మీరేం చదువుతున్నారు? – 1

పుస్తకాలు తరచుగా చదువుతున్నా, పేజీలకి పేజీలు సమీక్షలు రాసే ఓపికా, తీరికా లేని వారి కోసం ఈ పేజీని నిర్వహిస్తున్నాము. ఈ వారంలో మీరే పుస్తకాలు చదివారు, వాటిని గురించి ఓ రెండు ముక్కలు ఇక్కడ కమ్మెంట్ల రూపంలో పంచుకోవచ్చు.   ఈ నమునాలో వివరాలు చెప్తే సులువుగా ఉంటుంది.

పుస్తకం పేరు:
రచయిత:
భాష:
వెల:
అంతర్జాలంలో ఈ పుస్తక వివరాలు:
పుస్తకం పై మీ అభిప్రాయం:

  1. jaya

    @venkat: maa pasalapudi kadhalu kuda chala baguntayi. tappaka chadavandi

  2. సౌమ్య

    Amish రాస్తున్న ’Shiva Trilogy’ మొదటి భాగం – ’Immortals of Meluha’ పూర్తి చేశాను. మిగితా రెండు భాగాలు విడుదల కావాల్సి ఉంది. పుస్తకం – ఆసక్తికరంగా సాగింది. కథనం – అక్కడక్కడా కొంచెం పట్టు తప్పి, బోరు కొట్టించినా కూడా, మన మైథాలజీలోని పాత్రలు, ప్రదేశాలూ కావడం వల్ల చివరికంటా చదివించింది. భాష సాధారణంగా ఉంది. మరొక చేతన్ భగత్ పుట్టేశాడు అనిపించింది, ఆన్లైన్ లో ఈ పుస్తకం గురించి చాలా మంది రాస్తూ ఉంటే.
    మస్ట్ రీడా? అని అడిగారు కొంతమంది…వాళ్ళకి ఇది నా జవాబు: సిడ్నీ షెల్డన్, జెఫ్రీ ఆర్చర్ వంటి వారి పుస్తకాలు, నేను చదివినంతమటుకు, చాలా గ్రిప్పింగ్గా ఉంటాయి. ఆపకుండా చదివిస్తాయి. అలాగని, అవన్నీ మస్ట్ రీడ్స్ అని నేను క్లాసిఫై చేయలేను. అలాగే ఇదీనూ.
    http://shivatrilogy.com/ – పుస్తకం సమాచారం ఇక్కడ.

  3. రవి

    పద్యకవితా పరిచయం – బేతవోలు రామబ్రహ్మం గారిది
    దండి దశకుమార చరితమ్ – ఎం. ఆర్. కాలే గారిది,
    అవధాన ప్రక్రియ మీద ఒక పుస్తకం,
    కృష్ణమాచార్యుల వారి సంస్కృత బోధిని.

    ఇంచుమించు ఒకేసారి నాలుగు పుస్తకాలు మొదలెట్టాను.అవధాన పుస్తకం పూర్తయ్యింది. దశకుమార చరితమ్ డీఎలై లో సంస్కృత పాఠానికి ఒక తెలుగు అనువాదం దొరికింది.అయితే సగం (పూర్వపీఠిక) మాత్రమే ఉంది. ఎవరైనా పుణ్యాత్ములు మరో సగం ఎక్కడుందో చెబితే వారి మేలు మరువను. (కేతన గారి తెలుగు సేత దొరుకుతుంది, కానీ, నాకు దండి దశకుమార చరితమ్ సంస్కృత ప్రతి, తెనుగు లిపిలో పూర్తీ పాఠం కావాలి.)

  4. Achilles

    Reading “Confessions of an IT Manager” – written by Phil Factor, well known among the Database Admin folks. Must read for every IT guy, irrespective of the technology one is working on. The non-IT reader woulnd’t find it boring either!

    Here is the link for the book(the ebook version is free): http://goo.gl/qSfm

  5. venkat

    ఈమధ్య సుధా మూర్తి గారి “wise and otherwise” అనే పుస్తకం చదివాను. ఈ మధ్య వస్తున్న పర్సనాలిటి డెవలెప్మెంట్ పుస్తకాల కంటే ఎన్నో రెట్లు ఉన్నతమైన పుస్తక మిది. తన వ్యాపకం లో భాగంగా ఎన్నో వేల గ్రామాలు తిరిగిన ఈవిడ అనుభవాల్లోంచి వచ్చిన వ్యాసాలూ/కధలూ ఇవి. పుస్తక ప్రియులు తప్పక చదవాల్సిన పుస్తకం అనిపించింది.

  6. కౌండిన్య

    గత నెలలో చదివింది-అమరావతి కథలు

    ప్రస్తుతం చదువుతున్నది – బంగారు కథలు (కథా సంకలనం)

  7. Pavankumar

    నేను ఈ మద్య కదు కాని, కొన్నాళ్ళా కిందట చదివిన పుస్తకం
    చెతన్ భగత్ రసిన two states..
    చాల బవుంది
    పుస్తకం చదవదం లొ వున్న అనందన్ని గుర్తుకు తెస్తుంది.

  8. శ్రీనివాస్ వురుపుటూరి

    రంగనాయకమ్మ గారి “పిల్లలకోసం ఆర్థిక శాస్త్ర పాఠాలు” చదివాను. నాకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి ఇందులో. వందకి నాలుగో అయిదో తక్కువ అధ్యాయాల పుస్తకం. కొన్ని చోట్లలో బోర్ కొట్టించేంత పునరుక్తి ఉన్నట్లనిపించింది. మరి కొన్ని చోట్లలో అతిసాధారణీకరణం చెసిందా? అని అనుమానం కలిగింది. పెట్టుబడిదారీ భావజాలంలో పెరిగినందుకు కాబోలు, ఆవిడ అభిప్రాయాలపై తార్కికమైన వ్యతిరేకత లేకపోయినా, వంద శాతం ఏకీభవించటానికి మనసు ఒప్పుకోలేదు.

    దాశరథి రంగాచార్య విరచితమైన రెండు పుస్తకాలు చదివాను – శ్రీ శంకర చరితామృతం, శ్రీ రామానుజ జీవిత చరితామృతం. బోలెడన్ని అచ్చుతప్పులు (“నవ నారసింహుడు” కి బదులు “శవ నారసింహుడు” అని అచ్చు పడితే, ఏం చేయగలం, నొచ్చుకోవటం కాక?). పెద్దగా నచ్చలేదు నాకు. శైలి – సరళ వ్యావహారికం నుంచి కృతక గ్రాంధికంలోకి మారుతూ ఉంటుంది. ఎన్నో ఏళ్ళనుంచి రచయిత “ఘోషిస్తూ” వచ్చిన అమూల్యాభిప్రాయాలూ, స్వోత్కర్షా పునః, పునః పునరపి దర్శనమిస్తాయి – ఈ పుస్తకాల్లో. చరిత్ర తక్కువే, తత్త్వ వివేచనా లోతుగా ఉండదు. భక్తుల కోసం, ఆధ్యాత్మికతని వ్యాపకంగా పెట్టుకున్న వాళ్ళ కోసం రాసినట్లున్నారు రంగాచార్యుల వారు. Forgettable అనిపించింది.

    మరో పుస్తకం చేతన్ భగత్ రాసిన టూ స్టేట్స్ – సులభంగా చదివిస్తుంది. ఆత్మకథలాంటి నవల కాబోలు. తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు నచ్చుతుంది. తన హీరోయిన్లూ నచ్చుతారు కానీ మరీ పాప్ కార్న్ టైపు అనిపిస్తుంది.

  9. సౌమ్య

    సుమారుగా కుంటినడకన సాగుతున్న పుస్తక పఠనంలో – పూర్తి చేసినవి: అప్పుగా వచ్చిన సొదుం జయరాం రచనలు: “సొదుం జయరాం కథలు”, “అగమ్యం” నవలానూ. బాగున్నాయ్! రారా గారు ఈయనపై రాసిన వ్యాసం చదివి, ఈపుస్తకాలు దొరకబుచ్చుకుని (రాయబారాల పర్వం నడిపి)..చదివాను. ’వావ్’ తరహా కథలు కావు. రారా ’అలసిన గుండెలు’ గురించి పైన ఒక వ్యాఖ్యలో రాసినట్లే – ’తప్పక చదివి తీరాల్సిన’ జాబితాలోకి నేను ఎక్కించను కానీ, ఎవరన్నా అడిగితే చదవమనే చెబుతాను.

  10. venkat

    ఈ మధ్య కొనకళ్ళ వారి కధానికలు చదివాను. చాలా కధలు ఒక యాభయ్యేళ్ళ క్రితం సమస్యల్ని ప్రతిబింబిస్తున్నా కొన్ని కధలు ఇప్పటికీ రిలేవన్సు వున్నాయనిపించింది.

  11. bollojubaba

    మెహర్ జీ
    🙂

    ప్లీజ్ రీడ్ professional writer యాజ్ “మంచి రచయిత”:-)

    బొల్లోజు బాబా

  12. kalyan

    iam presetnly reading “Catcher in the Rye” by J D Salinger, I read 3 chapters its the story of a teen boy called holden.

  13. మెహెర్

    @bollojubaba:

    Baba garu,

    I do try, by God, I do. 🙂 Not so much for Telugu Literature, as for myself.

    Anyways, is there really a creature called “Professional writer” in Telugu? I mean, if he ever existed at all, he is long extinct by now, in my opinion. 🙂

  14. budugoy

    1) Surely You’re Joking Mr Feynman చదువుతున్నాను. పుస్తకం.నెట్లో ఎవరో రికమండ్ చేస్తే చదివాను. మంచి పుస్తకం. సైంటిఫిక్ టెంపరమెంట్ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం. ఫెయిన్మన్ భౌతికశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ విజేత. ఏదైనా స్వయంగా పరిశీలించి తెలుసుకునే స్వభావం వల్ల ఆయన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు చిన్నచిన్న వ్యాసాలుగా రాసి ప్రచురించరీ పుస్తకాన్ని. బ్రెజిల్ లో విద్యావ్యవస్థ గురించి ఆయన చెప్పిన విషయాలు మనకూ నూరు శాతం వర్తిస్తాయి. కొన్ని సార్లు నవ్విస్తూ, కొన్ని సార్లు ఔరా అనిపిస్తూ చక్కగా చదివించే గుణం కల పుస్తకం. చదడానికి మీరేమీ సైన్స్ విద్యార్థులు కానఖ్ఖర్లేదు. ఫెయిన్మన్ మిగతా పుస్తకాలు సంపాదించాలి.
    2) life and times of thunderbolt kid బిల్ బ్రైసన్ పూర్వ పుస్తకాలు short history of everything, walk in the woods నచ్చడంతో ఇదీ కొన్నాను. this is mainly about growing up in 50s of America. Times when microwaves were newest gadgest and TV was still monochrome. Bill talks nostalgically about life when things were much simpler, when there was no ADHD, kids could simply go out and play with out supervisions, and one knew everyone in neighborhood etc.. మనకు ఎనభయ్యో దశకంలో ఇలాగే ఉండేదనుకుంటా. సరదాగా ప్రయాణంలో చదువుకునే పుస్తకం.
    3) dont sprint a marathon ఏదో రైల్వే స్టేషన్లో కొన్నాను. కొన్నాక సెల్ఫ్ హెల్ప్ పుస్తకం అని అర్థమయ్యింది. హతవిధీ..ఇండియన్ రచయితలు ఈ జాన్రా ను ఇపుడప్పుడే ముట్టకపోవడం మంచిది. చెప్పిందే చెప్పి రాసిందే రాసి విసిగించాడు. i want my money back. boo hoo..
    4) ఊరి చివర — బ్లాగ్లోకంలో ఆహా ఓహోలు చూసి కొన్నాను. i cant believe everyone is going gaga about this book. i found it big bore and i dont think author (cringe to call him poet) knows what is poetry inspite of publishing 4th book.\

    5) Godel, Escher, Back – Golden eternal braid – ఈమాటలో కొడవళ్ళ గారి వ్యాసాలు చూసి సంపాదించానీ పుస్తకాన్ని. this is no bed-time read. u need pen/paper/pc by ur side when u read this. But very interesting book inspite of all that మూడు నెలల్లో పూర్తి చేస్తే గొప్పే (నా స్థాయికి.)

    btw ఇండియాలో కిండెల్ అమ్ముతున్నారట. you can start using it out of the box. ఎవరైనా ఫస్త్ హాండ్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్నవాళ్ళు సాధకబాధకాలు రాయగలరా?

  15. bollojubaba

    >ఆ కాసేపూ జీవితపు రొమ్ముల్ని చీల్చుతూ చేయి లోనికి జొనిపి వెచ్చగా, జిగటగా, నిర్విరామ లయతో కొట్టుకుంటున్న దాని గుండెకాయని తడుముతున్న అనుభూతి కలుగుతుంది.”

    dear mehar
    why dont you try to be serious professional writer.

    telugu literature miss you much.

  16. మెహెర్

    “ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ టైమ్” నవలలో మొదటి అధ్యాయం నిన్న పూర్తి చేసాను. మహా అయితే రోజుకి రెండు మూడు పేజీలు చదువుతున్నానేమో; కానీ చదివిన ఆ కాసినీ ఏ తొందరపాటూ లేకుండా, ఏ వాక్యాన్నీ అర్థం చేసుకోకనే వెనక వదిలేసాననిపించకుండా, పట్టి పట్టి చదువుతున్నాను. తగ్గ ప్రతిఫలమూ అందుతోంది. ఆ కాసేపూ జీవితపు రొమ్ముల్ని చీల్చుతూ చేయి లోనికి జొనిపి వెచ్చగా, జిగటగా, నిర్విరామ లయతో కొట్టుకుంటున్న దాని గుండెకాయని తడుముతున్న అనుభూతి కలుగుతుంది. స్టడీటేబిల్ స్తబ్ధతలో మైమరిచి పేజీలు తిరగేస్తున్న నా చుట్టూ, అప్పటిదాకా నన్ను ఆవరించి వున్న స్థలకాలాల యథార్థతకు మించిన యథార్థతతో, అంతకన్నా అర్థవంతమైన ప్రపంచం వచ్చి ముసురుకుంటుంది. అది సారవంతమైన ప్రపంచం, నా పరిసర ప్రపంచానికి మజ్జా రూపమనదగ్గ ప్రపంచం. “సారస్వతం జీవితానికి అనుబంధం కాదు; జీవితమే సారస్వతానికి అనుబంధం” అన్న భావనకు ఇంత దగ్గర దాఖలా ఇంతవరకూ ఏ రచనా చూపించలేదు. మార్సెల్ ప్రూస్ట్ తత్త్వశాస్త్రానికి అందని లోతుల్లోకి జీవితాన్ని తవ్వుతాడు; ఆ లోతుల్లోంచి అతని వచనం కవిత్వానిక్కూడా అందని సత్యాన్నీ సౌందర్యాన్నీ ఆవిష్కరిస్తుంది; ఈ రెంటినీ ఒక శాస్త్రకారుని నిర్మమత్వంతో సమన్వయపరుస్తాడు. ఇదీ కథంటే! ఇలా చెప్పాలి కథంటే! అనిపిస్తుంది పదే పదే. ఇపుడు తెలుస్తుంది ఎలాంటి పుస్తకాన్ని ఉద్దేశించి కాఫ్కా ఈ మాటలు అన్నాడో:

    “Altogether, I think we ought to read only books that bite and sting us. If the book we are reading doesn’t shake us awake like a blow on the skull, why bother reading it in the first place? So that it can make us happy, as you put it? Good God, we’d be just as happy if we had no books at all; books that make us happy we could, in a pinch, also write ourselves. What we need are books that hit us like a most painful misfortune, like the death of someone we loved more than we love ourselves, that make us feel as though we had been banished to the woods, far from any human presence, like a suicide. A book must be the axe for the frozen sea within us. That is what I believe.”

    కాఫ్కా ఒక నేస్తానికి రాసిన ఉత్తరంలోని ఈ వాక్యాలు మామూలుగా నేస్తాలకు పంపే ఉత్తరాల్లో పెద్ద ఆలోచనేమీ లేకుండా రాసే వాక్యాల్లాంటివే అనుకున్నాను. కేవలం ఒక పుస్తకం “మనలో గడ్డకట్టిన సముద్రాలపై గొడ్డలిపెట్టు” కాగలగడం అతిశయం అనుకున్నాను. ప్రస్తుతం స్వయంగా చవి చూస్తున్నాను. ఈ పుస్తకం నాతో చాన్నాళ్ళు ఉండబోతోంది.

  17. మెహెర్

    @Purnima:

    >>> ఎట్టకేలకు “అనుభవాలూ – జ్ఞాపకాలున్నూ” పుస్తకం నా చేతికి చిక్కింది. మూడో భాగం నుండి మొదలెట్టాను.

    ఎందుకు మూడో భాగం నుంచి? చాలా మిస్సవ్వచ్చేమో కదా అలా అయితే. చేతికి చిక్కడం అంటే అరువా, లేక కొనుగోలా? ఒకవేళ కొనుగోలే అయితే నేనూ సదరు కొట్ల ముందు వాలాలి, అందుకే అడుగుతున్నాను. 🙂

  18. వినయ్

    ముళ్ళపూడి వారి సాహితీ సర్వస్వం చదువుతున్నా.ఎండా కాలం పొద్దున్న తినే చద్దన్నం లా కడుపు లో చల్లగా వుంది.

  19. Purnima

    సి.పి.బ్రౌన్ లేఖలు – పుస్తకం పూర్తిచేశాను. దీనిపై నా అభిప్రాయం ఈ సైటులో త్వరలో..

    ఎట్టకేలకు “అనుభవాలూ – జ్ఞాపకాలున్నూ” పుస్తకం నా చేతికి చిక్కింది. మూడో భాగం నుండి మొదలెట్టాను. శ్రీపాద తెలుగు సంగతి దేవుడెరుగు, నాకాయనే మొత్తంగా నచ్చేస్తున్నారు. ఆయన ఆలోచనలు నన్ను అమితంగా ప్రభావితం చేస్తున్నాయి. చాలా నచ్చేస్తుంది.

    AP Govt. Oriental Manuscripts Library and Research Institute వారి ప్రచురణల్లో గురజాడ డైరీలు చదువుతున్నాను. ఆసక్తికరంగా ఉంది.

    అలనాటి సాహిత్య విమర్శ (అముద్రిగ గ్రంథచింతామణి పత్రిక (1885-1904) నుండి ఎంపిక చేసిన వ్యాసాలు) అన్న పుస్తకం మరోటి. ఇందులో భాషా కష్టము, అందులోని విషయమూ కష్టమే. అప్పట్లో పండితుల కొరకే నిర్వహించే పత్రికట ఇది. నాకు చాలా వరకూ అర్థంకావటం లేదు. పట్టుబట్టి చదువుతున్నాను.

  20. bollojubaba

    @ Srinivas gaariki

    thank you sir

  21. Sreenivas Paruchuri

    బాబా-గారు, బంగోరె పుస్తకాలు (అలానే వ్యాసాలు కూడా, ముఖ్యంగా నెల్లూరులో తొలిరోజుల్లో చేసిన పని) చాలానే వున్నాయి. DLI లో ఎన్నున్నాయో తెలియదు. A quick search showed the following four:
    Top 1:

    1. Brown Lakhalu (ఇది ఆయన తిరుపతిలో పనిచేసిన రోజుల్లో వచ్చిన నాలుగు పుస్తకాల్లో ఒకటి)
    2. Braun Jaabulloo Sthaanika Charitra Shakalaalu Kad’apa Jaabula San’kalanan’ (ఇది కూడా తిరుపతి సిరీస్‌లోనిదే)
    3. Malapalli Navalapai Prabhutva Nishedhalu
    4. ban’goore kuuniraagaalu itara rachanalu(ఇది బంగోరేపైన వచ్చిన వ్యాస సంకలనం)

    ఇక నాకు తెలిసిన (అంటే నా దగ్గరున్న) పుస్తకాలు:
    1. వేమన పద్యాలు : (సి. పి. బ్రౌన్ 1839 నాటి సంకలనం), తి.తి.దే, 1985 (There are more editions of this book)
    2. తాతాచార్ల కథలు, ఎమెస్కో, 1974
    3. బ్రౌన్‌ జాబులు – తెలుగు జర్నలిజం చరిత్ర 1832 నుంచి 1857 దాకా, 1973 (Its one of Bangore’s own publications. His 3rd publication to be precise.)
    4. Literary autobiography of C.P. Brown, Tirupati, 1977
    5. ఆంధ్ర గీర్వాణఛ్చందము = The prosody of the Telugu and Sanscrit languages explained, Tirupati, 1977
    6. Speeches and essays of Dr. C.R. Reddy, Nellore Progressive Union, Nellore, 1970
    7. First version of ‘KANYASULKAM’ by G. V. Apparao – Reprinted with
    copious annotations by ‘Bangorey’_, Nellore historic publication,
    Nellore, March 1969

    Bangore played a major role in publication of:
    Dr. Jolipalayam Mangamma’s: Book printing in India – with special reference to the contribution of European scholars to Telugu, 1746-1857, Tirupati, 1975

    Top 2:
    ఆయన ఆత్మహత్య చేసుకున్న మాట నిజమే. కొందరు వ్యక్తులు మోసం చేసిన మాట, ఎలాంటి సంస్థలనుండి సహాయం అందని మాట కూడా నిజమే. ఆ వివరాలన్నీ మరోచోట, మరోసారి.

    Top 3:
    బంగోరె రాతలు చాలా emotionalగా, ఆవేశపూరితంగా వుంటాయి. అందుకనే కదిలించి వేస్తాయి అన్న మాట వాడాను. ఆయన బ్రౌన్ పైన చూపిన వీరభక్తి తో నాకు తీవ్రమైన విభేదాలున్నాయి. అదిక్కడ అప్రస్తుతం. ఆయన పుస్తకాలలో మీకు విలువైన సమాచారం లభిస్తుంది. ఆ source materials అన్నీ వెలికి తీసి, లేక సంపాదించి చదవాలనే కుతూహలం (/ఆవేశం) కలుగుతుంది. నా విషయంలో అయితే అదే జరిగింది. Archival work అంటే దుమ్మూ, చీకటి గదులు, బోలెడు శ్రమ అనుకునే మన తెలుగువాళ్ళకు ఆయన తనకున్న పరిమితుల్లో చేసిన చారిత్రక పరిశోధన విలువేమిటో ఎప్పటికైనా అర్థమవుతుందా!

    — శ్రీనివాస్

  22. విష్ణుభొట్ల లక్ష్మన్న

    బేతవోలు రామబ్రహ్మంగారి “పద్య కవితా పరిచయం – నన్నయ్య నుంచి కంకంటి దాకా” చదువుతున్నా! ఇక్కడ ఆ పుస్తకాన్ని పరిచయం చెయ్యాలని ఉంది.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  23. bollojubaba

    > బ్రౌన్ లేఖలు అనే పిడిఎఫ్ ను ఇప్పుడే డౌన్‍లోడ్ చేశాను. ముప్ఫై పేజీలు చదివానంతే, పుస్తకం మూసి
    > పడుకోవాలంటే ప్రాణం మీదకు వస్తోంది

    అక్షర సత్యం. రాత్రి మూడయ్యింది పూర్తయ్యే సరికి. రక్తం వేడెక్కి ఇంకా దిగలేదు. మర్లా చదువుతున్నాను.
    పరుచూరి శ్రీనివాస్ గారూ, ఇంకా చాలానే ఉన్నాయన్నారు ఏమైనా లింకులుకానీ, ఫైల్లు కానీ పంపించండి సారూ?
    ఒక అప్రస్తుత ప్రసంగం
    బంగారే కి యూనివర్సిటీ వారు తగిన ఆర్ధిక సహాయం చేయక, ఈయన పరిశోధనలకు సరైన గుర్తింపునివ్వక పోవటంతో పిచ్చెక్కి ఆత్మ హత్య చేసుకొన్నాడని అంటారు నిజమేనా. can any one clarify? ఒక వేళ అదో స్కాండల్ అయితే పాపము శమించుగాక!

  24. మెహెర్

    రా.రా “సారస్వత వివేచన” నిన్న పూర్తి చేసాను. కొన్ని వ్యాసాలు బాగున్నాయి, కొన్ని మొదలవకుండానే అర్థాంతరంగా ముగిసిపోయినట్టున్నాయి, కొన్ని వ్యర్థవిన్యాసాలనిపించాయి. మొత్తం మీద ముందున్న ఉత్సాహం చదివిం తర్వాత చల్లబడింది. ఈ చల్లబడటం రా.రా వల్ల కాదు, ఈ పుస్తకం ప్రారంభించే సన్నాహంలో అసలు “విమర్శ” అనే వ్యాసంగం పట్లనే నాకు తాత్కాలికంగా పెరిగిన అంచనాల వల్ల. పుస్తకం పూర్తి చేసాకా అదెంత నిష్పలమో మరోసారి స్ఫురించింది. చాలామంది విమర్శకుల్లాగానే రా.రా విమర్శని స్వతస్సిద్ధమైన నియమాలతో స్వయంప్రతిపత్తి గల యంత్రాంగంగా చూస్తాడు. ఆ దృక్కోణాన్ని అంగీకరించి చదివినంత సేపూ ఈ వ్యాసాలు బాగున్నాయనిపిస్తాయి; చురుకైన వాక్యాల ఉరవడిలో అతని ఆలోచన విషయానుగతంగా గమించే తీరూ, తన వాదనల నిరూపణకు ఖచ్చితమైన మార్గాన్ని పరచడంలో అతని చాతుర్యమూ అబ్బురపరుస్తాయి; తేటతెల్లమైన విషయాలకే ఒక “force of revelation” జోడించి బయటపెట్టే శైలి వచనానికి కళ్ళప్పగించేలా చేస్తుంది; తన అభిప్రాయాల పట్ల అతని నిబద్ధత విశ్వాసపాత్ర మనిపిస్తుంది. కానీ ఒక్కసారి సారస్వతాన్ని “రచయిత”, “పాఠకుని”తో నిమిత్తం వున్న విషయంగా చూడటం మొదలుపెట్టామా, రా.రా (అతననే కాదు ఈ విషయంలో ఏ విమర్శకుడైనా) కేవలం స్వంత ఎజెండా వున్న మరొక్క పాఠకునిగా మాత్రమే మిగులుతాడు; అతని వాదనల వెనుక దృశ్యాదృశ్యంగానైనా కానవచ్చే విమర్శనా పాండిత్యమంతా ఒక అనవసరమైన బాగేజీగానూ, ఒక రచన చదివేటప్పుడు రచయితా పాఠకుల మధ్య ఏర్పడే సన్నిహితమైన వలయానికి వెలుపలి వ్యవహారంగానూ తోస్తుంది. అందుకే, నావరకూ ఈ పుస్తకానుభవమంతా, ఒక పాఠకునిగా నేను రా.రా అనే మరో పాఠకుణ్ణి కొన్ని సందర్భాల్లో అంగీకరించడమూ, మరికొన్ని సందర్భాల్లో తృణీకరించడమూ గానే మిగిలింది. శ్రీశ్రీ మీద అద్దేపల్లి వాఖ్యానం చూస్తే మాత్రం అటువంటి ఎన్నో వికృత వక్రభాష్యాల్నించి సారస్వతానికి విముక్తి కలిగించడానికి చాలా మంది రా.రాలు అవసరమనిపించింది. మొత్తం వ్యాసాల్లో చలం మీద రాసిన వ్యాసం “మహానుభావుడు చలం” బాగా నచ్చింది.

  25. telugu4kids

    పట్టుపువ్వులు పుస్తకం గురించి సమీక్ష రాద్దామనుకుని చదవడం మొదలు పెడితే ఇక్కడ ఆగి ఇది తయారు చెయ్యకుండా ఉండలేకపోయాను. http://lalithagodavari.com/sounds/emichitram.wmv
    ఇంకొంచెం refine చేసి త్వరలోనే తెలుగు4కిడ్స్ లో అందిస్తాను.
    (ఇంతకు ముందే ప్రచురణకర్తల అనుమతి తీసుకుని ఉన్నాను. ఇంతవరకూ ఒక్క కవిత మటుకు present చెయ్యగలిగాను. ఇది రెండవది.)

  26. Sreenivas Paruchuri

    > బ్రౌన్ లేఖలు అనే పిడిఎఫ్ ను ఇప్పుడే డౌన్‍లోడ్ చేశాను. ముప్ఫై పేజీలు చదివానంతే, పుస్తకం మూసి
    > పడుకోవాలంటే ప్రాణం మీదకు వస్తోంది. 🙁

    మరి బంగోరె రాతలంటే యేమనుకొన్నారు! ఊపివేస్తాయ్ .. కదిలించివేస్తాయ్ … రక్తం వేడెక్కి పోతుంది … 🙂 మొదలెట్టారుగా, ఆయనవే మరో డజను పుస్తకాలుంటాయి. అవి కూడా కానిచ్చేయండి. తర్వాత వివరంగా మాట్లాడుకుందాం.

    తిరుపతి కనుక వెళ్తే SVU లైబ్రరీలో ప్రచురణల విభాగానికి వెళ్ళండి. ఒక నాలుగు పుస్తకాలు దొరుకుతాయ్. 12 ఏళ్ళ క్రితం వెళ్ళినప్పుడు ఒక్కొక్క పుస్తకం 800-900 కాపీలు చొప్పున గుట్టలు పడున్నాయి. ఎందుకయినా మంచిదని ఒక్కొక్కటి నాలుగేసి కాపీలు కొనుక్కున్నాను. మరెక్కడా అమ్మరు మరి. ఎందుకని అడక్కండి. మరి మన ప్రభుత్వ సంస్థలంతే! On a related note, మంగమ్మ గారు రాసిన అల్లూరి సీతారామరాజు, Rate Schools of Godavari పుస్తకాలు A.P. Archives లో మాత్రమే అమ్ముతారు. అదొక ఘనత వహించిన సంస్థ. తిరుమల రామచంద్రగారి “గాథాసప్తశతిలో తెలుగు పదాలు” మీరు వూహించలేని చోట మాత్రమే దొరుకుతుంది. ఎవరయినా జవాబు చెప్తారేమో చూద్దాం :-).

    — శ్రీనివాస్

  27. Purnima

    తెలుగంటే కథలూ, నవలలూ తప్ప వైవిధ్యమేమీ లేదని వాపోయే నేను, తెలుగులో ఈ మధ్యకాలంలో చదువుతున్న, చదవాలనుకుంటున్న పుస్తకాలు నన్ను నోరెళ్ళబెట్టేలా చేస్తున్నాయి. డిజిటల్ లైబ్రరీ పుణ్యమా, మేం చూసొస్తున్న కొన్ని సంస్థల పుణ్యమా అని.

    ముందుగా బూదరాజు రాధాకృష్ణ రాసిన “పద్య సాహిత్యం: సంఘ చరిత్ర” అనే పుస్తకం. అరవై పేజీలు. ధర పాతిక రూపాయలు, అది అందించే సమాచారం మాత్రం వెలకట్టలేనిది. ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తాను ఇక్కడే!

    బ్రౌన్ లేఖలు అనే పిడిఎఫ్ ను ఇప్పుడే డౌన్‍లోడ్ చేశాను. ముప్ఫై పేజీలు చదివానంతే, పుస్తకం మూసి పడుకోవాలంటే ప్రాణం మీదకు వస్తోంది. 🙁

    మరికొన్ని పుస్తకాల వివరాలు రేపు. ఇప్పుడు వెతికి రాయాలి కాబట్టి.

  28. సౌమ్య

    -నండూరి రామమోహన రావు ఆంధ్రజ్యోతికి రాసిన సంపాదకీయ వ్యాసాల సంకలనాలు: అనుపల్లవి, చిరంజీవులు చదివాను. చాలా మంచి వ్యాసాలు.
    – కుమార శతకం, భాస్కర శతకం, నరసింహ శతకం, నారాయణ శతకం చదివాను. శంకర శతకంతో కుస్తీ పడుతున్నాను. సులభంగా అర్థమయ్యాయి. (చివరిది తప్ప)
    -Times of India లో Jug Suraiya రాసిన వ్యాసాల సంకలనం – Second opinion మొదలుపెట్టాను. శైలి చాలా బాగుంది.
    -Creationism, Theory of Evolution: రెంటి మధ్యా ఉన్న వాదప్రతివాదాలను వివరిస్తూ, ఏఒక్కరి పక్షమూ తీసుకోకుండా, ఇద్దర్నీ విశ్లేషించే ప్రయత్నం చేస్తున్న “Selfless gene” కూడా మొదలుపెట్టాను. ఆసక్తికరంగా ఉంది.
    (ఇదీ ప్రస్తుతం నడుస్తున్న కథ)

  29. నరసింహారావు మల్లిన

    ప్రస్తుతం నేను చదువుతున్న పుస్తకాలు.
    మందరం శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం అయోధ్యకాండ వావిలికొలను సుబ్బారావుగారు
    రామాయణ కల్పవృక్షం అయోధ్యకాండ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు
    అమరకోశము గురుబాలప్రబోధికా వాఖ్యతో అమరసింహుడు
    సంస్కృత పాఠమాల సంస్కృత భాషా సేవామండలి హైదరాబాదువారి ప్రచురణ

  30. నరసింహారావు మల్లిన

    @పూర్ణిమ
    మీరు అన్నమయ్య పద సాహిత్యం కోసం ప్రయత్నిస్తున్నట్టుంది. ఓసారి తిరుపతి లోని టి.టి.డి. వారి అడ్మినిష్ట్రేటివ్ ఆఫీసు బిల్డింగులకు దగ్గఱలో నున్న టి.టి.డి. ప్రెస్సులో ప్రటత్నించగలరు, తిరుపతి వెల్ళినపుడు. నేను అక్కడే మొత్తం సెట్టుని రెండుసార్లు కొనటం జరిగింది. 25% కన్సెషను కూడా ఇచ్చారప్పుడు.

  31. మెహెర్

    1) తెలిసినాయన్ని గత రెండు వారాలుగా పీడించగా పీడించగా చిన్నయసూరి బాలవ్యాకరణానికి దువ్వూరి వేంకటరమణ శాస్త్రి రాసిన సమీక్ష “రమణీయం” చేతికి వచ్చింది. నిన్ననే మొదలుపెట్టాను. ఇంతదాకా స్వీయచరిత్రలో దువ్వూరి వ్యావహారికాన్ని ఆస్వాదించాను. ఇప్పుడు “దువ్వూరి – ద గ్రాంథికం”ను చవి చూస్తున్నాను. 🙂 కాస్త కష్టమే అనిపిస్తుంది. అసలు తెలుగు వ్యాకరణం మీద కన్నా దువ్వూరి మీద ఆసక్తితో తెప్పించుకున్నాను.

    2) ఇక ఇప్పట్లో In Search of a Lost timeకి లేటెస్టు అనువాదం సంపాయించలేనన్న నిశ్చయానికొచ్చేసి, నా దగ్గరున్న C. K. Scott Moncrieff అనువాదంతోనే ముందుకుపోవాలని నిశ్చయించుకున్నాను. ఆల్రెడీ నిండా మునిగిపోయాను. చూడాలి ఎప్పుడు తేలతానో.

    మిగతా పుస్తకాలన్నీ పక్కన పెట్టి ఇవి మొదలుపెట్టాను. ఈ రెండూ పూర్తయ్యేదాకా ఇంకేవీ చదవకూడదన్న నిశ్చయంతో వున్నాను, మరీ దురదపుట్టనంత వరకూ ఏమీ రాయకూడదని కూడా. ఇలా అందరికీ చెప్పేస్తున్నందుకయినా ఆ నిశ్చయాలకి కట్టుబడి వుండాలి. 🙂

  32. సౌమ్య

    1. ఆముక్తమాల్యద-పరిచయం : సిపిబ్రౌన్ అకాడెమీ వారి ముద్రణ చదివాను. చాలా మంచి పుస్తకం. పద్యసాహిత్యాన్ని చదివేంత తెలుగురాని నాలాంటివారికి – ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావడం వల్ల కలిగే ఉపయోగాలు చాలానే ఉన్నాయి. త్వరలో దీనిపై వివరంగా రాస్తాను.
    2. మధురాంతకం రాజారాం – బాలల కథలు (విశాలాంధ్ర, 1992) చదివాను. నాకు ఒక పదేళ్ళప్పుడనుకుంటా, దీన్ని చదివే ప్రయత్నం చేసి అవతల పడేసినట్లు గుర్తు. ఇప్పుడైతే కథలు నచ్చాయి. ఇవి బాలల కథలు కావేమో – బహుశా టీనేజీ వయసున్న పిల్లలను దృష్టిలో ఉంచి రాసారేమో, అందుకే నాకు అప్పట్లో నచ్చలేదేమో అనిపించింది. ఇందులో వాడిన భాష అయితే, ఇప్పటి స్కూల్ పిల్లలు (కనీసం – “బాలలు”..)అర్థం చేస్కోడం కష్టమే. ఈ కథలన్నీ మూలాలు రశ్యన్, అమెరికన్ రచయితలవి. రాజారాం గారి అనుసరణలు మాత్రం టూగుడ్.
    2. “Gold of the gods”: Erich Von Daniken చదువుతున్నాను. ఇవి మంచి సై-ఫై కల్పనలు అనుకోవాలో, నమ్మలేని నిజాలనుకోవాలో, సీరియస్ పరిశోధనలనుకోవాలో, ఫార్స్ అనుకోవాలో : తేల్చుకోలేని స్థితిలో ఉన్నా ప్రస్తుతానికి.

  33. సౌమ్య

    1. పిలకా గణపతి శాస్త్రి ’అందని చందమామ’ చదివాను ఇప్పుడే. ప్రవరుడు-వరూధిని కథకి గద్యరూపం. గంధర్వులు కూడా మనలాగే ఆలోచిస్తారన్నమాట (టిపికల్ ఇండియన్ ఫిమేల్ లవ్)..అనిపించింది. మనుచరిత్రలోని ప్రవరుడు-వరూధిని కథని చివర్లో కొంత పొడిగించారు. కథనం ఆసక్తికరంగా, నాటకీయమ్గా, చదివించేలా ఉంది.
    2. నిన్నే పద్మినీసేన్ గుప్తా రాస్తే, కుందుర్తి వారు అనువదించిన ’సరోజినీ నాయుడు’ పుస్తకం కాసేపు చదివాను. నిజానికి-అది జీవిత చరిత్ర అన్నట్లు చెప్పారు కానీ (సాహిత్య అకాడెమీ ప్రచురణ, 1980), అదేదో ఆవిడపై విమర్శ లాగుంది. దాదాపు పుస్తకం మొదటి ముప్పై నలభై పేజీలు – సరోజినీదేవి కవిత్వాన్ని తీవ్రంగా విమర్శించడంతోనే అయిపోయింది. అంతే కాక, పుస్తకం ’జీవిత చరిత్ర’ లా కాక, కవిత్వం తీరుతెన్నుల విశ్లేషణకూ, రచయిత/అనువాదకులకు కవిత్వం పై ఉన్న అభిప్రాయాల వ్యక్తీకరణకూ వాడుకున్నట్లనిపించి నిరాశ పడ్డాను. అనువాదం నాకంత రుచించలేదు. అనవసర క్లిష్టతను జొప్పించినట్లనిపించింది.
    3. “IPL, Cricket and Commerce: an Inside story” – Alam Srinivas, T.R.Vivek రాసిన పుస్తకం చదువుతున్నాను. శైలి కొంచెం సీరియస్ టైపైనా కూడా, పుస్తకం చర్చిస్తున్న విషయం వల్ల ఆసక్తికరంగా సాగుతోంది పఠన. క్రికెట్-వ్యాపారం-జూదం-ఎంటర్టైన్మెంట్ – నాలుగుముక్కల్లో చెప్పాలంటే ఇదీ ఈ పుస్తకం కథ. ఐపీఎల్ గురించి చాలా విషయాలు తెలుస్తాయి.

  34. saritha

    nenu chalam gaari brahmaneekam chadivaanu .kanee naaku konni artham kaledu.konni chaduvuthe matram neti ammayilaku aa pusthakaanni thappanisari cheyyali anipinchindi.hats off to chalam .

  35. మెహెర్

    “జానకితో జనాంతికం”

    మాట్లాడే రచనలు నాకు విసుగని ఇక్కడే ఓ చోట చెప్పాను. కానీ అది మాట్లాడుతున్నవారెవరన్న దాన్ని బట్టి వుంటుందేమో. ఈమధ్యనే దువ్వూరి వేంకటరమణశాస్త్రి స్వీయచరిత్ర పూర్తి చేసాను. ఆయన పుస్తకమంతా మాట్లాడుతూనే వున్నారు. విసుగు మాట అటుంచితే, నిర్విరామంగా అలానే వింటూ వుండిపోవాలనిపించింది. ఆ అనిపించడం ఎందుకో ఏమిటో తెలుసుకోవాలంటే ఈ “జానకితో జనాంతికం” అనే చిన్న “వాక్ చిత్రం” చదివితే చాలు. అవటానికిది ఆయన ఆకాశవాణి కోసం *మాట్లాడిందే* అయినప్పటకీ, ఆయన రాయటంలోనూ ఈ మాటల ధోరణి వినిపిస్తూనే వుంటుంది. ఇది మొదట 1975లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైంది. ఇక్కడ భద్రాద్రి సీతమ్మవారితో తీరుబడిగా జనాంతికం మాట్లాడుతున్నాడాయన. తెలుగు ఎంత ఆత్మీయత ఉట్టిపడే భాషో కదా అనిపిస్తుంది ఆయన మాటలు వింటూంటే. అదే మళ్ళీ ఇంగ్లీషు మాత్రం చాలా ముక్తసరి భాష. మరి పరాయిభాష కావటం వల్లనో తెలీదు, స్వతహాగా అంతేనో తెలీదు. ఎవర్నన్నా దూరంగా నెట్టాలన్నా, వాళ్ళ స్థానంలో వాళ్ళని నిలబెట్టాలన్నా చక్కగా ఉపయోగపడుతుంది. తెలుగుతో అబ్బే ఆ నాటకాలు సాగవు. దగ్గరితనం వద్దన్నా పదాల మధ్య నుంచి నెర్రెలు చీల్చుకు మరీ బయటపడిపోతూంటుంది. సరే విషయానికొస్తే, “జానకితో జనాంతికం” ఈ క్రింది లింకులో పెడుతున్నాను. బాపు బొమ్మ అదనపు బహుమతి:

    http://www.scribd.com/doc/28497333/Janaki-Tho-Janaantikam-%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A8%E0%B0%95%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%9C%E0%B0%A8%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B0%BF%E0%B0%95%E0%B0%82