పుస్తకం
All about books


In The Spotlight 
 
 

2
comments
కథలు

డి. కామేశ్వరి కథలు

Posted  February 2, 2009  by  Somasankar Kolluri

వ్యాసం పంపినవారు: కొల్లూరి సోమ శంకర్ ప్రముఖ రచయిత్రి డి. కామేశ్వరి రాసిన 32 కథల సంకలనం ఇది. ఆవిడ వెలువరించిన సంకలనాలలో ఇది పదవది.  ఈ సంకలనంలో, ఆవిడ ఇతర సంకలనాలాలో చోటు చేసుకున్న కథలూ ఉన్నాయి. వర్తమాన సాంఘిక, ఆర్ధిక, రాజకీయ స్థితిగతులని తెలియజేసేది సాహిత్యమని రచయిత్రి గట్టిగా నమ్మారు.  అందుకే వివిధ సంవత్సరాలలో ప్రచురితమైన కథలని ఈ సంకలనంలో చేర్చారు.  ఇందులో 1965 -2008 మధ్య వివిధ పత్రికలలో ప్రచురితమైన కథలు ఉన్నాయి. […]

Full Story »

0
comments
పుస్తకం.నెట్ ప్రకటనలు

పుస్తకం.నెట్ ఫిబ్రవరి ఫోకస్ – శ్రీశ్రీ

Posted  February 1, 2009  by  పుస్తకం.నెట్

“ఈ శతాబ్దం నాది” అని ప్రకటించి, అన్నమాటని నిలబెట్టుకున్న ‘మహాకవి’ శ్రీశ్రీ గురించి ప్రత్యేక పరిచయం అనవసరం అనిపిస్తుంది. సాహిత్యం చదివే అలవాటుందా లేదా అన్న విషయం పక్కన పెడితే “శ్రీశ్రీ”, “మహాప్రస్థానం” అన్న పేర్లని వినని తెలుగువారిని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఎక్కడో కానీ తగలరేమో. ఇప్పటికి మధ్య వయసులో ఉన్నవారిలో అయితే అసలు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదేమో. సినిమా ప్రియులకు కూడా శ్రీశ్రీ పరిచయమక్కర్లేని పేరు. శ్రీశ్రీ 1910 జనవరి రెండవ తేదీన […]

Full Story »

 
3
comments
వార్తలు

జనవరిలో పుస్తకం.నెట్

Posted  January 31, 2009  by  పుస్తకం.నెట్

పుస్తకం.నెట్ ప్రారంభమై నెలరోజులైంది. ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటే మళ్ళీ ఇటు తిరిగే సరికి అది ఓ టపా అయింది. కార్పోరేట్ పదజాలం లో cumulative status report అనాలేమో దీన్నే. ఈ సైటు ప్రస్థానం అంకెల్లో చెప్పాలంటే.. ముప్ఫై రోజులూ, పాతిక పోస్టులూ, రెండొందల కమ్మెంట్లు, ఎనిమిదన్నర వేల పైగా హిట్లు, పది మందికి పైగా కాంట్రిబ్యూటర్లు. ప్రస్తుతం Achilles, అసూర్యంపస్య, ఒరెమునా, తాడేపల్లి లలితా బాలసుబ్రమణ్యం, పూర్ణిమ, రవి, సౌమ్య లతో పాటు […]

Full Story »

5
comments
ఆంగ్లం

తప్పక చదవాల్సిన ‘మంచి ముత్యం’

Posted  January 30, 2009  by  అతిథి

– రాసిన వారు: అరుణ పప్పు ‘పట్టణం ఒక సామాజిక జంతువు! దానికి నాడీమండలం, తల, భుజాలు, పాదాలు అన్నీ ఉంటాయి. అందుకే ఏ రెండు పట్టణాలూ ఒక్కలాగా ఉండవు. పట్టణానికుండే ఉద్రేకం, ఉద్వేగం గొప్పవి. అక్కడ వార్తలెలా ప్రవహిస్తాయో ఎవరికీ తెలియదు..’ అరవయ్యేళ్లకు పూర్వమే ఈ వాక్యాలు రాయగలిగాడు కనుకే సుప్రసిద్ధ అమెరికన్‌ నవలా రచయిత జాన్‌ ఎర్నెస్ట్‌ స్టెయిన్‌బెక్‌ నోబెల్‌ విజేత కాగలిగాడు. అది సత్యమనిపిస్తుంది ‘మంచి ముత్యం’ (Manchi Mutyam) నవల చదివితే. […]

Full Story »

16
comments
తెలుగు

సాఫ్ట్ వేర్ ఇంజనీర్

Posted  January 28, 2009  by  అతిథి

ఆ మధ్య ఇంటికి వెళ్ళినప్పుడు, ఏవైనా పుస్తకాలు కొందామని విశాలాంధ్రకి వెళ్ళా..  అన్ని ర్యాకులు వరుసగా చూస్తూ వస్తున్నా.. అటు విశ్వనాధుల వారికి, ఇటు శ్రీశ్రీ కి మధ్యలో చిక్కుకుని కళ్ళు మిటకరించి చూస్తోంది ఈ పుస్తకం.. మొదట శీర్షిక చూడగానే, ఆ ఏముంది మన (సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల) జీవితాల గురించి వెటకారం గా వ్రాసి ఉంటారు అని అనుకుంటూ ప్రక్కన పెట్టేయబోయా. ఎందుకో ఒక్కసారి వెనక్కి త్రిప్పి చూశా.. కొంచెం చదవాలనిపించేదిలా ఉంటుందనిపించింది.. సరే […]

Full Story »

9
comments
తెలుగు

‘మరపురాని మనీషి’ – తిరుమల రామచంద్ర

Posted  January 27, 2009  by  అతిథి

అసలు ఏ రంగంలోనైనా ప్రత్యేక స్థాయికి ఎదిగిన వారిని గుర్తుంచుకోవాలా? అవును గుర్తుంచుకోవాలి. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. మన ముందు తరాల్లో కొంతమంది మహా మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల పేర్లు తెలుసుకున్నా చాలు! వారు ఎందుకు గొప్పవారో తెలిస్తే మరీ మంచిది. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం తెలునాట జీవించిన కొందరు తెలుగు తేజో మూర్తుల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, శ్రీ తిరుమల రామచంద్ర గారు ఇంటర్వ్యూ చెయ్యగా, శ్రీ నీలంరాజు మురళీధర్ […]

Full Story »

 
4
comments
తెలుగు

గుప్త పాశుపతము – విశ్వనాధ సత్యనారాయణ

Posted  January 26, 2009  by  అతిథి

ఈ నాటకము 1982 న ప్రధమ ముద్రణ గావించబడినది.విశ్వనాధ వారు దీనిని మొదట తెలుగులో రాసినా, దీని సంస్కృత అనువాదమే (అనువదించినది విశ్వనాధవారే)తొలిగా 1973 లో, అమృత శర్మిష్టం అనే నాటకముతో కలిసి ప్రచురితమయ్యింది. హరిశ్చంద్ర పాత్రధారిగా ఆంధ్రదేశంలో పేర్గాంచిన, నాట్యాచార్య మల్లాది సూర్యనారాయణగారి అభ్యర్ధనపై కురుక్షేత్ర సంగ్రామం ఇతివృత్తముగా విశ్వనాధ దీనిని వ్రాయటము జరిగినది. ఈ నాటకం చదువుతుంటే తిరుపతి వెంకటకవులు రాసిన ఉద్యోగ విజయాలు గుర్తురాక మానవు.అదే పంధాలో రాసినట్లు విశ్వనాధవారే చెప్పారు.అప్పట్లో స్త్రీ […]

Full Story »

17
comments
కథలు

ప్రళయకావేరి కథలు

Posted  January 22, 2009  by  అతిథి

“అబయా! మనం మన పేరునన్నా మరిచిపోవచ్చుగాని అమ్మ పేరుని మటుకు మరువగూడదురా” “మాయమ్మ పేరు నాకు గుర్తుండ్లా తాతా!” “అమ్మంటే కన్నతల్లి మటుకే కాదురా. అమ్మంటే అమ్మబాస కూడా. అమ్మంటే అమ్మ నేల కూడా” ఇవి ఓ తాతా మనవడి మధ్య జరిగిన మాటలు. అమ్మ బాసని, అమ్మ నేలనీ మరువకూడదన్న తాత మాటలు ఓ మనవడిని విడువక పట్టి నడుపుతుంటే ఆ తాత మాటల స్ఫూర్తితో ఆ మనవడు వ్రాసిన కథలే ఈ “ప్రళయకావేరి కథలు”. […]

Full Story »

20
comments
జీవిత చరిత్రలు

కనుపర్తి వరలక్ష్మమ్మగారి విశిష్ట వ్యక్తిత్వం

Posted  January 20, 2009  by  అతిథి

ప్రముఖ సంఘసేవా తత్పరురాలూ, రచయిత్రీ, అయిన కనుమర్తి వరలక్ష్మమ్మగారు (1896-1978) స్వాతంత్ర్యోద్యమంలో విస్తృతంగా కృషి చేసిన మహా మనీషి. వీరేశలింగంగారు ప్రారంభించిన ఉద్యమాలూ, స్వాతంత్ర్య సమరమూ మంచి వూపు అందుకున్న సమయం అది. వరలక్ష్మమ్మగారిమీద ఆ ఉద్యమాల ప్రభావం చాలా వుంది. గాంధీగారి నాయకత్వంలో విదేశీ వస్త్రబహిష్కరణలో పాల్గొని ఆమె ఖద్దరు ధరించడం ప్రారంభించారు. స్త్రీలని విద్యావంతులని చేయడానికీ, విజ్ఞానవంతులని చేయడానికీ బాపట్లలో స్త్రీహితైషిణీ మండలి స్థాపించారు. స్త్రీలు ఓటుహక్కు వినియోగించుకోవాలని ప్రోత్సహించిన ఆదర్శ మహిళ. ఆమె […]

Full Story »