పుస్తకం
All about books


In The Spotlight 
 
 

4
comments
తెలుగు

కథాక్రమంబెట్టిదనిన………

Posted  September 2, 2015  by  అతిథి

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి                 మానవుడు మాటలు నేర్చినది మొదలు నేటి వరకూ అవిచ్ఛిన్నంగా సాగుతున్న ఏకైక సాహిత్య ప్రక్రియ కథాకథనం. కథ వివిధ కాలాలలో వివిధ దేశాలలో వివిధరూపాలు సంతరించుకొన్నది. (కథా ప్రక్రియ ఈ దేశం నుంచి మనకు వచ్చింది, నవలా ప్రక్రియ ఆ దేశం నుంచి మనకు వచ్చింది అనేవి గుడ్డి మూఢనమ్మకాలు.)               వేదాలలోని […]

Full Story »

 
2
comments
ఆంగ్లానువాదం

మృత్యువుకు జీవం పోసి..

Posted  November 9, 2010  by  Purnima

మృత్యువు అన్న పదం వినగానే మీకు తొట్టతొలుత కలిగే భావమేమిటి? భయం? కోపం? నిర్లిప్తత? వైరాగ్యం? అయోమయం? నిరాశ? దిగులు? ఆందోళన? మృత్యువు కి ఒక ఆకృతిని ఇవ్వమంటే, మీరేం ఇస్తారు? రాకాసి? యమపాశం? అశరీరమైనదేదో? “మానవులకు ఇక మృత్యువు లేద”ని మీతో ఎవరన్నా అంటే, మీ ప్రతిస్పందన? ఆశ్చర్యం? ఆనందం? ఊరట? ఆందోళన? ఇప్పుడు ఇంకో ప్రశ్న: “మానవులకు ఇక మృత్యువు లేద”ని మీరు పది లక్షల జీవిత భీమా చేయించుకున్నాక, ఎవరన్నా చెప్తే? ఎలా […]

Full Story »

 
0
comments
ఆంగ్లం

In to the passionate soul of subcontinental cricket

Posted  July 18, 2011  by  అసూర్యంపశ్య

In to the passionate soul of sub-continental cricket Emma Levine Penguin, 1996 బెంగళూరు బ్లాసంస్ లో తిరుగుతూ ఉంటే, ఈ పుస్తకం కనబడ్డది. క్రికెట్ చూడ్డం కంటే, చదవడం పై ఆసక్తి ఎక్కువ ఉండడం మూలాన, కొనుక్కుని, చదవడం మొదలుపెట్టాను. ఇది కూడా క్రికెట్ ఆట గురించే. ఇది కూడా ‘క్రికెటర్ల గురించే. కానీ, ఇది మిగితా క్రికెట్ పుస్తకాల లా కాదు. ఎందుకంటే, ఇక్కడ రాయబడ్డ క్రికెట్ మైదానాలూ, క్రికెట్ ప్లేయర్లూ […]

Full Story »

2
comments
తెలుగు

వేనరాజు, ఖూనీ

Posted  February 27, 2014  by  అతిథి

వ్యాసకర్త: Halley *********** ఈ వ్యాసం వేనరాజు గురించీ, ఖూనీ గురించీ. “వేనరాజు” విశ్వనాథ వారు రాసిన నాటిక, అప్పట్లో దీని మీద పెద్ద దుమారమే రేగి కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు దీనికి ప్రతిగా “ఖూనీ” రాసారట. నేను వేనరాజు చదివి కొన్ని నెలలు కావొస్తోంది. ఆ నాటిక నేను చదవటానికి కారణం పోయిన సంవత్సరం “అభ్యుదయ చలన చిత్ర రథ సారథి – గూడవల్లి రామబ్రహ్మం” అన్న పుస్తకం చదవటం. అందులో ఒక […]

Full Story »

3
comments
పుస్తకలోకం

తెలుగు భాష – తానా సేవ

Posted  January 26, 2013  by  Jampala Chowdary

(ఈ వ్యాసం కొన్ని మార్పులతో డిసెంబర్ 2012 తెలుగువెలుగు సంచికలో ప్రచురించబడింది.) ************ అమెరికాలో తెలుగువారు తగుసంఖ్యలో స్థిరపడటం మొదలు బెడుతున్న రోజుల్లో, అంటే 1970లలో, చాలా నగరాల్లో తెలుగు సంఘాలను ఏర్పరచుకోవటం మొదలుబెట్టారు. అమెరికా అంతటా చెదురుమదురుగా ఉన్న తెలుగువారినీ, తెలుగు సంఘాల్నీ ఒక చోట చేర్చటానికి 1977లో న్యూయార్క్ నగరంలో డా. గుత్తికొండ రవీంద్రనాథ్, డా. కాకర్ల సుబ్బారావుల నాయకత్వంలో ఉత్తర అమెరికా తెలుగు మహాసభలు జరిగాయి. ఆ మహాసభలకు వచ్చిన తెలుగువారంతా అమెరికాలో […]

Full Story »

4
comments
తెలుగు

అగ్గిపెట్టెలో ఆరుగజాలు

Posted  January 13, 2016  by  అతిథి

వ్యాసకర్త: మణి వడ్లమాని ************ అసలు చేనేత అదేనండి, హ్యాండ్ లూం  చీరలు అంటే  మొదటినుంచి ఇష్టం. అసలు ఆడవాళ్ళకి చీరలకు అవినాభావ సంబంధం ఎలాగూ ఉండనే ఉంది. బండారులంక, పుల్లేటికుర్రు, భూదాన్ పోచంపల్లి, బొబ్బిలి, ధర్మవరం,గద్వాల్, ఉప్పాడ ఇలా ఆయా ఊళ్ళు వెళ్లి డైరెక్ట్ గ మగ్గాల దగ్గరనుండి మరీ కొనుక్కునే వాళ్ళము. ఒకసారి బొబ్బిలి వెళ్ళినప్పుడు కొన్ని చీరలు కొందామని ఒక ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇల్లు దుకాణంకూడా ఒకటే. ముందు ఇంటికి వెళ్ళగానే […]

Full Story »

0
comments
కవితలు - పద్యాలు

మన బంగారు ఖజానా – ముద్దుకృష్ణ వైతాళికులు – 2

Posted  November 2, 2011  by  Jampala Chowdary

ముద్దుకృష్ణ వైతాళికులు పై చౌదరిగారి పరిచయ వ్యాసంలో మొదటి భాగం ఇక్కడ.   1935 వరకూ తెలుగు కవితా నవప్రస్థానంలో పాలు పంచుకొని పేరు పొందిన రచయిత లందరూ దాదాపుగా వైతాళికులు సంకలనంలో ఉన్నారు. 191 కవితలు. 26 గురు కవులు. గురజాడతో మొదలు బెట్టి శ్రీశ్రీ వరకూ. నండూరి సుబ్బారావువి  పదమూడు కవితలు. విశ్వనాధ, వేదులలవి చెరు పన్నెండు.  నాయనివి పదకొండు. అబ్బూరి, రాయప్రోలులవి చెరు పది. శ్రీశ్రీవి ఎనిమిది (అప్పటికి మహాప్రస్థానం కవితలలో చాలా భాగం ఇంకా రాయలేదు; పుస్తకం […]

Full Story »

 
4
comments
పాతబంగారం

మయూరుని సూర్య శతకం

Posted  May 1, 2011  by  అతిథి

రాసిన వారు: కె.ఎం.చంద్రమోహన్ ****************************** మయూరుని పేరు నేను మొదటిసారి వినడం శ్రీనాధుని కావ్యాలలోనే. “భట్ట బాణ మయూర భవభూతి శివభద్ర కాళిదాసుల మహాకవుల దలచి…” అని కాశీ ఖండంలో బాణ, భవభూతి, కాళిదాసాదుల సరసన నిలిపి ప్రార్థించాడు. మయూరుడు అన్న పేరు ఆకర్షణీయంగా తోచడంతో ఈ మయూరుడెవరా అని అప్పట్లో వెదకడమూ, సూర్య శతక కర్త అని తెలిశాక ఒకే ఒక శతకంవ్రాసిన కవికి కాళిదాసాదులతో సామ్యమా అని ఆశ్చర్యపడి ఆ విషయం తరువాత మరిచి […]

Full Story »

5
comments
కవితలు - పద్యాలు

హాయిగా ఏడ్చేసా..

Posted  April 11, 2013  by  అతిథి

వ్యాసకర్త: కడప రఘోత్తమరావు (ఈ వ్యాసం కొండముది సాయికిరణ్ కుమార్ గారి కవిత్వం “అంతర్యానం” కు కడప రఘోత్తమరావు గారు రాసిన ఆప్తవాక్యం.) ******** “ఆ రోజుల్ని తలచుకున్నప్పుడల్లా ఆనందం లాంటి విచారం కలుగుతుంద”ని తిలక్ అన్నా “హాయిగా ఏడ్చేసా” అని సాయికిరణ్ అన్నా పాఠకుల్లో కలిగే రసస్పందన ఒక్కటే – సౌకుమార్యంతో కూడిన అంతఃచేతనపు మేలుకొల్పు. అప్పటివరకూ స్ఫురించని భావాలు తోచడం, పరిచితమైన భావాల్లో కొత్తకోణాలు అగుపడడం వంటి అనుభవాలు పాఠకులకి అందించగలిగిన క్షణాన ఆ […]

Full Story »