పుస్తకం
All about books


In The Spotlight 
 
 

 
4
comments
తెలుగు

మేథ मॆ tricks

Posted  January 6, 2009  by  రవి

పైన పేరెక్కడో చూసినట్టు ఉందా? మీరు 80 వ దశాబ్దంలో వచ్చిన బాలజ్యోతి పత్రిక చదువుతూ వుండుండాలి. అప్పట్లో చందమామ, బొమ్మరిల్లు, తదితర పిల్లల పత్రికలకన్నా బాలజ్యోతి ఎక్కువ సర్క్యులేషన్ సాధించిన పత్రిక. నండూరి రామమోహన రావు గారు, శశికాంత్ శాతకర్ణి వంటి సంపాదకుల చేతుల్లో రూపుదిద్దుకున్నది. ఆ పత్రిక గడిచినంత వరకు, అందులో వచ్చిన ముఖ్య శీర్షిక అవసరాల రామకృష్ణారావు గారు నిర్వహించిన మేథ मॆ tricks.ఇందులో పాల్గొని నెగ్గిన వారికి అప్పట్లో బాలజ్యోతి నెలనెలా […]

Full Story »

17
comments
తెలుగు

వేమన విశ్వరూపం

Posted  January 6, 2009  by  తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

కేరళలో తామ్రపర్ణీనది ఒడ్డున కాణియార్‌లనే తెగ ఒకటుంది. వారు పొదిగ కొండల్లో నివసిస్తారు. వారి మాతృభాష మలయాళం. కాని వారు ఒక భాషని దేవతల భాషగా పిలుచుకుంటారు. ఆ భాషలోనే తమ పెళ్ళిళ్ళూ, పేరంటాలూ జరుపుకుంటారు. ఆపద వస్తే ఆ భాషలోనే శాంతులు కూడా చేయిస్తారు. ఆ భాష మఱింకేదో కాదు, మన తెలుగే. అసలు విషయం – కాణియార్లు అడుగడుగునా వేమన పద్యపాదాల్ని సుభాషితాలుగా గుర్తుచేసుకుంటారట కూడా ! వింటూంటే ఆశ్చర్యంగా ఉంది కదూ ? […]

Full Story »

18
comments
ఆంగ్లం

The Davinci Code

Posted  January 5, 2009  by  అసూర్యంపశ్య

“డావిన్సీ కోడ్” – ఇప్పుడు కూడా ఈ పేరు వినగానే మూడు-నాలుగేళ్ళ క్రితంలాగా “ఓహ్! ఆ పుస్తకమా!” అన్న familiarity తో కూడిన ఆసక్తి కలగలసిన అభిమానం ఎంతమందిలో కలుగుతుందో నాకు తెలీదు కానీ, 2004 లో నేను ఇంకా ఇంజినీరింగ్ చదువుతూ ఉన్నప్పుడు ఈ పుస్తకం ఓ సంచలనం. ఇది చదవలేదు అని ఎవరన్నా అంటే – “ఇది చదవలేదా నువ్వు? ఈ పుస్తకం? నిజం?” అని అనుమానంతో ఎదుటివారు ప్రశ్నిస్తే ఇబ్బందిగా మొహాలు పెట్టిన […]

Full Story »

12
comments
కథలు

మా అమ్మ చెప్పిన కతలు

Posted  January 4, 2009  by  రవి

మా పాపాయి కి మొన్నామధ్య 4 నెలలు నిండినయ్యి. వాళ్ళ అమ్మ, అమ్మమ్మ , పాపాయికి పాలతో బాటు రాగిబువ్వ అలవాటు చేయిస్తున్నారు. ఓ రోజు పాప బువ్వ తినకుండా మారాం చేసింది. అప్పుడేమో పాప అమ్మమ్మ, పాపను వడిలో కూర్చోబెట్టుకుని, పాపను ముందుకు వెనక్కీ ఆడిస్తూ, పాట పాడిందిలా. “ఊగు ఊగు గంగెద్దు ఉలవ కుడితీ పెట్టేము, పాఱాడు గంగెద్దు పాలబువ్వ పెట్టేము, పాఱిపో గంగెద్దు, తిరిగీ పట్టుకు వచ్చేము” …పాప ఏడుపాపి నవ్వింది. నాకో […]

Full Story »

35
comments
కథలు

దర్గామిట్ట కతలు

Posted  January 3, 2009  by  అతిథి

“దర్గామిట్ట కతలు” — ఈ పుస్తకం బావుంటుంది.. చదవమని చాలా మంది చెప్పారు.. అయినా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చా.. చివరికి మొన్నా మధ్య పుస్తకోత్సవం (బెంగళూరు) లో కూడా పెద్ద పట్టించుకోలేదు.. కొన్ని పుస్తకాలు తీసుకుని, కౌంటర్ దాకా వెళ్ళిన తరువాత హంపీ నుండి హరప్పా దాకా గుర్తుకు వచ్చింది.. మళ్ళీ వెనక్కి వచ్చా..  అది దొరకలేదు కానీ, ఈ పుస్తకం కనిపించింది.. తీసుకుందామా, వద్దా అని కాసేపు ఊగిసలాడి సరే ఎలా ఉంటుందో చూద్దామని […]

Full Story »

8
comments
కవితలు - పద్యాలు

గుంటూరు శేషేంద్ర శర్మ

Posted  January 2, 2009  by  chavakiran

రాసిన వారు: చావాకిరణ్ ************* ఈ పుస్తకం గురించి నేను చెప్పబోయే ముందు, పుస్తకం అట్టపై వెనక వ్రాసిన విషయం చదవడం బాగుంటుంది. “ఆధునిక తెలుగు కవిత్వానికి శేషేంద్ర అనే ఒక అభివ్యక్తి అలంకారాన్ని కానుక చేసి అద్వితీయ స్థానాన్ని పొందిన కవి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ. భాషలో, భావంలో దృక్పథ ప్రకటనలో కవి కుండాల్సిన నైతిక ధైర్యం ఆయన రాసిన ప్రతిపాదంలోనూ కనిపిస్తుంది. కవి సామాజిక, సాంస్కృతిక నాయకుడై జాతిని నడపాలని భావించిన శేషేంద్ర […]

Full Story »

17
comments
ఆంగ్లం

వివేకానందుని ఉత్తరాలు

Posted  January 2, 2009  by  Achilles

వివేకానందుడి గూర్చి చెప్పాలంటే ఎక్కడ ప్రారంభించాలో, ఎక్కడ ముగించాలో అర్థం కాదు. జ్ఞాపకాలు, అనుభవాలు అనుభూతులు ఒకటా రెండా! పేరు వినగానే నరాల్లో రక్తం పరుగులు తీస్తుంది. చిమ్మ చీకటిని నిట్టనిలువునా చీల్చే విద్యుల్లతనొకదానిని మానవ శరీరం లో బంధించారేమో అన్నట్లుండే రూపం,విషయాన్ని చూడగానే దాని మర్మాలను తెలుసుకోగల అపారమైన మేధస్సు, చేతిలో చిల్లిగవ్వకూడా లేకున్నా ఒక గొప్ప సంస్థను నిర్మించిన కార్యదక్షత, నమ్మినవాటికోసం ప్రపంచం మొత్తాన్ని ధిక్కరించి నిలబడగల సత్తా… నిద్రాణమైన ఒక జాతిని మొత్తము […]

Full Story »

 
7
comments
ఆంగ్లం

The God Delusion

Posted  January 1, 2009  by  అసూర్యంపశ్య

“The God Delusion” అన్న పుస్తకం రిచర్డ్ డాకిన్స్ రచించిన ప్రసిద్ధి చెందిన పుస్తకం. ఈ పుస్తకాన్ని నాస్తికత్వపు భగవద్గీతలాగా వర్ణిస్తూ కూడా ఉంటారు చాలామంది. డాకిన్స్ విషయానికొస్తే ఆక్స్‍ఫోర్డ్ విశ్వవిద్యాలయం లో ఆచార్యులుగా ఉన్నారు ప్రస్తుతం. 70లలో “The selfish gene” ద్వారా ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. తరువాత కూడా ప్రధానంగా డార్విన్ సిద్ధాంతం ద్వారా సృష్టిని అర్థం చేసుకోవడం, సృష్టికర్త ఉన్నాడు అన్న వాదనకి వ్యతిరేకంగా పరిశోధన చేయడం ద్వారా డాకిన్స్ ప్రపంచవ్యాప్తంగా […]

Full Story »

11
comments
కథలు

అచలపతి కథలు

Posted  January 1, 2009  by  సౌమ్య

అచలపతి కథలు గురించి కొన్నాళ్ళ క్రితం విన్నాను. వుడ్‍హౌజ్ తరహా హాస్య కథలు అన్న క్యాప్షన్ గుర్తు ఉంది.  నిజం చెప్పాలంటే, ఆ క్యాప్షన్ చూసే నాకు ఇన్నాళ్ళూ ఆ కథలు చదవాలనిపించలేదు. కానీ, ఎమ్బీయస్ ప్రసాద్ “పడక్కుర్చీ కబుర్లు” సిరీస్ మీద ఉండే ఇష్టం కొద్దీ, ఆయన రాసిన ఈ కథల్ని చివరికి చదివాను. ఇవి వుడ్‍హౌజ్  తరహా కథలో కాదో నాకు తెలీదు కానీ, అచ్చమైన తెలుగు కథలు. వుడ్‍హౌజ్ కథలు నేనెప్పుడూ చదవలేదు […]

Full Story »