మీరేం చదువుతున్నారు?

పుస్తకాలు తరచుగా చదువుతున్నా, పేజీలకి పేజీలు సమీక్షలు రాసే ఓపికా, తీరికా లేని వారి కోసం ఈ పేజీని నిర్వహిస్తున్నాము. ఈ వారంలో మీరే పుస్తకాలు చదివారు, వాటిని గురించి ఓ రెండు ముక్కలు ఇక్కడ comments రూపంలో పంచుకోవచ్చు.   ఈ నమునాలో వివరాలు చెప్తే సులువుగా ఉంటుంది.

పుస్తకం పేరు:
రచయిత:
భాష:
వెల:
అంతర్జాలంలో ఈ పుస్తక వివరాలు:
పుస్తకం పై మీ అభిప్రాయం:

పాత వ్యాఖ్యలను, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చును.

203 Comments

  1. Sowmya

    ప్రదీప్ సెబాస్టియన్ వివిధ పత్రికలలో రాసిన సాహిత్య వ్యాసాల సంకలనం “The Groaning Shelf” చదువుతున్నాను. ఈ పుస్తకం మొదటిసారి 2010 లో చదివాను. అడపా దడపా ఒక్కో వ్యాసం మధ్యలో చాలాసార్లే చదివినా, గత వారంలో మళ్ళీ దాదాపు మొత్తం పుస్తకాన్ని తిరగేశాను – ఈ వ్యాసాలు పుస్తకాల గురించి, రచయితల గురించి, పుస్తకాలు అమ్మేవాళ్ళ గురించి, కొనేవాళ్ళ గురించి, కొట్టేసేవాళ్ళ గురించి, ప్రదర్శనల గురించి – వెరసి పుస్తక ప్రపంచం గురించి. పుస్తక ప్రియులు తప్పకుండా చదవాల్సిన పుస్తకం – ఆపైన ఫిక్షన్-నాన్ ఫిక్షన్ భేదాలు లేకుండా ఓ వంద పుస్తకాలైనా టురీడ్ జాబితాలో చేర్చుకుంటారు 🙂

    నాలుగేళ్ళుగా ఈ పుస్తకం గురించి ఒక వ్యాసం రాయాలి అనుకుంటూ రాయనేలేదు. అది డ్రాఫ్ట్ గా నా కంప్యూటర్ లో అలాగే ఉంది – ఈసారి మట్టుకు తప్పకుండా రాయాలి అనుకుంటున్నాను 🙂

  2. Bhanu Prakash

    లోయనుంచి శిఖరానికి పుస్తకం చదివా విజయానికి ఐదు మెట్లు, విజయానికి ఆరొ మెట్టు మళ్ళీ చదువుతున్నట్టే ఉంది,కొన్ని కథలు రిపీట్ అవ్వడం యండమూరి క్రియేటివిటీ కి ఏమయ్యిందా అనిపీంచింది, మళ్ళీ చెప్పినవే చెప్తున్నట్టు ఉంది, ఆయన రచనల్లో ఆయన శైలి మనల్ని ఎన్నో పేజీలు తెలియకుండా చదివిస్తుంది ఇందులో అది మాత్రం అలానే ఉంది లేదంటే చదవడం కష్టం అయ్యేది, మొత్తంగా ఆయన చరిత్ర చూసి ఈ పుస్తకం కొనాలే తప్ప ఈ ఫేస్ బూక్ కాలం లొ ఆయన చెప్పే విషాయాలు మనం తరచూ మన ఎఫ్ బి గోడ పైనా చూసేవే.చివరగా కొత్తదనం లోపించింది అని మాత్రం చెప్పగలను.

  3. సౌమ్య

    ఈ స్పేస్ ని నేను వాడుతున్నట్లు ఇంకెవరూ వాడడం లేదుగా! 🙂
    గత నెల రొజుల్లో చదివిన పుస్తకాలు:

    గ్రాఫిక్ నవలలు/ఆత్మకథలు: I killed Adolf Hitler by Jason (వెరైటీగా ఉంది కథ), Mom’s Cancer – Brian Fies (ఉపయోగకరమైన పుస్తకం), Maus-1: A Surviver’s Tale, My father bleeds history – Art Spiegelman (చాలా ఆసక్తికరంగా ఉంది. వీలయితే మిగితా భాగాలు చదవాలి!)

    We are all made of glue – Marina Lewycka: ఈవిడ రాసిన మరొక పుస్తకం అంత నచ్చలేదు కానీ, కాలక్షేపానికి చదూకోవచ్చు – సమయం తెలీదు ప్రయాణాల్లో అయితే. ఆవిడ మార్కు వ్యంగ్యం, విపరీతమైన పరిసరాల పరిశీలనా నవ్వించాయి.

    నాటకాలు: My Dinner with Andre – Wallace Shawn, The Mountain Top-Katori Hall (ఈ రెండో నాటకం లో మార్టిన్ లూథర్ కింగ్ చివరి రోజు ఎం జరిగి ఉంటుంది అన్న కథాంశం – ఆసక్తికరంగా ఉంది)

    Letters to a young scientist – Edward O.Wilson. Rilke రాసిన Letters to a young poet స్పూర్తి తో రాసారంట ఈ పుస్తకాన్ని. విల్సన్ గారు ప్రముఖ శాస్త్రవేత్త. రెండు సార్లు పులిట్జర్ ప్రైజు అందుకున్న వ్యక్తీ. ఈ నేపథ్యంలో పుస్తకం నన్ను ఊహించినంత ఆకట్టుకోలేదు. కొన్ని ఉత్తరాలు చాలా బాగుంటే, కొన్ని సాధారణం గా అనిపించాయి. కొన్నేమో ఆ ఫీల్డులో పనిచేసేవాళ్ళకి తప్ప మిగితా వాళ్లకి ఆట్టే పనికిరావేమో అనిపించింది. మొత్తానికి నాకు అన్నింటికంటే నచ్చిన అంశం – ఆయన కష్టపడ్డం, ఓపిక పట్టడం – రెంటికీ పరిశోధక విద్యార్థి జీవితంలో ఉన్న ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పడం. నా అనుభవంలో పుట్టు మేధావితనం కంటే కూడా ఈ రెండూ ఎక్కువ ముఖ్యం అనిపించేది – అదే ఈయన కూడా అనడంతో నాకు భలే థ్రిల్లింగ్ గా అనిపించింది 🙂

    Gone Girl – Gillian Flynn : ఈ పుస్తకం నన్ను ఆర్నెల్ల బట్టి stalk చేసిందని చెప్పవచ్చు 🙂 ఏప్రిల్ లో మొదలుపెట్టి ఆపేసిన పుస్తకం – ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉండడం తో మొన్నేమధ్యే చదివాను. disturbing thriller! వచ్చే వారం సినిమాగా విడుదల అవుతోంది. ప్రస్తుతానికి ఈవిడ రాసిన మరో నవల Dark Places చదువుతున్నాను.

    కొసరు కొమ్మచ్చి : అన్ని వ్యాసాలు బాగున్నాయి. ఎం.బీ.యస్. గారి వ్యాసం నాకు అన్నింటికంటే నచ్చింది.

    పునశ్చర్రణం : డాక్టర్ వైదేహి శశిధర్ – కొన్ని కవితలు బాగా నచ్చాయి. రోజూవారీ విషయాలనే వైదేహి గారు వర్ణించే తీరు చాలా ఆసక్తికరంగా తోస్తుంది నాకు.

  4. సౌమ్య

    ఈ మధ్య కాలంలో అనేక వ్యక్తిగత కారణాల వల్ల తరుచుగా పుస్తకాలు చదువుతున్నాను.గత నెల్లాళ్ళలో చదివిన పుస్తకాలు:

    * The Fault in our stars – ఈ నవల ఆధారంగా ఇదే పేరుతో వచ్చిన సినిమా చూశాక చదివాను. నాకు నచ్చింది. అక్కడక్కడా కొంచెం మెలోడ్రామా ఉంది కానీ – అది young adults ని ఉద్దేశించి రాసినది. ఇద్దరు క్యాన్సర్ బాధిత టీనేజర్ల ప్రేమకథ – ఆమాత్రం డ్రామా ఉంటుంది కదా!

    * Light of Asia – Indian Silent Cinema, 1912-1934 – Suresh Chabria: మూణ్ణాలుగేళ్ళ క్రితం నుండీ‌ చదవాలి అనుకుంటూండగా ఇప్పటికి వీలు పడింది – మా లైబ్రరీలో ఉండడంతో. తొలినాటి భారతీయ చిత్ర పరిశ్రమ గురించి నాలుగు వ్యాసాలు, భారతదేశంలో వచ్చిన నిశబ్దచిత్రాల జాబితా ఉన్నాయి. ఒకట్రెండు వ్యాసాలు కొంచెం చదవడానికి క్లిష్టంగా‌ఉన్నాయి కానీ, పుస్తకం చాలా విలువైనది అనిపించింది.

    * The Emperor of All Maladies – Siddhartha Mukherjee: క్యాంసర్ వ్యాధి చరిత్ర. అద్భుతమైన పుస్తకం. దీన్ని గురించి పుస్తకం.నెట్లో ఈ వారమే పరిచయ వ్యాసం రాశాను.

    * Fun Home: A Family Tragicomic – Alison Bechdel: ఈ చిన్న గ్రాఫిక్ ఆత్మకథని గత రెండు వారాల్లో అటు తిప్పి ఇటు తిప్పి మూడుసార్లు చదివేశాను. చాలా ఆసక్తికరమైన పుస్తకం. త్వరలో ఇక్కడ పరిచయం రాయడానికి ప్రయత్నిస్తాను.

    * Shadows in the Sun: Healing from Depression and Finding the Light Within – Gayathri Ramprasad : ఈ పుస్తకం వైపుకి నన్ను లాగిన ముఖ్యమైన కారణం ఒక భారతీయ వనిత తన క్రానిక్ డిప్రెషన్ గురించి బహిరంగంగా పుస్తకం రాయడం . నా మట్టుకు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను ఓ పుస్తకం‌ నుండి. డిప్రెషన్ గురించి కొంచెమైనా తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవారికి తప్పకుండా చదవమని సూచిస్తాను.

    * Ten Days in a mad house – Nellie Bly : 1880లలో ఒక అమెరికన్ జర్నలిస్టు ఒక మానసిక ఆసుపత్రి పనితీరును గమనించడానికి గాను అక్కడ అందరిని తనకి మతిస్థిమితం లేదని నమ్మించి అక్కడ రోగిగా చేరి, అక్కడి అనుభవాలను పుస్తకంగా రాసింది. అదే ఈ పుస్తకం. ౧౩౦ ఏళ్ళ క్రిందటి పుస్తకమే అయినా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఆవిడ అనుభవాలు.

    ప్రస్తుతానికి చదువుతున్నది: Kay Redfield Jamison రాసిన “An unquiet mind”.

  5. డింగు

    If Tomorrow Comes by Sidney Sheldon
    Sheldon రచన చదవడం ఇదే మొదటిసారి. ఎత్తులు పైఎత్తులుతో నవల థ్రిల్లింగ్‌గా ఉంది.

  6. Sowmya

    Eleanor Brown రాసిన నవల “The Weird Sisters” చదివాను. కథ (ముఖ్యంగా ముగింపు) చాలా రొటీన్ గా‌ఉంది కానీ, కథ చెప్పిన విధానం, రచనా శిల్పం మట్టుకు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. షేక్స్పియర్ రచనలతో పరిచయం ఉన్నవారికైతే కథనం ఇంకా నచ్చుతుందేమో. ఏదేమైనా, ప్రధాన పాత్రలూ ఐదూ పుస్తకాలనూ, షేక్స్ పియర్ రచనల్లోని వాక్యాలనూ తమ జీవితంలోని కథలను వ్యథలను ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకోడానికి, వాళ్లకి వాళ్ళు చెప్పుకోడానికి కూడా భలే వాడుకున్నారు. ఆ ఫ్యామిలీ‌ డ్రామాలోకి సాహిత్యాన్ని జొప్పించడం గొప్పగా చేసింది రచయిత్రి.

  7. సౌమ్య

    Margreet de Heer అన్న నెదర్లాండ్స్ కు చెందిన ఆర్టిస్టు, ఆవిడ భర్త Yiri తో కలిసి రూపొందించిన రెండు గ్రాఫిక్ పుస్తకాలు: Science: A Discovery in Comics, Philosophy: A Discovery in Comics – చదివాను ఈమధ్యన. రెండింటి వెనుకా ఉన్న ఆలోచన – టీనేజీ పిల్లలకి నెమ్మదిగా ఈ రెండు అంశాల గురించి బొమ్మల రూపంలో వాటి చరిత్ర చెబుతూ పరిచయం చేయడం. పుస్తకాలు రెండూ బాగున్నాయి. సైంసు పుస్తకం ఫిలాసఫీ పుస్తకంకంటే బాగా వచ్చినట్లు అనిపించింది. అక్కడా ఇక్కడా చిన్న చిన్న పొరబాట్లు, టైపాట్లూ ఉన్నప్పటికీ, ఈసారెవరైనా పన్నెండు పదమూడేళ్ళ పిల్లలకి కానుక ఇవ్వాల్సి వస్తే సైంసు పుస్తకం ఇద్దామనుకుంటున్నాను.

    రచయిత్రి జాలగూడు: http://margreetdeheer.com/eng/index.html

  8. సౌమ్య

    Bill Bryson రాసిన యాత్రా వ్యాసాలు “Neither here nor there”; అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో జీవితం గురించి రాసిన కాలం వ్యాసాలు “Notes from a Big country” చదివాను. మొదటి పుస్తకంలో కొన్ని వ్యాసాలు బాగున్నా కూడా, మొత్తంగా చెప్పాలంటే ఆ పుస్తకం కొంచెం నిరాశ పరచింది. రెండో‌ పుస్తకం ఆసక్తికరంగా ఉంది. దానితో నేను “Notes from a Small Island” కూడా చదవాలి అని నిర్ణయించుకున్నాను.

    ప్రస్తుతానికి స్వీడిష్ రచయిత్రి, సాహిత్యంలో నోబెల్ పొందిన తొలి మహిళా అయిన Selma Lagerlöf కథలు చదవడం మొదలుపెట్టాను.

  9. S. Narayanaswamy

    2012 తరవాత ఎవరూ ఇటొచ్చినట్టు లేదు!
    I am currently reading “Collected Stories” by Reynolds Price, an American writer.

    1. S. Narayanaswamy

      సారీ .. పాత కామెంట్లని చూసి అవే లేటెస్టు అని భ్రమపడ్డాను.

    2. సౌమ్య

      అదే కదా… మొన్నామధ్య కూడా ఏదో వ్యాఖ్య వచ్చుండాలే అనుకున్నాన్నేను!‌ 🙂

  10. డింగు

    Hyperbole and a Half by Allie Brosh
    ఇది ఒక బ్లాగు. ఇందులోని కొన్ని పోస్టులు ఇదే పేరు గల పుస్తకంలో ఉన్నాయి. రచయిత్రి తన కథలకు బొమ్మలను వాడిన తీరు అద్భుతం. ఇందులోని కొన్ని పోస్టులకు విపరీతంగా నవ్వుకున్నాను. మీరు ఓ లుక్కేయండీ.
    http://hyperboleandahalf.blogspot.com

  11. Sowmya

    గత నెలలో చదివిన రెండు పుస్తకాలు:
    Rahul Dravid: Timeless Steel : ESPN Cricinfoలో రాహుల్ ద్రావిడ్ పై వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులు రాసిన వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. ఇటీవలి కాలంలో ఒకే వ్యక్తిపై రాసిన వ్యాసాలు చదివిన వాటిల్లో నన్ను ఇంతగా ఆకట్టుకున్న పుస్తకం లేదు. ఇవన్నీ ఒకేసారి ఈ పుస్తకం కోసమని రాసిన వ్యాసాలు కాకపోవడం దీనికి ఒక ప్రధాన కారణం. దాని వల్ల ద్రవిడ్ గురించి ఒక్కోరూ ఒక్కో కోణంలో రాశారు. Enriching reading experience. ఈ పుస్తకం చదవడం క్రికెట్, ద్రవిడ్ అభిమానులకే కాదు, మామూలు పుస్తకాభిమానులకి కూడా ఒక మంచి అనుభవం అవుతుంది అనుకుంటున్నాను.

    Shakespeare: The World as Stage – Bill Bryson: దేశం కాని దేశంలో టూరిస్టుగా దిగిన ఒక అద్దెరూములో పుస్తకాలు కనబడ్డమే అబ్బురమంటే….ఆ గ్రీకు పుస్తకాల మధ్య ఈ ఆంగ్ల పుస్తకం తారసపడ్డది నాకు. Bill Bryson అనగానే ఆకర్షణ వల్ల చదువుదాం అని మొదలుపెట్టాను -ఇదివరలో ఈ రచయితవి కొన్ని వ్యాసాలు, పుస్తక భాగాలు చదివిన అనుభవం వల్ల. ఆయన స్టైల్ లో ఆసక్తికరమైన చారిత్రక సంగతులతో ఆద్యంతం పుస్తకం ఆపకుండా చదివించింది. అయితే, టైటిల్ లో ఉన్న షేక్స్పియర్ కథ పుస్తకంలో ఎంతుందో, ఆనాటి చరిత్ర కూడా అంతే ఉంది. అది కొంచెం distracting గా అనిపించింది నాకైతే. కానీ, మొత్తానికి పుస్తకం నాకు నచ్చిందనే చెప్పాలి. అంత పెద్ద రచయిత గురించిన ప్రాథమిక సంగతులు కూడా ఇంకా ఎవరికీ నిర్థారణగా తెలియవంటే‌ ఆశ్చర్యంగా అనిపించింది. ఇటువంటి పుస్తకాలు మన దేశపు రచయితల గురించి కూడా ఏవైనా వచ్చి ఉంటే తెలియజేయగలరు.

  12. Sowmya

    గత పదిరోజుల్లో చదివిన పుస్తకాలు:

    సుస్వరాల పాలగుమ్మి:
    ఇది పాలగుమ్మి విశ్వనాథం ౮౦వ జన్మదిన సందర్భంగా “నాదవినోదిని” సంస్థ వారు వెలువరించిన commemorative volume. వివిధ వ్యక్తులు తమకి పాలగుమ్మితో గల అనుబంధం గురించి రాసిన వ్యాసాలతో పాటు చివ్వర్లో విశ్వనాథం గారే స్వయంగా‌ తన సంగీత-సాహిత్య జీవితం గురించి రాసిన వ్యాసం ఉంది. ఆ చివ్వరి వ్యాసం మట్టుకు తప్పక చదవదగ్గది. తక్కిన వాటిల్లో అంత ఆసక్తికరమైన అంశాలేవీ నాకు కనబడలేదు.

    ఆత్మకథ -విశ్వనాథ సత్యనారాయణ:
    ఈ పుస్తకం నేను సమయాభావం వల్ల పూర్తి చేయలేకపోయాను కానీ, చాలా ఆసక్తికరంగా ఉంది. విశ్వనాథ వారి బాల్యం, అప్పటి జీవనవిధానం ఇవన్నీ చదివి ఊహించుకుంటూంటే బాగుంది. ఆయన సాహితీ జీవితం గురించి రాసింది తక్కువ. బహుశా ఇది అసంపూర్ణంగా మిగిలిపోయినందుకేమో. విశ్వనాథ వారసులు ఈ పుస్తకాలన్నీ మరొకసారి ముద్రిస్తే, ఈ‌టైపులో వేరే వాళ్ళ పుస్తకాలు limited time లో ఆబగా చదవబోయి, సరిగా చదవలేకా, చదివినదాన్ని ఎక్కడ టైమైపోతోందో అన్న టెన్షన్లో పూర్తిగా‌ ఆస్వాదించలేకా నాబోటి వారు పడే బాధకి విముక్తి లభిస్తుంది.

    నెమ్లీక -తెలిదేవర భానుమూర్తి:
    ఈ పుస్తకం ఇదివరలో ఒకసారి చదివాను. ఇపుడు మళ్ళీ‌చదివాను. చక్కటి తెలంగాణ మాండలికంలో రాసిన బాల్యం కథలు. భాషే కాదు, కథా వస్తువులు కూడా నన్ను చాలా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా – వాళ్ళ ఊరికి మొదటిసారి రైలు బండి వచ్చినప్పుడు దండలూ గట్రా వేసి డ్రైవర్ ను సన్మానించడం వగైరా సంఘటనలు చదువుతున్నప్పుడు అది ఊహించుకుని ఎన్నిసార్లు నవ్వుకున్నానో!

    మా కుటుంబం:‌కవనశర్మ, ఆయన కుటుంబసభ్యులు
    ఈ పుస్తకంలో కవనశర్మ, ఆయన భార్య విజయలక్ష్మి గారు, వాళ్ళ పిల్లలు, ఆయన తల్లిగారు – ఇలా వాళ్ళ కుటుంబసభ్యులు వాళ్ళ గురించి రాస్కున్న వ్యాసాలు ఉన్నాయి. మరి ఇదంతా ఒక మనిషి ఎడిటింగా, లేకపోతే వీళ్ళందరికీ ఒకే విధమైన హాస్య చతురతా, వ్యంగ్యమూ ఉన్నాయేమో నాకు తెలియదు కానీ, బాగా entertaining వ్యాసాలు. అందునా ఒకసారి ఈ వ్యాసకర్తల్లో కొందరిని కలిసినందువల్లో ఏమో కానీ నాకైతే ఎక్కడా బోరు కొట్టలేదు. అయితే, ఇలాంటి ఓ పుస్తకానికి టార్గెట్ రీడర్స్ ఎవరు? అన్నది మట్టుకు నాకు అర్థం కాలేదు.

    ఆరడుగుల నేల: చలసాని ప్రసాదరావు
    ఈ పుస్తకానికి కాప్షన్ -“నమ్మవలసిన నిజాలు”. బ్రాకెట్లలో “దేశదేశాల యదార్థ గాథలు” అని రాశారు. ఇక్కడిదాకా బానే ఉంది. “తమ శక్తి సామర్థ్యాలతో ప్రపంచాన్ని విభ్రాంతపరచిన కొందరు దేశదేశాల సాహసుల గాథలివి” అని రాశారు. అక్కడే దెబ్బకొట్టింది. కొన్ని కథలు చాలా ఆసక్తికరంగా అనిపించినప్పటికీ, కథలకి విపరీతమైన నాటకీయత జోడించేసరికి నాకైతే యదార్థ గాథలకి మసిపూసి మారేడుకాయ చేసారేమో అన్న సందేహం కలిగింది. అందునా చాలామట్టుకు కథల్లో నాకు “సాహసులు” అని గొప్పగా చెప్పుకోవాల్సిన విషయమేమిటో‌కూడా అర్థం కాలేదు. కొన్ని వ్యాసాలైతే టైటిల్ నుండే గాసిప్ వ్యాసాల్లా అనిపించాయి.ఏమన్నా అంటే అన్నామంటారు కానీ, నాకు టీవీ ఛానెల్స్ లో వచ్చే క్రైం ప్రోగ్రాంలలో నెరేటర్స్ గుర్తు వచ్చారు. ఆ టైటిల్ కి జస్టిఫికేషన్ కూడా నాకేమీ కనబళ్ళేదు. నా ఉద్దేశ్యంలో ఈ పుస్తకాన్ని క్షేమంగా స్కిప్ చేసేయొచ్చు. అన్నట్లు, ఈ వ్యాసాలు మొదట “ఈనాడు” పత్రికలో వచ్చాయట.

  13. Sowmya

    కాట్రగడ్డ మురారి గారి స్వీయానుభవాలతో కూడిన “నవ్విపోదురు గాక…” చదివాను. ఈ పుస్తకం ఎలా ఉందంటే వివరించడం కష్టం – కొన్ని చోట్ల బాగుంది. చాలా చోట్ల – ఏమిటీయన… ఎందుకివన్నీ చెబుతున్నాడిప్పుడు? అనిపించింది. కొన్ని చోట్ల బోరు కొట్టింది. కొన్ని చోట్ల ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. కానైతే, చాలా ఓపెన్ గా రాసారనిపించింది. ఆ ఓపెన్-నెస్ ఎక్కడెక్కడ అవసరం? ఎక్కడ అనవసరం? – అన్నది ఎవళ్ళకి తోచినట్లు వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. అన్నిటికంటే‌ నాకు ఒక్క క్షణం మైండు బ్లాకైన విషయం మాత్రం – ఆయన కుక్కల్లో రెంటి పేర్లు – భానుమతి, రామకృష్ణ కావడం! పుస్తకంలో మరీ ప్రతీదీ చెప్పి తీరాలన్నట్లు అన్ని పేజీలు రాయకుండా, కొంచెం కుదించి ఉంటే, బహుశా మరికాస్త ఆసక్తికరంగా ఉండేదేమో. ఏమైనా, ఓపిక చేసుకుని చదివితే మట్టుకు చాలా విషయాలు తెలుస్తాయి. అవన్నీ పనికొస్తాయా? అంటే‌ మట్టుకు నేనేం చెప్పలేను.

  14. నాగ వంశీధర్ రాటకొండ

    సాహిత్య ఝరి…A Stream Of Thoughts పుస్తకం, తెలుగు వచనంలో వ్రాశిన ఒక మదురమైన పుస్తకం.
    కుటుంబంలో అందరూ చదువుకోదగ్గ పుస్తకం.

    http://kinige.com/kbook.php?id=2157&name=Sahitya+Jhari

  15. సౌమ్య

    “మునెమ్మ” నవల చదివాను (అవునండి, ఇన్నాళ్ళూ చదువలేదు). నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఇలాంటి ఒక కథ తెలుగులోనైతే నాకెప్పుడూ కనబడలేదు (నేను చాలా ప్రముఖ రచనలు చదవలేదని ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది.) .. కనుక, ఎవరన్నా నన్ను సలహా అడిగితే, దీన్ని చదువమని సూచిస్తాను.

    బంకించంద్రుడి బంగ్లా నవల “మృణాళిని” కి దండమూడి మహీధర్ తెలుగు అనువాదం చదివాను. ఇదీ మునెమ్మ లాగే చిన్న నవల. ఆపకుండా చదివించింది కానీ, ఆట్టే విశేషాంశాలు ఏవీ లేవు. కాలక్షేపం కోసం చదువుకోవచ్చు అని నా అభిప్రాయం.

    “ముచికుంద్-తీపి అంటే ఎంతిష్టమో” అన్న పిల్లల పుస్తకం ఒకటి (మాధవ్ గాడ్గిల్ రచన, తురగా జానకీరాణి తెలుగు అనువాదం) చదివాను. ఇది నాకు చాలా నచ్చింది. అలాగే, చాలా ఆసక్తికరంగా ఉపయోగకరమైన విషయాలు చెప్పారు. కొంచెం తమంత తాము పుస్తకాలు చదువుకోగల పిల్లలు ఉంటే తప్పకుండా చదివించమని సూచిస్తాను. పుస్తకం పలుభాషల్లో, ప్రథం బుక్స్ వారి ద్వారా లభ్యం.

  16. syamala appaji

    nenu eemadhya chadivina pustakam peru: amaravati kathalu by Satyam senkaramanchi.

    chala baagundi

  17. Prasad Devarakonda

    Nenu prasthutham Telugu-Velugu ane maasa sanchika chaduvuthunna. chala bagundhi.
    ika nunchi parthi nela koni chaduvuthanu.
    Naku ee “pustakam.net” gurinchi thelisindi ee Telugu-Velugu pustakam dwarane.
    ee site prarambhincha “poornima & Sowmya” gariki kruthagnathalu.

    ‘Naku keyboard meda telugu letters type cheyadam raledu, anduke english lo rassanu’.
    kshaminchandi

  18. లలిత (తెలుగు4కిడ్స్)

    మాలతి గారు J California Cooper వ్రాసిన కథ Color me real ని ప్రస్తావిస్తే ఆ కథ దొరకక అదే రచయిత్రి వ్రాసిన Life is short but wide చదివాను. ఇందులో రంగుల ప్రస్తావన ఉన్నా కూడా, పేదరికందే ఎక్కువ ప్రభావం కనిపించింది నామటుకు నాకు. అదే పేదరికం మానవ సంబంధాలలో ఆత్మీయత పెంచడం కనిపించింది. చక్కని, చిక్కని కథనం. ఆపకుండా చదివాను. కథగా పెద్దగా ఏమీ లేదేమో. మూడు తరాలలో నడిచిన కథ. ఒక చిన్న ఊరు పట్టణంగా ఎదగడం, చదువు వల్ల చైతన్యం కలగడం, అది అక్కడినుండి వెళ్ళిపోయిన వారికంటే అక్కడే ఉన్న వారిలో కలిగించిన జ్ఞానం, దాని వల్ల వాళ్ళకి జీవితం అర్థవంతంగా గడపడం అనే దాని విలువ తెలియడం, ఆ అర్థాన్ని మనమూ ఆస్వాదించగలిగేలా చెయ్యడం ఆసక్తితో చదివేలా చేశాయి. నిజానికి చదువు వల్ల విలువ తెలియడంకన్నా కూడా, జీవితం విలువ తెలిసిన వాళ్ళు చదువు తమకీ తమ వారికీ ఉపయోగపడుతుందని చదువుకోవడాన్ని ప్రోత్సహించడం కనిపించింది. బైబిల్ స్వంతగా చదవాలి కానీ చర్చిలో విన్న మాటలు అక్షరాలా నమ్మెయ్యకూడదు అని తెలుసుకోవడం, చదువుకోవడం వల్ల తెల్ల వాళ్ళు ఇష్టం లేకపోయినా వారి ఉపయోగం తెలిసి పని ఇవ్వడం (తక్కువ జీతానికే ఐనా) వంటి ప్రయోజనాలు కలిగినట్లు చూపించారు.

  19. డింగు

    బాలభారతం పిల్లల మాస పత్రిక — తొలి సంచిక
    చిట్టి కథలు, అలరించే బొమ్మలు, ఉపయోగకరమైన విషయాలతో సంచిక బాగుంది. రాకెట్, మండే మంచు, ఎస్కలే్టర్, జీబ్రా చారల గురించి విషయాలున్నాయి. నాకు ‘కిట్టీకి తెలుసొచ్చింది’ కథ, కార్టూనిస్ట్ శ్రీధర్ పాఠాలు, ‘తెలుగుకి వారసులం’, ‘ఈసఫ్’ సంగతులు నచ్చాయి. పెద్ద అక్షరాలతో పేపర్ క్వాలిటి English kids magazineలాగ ఉంది.

    తమ పిల్లలు తెలుగు చదవాలి అనుకునేవారికి ఈ పత్రిక ఉపయోగపడుతుంది.

  20. రవి

    సర్దేశాయ్ తిరుమల రావు గారి పుస్తకం చదువుతున్నాను. రారా తర్వాత అంతగా పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్నాడు. ఒక్కోసారి రారాను మించిపోతాడు కూడా. మార్క్సిస్టు విమర్శకుడు కాదు కానీ కవితల పేరు మీద అసంబద్ధత్వాన్ని, సాంప్రదాయవాదం వెనుక కుహకాలను ఓ మాదిరిగానే కడిగాడు. పాశ్చాత్య రచయితల పేర్లు కుప్పలు కుప్పలుగా చెపుతాడు.

    వ్యక్తిగా తిరుమల రావు గురించి చదివి ఉలిక్కిపడతారు. (నేనూనూ). తైలపరిశోధనలో 11 పేటెంట్లు కలిగిన అసామాన్యుడైన పరిశోధకుడు. ఇంకా చాలా ఉన్నాయి.

  21. Sowmya

    “తొలినాటి తెలుగు కథానికలు – మొదటి నుంచి 1930 వరకు” అన్న కె.కె.రంగనాథాచార్యులు గారి పరిశీలన చదువుతున్నాను. పుస్తకం సూటిగా, క్లుప్తంగా బాగుంది. ఎక్కడికక్కడ పరిశీలనలో తెలిసినవి పంచుకోవడమే కానీ, స్వకపోల కల్పనలు లేవు. అలాగే, అన్నీతెలిసిన వారికథేమో కానీ, నాబోంట్లకు మట్టుకు ఆసక్తికరంగా అనిపించే సంగతులు చాలా తెలుస్తున్నాయి. ఇక్కడ ప్రస్తావించిన వారి రచనల గురించి ప్రెస్ అకాడెమీ ఆర్కైవ్స్ వెబ్సైటులో వెదికి ఆసక్తికరమైన కథలు చదువగల్గుతున్నాను. పుస్తకంలో వ్యాసాలు మరీ క్లుప్తంగా, అసంపూర్ణంగా మధ్య మధ్యలో అనిపించినా కూడా, ఇది చాలా విలువైన పుస్తకం నాకు తారసపడ్డ వాటిల్లో!

  22. Sowmya

    ఎ.వి.రెడ్డిశాస్త్రి గారి “అసంగత సంగతాలు” కథలు చదివాను. తెలుగులో “absurd fiction” రచనలు చేయాలన్న ఆలోచన బాగుంది కానీ, కథ-కథనం ఆట్టే ఆకర్షణీయంగా అనిపించలేదు..ఒకట్రెండు కథల్లో తప్ప. అయితే, మామూలుగా ఆ శైలి రచనలంటే నాకిష్టం కనుక పుస్తకం పూర్తి చేయడం ఆట్టే శ్రమ కాలేదు, అది వేరే విషయం.

  23. సౌమ్య

    కాలక్రమంలో భాషలో కలిగే మార్పులు, వాటికి కారణాలు, ఇది మంచికా? చెడుకా? అన్న చర్చలతో కూడిన Language Change: Progress or Decay? అన్న పుస్తకం చదివాను. రచయిత్రి: Jean Aitchison. పుస్తకం సులభ గ్రాహ్యంగా, అలాగే చక్కటి ఉదాహరణలతో నిండి ఉంది. అక్కడక్కడా కొన్ని అంశాలు నాకు అర్థం కానప్పటికీ, మొత్తంగా చూస్తే, ఈ పుస్తకం ఆ అంశం గురించి చక్కటి పరిచయం అనే చెప్పాలి.

  24. సౌమ్య

    చాలారోజులుగా నేను ఏమీ చదవనప్పటికీ, శ్రీ అట్లూరి గారు రాసిన వ్యాసం పుణ్యమా అని, “ప్రళయ కావేరి కథలు” మళ్ళీ చదవడం మొదలుపెట్టాను. కథన పరంగా చాలా సాధారణంగా అనిపించినప్పటీకీ, అక్కడి భాష, సంస్కృతి, rich vocabulary, అన్నింటినీ మించి రచయితలో ప్రళయకావేటి పై ఉన్న అభిమానం – ఇవన్నీ కలిపి, నగరవాసం తప్ప మరోటి ఎరుగని నాకు ప్రళయ కావేరి జీవితాన్ని సాక్షాత్కరింపజేశాయి. మొదటిసారి చదివినప్పుడు, ఇప్పుడూ కూడా భాషతో కొంచెం ఇబ్బంది పడ్డమాట వాస్తవమే కానీ, అయినా సరే, అలా ఒక్కో కథా మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ పోయాను గత కొన్నాళ్ళలో! 🙂

    ఇక, మరొక పుస్తకం – మొదలు పెట్టిన పేజీ నుండి, చిరాకు, ఆశ్చర్యం, నవ్వు ఇలా రకరకాల భావోద్వేగాలు కలిగిస్తూ, “ఇలాంటి మనిషి తెలుగుదేశంలో బతికాడా? అదీ ఆ కాలంలో? అంత వ్యతిరేకతనీ తట్టుకుని తను నమ్మింది చేసుకుపోవడమే కాక, అదంతా నిజాయితీగా మళ్ళీ చెప్పాడూ అంటే…ఈయనకెంత ధైర్యమూ? ఈయనతో కలిసి ఉండేవారిది ఏం ఓపిక? ఏం ధైర్యం? అసలు ఈయన ఏమిటి ఇంతలా ఆలోచించాడు?” అని పదే పదే అనుకుంటూనే ఏకబిగిన చదివేలా చేసింది. అది చలం రాసిన “చలం”. ఈయన భావజాలం నాకు నచ్చిందనో, నచ్చలేదనో కాదు (నేనంతగా చదవలేదు రెండు మూడు పుస్తకాలు తప్ప) … ఈయనకి నేను ఇప్పుడు అర్జెంటుగా admirer కూడా ఏమీ కాలేదు (నేనన్ని రచనలు చదువలేదు కనుక). కానీ, అసలు ఈ మనిషే ఓ అద్భుతం అనిపించింది నాకు. చదివేందుకు మాత్రం చాలా ఇబ్బంది పెట్టింది. ఒక్కోచోట ఎవరి గురించి మాట్లాడుతున్నాడో, ఆ కొత్త కొత్త పాత్రలంతా ఎక్కడ నుంచి వస్తారో ఏమీ అర్థం కాలేదు. అయినా, చదవడం ఆపబుద్ధి కూడా కాలేదన్నది వేరే విషయం.

  25. రవి

    శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి అనుభవాలు జ్ఞాపకాలు చదువుతున్నాను, కొంచెం కొంచెం గా. చాదస్తం అనిపిస్తూ ఉంది, అయితే వదలనివ్వటమూ లేదు. తెలుగు నుడికారం కన్నా సంస్కృత నుడికారమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. పుస్తకం లో భాష బయటా అలానే ఉండేదో లేక ఆయన అలా రాస్తున్నాడో తెలీదు. తెలుగు మీద అభిమానం ఎంత ఉన్నా హిందీని, హిందుస్తానీ సంగీతాన్ని, ఆ మాటకొస్తే ఇతర భాషల్ని ఎందుకు ద్వేషించాలో సరైన కారణం కనిపించట్లేదు. అప్పటి పరిస్థితులు అలాగ ఉండేవేమో అని సరిపెట్టుకోవాలి. విమర్శ మీద ఈయన చెప్పిన వ్యాఖ్యలు బావున్నాయి. తిరుపతి వేంకటకవులతో కలహం, ఒకరొకరు చెప్పులు చూపించి తిట్టుకోవడం ఆత్మకథలో చెప్పుకోకపోయినట్లయితే బావుండేది.

  26. సౌమ్య

    సెలవులో కొనసాగుతున్నందువల్ల గత వారం రోజులుగా వివిధ నవలలు, ఆసక్తికరమైన యాత్రా కథనం ఒకటీ చదివాను.

    1. Change – Mo Yan: మో యాన్ కు నోబెల్ రావడమూ, ఇది what is communism? అన్న శీర్షికలో వచ్చిన స్వీయానుభవాల పుస్తకాల్లో ఒకటి కావడం మూలానా చదివాను. పుస్తకం బాగానే ఉంది కానీ, నేను ఊహించినంత గొప్పగా లేదు. అయితే, మో యాన్ రచనా శైలి, వర్ణనలు నాకు నచ్చాయి.

    2. The Pregnant King – Devadutta Patnaik: భారతంలో పొరపాటున భార్యలు తాగవలసిన మంత్రించిన పాయసాన్ని తాను తాగేసి ఒక బిడ్డ కి “తల్లి” అయిన యువనాశ్వుడి కథ ని ఆధారంగా రాసిన నవల ఇది. ఆపకుండా చదివించింది. వివిధ సందర్భాల్లో వచ్చిన చర్చల్లో ఆట్టే లోతు లేనట్లు అనిపించింది కానీ, ఒక నవలగా మాత్రం పూర్తిగా పైసా వసూల్ అనిపించింది 🙂

    3. The Krishna Key – Ashwin Sanghi : రీమేక్ సినిమాలు ఒక్కోసారి అసలువి చూసేసినా కూడా ఆసక్తికరంగా చూస్తాము. అలా, ఈ నవల Dan Brown రాసిన Da Vinci Code కి దేశీ రీమేక్ అయినా, కథలో పాత్రలు, వాళ్ళ వెదుకులాటకి కారణాలూ మారినా కూడా మక్కికి మక్కి డా విన్సీ కోడ్ ని దింపేశినా కూడా ఆపకుండా చదివించింది. సంఘీ మార్కు విపరీత రిసర్చి చాయలు నవలలోనూ, చివర్లో పొందుపరచిన రిఫరెన్సులలోనూ కనిపించాయి. ఆ విపరీతమే ఒక్కో చోట వికటించి బోరు కూడా కొట్టించింది.

    4. చత్తీస్‌ఘడ్ స్కూటర్ యాత్ర – పరవస్తు లోకేశ్వర్: ఆక్టివా స్కూటర్ మీద పది రోజులు, దాదాపు 2000 కి.మీ. చట్టీశ్‌ఘడ్ లో లోకేశ్వర్, ఆయన స్నేహితుడు చేసిన యాత్ర విశేషాలతో కూడిన పుస్తకం. మిగితా విషయాలు అటు పెడితే, చాలా ఆసక్తికరమైన విషయాలు, చరిత్రా తెలిశాయి. త్వరలో ఈ పుస్తకం గురించి పుస్తకం.నెట్ లో పరిచయం చేయాలి అనుకుంటున్నాను.

  27. సౌమ్య

    విశ్వనాథ వారి “పునర్జన్మ” నవల చదివాను. ఏకధాటిగా ఆపకుండా చదివించింది. లోతుగా దానిలో (ఒకవేళ ఉంటే) ఉన్న సింబాలిజాన్నీ వాటినీ అర్థం చేసుకునే పరిజ్ఞానం నాకుందో లేదో కానీ, క్లైమాక్సు చదువుతున్నప్పుడు ఎందుకో మళ్ళీ సమయం చిక్కితే నవల మొత్తం రెండోసారి చదవాలి అనిపించింది. ఇప్పటిదాకా నేను చదివిన వీరి నవలలన్నీ నాకు చాలా ఆసక్తికరంగా అనిపించాయి కనుక (కొన్నింటిలో భావజాలం నాకు నచ్చినా, నచ్చకున్నా!)… సెలవు ముగిసేలోపు మరొకటో రెండో నవలు చేజిక్కించుకుని చదవడానికి ప్రయత్నించాలని అనుకుంటున్నా.

    1. roshni karedla

      Where did u get the novels by viswanatha satyanarayana? I would like to purshase some like cheliyali katta etc . I tried in visalandhra . but they are selling all his works in full set .Iam already possessing some . so kindly mail me the possible shops or libraries . Thanx a lot.

      Regards
      Roshni

  28. Sowmya

    గత మూడు వారాల్లో చదివిన పుస్తకాలు:
    * Cecil and Jordan in Newyork – Gabrielle Bell : అధివాస్తవిక, గ్రాఫిక్ కథల సంకలనం. నా మట్టుకు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించాయి కథలన్నీ. వీక్షణం శీర్షిక ద్వారా పరిచయమైన ఈ యువ రచయిత్రి ఇతర రచనలు కూడా కొత్త సంవత్సరంలో చదవాలి అని నిర్ణయించుకున్నా.

    * Amul’s India: Based on 50 years of Amul’s advertising : ఏదన్నా వార్తావిశేషం సంభవిస్తే, తరువాత అమూల్ వారి స్పందన ఏమిటా? అని ఆసక్తిగా ఎదురుచూసే వాళ్ళలో నేనూ ఒకదాన్ని. గత 50 ఏళ్ళలో వచ్చిన అలాంటి బొమ్మల ప్రకటనల్లో కొన్నింటిని ఎంపిక చేసి వేసిన పుస్తకం. ఇందులో కొందరు ప్రముఖులు ఈ ప్రకటనపై, వీటితో తమ అనుబంధం పై రాసిన వ్యాసాలు కూడా ఉన్నాయి. నాకు చాలా నచ్చిందీ పుస్తకం. అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభ్యం.

    * “అభ్యుదయ చలనచిత్ర రథసారథి” గూడవల్లి రామబ్రహ్మం: హైదరాబాదు బుక్ ఫెయిర్ లో కనబడ్డ పుస్తకం. ఆయన గురించి వివరాలు తెలుసుకోవడం బాగుంది కానీ, పుస్తకం మరీ నాటకీయంగా అనిపించింది. ఇది బయోగ్రాఫిచల్ నవల అని, ఇందులోని సమాచారంలోని నిజానిజాలతో తనకి సంబంధంలేదని, వెరిఫై చేసుకునే ఓపిక,తీరిక కూడా లేవని రచయిత ముందే చెప్పేసినా కూడా – ఆయన గురించి వేరే ఏం పుస్తకాలున్నాయో కూడా నాకు తెలియదు కనుకా, ఇదొక్కటే నాకు తెలుసుకునే మార్గం కనుకా – నేను అసంతృప్తికి లోనయ్యా పుస్తకం చదివాక. అయితే, పుస్తకంలో ఆయన సినిమాల పరిచయాలు, అప్పట్లో వచ్చిన సమీక్షలు ఇవ్వడం మాత్రం నాకు నచ్చిన అంశాల్లో ఒకటి.

    * తొలినాటి గ్రామఫోన్ గాయకులు – రెండో భాగం: మొదటి భాగం పోయినేడాది మొదట్లో చదివాను. ఈ గాయకులలో ఎవరో ముగ్గురో, నలుగురో తప్ప నాకు పేర్లైనా తెలియవు కనుక, ఆసక్తికరంగా అనిపించింది. జతచేసిన సీడీ ఇంకా వినలేదు కానీ, పరిచయాలు మాత్రం క్లుప్తంగా, సరళంగా ఉన్నాయి.
    ***
    దేశంలో ఉండడం మూలానా ఉన్నట్లుండి బోలెడు పుస్తకాలకి ఆక్సెస్ దొరికి ప్రస్తుతం ఏదీ పూర్తిచేయకుండా పలు పుస్తకాలు చదువుతూ కాలం గడుపుతున్నా 😛

    1. Sreenivas Paruchuri

      I can partly understand your disappointment about Gudavalli Ramabrahmam monograph. I have deep (insider) knowledge about this project but I don’t want to go into details here. The “biographical novel” like style is is also not of my like and it reads quite dramatic at some places, but there are no factual errors as it was carefully proofread and all sources cross-checked more than twice. If you want to check other works, there are at least two other books. One by Gorrepati Venkatasubbayya (Its a small pamphlet like booklet of 50-60 pages.) from 1980s and a souvenir edited by Dr. Patibandla Dakshinamurti of Tenali, published in 1976. It contains many contributions from GR’s contemporaries. I myself wrote a small essay in a souvenir edited by Nasy in 1995 which was somewhat expanded and republished in TANA patrika in 1997. I have serious academic interest in Gudavalli (and L.V. Prasad) and one day would like to do a lengthy monograph.

  29. సౌమ్య

    భైరప్ప గారి మరొక నవల Sakshi కి ఆంగ్లానువాదం The Witness చదివాను. ఆంగ్లానువాదం – Bhairappa, Sharon Norris.

    నవల మొదలైన విధానం, ముగించిన విధానం అద్భుతంగా ఉంది. వాటి కోసమే ఈ నవల చదివేయవచ్చు అసలు నా అభిప్రాయంలో. మధ్యలో నడిచే కథ అంతా ఆసక్తికరంగా ఉంది కానీ, జీర్ణించుకోవడం కష్టం అలాంటి మనుషుల్ని. అంత దారుణమైన మనుషులు ఉండరని కాదు కానీ, నాకే చేత కాలేదు తట్టుకోవడం. అయితే, యమధర్మరాజు-చిత్ర-చిత్రగుప్తుల ను సీన్లోకి తెచ్చి, మొదట్లో, చివర్లో నడిపిన సంభాషణ మాత్రం గొప్పగా ఉంది. అది చదివాక రాత్రి వాళ్ళు కల్లోకి కూడా వచ్చి ప్రశ్నలేశారు నన్ను 😉

    1. Srinivas Vuruputuri

      నేను భైరప్ప గారి “మంద్ర” ఆంగ్లానువాదం చదవడం మొదలుపెట్టాను. ఓ హిందుస్థానీ సంగీతకారుడి కథ చెబుతూ కళ-నైతికత సమస్యను చర్చిస్తుందట ఈ నవల. మొదటి పేజీలోనే ఓ చక్కని చైతన్యస్రవంతి పేరాతో కథలోకి లాక్కెళ్ళారు. ఆసక్తికరంగా ఉంది.

    2. pavan santhosh surampudi

      ఇంత వైవిధ్యభరితమైన రచనలు ఉన్నాయా ఈయనవి.. ఓపనిగా పెట్టుకునన్నా ఓసారి ఈయనవి కొన్ని నవలలు చదవాలి. ఇప్పటివరకూ ఈయన పర్వ చదివాను, వంశవృక్షం(తెలుగు) చూశాను.

    3. Ravindranath Nalam

      Grihabhangam is another great novel from Sri Bhirappa that depicts male chauvinism in the old and traditional Kannada Brahman families.Wonderful characterisation does not allow you put the book down.

  30. సౌమ్య

    గత వారం పదిరోజుల్లో చదివిన పుస్తకాలు:
    1) ఆనందీ గోపాల్ – మరాఠీ మూలం: ఎస్.జె.జోషి, ఆంగ్లానువాదం – ఆశా దాంలే.
    -పాశ్చాత్య వైద్యవిధానాల్లో డిగ్రీ పొందిన తొలి భారతీయురాలు. ఈ పుస్తకం ఆవిడ జీవితం ఆధారంగా రాయబడ్డ నవల. ఆపకుండా చదివించడమే కాకుండా, చాలా చోట్ల కలవర పెట్టింది నన్నీ నవల. అయితే, ఆవిడని మాత్రం నమ్మశక్యం కాని జీవితం. నవలీకరణ తాలూకా డ్రామా లేకపోయినా కూడా ఇది నిజం. పుస్తకం బయట మార్కెట్లో దొరకడం లేదు.

    2) Vamsavriksha – The Uprooted : ఎస్.ఎల్.భైరప్ప కన్నడ నవలకి కె.రాఘవేంద్రరావు ఆంగ్లానువాదం. నవల గొప్పగా ఉంది. ఆపకుండా చదివించింది. అయితే, ఒక్కసారి చదువుతో పూర్తిగా గ్రాస్ప్ చేయడం కష్టం – అంతర్లీనంగా ఉన్న అద్వైతాన్ని. అనువాదం మాత్రం చాలా డ్రై గా ఉంది. కొన్ని చోట్ల వాక్యాలు నవ్వుపుట్టించేలాఉన్నాయి. ఉదా – మరణశయ్య మీద ఉన్న తన భార్యని చూడ్డానికి కుటుంబసభ్యులొకరు వస్తే, భర్త ఆవిడ చెవి దగ్గరకెళ్ళి ఫలానా వారు వచ్చారు, చూడు అంటాడు. దానికి అక్కడ అనువాదం – he shouted in to her ear.
    shouted?? ఏమైనా, ఈ అనువాదంలో కూడా పుస్తకం ఆపకుండా చదివించింది.

  31. సౌమ్య

    “మాస్తి కన్నడద ఆస్తి” అనిపించుకున్న మాస్తి వెంకటేశ అయ్యంగార్ గారి కథలు కొన్నింటికి “కథ క్లాసిక్స్” వారి ఆధ్వర్యంలో రామచంద్ర శర్మ చేసిన ఆంగ్లానువాదం చదివాను ఈ వారాంతంలో. పది కథలు ఉన్నాయి. కథలన్నీ ఎక్కడా బోరు కొట్టించకుండా చదివించాయి. రామానుజుల భార్యని గురించిన కథ నాకు ఈ సంపుటిలో అన్నింటికంటే బాగా నచ్చిన కథ. కొన్ని కథల్లోని సంభాషణలు, సంఘటనలు చదివి చాలా నవ్వుకున్నా (ఉదా: Our Teacher కథలో ఇద్దరు పిల్లలు బలపాల గురించి కొట్లాడుకుంటూ క్లాసుకి లేటుగా వెళ్ళే దృశ్యం వర్ణన). కొన్ని మామూలు మనుషుల కథలు చెబుతూనే, జీవిత సత్యాలు గుర్తుచేశాయి.

    పుస్తకానికి ముందు భాగంలో మాస్తి జీవితం, రచనల గురించి రామచంద్ర శర్మ వ్యాసం వల్ల మాస్తి గురించి ఎన్నో వివరాలు తెల్సుకున్నాను.

    1. ఏల్చూరి మురళీధరరావు

      ఆధునిక తెలుగు అనువాద సాహిత్యంలో మద్దిపట్ల సూరి గారి “స్వయంసిద్ధ”కు ఒకపాటి సాటి రాగలిగినది అంటూ ఏదన్నా ఉంటే, అది – కొంతవఱకు, విద్వాన్ విశ్వం గారు శ్రీ మాస్తి వెంకటేశ అయ్యంగార్ సుప్రసిద్ధరచన “సుబ్బణ్ణ”కు చేసిన తెనుగుసేత – అని నేననుకొంటాను. చదివినకొద్దీ మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే అద్భుతమైన అనువాదం.

      మాస్తి వారి “పంప భారతదీపిక” కన్నడం నుంచి అనువాదమై తెలుగునాట ప్రచారానికి రావలసిన గొప్ప వ్యాఖ్య. నన్నయ్యగారిని అర్థంచేసుకోవటానికి ఎంత ఉపకరిస్తుందో!

      మీ అందరికీ దీపావళీ పర్వదిన సర్వ శుభాకాంక్షలు!

    2. pavan santhosh surampudi

      వారికి జ్ఞానపీఠ తెచ్చిపెట్టిన చిక్కవీర రాజేంద్ర చదవండి. నేబుట్ర ప్రచురణ. అనువాదం కూడా చక్కగా ఉంటుంది. అయితే పుస్తకం బయటెక్కడా దొరకదు. నేబుట్ర వాళ్ల పుస్తకాల షాపుల్లోనో, వారు ఎక్కడైనా పెట్టే స్టాళ్ళలోనో కొనాలి. (పుస్తకం 30 రూపాయలుంటుంది. 😀 )

    3. pavan santhosh surampudi

      “మాస్తి చిన్న కథలు” అని ఓ తెలుగు అనువాదం ఉంది సాహిత్య అకాడెమీ వారిది. అయితే అనువాదం మొదట్లో కొంచెం ఇబ్బంది పెట్టింది. మరీ ఘోరం కాదు లెండి. అన్ని కథలూ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా “మంత్రోదయం” అనే కథ మాత్రం చాలా బావుంది.

  32. Manasa

    నిన్న”If God was a Banker” (By Ravi Subrahmanan) చదివాను. చాలా నెలల తరువాత ఒక ఆంగ్ల పుస్తకం పట్టుకుని ఓపిగ్గా చదివాను. ఇంతకీ పుస్తకం బాలేదు. .
    ఒక్కటంటే ఒక్క చోట కూడా మంచి కథ అని కానీ, ముందు బాగుంటుందని కానీ అనిపించలేదు. Disappointing!

    1. pavan santhosh surampudi

      <>
      ఐతే మీ ఓపికకు మెచ్చుకోవాలి

  33. Manasa

    read Shantaram one more time 🙂
    and thought I would share this link with literary friends

    http://www.goodreads.com/author/quotes/18907.Gregory_David_Roberts

  34. pavan santhosh surampudi

    ప్రస్తుతం ఆల్ టైం క్లాసిక్ మార్గరెట్ మిచెల్ “గాన్ విత్ ద విండ్” చదువుతున్నాను. ఆ అనుభూతి చెప్పాలంటే ఓ వ్యాసమే వ్రాయాలి. ఓ గొప్ప రచనను మనకి వయసు పెరిగే కొద్దీ కొన్ని ఇంటర్వెల్స్ లో మళ్లీ మళ్లీ చదవాలేమో. ఎన్నో రంగుల్లో కనపడుతోంది నాకు ఇప్పుడు ఈ నవల.

    1. varaprasad

      ”గాన్ విత్ ది విండ్” గురించి వ్రాస్తానన్నారు,పుస్తకంలో వచ్చిందా సంతోష్ గారూ.

  35. Ravindranath Nalam

    పాల పిట్ట మాస పత్రిక లో స్వర్గీయ నండూరి రామ మోహనరావు గారి గురించి రెంటాల కల్పన గారి వ్యాసం చదవక పోయినట్లయితే ఆ బహు ముఖ ప్రజ్ఞా శీలి వ్రాసిన విశ్వ దర్సనం విశిష్టత తెలిసి ఉన్డేది కాదు.

Leave a Reply