మీరేం చదువుతున్నారు? – 2

పుస్తకాలు తరచుగా చదువుతున్నా, పేజీలకి పేజీలు సమీక్షలు రాసే ఓపికా, తీరికా లేని వారి కోసం ఈ పేజీని నిర్వహిస్తున్నాము. ఈ వారంలో మీరే పుస్తకాలు చదివారు, వాటిని గురించి ఓ రెండు ముక్కలు ఇక్కడ కమ్మెంట్ల రూపంలో పంచుకోవచ్చు.   ఈ నమునాలో వివరాలు చెప్తే సులువుగా ఉంటుంది.

పుస్తకం పేరు:
రచయిత:
భాష:
వెల:
అంతర్జాలంలో ఈ పుస్తక వివరాలు:
పుస్తకం పై మీ అభిప్రాయం:

  1. gks raja

    @సౌమ్య: చదువుతూ ఉన్నవాటిలో ఆపకూడనిది- ఎందరోమహానుభావులు, ఆపాలన్నా ఆపలేనిది గిరిశం లెక్చర్లు. నీను మళ్ళి మళ్ళి చదివినవి ఇవి రెండు కూడా..
    రాజా.

  2. gks raja

    @కెక్యూబ్ వర్మ:
    ఈ పుస్తకం గురించి ఏవరో చెప్పగా విన్నాను. కాని తెలుగు అనువాదం వచ్చిన సంగతి నాకు తెలియదు. తప్పక కొని చదువుతాను. అహ! ఆలోచిస్తాను.
    రాజా.

  3. gks raja

    అడవితల్లి
    మంచి పుస్తకం గురించి చిన్న విషయం….

    పుట్టిన గడ్దనే నమ్ముకొని, అడవి తల్లి ఒడిలోనే పెరిగి, పొద్దంతా ఆనందంగా ప్రకృతి పంచనే కాయకష్టం చేసుకుబ్రతుకుతున్న అడవిబిడ్డల్ని వారి భూమినుంచి, జీవనవిధానంనుంచి బ్రతుకునుండి వేరుచేసి, అభివృధ్ధి పేరు చెప్పి వెళ్ళగొడితే సహించక తిరగబడ్డ ఒక ఆడపిల్ల నిజజీవితగాధ “అడవి తల్లి”. సి.కె.జాను అనే ఆడబిడ్డ స్వయంగా అనుభవించిన దైన్య జీవితంలోనుండి, నిర్దాక్షిణ్యంగా భూమినుండి విడదీసిన పరిణామాలకు విలవిల్లాడిపోయిన గిరిజనుల గుండె చప్పుళ్ళనుండి పుట్టిన తిరుగుబాటే సి.కె.జాను. ఆ తిరుగుబాటు కేరళ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయాన్ని ఒక్క కుదుపు కుదిపింది. దిగివచ్చిన ప్రభుత్వం ఆమె నాయకత్వంలోని ఆదివాసీలతొ ఒడంబడిక చేసుకుంది. షరా మామూలుగానె ఆచరణలో పెట్టలేదు. దానికి సి.కె.జాను మరింత పట్టుదలతో తిరిగి పోరాటాన్ని కొనసాగిస్తూ– “ఆదివాసీల సమస్యల్ని ఆదీవాసీలే పరిష్కరించుకోవాలని, భూమిని నమ్ముకొన్న అడవి బిడ్డ్డలకు ఆ శ్రమ విలువ తెలియని వేరే మేధావులెవ్వరూ పరిష్కారం చూపించరని సిధ్ధాంతీకరించిన ఆమె నిరక్షరాసురాలు. ఆమె స్వయంగా చెప్పగా భాస్కరన్ అనె జర్నలిస్టు వ్రాసిన అసంపూర్తి ఆత్మ కధే “అడవి తల్లి”.

  4. కెక్యూబ్ వర్మ

    ఈ మధ్య నన్ను అమితంగా ఆకట్టుకున్నది, ఆలోచింప చేసిన పుస్తకం ఎలకల మనుషులు. దీని ఆంగ్లమూలం జాన్ స్టెయిన్ బెక్ రాసిన అఫ్ మైస్ అండ్ మెన్.. తెలుగు అనువాదం హెచ్చార్కె గారు. ఇది 1930 అమెరికా ఆర్థిక మాంధ్యం నేపథ్యంలో అక్కడ మృగ్యమైపోతున్న ఉద్యోగావకాశాలు, మనుషుల మధ్యనున్న మానవ సంబంధాలుపై మార్కేటీకరణ ప్రభావంపై రాసిన నవల. నేడు మన దేశం, ప్రధానంగా తెలుగునేలలోని మన అనుభవాలకు దగ్గరగా అంటే వస్తున్న సెజ్ భూబకాసురులు, ప్రపంచీకరణ, మార్కేట్ ప్రభావం, పెరిగిపోతున్న వస్తువ్యామోహం, క్షీణిస్తున్న మానవ సంబంధాలు (తల్లిదండ్రులను శ్మశాన వాటికలలో పడవేయడం లాంటి) కలుగుజేస్తున్న ప్రభావంతో గుండెలపై భారమౌతున్న స్నేహసంబంధాలు మిగిలించుకుందామన్న ఆర్తిని కలుగజేయడానికి ఈ నవల ఓ చూపును ప్రసరిస్తుంది. హెచ్చార్కెగారు తనదైన శైలిలో, మాండలికంలో అనువదించడం వలన పాత్రల పేరుతప్ప మిగిలిన సారాంశం దగ్గరగా అనిపించడం మరింతగా ఈ నవలను చేరువ చేసింది.. అడుగుజాడలు పబ్లికేషన్స్ వారి ఈ పుస్తకం వెల రూ.60/-లు.. అన్ని పెద్ద పుస్తకాల షాపుల్లో లభిస్తుంది. చదివి ఆలోచించగలరు..

  5. dvrao

    సుధా మూర్తి పుస్తకం wise & Otherwise కి తెలుగు అనువాదం జ్ఞానం – పరిజ్ఞానం చదువుతున్నాను. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ గా ఆమెకి ఎదురైన అనుభవాలు చాలా సరళం గా చెప్పారు. అనువాదం కూడా బావుంది. లైబ్రరీ లో ఉంచుకోవాల్సిన పుస్తకం.

  6. సౌమ్య

    మళ్ళీ నేనే:
    వంశీ నవల “దిష్టి బొమ్మ” చదివా. చెత్తలా ఉంది.

    ముళ్ళపూడి వారి “రాధా గోపాలం” కథలు చదివా. ఇదివరలో చదివినవే అయినా, మళ్ళీ నచ్చాయి. టైం లెస్ క్లాసిక్స్!

    ముళ్ళపూడి వారి “ఇద్దరమ్మాయిలూ, ముగ్గురబ్బాయిలూ” చదివాను (నవల అనుకోవచ్చు కదూ దీన్ని?) – కామెడీతో కూడిన ప్రేమ కథ. చదివేటప్పుడు స్క్రీన్ ప్లే అనిపించడం ఎలాగో రమణ గారి రచనల్లో నాకు ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది. అయితే, సంభాషణలు, వాటిలోని చెణుకులూ, వ్యంగ్యమూ కూడా తెగ నచ్చాయి.

    ఆయన పుట్టుకతోనే స్క్రీన్ ప్లే రైటర్ అనిపిస్తుంది! 🙂

  7. సౌమ్య

    ఇవ్వాళే ఫుట్పాత్ పై ముదిగొండ శివప్రసాద్ గారి చారిత్రక నవల – ‘రెసిడెన్సీ’ దొరికితేనూ, చదివి పూర్తి చేసాను. నిజం చెప్పాలంటే – దీనికంటే, సలాం హైదరాబాదు నవలలో భాగంగా ఈ కథను చెప్పిన పద్ధతే నచ్చింది నాకు.White Mughals నవల నేను చదువలేదు కనుక వ్యాఖ్యానించలేను.

    అయినా, పదేళ్ళ క్రితమే, ఈ “రెసిడెన్సీ” అన్న తెలుగు పుస్తకానికి నూట యాభై రేటు పెట్టారంటే – ఇంకా షాకులో ఉన్నా 🙂

  8. dvrao

    @sriram velamuri:
    ఆయన కధా సంకలనం విశాలాంధ్ర లో దొరకొచ్చు.

  9. sriram velamuri

    రమణ గారిని స్మరించుకుంటూ ఆయన కోతి కొమ్మచి మరోసారి
    చదువుతున్నాను,ధన్యోస్మి

  10. సౌమ్య

    ఇవ్వాళే అశ్విన్ సంఘీ కొత్త నవల “Chanakya’s Chant” పూర్తి చేసాను. బాగుంది.

  11. మెహెర్

    Even interviews can make you teary eyed sometimes. Here’s an interview of Austrian writer Thomas Bernard:

    http://www.thomasbernhard.org/interviews/1986intas.shtml

  12. మెహెర్

    “Like dreams, they wither under analysis; like dreams, they offer us hermetic brilliance if we choose to accept them on their own terms.”

    http://ivebeenreadinglately.blogspot.com/2011/02/against-interpretation-against-allegory.html

  13. dvrao

    @sriram velamuri: శ్రీరాం గారూ, వీలైతే ఆయన రాసిన వరడు చదవండి. అద్భుతమైన చిత్రణ.

  14. dvrao

    ఈరోజే జాన్ జుబ్రజుస్కి రాసిన ది లాస్ట్ నిజాం పూర్తి చేసాను. చాలా ఇంటరెస్టింగ్ గా వుంది. అసఫ్ జాహి ల వంశ ప్రారంభం నుండి చివరి నిజాం కాలం వరకు జరిగిన చరిత్ర బాగా చిత్రీకరించారు. ఒక సారి చదవొచ్చు, బాగుంది

  15. సౌమ్య

    ఈ రెండ్రోజుల్లో చదివినవి:
    దాసరి సుబ్రహ్మణ్యం గారి జానపద నవలలు: అగ్నిమాల, మృత్యులోయ
    కాశీభట్ల వేణుగోపాల్ గారి నవల – “నేనూ-చీకటి”

    -వేటి దారుల్లో అవి బాగున్నాయి. కాశీభట్ల గారి నవలలోని శైలి, భాష చాలా నచ్చాయి. దా.సు. గారి నవలల్లో ఫాంటసీ బాగా నచ్చింది.

  16. sriram velamuri

    వంశీ కి నచ్చిన కథలు చదువుతున్నాను.అల్లం శేషగిరి రావు గారి ‘చీకటి’ అనే కధ దాదాపు
    ఏడుపు తెప్పించింది.ఈరోజు సాక్షి పేపర్ లో యాదృచ్చికంగా ఆ కధ ను పరిచయం చేసారు.

  17. సౌమ్య

    Philip Pullman రాసిన “His Dark Materials” Trilogy పూర్తి చేసాను. పిల్లల కోసం రాసిన ఫాంటసీ నవలలే అయినా కూడా, ఆలోచింపజేసే అంశాలు చాలానే ఉన్నాయి. త్వరలో వీటి గురించి పుస్తకం.నెట్ లో పరిచయం చేస్తాను. మూడు నవలల పేర్లు:

    Book-1: The Northern Lights (or, The Golden Compass – సినిమాగా కూడా వచ్చింది.)
    Book-2: The Subtle Knife
    Book-3: The Amber Spyglass

  18. srihari

    MGBS-Hyderabad, bus station lo, Bengaluru bus ki inka 1 hour time untey….emi cheyyalo artham kaaka…akkadey unna bookstall daggariki vellanu…Akkada ee book choosanu..Ventaney konesi chaduvutunnanu…
    1/4th complete ayyindi…

    About the book:
    “Nadichey Devudu”- The book is not an auto biography or biography of “Kanchi Paramaacharya(aka)Sri Chandrashekarendra Saraswathi (aka) Periyvvaal”. The book was about the experiences of “Neelam Raju Venkata Sheshaiah, editor of Andhra Prabha”,with Kanchi Paramaacharya….Chaala Baagundi..

  19. ellankibhaskaranaidu

    The book “VIRAT” translated into Telugu by ponugoti krishnareddy is very greate book. The original english writer “STEPHAN TSHSVKK”. CAN ANY BODY TELL WHERE THE ORIGINAL BOOK AVAILABLE?

  20. సౌమ్య

    గత రెండు వారాలుగా చదివిన, చదువుతున్న, చదువుతూ విసుగొచ్చి ఆపేసిన పుస్తకాలు:

    చదివినవి:
    జలార్గళ శాస్త్రం – వరహమిహిరుడు : ఆసక్తికరం!
    కథల అత్తయ్యగారు – నిడదవోలు మాలతి : కొన్ని కథలు బాగున్నాయ్!
    పక్షులు, సముద్రం నా పేరు, ఈనగరం జాబిల్లి -గుంటూరు శేషేంద్ర శర్మ : కొన్ని పద్యాలు, వ్యాసాలు తెగ నచ్చేసాయ్!
    పోలేరమ్మ బండ కతలు – కదీర్ బాబు: బాగుంది
    అనార్కో – సత్యు: ఏడు కథలు. బాగున్నాయ్!
    కరుణ ముఖ్యం – ఇస్మాయిల్ వ్యాసాలు
    రెండో ప్రతిపాదన – వివిధ ప్రపంచ కవుల కవిత్వానువాదాలు – ఇస్మాయిల్: ఈ పుస్తకం కాస్త నిరాశ పరచింది.
    చీకట్లో చీలికలు – గొల్లపూడి మారుతీరావు నవల – ఇది నవోదయ వారి తొలి ప్రచురణ అట. బాగుంది. కానీ, అద్భుతంగా ఏమీ లేదు.
    తొలినాటి గ్రామఫోన్ గాయకులు – మంచి పుస్తకం!
    కోమలి గాంధారం – మృణాలిని – మాంచి కాలక్షేపం!

    గివప్ కొట్టినవి:తారకనామ రామాయణం – బ్రహ్మయోగి

    చదువుతూ ..ఊ..ఉన్నవి:
    గిరీశం లెక్చర్లు – ముళ్ళపూడి
    Peter Roebuck వ్యాసాలు
    భండారు అచ్చమాంబ కథలు
    ఎందరో మహానుభావులు – తనికెళ్ళ భరణి

  21. Jampala Chowdary

    Committee for Consultations on the Situation in Andhra Pradesh – Report – December 2010. Also known as Srikrishna Commitee Report. Interesting, to say the least. Highly recommended.

  22. Sravani

    Read some of the short stories from Balabhadrapatruni Ramani like Illu,Godugu,Anantam,Aligina Vela…They are just awesome..The depth of the stories have touched my heart…Though they are simple, they carry a lot of meaning.The best I felt were,Anantam and Illu..
    “Anantam” had a great message as “The courage you have to see death: use it to solve your problems, but dont get back from them and see Death as solution”.
    “Illu” show cases,an old woman feelings on her home built with her own hands and how she struggles to get it back.

  23. రమణ

    బి.తిరుపతిరావు గారి ‘పోస్ట్ మోడర్నిజమ్’ చదువుతున్నాను. చదివినంతవరకు ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఆధునికతను, ఆధునికానంతర వాదాన్ని గురించిన వివరాలు సమగ్రంగా ఉన్నాయి. అయితే ఇంగ్లీషు పదాల సమానార్ధాలను తెలిపే తెలుగు పదాలను విరివిగా ప్రయోగించడం మంచి ప్రయత్నం. పాఠకుడు కొంచం ఓపికతో చదవాల్సి ఉంటుంది.

  24. కౌటిల్య

    మొన్న పుస్తకాల పండగలో బోల్డు కొన్నా..అవన్నీ తొరగా చదివేయాలి…కాని సంవత్స్రరం కింద నా దగ్గరనుంచి నేను చదవకుండానే వెళ్ళిపోయిన విశ్వనాథ వారి “పరీక్ష” తిరిగొచ్చింది…ఆ పుస్తకం ఎప్పటిలాగే విజయవాడ,లెనిన్ సెంటర్,ప్రాచీన గ్రంథమాలలో కొన్నా..బుల్లి పుస్తకం..ఖరీదు కాస్త ఎక్కువే..కాని తప్పదుకదా,కొనేశా….ఇప్పటికి చదవడం కుదిరింది..పబ్లికేషన్సూ అవ్వీ చాలా పాతవి…అసలిప్పుడు లేవేమో….1951 లో గురువుగారు రాసిన నవల…..బీదకుటుంబాల మీద ఆనాటి ఇంగ్లీషు చదువులు ఎలాంటి ప్రభావం చూపించాయన్నది అద్భుతంగా చిత్రీకరించారు…ఈనాటి పరీక్షాపధ్ధతులకి కూడా సరిగ్గా సరిపోతుంది…పరీక్షలనేవి ఒక విద్యార్థి జీవితం మీదేకాకుండా,అతని కుటుంబ పరిస్థితులమీద,చుట్టూ ఉన్న అతని సంఘపరిస్థితులమీద ఎలా,ఎన్నిరకాలుగా ప్రభావం చూపుతాయనేది అద్భుతంగా చిత్రీకరించారు…కాని చివర్లో హీరో అననుగాని,ప్రధానపాత్రని చంపేశారు హఠాత్తుగా…కాసింత మనసు మెలిపెట్టినట్టనిపించింది….ప్రతి తల్లీ,తండ్రీ చదవాల్సిన పుస్తకం…..చదివి తమ పిల్లల(ముఖ్యంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి వెళ్ళేవాళ్ళ మీద) మీద అలాంటి పరీక్షల భారాన్ని పెట్టకుండా ఉంటే మంచిది

  25. రవి

    నోరి నరసింహశాస్త్రి గారి ధూర్జటి చారిత్రాత్మక నవల ఓ స్కూలు లైబ్రరీ నుండి తెచ్చుకుని చదివాను. నేను 2010 లో – మొదలుపెట్టి చివరి వరకూ చదివిన ఏకైక పుస్తకం ఇదే అనుకుంటా. ఈయన ఇతర పుస్తకాలకంటే బావుంది. చరిత్రను కాస్త తన దారిన తిప్పుకున్నా, పెడదారిన మాత్రం పట్టించలేదు. ధూర్జటి కవి వేశ్యాలంపటుడు కాదని నిరూపించడం బావుంది కానీ, ఆ ప్రయత్నంలో వేశ్యకు దైవత్వం ఆపాదించడం అదీ అంత బావోలెడు. అదొక్క లోపం మినహా మిగతా అంతా బావుంది.

  26. Sowmya

    “BPO-Sutra : True stories from India’s BPO and call centers.”
    -అన్న పుస్తకం చదివాను. ‘చికెన్ సూప్’ పుస్తకాల తరహాలో, కాల్ సెంటర్ ఉద్యోగుల కథలతో రాసిన పుస్తకం. దాదాపు నాలుగొందల పేజీలున్న పుస్తకం ఏకబిగిన చదివేశాను కనుక, పుస్తకం టైంపాస్ కి చాలా బాగుంటుంది అన్నట్లే. పైసా వసూల్ కూడానూ! 🙂
    ప్రచురణ : రూపా అండ్ కో
    వెల: తొంభై ఐదు రూపాయలు

  27. సుమధుర

    వడ్డెర చండీదాస్ నవల ’హిమజ్వాల’ చదువుతున్నాను.తెలుగే ఐనా అక్కడక్కడా ప్రకృతి వర్ణనలూ స్వగతాలూ పొడుగ్గా సాగుతూ అర్థంకానట్టనిపిస్తుంది.కానీ ఆ స్వగతాల్లోనే మనసునర్థం చేసుకొనే ప్రయత్నాలూ కనిపిస్తాయి.కాస్తంత విశృంఖలత కూడా ఉన్నట్లనిపిస్తూ ఉంది నాకు. మొత్తంమీద ఏకబిగిన చదివిస్తూంది.

  28. సౌమ్య

    నండూరి రామ్మోహనరావు గారి ‘విశ్వరూపం’ చదువుతున్నాను.
    ఎప్పట్లాగే, ఆయన లా సైన్సుని సరదాగా కబుర్లు చెప్తున్నట్లు చెప్పడం, రాయడం మరొకరి తరం కాదు. ప్రతి అధ్యాయం మొదట్లోనూ ఉన్న కవిత్వపు కొటేషన్లు, పురాణాల లైన్లూ కూడా హైలైట్.

    ఎటొచ్చీ, ఈ పుస్తకాల్లో ఫొటోల క్వాలిటీ గురించి కూడా చూస్కుని ఉంటే బాగుండేది.

    నండూరి గారికి ఓపికుంటే ఆయనో, లేదంటే, మరెవరైనా ఆసక్తి గలవారో – ఈ మధ్య కాలం లో జరిగిన రిసర్చి కూడా జోడిస్తూ రాస్తే బాగుణ్ణు.

  29. లలిత (తెలుగు4కిడ్స్)

    ఎప్పుడో చదవాల్సినవి ఇప్పుడు చదువుతున్నాను 🙁
    ఇప్పటికైనా చదువుతున్నాను.
    Sense and Sensibility

    అందులో ఈ సంభాషణ ఇక్కడ పంచుకోవాలనిపించింది:
    పై పై మాటలు వింటే ఎంత ఉన్నతమో అనిపించే ఆశయాలను, లోతుగా తరచి చూస్తే అవి నేలకి ఎంత దూరంలో ఉన్నాయో తెలుస్తుంది 🙂
    ఈ సంభాషణ పదిహేడేళ్ళ అమ్మాయితో అనుకోండి.

    Marianne:
    “What have welath or grandeur to do with happiness?”

    “Grandeur has but little,” said Elinor, “but wealth has much to do with it.”
    “Elinor, for shame!” said Marianne; “money can only give happiness where there is nothing else to give it. Beyond a competence, it can afford no real satisfaction, as far as mere self is concerned.”
    “Perhaps,” said Elinor, smiling, “we may come to the same point. Your competence and my wealth are very much alike, I dare say, and without them, as the world goes now, we shall both agree that every kind of external comfort must be wanting. Your ideas are only more noble than mine. Come, what is your competence?”
    “About eighteen hundred or two thousand a-year; not more than that.”
    Elinor laughed. “Two thousand a-year! One is my wealth! I guessed how it would end.”
    “And yet two thousand a-year is a very moderate income,” said Marianne. “A family cannot well be maintained on a smalle. I am sure I am not extravagant in my demands. A proper establishment of servants, a carriage, perhaps two, and hunters, cannot be supported on less.”
    :)))

  30. సుమధుర

    ఈ సంవత్సరం సెప్టెంబరు మాసంలో కడపలో జరిగిన పుస్తకప్రదర్శనలో “మెట్టుకు పై మెట్టు” అన్న తకళి శివశంకర పిళ్ళైగారి (నేషనల్ బుక్ ట్రస్ట్ వారి ప్రచురణ,అనువాదం:ఇలపావులూరి పాండురంగ రావు) నవల కొన్నాము,చదివాము.ప్రభుత్వ సచివాలయంలో జూనియర్ క్లర్క్ గా చేరి ఛీఫ్ సెక్రటరి స్థాయికి ఎగబ్రాకడానికి కథానాయకుడు కేశవ్ పన్నిన పన్నాగాలు,అతనికి కలసివచ్చిన అవకాశాలు,చివరికి అతడు పదవికి ఎలా దూరం కావలసి వస్తుందో,అన్నీ చదివాక ప్రభుత్వ కార్యకలాపాలు ఇలా జరుగుతాయా అన్న అశ్చర్యంలో మునిగిపోయాము.నిజంగా పిళ్ళైగారి కలంనుండి వెలువడ్డ ఈ నవల అద్భుతం.
    ఇంకా ఈ ప్రదర్శనలో కొన్న పుస్తకాలు:సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిగారి “బతుకు సేద్యం” కథలు,మహాశ్వేతా దేవి ఉత్తమ కథలు,ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి “ద్రౌపది”,నా.ధో.మహానోర్ గారి “గాంధారి”(నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురణ,అనువాదం:డా:అయాచితుల హనుమఛ్ఛాస్త్రి).

  31. Purnima

    చదివిన మరో రెండు పుస్తకాలు:

    పోలేరమ్మ బండ కతలు: ఏముండాయబ్బ ఈ కతలు! సదవతా ఉంటే.. యాడికో తీసుకుపోతా ఉండాయ్! ఇంత రాగి సంగటి ముద్దలో అంత కూరేసుకొని, రొంత నెయ్యేసుకొని నోట్లో పెట్టుకోగానే, గొంతులోకి జారిపోయినట్టు ఉండాయి.
    సీమ పిల్లకాయలు, భలే టపాకాయలు! 😉

    పుణ్యభూమి: బూదరాజు గారు ఆదివారాలు ఈనాడులో రాసిన “పుణ్యభూమి” కాలమ్ నుండి సంగ్రహించబడ్డ వ్యాసాలు. పొలిటికల్ వ్యాసాలు ఇంత ఎంటర్‍టేనింగ్ ఉంటాయని, నాకు తెలీదు. గత రెండు దశాబ్దాల్లో భారతదేశంలో జరిగిన అనేకానేక సంఘటనలు, వాటిపై వ్యాఖ్యానాలు తెల్సివచ్చాయి.

    ఇల్లాలి ముచ్చట్లు మొదలుపెట్టాను.. బాగా అనిపించాయి. పుస్తకం కొంచెం పెద్దదే, పూర్తవ్వడానికి చాలా సమయం పట్టేట్టు ఉంది.

  32. Purnima

    @మెహెర్:

    🙂 Better if you drop it, straightaway.

    ______________________________

    ఇప్పుడే కె.ఎన్.వై పతంజలి గారి “పతంజలి భాష్యం” చదివాను. ఇంత చలిలోనూ రక్తం బాగా వేడెక్కింది. 🙂 పొలిటికల్ సెటైర్ చదవటం ఇదే మొదటిసారి నాకు!

    ఈ పుస్తకం హైదరాబాద్ బుక్ ఫేర్‍లో లభ్యం. కొన్ని కాపీలే ఉన్నట్టు ఉన్నాయి. కనిపిస్తే తప్పక తీసుకోమనే చెప్తాను.

  33. మెహెర్

    “అలాంటప్పుడు, ఆయా రచయితలు నాకు హాస్యాస్పదం అనిపిస్తారు.”

    Just a page in to it… I already know I am in for a tough deal. I thought that my being male must have got something to do with it. Anyways, it’s nice to hear it from you — whatever your reasons may be! 🙂