మధ్యలో ఎన్.టీ.ఆర్. గ్రౌండ్స్ లో జరుగనుంది. వివరాలు ఇవిగో: Hyderabad Book Fair 2015 Venue: NTR Grounds, Near Indira Park, Hyderabad Dates: 18th to 27th December, 2015 Timings: Weekdays: 2 to 8.30 pm Sat, Sun & Holidays: 12 to 9 pm (వివరాలు పంపినందుకు కొసరాజు సురేష్ గారికి ధన్యవాదాలు. ఈ చిత్రం […]

Full Story »