మీరేం చదువుతున్నారు? – 1

పుస్తకాలు తరచుగా చదువుతున్నా, పేజీలకి పేజీలు సమీక్షలు రాసే ఓపికా, తీరికా లేని వారి కోసం ఈ పేజీని నిర్వహిస్తున్నాము. ఈ వారంలో మీరే పుస్తకాలు చదివారు, వాటిని గురించి ఓ రెండు ముక్కలు ఇక్కడ కమ్మెంట్ల రూపంలో పంచుకోవచ్చు.   ఈ నమునాలో వివరాలు చెప్తే సులువుగా ఉంటుంది.

పుస్తకం పేరు:
రచయిత:
భాష:
వెల:
అంతర్జాలంలో ఈ పుస్తక వివరాలు:
పుస్తకం పై మీ అభిప్రాయం:

  1. Gireesh K.

    మా అమ్మగారి మరణం వలన కలిగిన బాధనుంచి తేరుకోలేక, జీవచ్చవంలా కాలం గడుపుతున్న నన్ను, పుస్తకం నన్ను హత్తుకుని, ఊరడించి, లాలించి మామూలు మనిషిని కావడానికి సహాయపడింది. టైము దొరకట్లేదు అన్న సాకుతో, చాన్నాళ్ళ క్రితం వదిలేసిన చదవడమనే హబీ, మళ్ళీ నాకు మార్గదర్శి అయ్యింది.

    ప్రస్తుతం భమిడిపాటి రామగోపాలం గారు వ్రాసిన “ఇట్లు మీ విధేయుడు” కథాసంపుటం చదువుతున్నాను. ఈ పుస్తకంలోని మొట్టమొదటి కథ “వెన్నెల నీడ” ఒక్కటి చాలు, చదువరిని కట్టిపడేయడానికి. తెలుగు మధ్యతరగతి జీవితాన్ని, దాని వైశాల్యాన్నీ, సంకుచితత్వాన్నీ, ఆశలనూ, ఆకాంక్షలనూ, స్వాతంత్ర్యానంతరం దాని పరిణామ క్రమాన్నీ చాలా చక్కగా, చిన్ని చిన్ని కథల ద్వారా ఆవిష్కరించిన “భరాగో” తీరు అత్యద్భుతం. ఈ పుస్తకంలో ఏ ఒక్క కథా మనల్ని నిరాశపరచదు. ముఖ్యంగా, ఈయన శైలి ఎంతో హృద్యం. కేవలం చిన్న చిన్న సంభాషణల ద్వార కథను నడిపే తీరు చాలా తక్కువమందికే తెలిసిన విద్య. వర్ధమాన రచయితలకు ఈ సంపుటం ఒక పాఠ్యపుస్తకమే. వీలైతే త్వరలో ఈ పుస్తకం గురించి పుస్తకం.నెట్ లో రాద్దమనుకుంటున్నాను.

  2. సౌమ్య

    రావికొండలరావు కథలు చదివాను. బాగున్నాయి. ఎప్పుడైనా తీసి చదివి కాలక్షేపం చేసేయొచ్చు 🙂
    ఈపుస్తకం గురించి త్వరలో పుస్తకం.నెట్లో పరిచయం చేద్దాం అనుకుంటున్నాను.

  3. సౌమ్య

    స్వల్ప విరామానంతరం మళ్ళీ పుస్తక పఠనంలోకి: ఇంద్రగంటి జానకీబాల రాసిన ’దుర్గాబాయి దేశ్ముఖ్’ మొదలుపెట్టాను. పుస్తకం రాసిన విధానమేం నచ్చలేదు కానీ, దుర్గాబాయ్ గారి గురించి కనుక, అలాగే, చదువుతున్నాను. పుస్తకం బహు చిన్నది – ఒక తెలుగు పుస్తకాన్ని, తొంభై పేజీలన్నా లేకుండానే తొంభై రూపాయలకమ్మగా నేను చూస్తాననుకోలేదు. ఇప్పుడు చూశాను. ఇదీ ఒక విధమైన పురోగమనమే కాబోలు.

  4. శ్రీనిక

    I am presently reading Dr.Jeckle and Mr.Hyde by Robert Luios Stevenson. It was one of his famous works. It explains how man is paradoxical in nature. He elicits man’s bi-faceted qualities.

  5. మెహెర్

    @Purnima:

    Wow! అప్పుడే కొనేయడమూ చదవటం మొదలెట్టేయడమూనా!

    పెళ్ళాం నెత్తిన పెట్టిన ఒట్టుకి కట్టుబడి కల్లుకాంపౌండు జోలికి పోకుండా అతికష్టం మీద ఉగ్గబట్టుకునే తెగమరిగిన తాగుబోతుకి మల్లే నేనీ మధ్య పుస్తకాల షాపుల జోలికి పోకుండా అతికష్టం మీద నిభాయించుకుంటున్నాను. ముందు అల్మారాలో దేపెట్టిన పుస్తకాలన్నీ అవజేసిం తర్వాతే మళ్ళీ కొత్త పుస్తకం కొనాలన్నది కొత్త సంవత్సరం తీసుకున్న నిర్ణయం. కానీ ఈ కామెంట్ మరీ ఊరించేసి నా నిర్ణయాన్ని సడలించేస్తోంది. కాబట్టి ఇక తప్పదు కొనాలి. 🙂

    >>> “if that doesn’t inspire you for a living.. God save you! :)” … యెస్! య్యెస్!! య్యెస్స్!!! య్యెస్స్‌స్స్!!! 😛

    స్టీఫెన్ కింగ్ వాక్యం బాగుంది.

    (ఛ! కొద్దిలో వందో కామెంట్ మిస్సయి పోయాను. :P)

  6. Mamatha

    I am currently reading Playful Parenting by Lawrence J. Cohen. I think everyone(not just parents, but everyone who will come in contact with kids.. so, thats everyone) should read this book. It explains the frustrations of a child(infant to teens .. or older *smiles*) and gives suggestions on how to convert tears to giggles, which would make your day. It exaplains how to grow(yep grow, not stoop) to a kid’s level of thinking, to understand them.

  7. Purnima

    @మెహెర్:
    Amazing that you didn’t pick up “The Original of Luara” yet. I’ve *seen* (not read) the book and fell in love with it. I just read Dmitri’s introduction and then skimmed through the rest of the pages.

    I’m not a fan or anything to Nobokov, but I still wanted this copy in my collection for sure. Reason? For me, it gave a chance to peep into a writer’s corner, I could see his handwriting, the strike offs, the spelling mistakes, variations of the shake of his hand, his struggle for the apt word.. Man, it was too much of exhilaration to leave it behind the rack where I picked it in Crosswords.

    Agreed that, everyone has their own reason to pick up books, I would still go out and out and suggest *anyone* (though you’re into English novels or not, Nobokov’s fan or not) to pick this book up. Don’t read it. Take it home. Cover the book with plastic cover as we used to do as kids. And place it on the rack such a way that its mostly in your sight. And when the going gets tough and you think, its easy for everyone else except you.. pick this book, sit down in a corner with book on our lap, and no, don’t read it. Just see those magical letters on the page, broken words, strike offs.. if that doesn’t inspire you for a living.. God save you! 🙂

    I know I bragged too much. Anyway,the book costs one around 700 bucks, so…

    In the heat of the topic, a quote of Stephen King, which has occupied my brain off late.

    “Life is not support system for art. It’s the other way round.”

  8. మెహెర్

    నబొకొవ్ జీవిత చరిత్రకారుడూ, విమర్శకుడూ బ్రైన్ బోయ్డ్ ఈమధ్యనే ఒక వ్యాసం రాసాడు. మధ్యాహ్నం చదివాను. నబొకొవ్ విషయంలో నాకొకటి ఆశ్చర్యం కలిగిస్తూంటుంది. ఒక్కరంటే ఒక్క వ్యక్తి—పైగా తన రచనాజీవితంలో ప్రచురించిన ప్రతీ ఒక్క వాక్యమూ బోలెడన్ని మెరుగుల తర్వాతే బయటకువెళ్ళిందని చెప్పుకున్న వ్యక్తి (అంటే అంత పట్టింపు వున్న వ్యక్తి); అంతేగాక తన వ్యక్తిగతజీవితంలో రెండు ప్రపంచయుద్ధాలూ, మాతృభూమి నుంచి వెలివేత లాంటి ఎన్నో గడ్డు పరిస్థితుల్ని భరించిన వ్యక్తి—అలాంటి ఒక్కరంటే ఒక్క వ్యక్తి ఇంత విస్తారంగా రాయగలగడం సాధ్యమా అనిపిస్తుంది (ఇన్ని కథలూ, ఇన్ని నవలలూ, ఇన్ని కవితలూ, ఇన్ని వ్యాసాలూ!). ఈ వ్యాసంలో ఇంకా నబొకొవ్ రచనలు ఎన్ని వెలుగులోకి రావలసి వుందో చెప్పాడు వ్యాసకర్త. రష్యన్ సాహిత్యంపై నబొకొవ్ రాసిన వ్యాసాల సంపుటి బహుశా ఇంకో మూడేళ్ళలో రానుందట. ఇదీ వార్త:

    “I am now editing these lectures with my former student, Stanislav Shvabrin. They range from saints’ lives to Vladislav Khodasevich, whom Nabokov considered the greatest 20th-century Russian poet. They cover the literary material that he knew best, that he devoured as a boy, studied at Cambridge, and was brought to Cornell to teach. In the lectures, Nabokov opens up the whole range of Russian literature, injecting all his passion and imagination into discussions of Pushkin or digressions on literature, art, and life. The lectures should be published in three years or so.”

    Hmm, yummy! 🙂 ఇదేగాక ఇంకో రెండేళ్ళలో నబొకొవ్ “కలెక్టెడ్ పొయెమ్స్” కూడా రానున్నాయట. అవిగాక, ఆయన అనువాదాలు చాలా రావలిసినవి వున్నాయి. వీటితోబాటూ ఆయన తన చెల్లెలు ఎలీనాకూ, భార్య వెరాకూ రాసిన ఉత్తరాలు కూడా వచ్చే సంవత్సరం ప్రచురణకు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తోంటే బహుశా ఇంకో దశాబ్దం దాకా నబొకొవ్‌కి వీడ్కోలు పలికి ముందుకుపోవాల్సిన బాధ లేదన్నమాట. 🙂

    వ్యాసంలో అసలు విషయం ఈ వార్త కాదు. ఇందులో ఇటీవలే ప్రచురితమైన నబొకొవ్ అసంపూర్ణ నవల “ద ఒరిజినల్ ఆఫ్ లారా”ను క్లుప్తంగా సమీక్షిస్తున్నాడు బ్రైన్ బోయ్డ్. ఆ నవల నుంచి పాఠకులు ఏది ఆశించవచ్చో ఏది ఆశించకూడదో చెప్తున్నాడు. ఆ నవలను అతను మొదటిసారి చదివిం తర్వాత నబొకొవ్ చివరికోరికను మన్నించి దాన్ని కాల్చేయడమే మంచిదన్న నిర్ణయానికొచ్చాడట. అంతగా నిరాశపర్చిందట. కానీ పునఃపఠనాల్లో అభిప్రాయం ఎలా మారిందో చెప్తున్నాడు. Brian Boyd is the best reader of Nabokov I so far encountered. So the his opinion is valuable for me. కొన్ని పరిశీలనలు బాగున్నాయి:

    “In On the Origin of Stories: Evolution, Cognition, and Fiction (2009), I marshal the evidence that we have evolved into a storytelling species, and that the main reason we have done so is because stories improve still further the social cognition and hence the shifts in perspective that had already reached such a high level in our species. From childhood pretend play to adult fiction, we speed up the capacity of our minds to leap beyond our here and now by taking on new roles, sidling and sliding this way and that through time, space, minds, and modalities, thanks to the intense doses of social information we deal with in fiction. No one has taken this further than Nabokov does in his last novel. Narratologists and novelists alike will focus on the opening chapter of The Original of Laura as proof of the new finds still to be made in fiction.”

    నేనైతే ఈ నవల ఇంతదాకా చదవలేదు. ఇప్పటిదాకా వచ్చిన సమీక్షల్ని బట్టి చదవాలన్న ఆసక్తీ అంతగా కలగటం లేదు. అయితే ఇందులో నవల అచ్చుప్రతితోబాటూ నబొకొవ్ ఇండెక్స్ కార్డుల మీద రాసిన రాతప్రతిని కూడా ఓ ప్రక్క ఇచ్చారట, బహుశా కొంటే దాని కోసం కొనాలి.

  9. సౌమ్య

    ఆరుద్ర -’రాముడికి సీత ఏమౌతుంది’ – వ్యాస సంకలనం చదువుతున్నాను. పేరు చూసి, ఇదేమిటో ఇలా ఉందనుకుని కొన్నాళ్ళుగా తెరవలేదు కానీ, పుస్తకం మాత్రం మహ ఆసక్తికరంగా ఉంది.

  10. మెహెర్

    “దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయ చరిత్ర” చివరి పేజీల్లో వున్నాను. ఈ పుస్తకం గురించి రాయాలనుంది కాబట్టి, నా గత కొన్ని రోజులూ ఈయన సాంగత్యంలో బాగా నడిచాయని చెప్పి వూరుకుంటాను.

  11. సౌమ్య

    రా.రా. ’అలసిన గుండెలు’ కథల సంకలనం చదువుతున్నాను. సగం అయింది.
    హుమ్… గత వారంరోజుల్లో: నలుగురు రారా లను చూశాను – నిరంకుశ విమర్శకుడు, పిల్లల కథకుడు, పెద్దల కథకుడు; ఇక్కడి వ్యాసం, వ్యాఖ్యల ద్వారా తెలిసిన – మనిషిగా రారా. నాలుగూ, నాలుగు భిన్న కోణాలు అనిపించాయి. ఈ కథలు – ఆ టైటిల్ని చూసి ఊహించినదానికి భిన్నంగా, పీస్ఫుల్ గానే ఉన్నాయి. ’ఎక్స్‍ట్రా ఆర్డినరీ’ అని నాకనిపించలేదు కానీ, నన్నెవరన్నా అడిగితే చదవమనే చెబుతాను.
    రారా -అనువాద సమస్యలు – ఎవరి వద్దనన్నా ఈబుక్ ఉంటే తెలుపగలరు.

  12. Achilles

    “A Season in Hell” – Arthur Rimbaud చదువుతున్నాను. కాస్త ఖాళీ సమయం దొరికేసరికి రికామీగా విజయవాడ లెనిన్ సెంటర్ కు వెళ్ళాను – ఏవైనా పాత పుస్తకాలు దొరుకుతాయేమోనని. ముప్ఫైరోజుల్లో java, C, C++ లాంటి పుస్తకాల మధ్యలో అనుకోకుండా పెంగ్విన్ వారు ప్రచురించిన ఈ బుల్లి పుస్తకం కనిపించింది.

    ఆర్థర్ రేంబో తన జీవితంలో ఉత్కృష్టమైన రచనలన్నీ పందొమ్మిది సంవత్సరాల వయసులోపే చేసేసాడు. తన ఇరవయ్యో సంవత్సరంలో చేసిన ఈ రచన చాలా ముఖ్యమైనది. ఫ్రెంచి సింబాలిజం కు ఆద్యుడుగా చెప్పబడే రేంబో తన తన ప్రతీకలను తానే ధ్వంసం చేసుకుంటూ పడే తీవ్రమైన వ్యథను చూస్తాం! కొన్ని కోట్స్:

    “Ah! I have brought too many- But my dear Satan, I beg you, an eye a little less inflamed! And while we are waiting for the few little over due cowardly actions, you, who appreciate in a writer the absence of any descriptive or instructive talent, for you I tear off these few hideous pages from my notebook of a damned soul.”

    “I don’t understand rebellion. My race never rebelled except to loot: as hyenas devour an animal they have not killed.”

    తన మాతృదేశం అయిన ఫ్ర్రాన్స్ ను ఉద్దేశించి రాసినా ఇది మన దేశానికీ అతికినట్తు సరిపోవడం లేదూ!

    “Oh! Science! Everything has been revised. For the body and for the soul – the viaticum – we have medicine and philosophy – old wives’ remedies and arrangements of popular songs. As well as the amusements of prince and the games which they forbade! Geography, cosmography, mechanics, Chemistry! Science, the new aristocracy! Progress. The world is on the march! Why shouldn’t it turn, too?”

    Science is the new aristocracy. Indeed. Think about the average Mallaiah in his priestly arrogance when he is peddling ‘scientific theories’ without actually knowing what they mean. Think about the moral force their arguments usually carry!

    “To whom shall I hire myself? What beast must be worshipped? Whose hearts shall I break? Which holy image attacked? What lie must I uphold? – In what blood shall I wade?”

    “The fox howled under the leaves, spitting out the bright feathers of his feast of fowl: like him, I consume myself.”

    “…It is the voice of the oracle, what I say. I understand, and, not knowing how to express myself without pagan words, I would prefer to remain silent.”

    “Yes my eyes are closed to light. I am an animal, a negro. But I am capable of being saved. You, maniacs, wild beasts, misers, are negroes in disguise. Merchant, you’re a negro. Magistrate, you are a negro; General, you are a negro; emporer, you old scabby itch, you’re a negro.”

    “When I was still quite a child, I used to admire the stubborn convict on whom the prison gates always close again; I used to visit inns and lodgings which he might have sanctified with his presence; I saw with his mind the blue sky and the flourishing labour of the countryside; I sniffed out his fate in the town. He had more strength than a saint, and more common sense than a traveller – and himself, himself alone! as witness to his glory and his rightness.

    On the roads, on winter nights, without shelter, without clothing, without bread, a voice would clutch my frozen heart: ‘Weakness or strength: look at you, its strength. You know neither where you are going nor why you are going: go everywhere, respond to everything. They won’t kill you anymore than if you were a dead corpse….”

  13. Purnima

    @పవనకుమార్:
    పవన్ గారు: ఆ వివరాలు ఇవ్వకపోవటం నాదే తప్పు. మన్నించండి.

    స్టీఫన్ కింగ్ పుస్తకం ఏ పుస్తకాల షాపులో అయినా దొరకవచ్చు. నేను కొన్నది ఆన్‍లైన్‍లో: http://www.flipkart.com/writing-stephen-king-memoir-craft/0743455967-l5w3f7wccc

    ఇక చిలకమర్తి వారి పుస్తకాలేమో, తిరుపతిలో గోవిందరాజు స్వామి ఆలయంకి ఒక పది అడుగుల దూరంలో ఉన్న “తిరుమల తిరుపతి దేవస్థానం వారి బుక్ స్టాల్” లో కొన్నాను. ఈ పుస్తకాలు మరెక్కడైనా దొరుకుతాయన్న నమ్మకం లేదు. కొరియర్ చేసుకోడానికి వీలుగా ఏమన్నా చిరునామా ఉందా అని అడిగాను. లేదన్నారు. అక్కడికి వచ్చి కొనుక్కోవడమే అన్నారు. ఈ లోపు, మరొకరు వచ్చి, “హైదరాబాద్‍లో హిమాయత్ నగర్ లో ఇన్ఫర్మేషన్ సెంటర్ లో ఉగాది సందర్భంగా ఒక స్టాల్ నిర్వహిస్తారట. అక్కడ చూడండి.” అని చెప్పారు, నేను అడిగిన అన్నమయ్య పద సాహితి పుస్తకాలు స్టాక్ లో లేవని చెప్పాక. తిరుపతిలో మితృలపై భారం వేయడానికే నేను సిద్ధపడ్డాను. 🙂

    @రవి:
    చిలకమర్తి వారిది కేవలం నాటికే! మరే వివరాలూ లేవు. “సంస్కృతంలో భాసుడు రచించిన ప్రతిమానాటకాన్ని దృష్టిలో ఉంచుకొని చేసిన రచన ఇది” అని రాశారు ముందుమాటలో. మరి దీన్ని అనువాదం అనవచ్చునో, లేదో! కాకపోతే నిన్న మీరు బజ్ లో ఉటకించిన రెండు మూడు వాక్యాలు ఇందులో యధాతధంగా ఉన్నాయి.

    నేను ఈ వారంలోపు ఈ పుస్తక పరిచయం చేద్దామనుకుంటున్నాను. పద్యాలు కదా, నాకు కొంత సమయం పడుతుంది. మీరూ పుస్తకం గురించి రాయండి. లేదా, ఇద్దరం కల్సి ఏదైనా వ్యాసమో, చర్చో చేద్దామన్నా సరే! నాకో మెయిల్ చేయండి.

  14. రవి

    @Purnima: ప్రతిమా నాటకం – నాటకమొకటే చెప్పారా చిలకమర్తి వారు? అందులో విశేషాలూ అవీ చెబుతూ వచ్చారా? ఎక్కడ దొరుకుతుంది ఆ పుస్తకం?

    నేను కాలే గారి పుస్తకం చదివాను. ఆయన ఏవేవో విశేషాలు చెప్పారు. (సగం తెలిసాయి, సగం తెలియలేదు). మధ్యమధ్యలో ఆయన భాసమహాకవి పద్యాలలో పొరబాట్లవీ కూడా ఎత్తి చూపిస్తారు.

  15. సౌమ్య

    రారా ’విక్రమార్కుని విడ్డూరం’ చదివానిప్పుడే. సరదాగా ఉంది కానీ, ఇంకాస్త పొడిగించి ఉండాల్సిందనిపించింది. పిల్లలు బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఉందీ కథని. ’సారస్వత వివేచన’ లో ఎంతో మందిని చెండాడిన రారా ఇలాంటి ఫాంటసీ కథ రాసాడంటే నమ్మలేకపోతున్నా!! 🙂

  16. పవనకుమార్

    @Purnima: ఈ రోజు హాయిగా ఉదయించింది, పుస్తకాలతో మీ ప్రయాణాన్ని చదవడం వల్ల. మీతో సహా ‘పుస్తకం’లో రాసే వాళ్లందరికీ ఒక విన్నపం. పేర్కొన్న పుస్తకం ప్రాప్తి స్థానాన్ని కూడా దానితో పాటే తెలియజేయండి. రాసి తెప్పించుకునేవయితే చిరునామా, ఆన్-లైన్ కొనుక్కోడానికి వీలుంటే, ఆ ఫెసిలిటీ గురించి కూడా.

  17. Purnima

    అసలే ప్రయాణాలంటే నాకు చిరాకు. దానికి తోడు ప్రయాణాల్లో పుస్తకాలు చదవ(లే)కపోవటం ఇంకా చిరాకు పుట్టిస్తుంటుంది. కానీ ఈ వారం ప్రయాణంలో చెప్పుకోదగ్గ పుస్తకాలు చదివాను. 🙂

    ౧. Stephen King – On Writing: ఈ మధ్యకాలంలో వినిపిస్తున్న చర్చలు, అభిప్రాయాల తరహాలో ఈ పుస్తకం గురించి చెప్పమంటే, స్టీఫన్ కింగ్ అనే అమెరికన్ రచయిత , తన గురించి, తన రచనల గురించి, అసలు రచనలెలా చేయాలన్న విషయాల గురించి రాసుకున్న సొంతడబ్బా పుస్తకం.

    అనుకుంటాం గానీ, సొంతడబ్బాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఒకడి అనుభవం మరొకడికి అవసరం లేకపోతే, మనుషుల మధ్య మాటలెందుకు? భాషలెందుకు? భాషోద్యమాలెందుకు?

    “నాకేం తెల్సునని రచన గురించి రాయటానికి?” అన్న మీమాంసతోనే మొదలెయ్యినా, ఈ పుస్తకం ద్వారా నేనూ, స్టీఫింగ్ నిరాటంకంగా oka ఐదారు గంటలు కబుర్లాడుకున్నాము – పుస్తకాల గురించి, చదవడం గురించి, రాయడం గురించి, ఇంట్లో వాళ్ళ గురించి – అన్నింటి గురించి.

    బిరువాల్లో అలంకారప్రాయంగా కాక, అట్టల మధ్య పేజీల్లో దాగున్న ఆత్మకై, ఆత్మీయతకై వెతుక్కునే పాఠకుడు మీరైతే, ఇది మీకు must read.
    మీ ఊపిరి తెల్ల కాగితాల మీద మీరు రాసే అక్షరాల్లో ఉందని మీకు ఈ సరికే తెల్సినట్టైతే, అలా జీవించిన మరో మనిషికోసం ఈ పుస్తకం మీకు Must Read.
    “రాయాలని ఉంది.. గుండెను విప్పి రాయాలని ఉంది” అని “రుద్రవీణ” చిరంజీవిలా ఊగిపోయి.. పోయి.. రోజూవారి జీవనంలో పడి, రచనల్ని వెనక్కి నెట్టేసి త్రిశంకు స్వర్గంలో, పరోక్ష నరకంలో బతికే వారికి ఈ పుస్తకం MUST READ.

    ఈ పుస్తకం పై ఒక ధీర్ఘ వ్యాసం నా మెదడులో, punctuation తో సహా సిద్ధంగా ఉంది. అది పుస్తకం.నెట్ కి ఎంత అనుకూలిస్తుందో చూసి, ఇక్కడో, మరెక్కడో రాస్తాను.

    ౨. సుందోపసుందుల వధ: చిలకమర్తి లక్ష్మీనరసింహం

    పై పుస్తకంలో ఒక మంచి రచనకుండవలసిన లక్షణాలు వివరిస్తే, ఆ లక్షణాలన్నీ కలిగిన పుస్తకం వెంటనే చదవగల్గడం అదృష్టం. ఇదో నాటిక. పద్యాలున్న నాటిక. మహాద్భుతంగా ఉంది. నిఘంటువు లేకుండా పద్యాలు ఎట్టా చదివేది అనుకున్నాను. అక్కడక్కడా అర్థం కోసం కష్టపడ్డా, మొత్తానికైతే మహా పసందుగా పూర్తి చేశా ఈ పుస్తకాన్ని.

    ౩. ప్రతిమా నాటకము: చిలకమర్తి లక్ష్మీనరసింహం

    ఇదీ ఒక నాటికే! రామాయణం కథ. కైక వరాలు అడిగిన దగ్గర నుంచి, రాముడు వనవాసం పూర్తి చేసుకొని వచ్చే వరకూ కథుంటుంది. చదవటానికి చాలా కష్టపడ్డాను. భాసుడి రాసిన దాన్ని ఆధారంగా చేసుకొని రాశారంట.

    మొత్తానికి చిలకమర్తి వారి వచనమూ, పద్యమూ మహదానంద భరితంగా ఉంది. నాకు భలే నచ్చింది.

    ఇంకోటి “నీతి కథామాల” అనే పుస్తకం కొన్నాను. పురాణ పురుషుల గురించి కొన్ని కథనాలు. నేను కాసిన్నే చదివాను. నామిని కతలు మళ్ళీ చదువుకున్నా.

    ఇతి వార్తాహ!

  18. మెహెర్

    Reading “Henderson The Rain King” by Saul Bellow.

    I want! I want! I want! — I want to go to Africa. 🙂

  19. సౌమ్య

    “బాకీ-బాకా” – నిష్టల వెంకటరావు కథాకవితలు – చదువుతున్నాను. యాభై పేజీల పుస్తకం – బాగా సరదాగా ఉంది.

  20. మెహెర్

    @Achilles: 🙂

    మనం అనుభవం కొద్దీ కొన్ని కొండగుర్తుల్ని వంటబట్టించుకుంటే ఏ పుస్తకాన్ని చదవచ్చూ, ఏ పుస్తకాన్ని చదవకూడదూ అన్న తెలివిడి ఓ రిఫ్లెక్సివ్ యాక్షన్‌‍లా మనలో భాగమైపోతుంది. అంటే మెదడులో ఓ తరహా quack detector లాంటిది సిద్ధం చేసుకోవాలన్నమాట. I am moderately blessed with it. 🙂 దీని మీద నమ్మకంతోనే కొన్ని పుస్తకాలకు కవరు పేజీ కూడా చూడకుండా మనసులో ఇంటూ మార్కు పెట్టేసుకుంటాను. నా అంచనా నూటికి నూటముఫ్పైపాళ్ళు తప్పుకాదు. తప్పదు కదా, జీవితం చిన్నది, పుస్తకాలు బోలెడు. పెట్టిన ఖర్చు గల్లంతైందనిపించినా ఎలాగో ఓర్చుకోగలంగానీ, చదివిన సమయం వ్యర్థమనిపిస్తే సమాధానపడలేం. I heard so much quack-quacking about this book, I bypassed it.

    Happy reading anyway, with Sripada.

  21. రవి

    మంచి ముక్క చెప్పారు. ఎవరైనా ఎందుకు రానిస్తారండీ? literature లో కూడా రాజకీయాలు నడవడం ఈ దేశంలోనే సాధ్యం. అన్నట్టు ఆయన ద్రౌపది స్ఫూర్తితో ఇప్పుడు ఆయన దృష్టిని సత్యభామ మీద సారించారు. నవ్య వారపత్రికలో వచ్చేవారం నుంచి ఆయన సీరియల్ సత్యభామ మొదలవుతూంది.

  22. Achilles

    ఆచార్య(?) యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి “ద్రౌపది” చదువుతున్నాను.

    ఇంకా మానసికంగా పూర్తిగా ఎదగని పిల్లలు, మాటలు తడుముకుంటూ ఏదో చెప్పబోయి, పదాలు దొరక్క ఏదోదే చెబుతారు చూడండి, చిన్నపిల్లలు ఇమెయిల్ రాసేప్పుడు వాక్యాలను విడగొట్టి, ప్రతివాక్యం పక్కనా చుక్కలు పెడతారు చూడండి – సరిగ్గా అదే వరస లక్ష్మీ ప్రసాదు ది కూడా. ఈ పేరా చదవండి.

    “ఇదేనా నేను కోరుకున్న శృంగారం అనుకుంది ద్రౌపది… కాని ఆ రాత్రి ధర్మరాజు గురించి ఆమెకెన్నో విషయాలు తెలిశాయి. ధర్మరాజులో ఆత్మన్యూనత ఎంత ఎక్కువో తన పట్ల ఆత్మవిశ్వాసమూ ఎక్కువ… పైకి ఎంత సహనం మూర్తీభవించినట్లు కనపడతాడో అంత అసహనం ఆయనలో దాగి ఉన్నది… ఆయన ఇతరులలో గొప్పతనాన్ని చూడాలేడు…స్త్రీ మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేయడు… పెద్దలు, సాధువుల పట్ల గౌరవం ప్రకటించి వారి మెచ్చుకోళ్ళు పొందటంలో అతడు అపారమైన ఆనందం పొందుతాడు…అందరిమీదా అధికారం ఉన్నదని భావిస్తాడు…ధర్మరాజును శారీరకంగా సుఖపెట్టడం, ఆయన మనసును సంతోష పెట్టడం, లేదా ఆయనకు నచ్చినట్టు వ్యవహరిస్తున్నట్లు నటించడం వల్లనే పాండవుల కుటుంబంలో శాంతి ఉంటుందని ద్రౌపదికి అర్థం అయింది”

    మహాభారతం గొప్ప, ఆ పాత్రల చిత్రీకరణ బావోలేదు గట్రా విషయాలు మాట్లాడబోవట్లేదు(అసలు ఇది భారతమూ కాదు ఇందులోని హీరోవిన్ను ద్రౌపదీ కాదు). ప్రతి పాత్రనూ పట్టుకుని ఎవ్వరూ అడక్కుండానే పాత్రల “మానసికస్థితిని” విశ్లేషించి దాని చుట్టూ సాఫ్ట్ పోర్న్ కవర్ (కాస్త దళసరిదే) కప్పిన విధానాన్నీ ప్రశ్నీంచట్లేదు! మహాభారతం అందరిదీ ఒక్కోడు వాడి సంస్కారాన్ని బట్టి అందులో ఏం కావాలనుకుంటే అది చూస్తాడు. జనం ఏది తమనాకర్షిస్తే అది వింటారు. అవార్డు రావటమూ సమస్య కాదు.

    అసలు నా సమస్య,

    ఇప్పటికి 167 పేజీలను చదివాను, పేరాకి కనీసం ఏడు సార్లు, ప్రతి రెండో వాక్యం చివరా, ఫుల్‍స్టాపులు ఉండవలసిన చోట కూడా “…” అని మూడు చుక్కలు పెట్టే ఇతడిని, రచయిత గొంతుతో కథనడుపుతూ ఉన్నట్టుండి ఏ ద్రౌపదిలోకో, ధర్మరాజులోకో దూరిపోయే ఇతడిని, కనీసం సాఫ్ట్ పోర్న్ నరేటివ్ ని కూడా (అదీ ఆయనే అన్నట్టు ద్రౌపది లాంటి “మహాఅందగత్తెను” డీల్ చేస్తున్నప్పుడు) ఆకట్టుకునేట్టుగా రాయలేని ఇతడిని – నవలా రచయితల కు ఉండాల్సిన ప్రాథమిక అర్హతలేవీ లేని ఇతడిని అసలు ఏ పబ్లిషర్ అయినా తన ఆఫీసు చుట్టుపక్కలకు కూడా ఎలా రానిచ్చాడో అర్థం కావట్లేదు. భారద్దేశం! ఇక్కడే జరుగుతాయ్ ఇట్టాంటివి!! ఇప్పుడు అర్థం అయింది ఇతగాడు ద్రౌపదిని ఎందుకు కథాంశంగా ఎన్నుకున్నాడో. There is no such thing called bad press. He thought that the buzz his subject capable of creating would conceal his inadequacies. He merely succeeded.:P

    దీనికన్నా ముందు సదివిన పుస్తకం దెబ్బనుంచే ఇంకా ఉపశమనం కలుగలేదు, ఇంకా దీన్ని కొనసాగించే సాహసం చేయను!!

    Good Bye, Prasad.

    Sripaada, here I come! 🙂

  23. Purnima

    రవిగారి ప్రోత్సాహంతో చదివిన / చదువుతున్న / మధ్యలోనే పక్కకు పెట్టిన పుస్తకాల జాబితా:

    Modern Reading – A miscellany – బెంగళూరులోని ప్రముఖ పుస్తక షాపు “సెలెక్ట్” వారు ప్రచురించిన పుస్తకం. పుస్తకం అమ్మకందార్లు, పుస్తకాల కొనుగోళ్ళ అనుభవాలూ, జ్ఞాపకాలు కొన్ని వ్యాసాల రూపంలో పొందుపరిచారు. భలే చక్కని పుస్తకం.

    నామిని కథలు: వీటిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్నా! రాగి సంగటి ముద్దలో అంత నేయ్యి వేసుకొని, గొంత పప్పు వేసుకొని తిన్నంత కమ్మగా, మజాగా ఉన్నాయి.

    అజంతా కవిత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఎల్లోరా కవిత్వం కూడా మొదలెట్టాను – అన్నీ చదవలేదింకా! పుస్తకం ముందుమాటలో గుంటూరు శేషేంద్ర గారి వ్యాఖ్యానం చూశాక పుస్తకం మీద అంచనాలు హచ్చు అయినాయేమో.. ఎల్లోరా అక్కడక్కడా మహాద్భుతం అనిపించారు.. అక్కడక్కడా ఓకే అనిపించారు.

    అలానే బేతవోలు రామబ్రహ్మం గారి “పలుకు చిలుక” కూడా కాస్త కాస్తగా చదువుతున్నాను. సమకాలీన భారతీయ కవితలకు ఛందోబద్దమైన పద్యానువాదం చేశారు. నాకు ఆ ప్రయత్నమే గొప్ప “థ్రిల్ల్” ఇచ్చింది. కొన్ని చదివాను. బాగా నచ్చాయి. అన్నీ చదివి గానీ ఒక అభిప్రాయానికి రాలేననుకోండి!

    కవన శర్మ “అమెరికా మజిలీ కథలు” చదువుతున్నాను. హాస్యం అంతగా పండిందనిపించలేదు కానీ, మన యూనివర్సిటీల్లో ఉన్న పరిస్థితులకి కథ బా అద్దం పట్టిందనిపించింది. ఏ ప్రయాణాల్లో చదువుకోడానికి బాగుంటుందనుకుంటా!

    కొన్ని పత్రికలు: నండూరి పార్థసారధి గారు కొన్ని సంవత్సరాల పూర్వం నడిపిన పత్రిక “రసమయి” – నా చేతికి జిక్కిన పత్రికలో యామిని కృష్ణమూర్తిగారితో ఇంటర్వ్యూ, హైదరాబాదులో ఒక గ్రంథాలయం వివరాలు – ఇలా కొన్ని ఆసక్తికరమైన వ్యాసాలతో పత్రిక బాగుంది. నాకు తెల్సి ఈ పత్రిక ఇప్పుడు రావటం లేదు.

    అలానే చెన్నై నుండి వెలువడే “జగతి” పత్రిక కూడా.. ఇది ఇంకా కొనసాగుతున్నట్టుంది. నాకు ఇందులో ఎక్కువగా పాతకాలం నాటి కబుర్లు కనిపించాయి. బాగుంది. మాలతి చందూర్ గారిదనుకుంటా ఈ పత్రిక(?)!

    రాసిన ప్రతీ వాక్యంతోనూ నాతో “వాహ్వా” చెప్పించుకునే రచయిత్రి Dorothy Parker – నా అదృష్టం కొద్దీ ఈవిడ కథల పుస్తకం మొన్నే దొరికింది. కొన్ని చదివాను. అవే చదువుతూ ఉన్నాను. చాలా పెద్ద పుస్తకం – ఎప్పటికి అయ్యానో! ఊహు.. అవ్వకుండా ఉంటూనే బాగుంటుందేమో!

    మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కృష్ణాతీరం! “ఎలా ఉంది?” అని అడగండి.. “గోదారి తీరంలో నడిచినట్టుంది” అని చెప్తా! “అదేంటి?” అనడక్కండి. నేనే చెప్తా పుస్తకంలో అతి త్వరలో! 🙂

    ఇక్కడితో నా “సొంతడబ్బా” సమాప్తం! 😛

  24. సౌమ్య

    ఇవాళే పని మధ్యలో తోచక – బ్నిం రాసిన ’మిసెస్ అండర్‍స్టాండింగ్’ మొదలుపెట్టాను. ’కాంతం కథలు’ కి ఆధునికరూపంలా ఉంది. మరీ చిన్న చిన్న వ్యాసాలవడం కొంత నిరాశ కల్గించినా, నాకు ఓవరాల్గా బ్నిం శైలి నచ్చింది. ఈయన రాసిన రచనలు మరేవన్నా ఉన్నాయేమో చూడాలి.

  25. HalleY

    @ravi.env:
    If you are referring to “Sweeyacharitamu” by Chilakamarthi please do read it ! . It is an awesome book . Though i understand the granthikam can be a big pain 🙂 (Assuming that is the reason that put you off)

  26. ravi.env

    వెరైటీ కోసం చదివి పక్కనెట్టేసిన పుస్తకాల జాబితా పెడుతున్నాను.

    నోరి నరసింహశాస్త్రి గారి నారాయణభట్టు – మూడువంతులు పూర్తి.
    చెంఘిజ్ ఖాన్ – 10 పేజీలనుకుంటాను.
    మిట్టూరోడి కథల్లో పచ్చనాకు సాక్షిగా, మిట్టూరోడికథల్లో కొన్నీ మిగిలాయి. – 85 % అయిపోయింది
    చిలకమర్తి గారి జీవితచరిత్ర – 4 పేజీల తర్వాత ఆగింది.
    శ్రీపాద వారి మార్గదర్శి – మార్గదర్శి కథ ౨ సార్లు చదివాను. మిగిలినవి సగం. గోదావరి యాస, మరీ అచ్చతెనుగు నుడికారం కొంచెం కష్టంగా ఉంది. – 50 %
    తిలక్ కథలు – కొన్ని చదివాను. తెగ ఏడిపిస్తున్నాడు – 60 %
    మిథునం – (రెండోసారి) ధనలక్ష్మి, మిథునం కథలు మిగిలాయ్. ఎందుకో మిథునం కథ నాకు నచ్చలేదు!
    విస్మృత యాత్రికుడు – రాహుల్ జీ నవల రెండోసారి – 40 శాతం చదివి, చివరికెళ్ళి, చివర ఓ 10 పేజీలు చదివాను.
    మూలా సుబ్రహ్మణ్యం గారి ఏటివొడ్డున – ఈ మధ్య కాలంలో బాగా ఆస్వాదించిన పుస్తకం.

    అవన్నీ గత కొన్ని నెలల్లో జరిగినవి.

    ప్రస్తుతం – ఎందుకో సంస్కృత సాహిత్యం చదవాలనిపించి, ఓ రూపకం చదువుతున్నాను. పుస్తకంలో దీనిమీద రాయలనుంది.

  27. సౌమ్య

    అజంతా స్వప్నలిపి చదువుతున్నాను. అద్భుతం 🙂

  28. పవనకుమార్

    @Purnima: మీరు ‘నూతిలో గొంతుకలు’ ఇష్టపడి వుంటే, ఎందుకు ఇష్టపడ్డారో సంక్షిప్తంగా చెప్పగల‍రా?

  29. మెహెర్

    Just read this essay. Nobel writer Saul Bellow reassuring us silverfishes against technology. Loved these lines:

    “There was no rivalry then between the viewer and the reader. Nobody supervised our reading. We were on our own. We civilized ourselves. We found or made a mental and imaginative life. Because we could read, we learned also to write. It did not confuse me to see ‘Treasure Island’ in the movies and then read the book. There was no competition for our attention.”

  30. మెహెర్

    “రాతిరై, మఱల భార్యాభర్తలకు కలసికొను వేళయయి, యింటిలో చివరకు సర్దుచున్న పాత్ర సామగ్రి మ్రోతలే మన్మథుని జ్యాటంకారము వలె ధ్వనించెను. ఆనాడు పవలెల్ల అరుంధతి కనపడలేదు. రాత్రికి నల్లని చీరతో శాంబరీవిద్య వలె తోచినంతనే ముగ్ధుడైన ధర్మారావు, కనులతో ఊరకే చూచుచు పండుకొనెను. అరుంధతి చిలుకలు చుట్టుచుండెను. క్రొత్త కస్తూరి వాసన తరగలు తరగలుగా గదియెల్ల తారాడి, వెలుగుచున్న అగరువత్తులను వట్టి నిర్గంధ ధూమముగా చేసి, కడచిన రాత్రిదైన తమ శయ్యాగతమైన పరిభోగ సూచకమైన స్వకీయ ప్రేమ భావ నిర్గతమో యన్నట్టిదైన పరిమళమును గూడ జయించి, ధర్మారావు నాసారంధ్రము నంట పొడిచెను. ఉన్నాదిని యైన ఆ చిక్కని తావికి ధర్మారావు — దక్షిణానిల ప్రచారము వలన సన్న సన్న పొరలు పొరలుగా వచ్చిన పటీతరు వాసనలు తగిలి, నిద్రామాంద్యము నుండి చుట్టులు చుట్టుకొన్న యొడలు దీర్ఘీకరించి తత్పటీర వృక్షాభిముఖముగా త్రాచులు మందమందముగ చనుచున్నట్లుగా — అరుంధతి వంకకు నడిచెను.” ~ వేయి పడగలు

    And I said goddamn! 🙂

  31. సింధువు

    ముళ్ళపూడి వెంకటరమణ “కథా రమణీయం” 2వ సంపుటి పూర్తయింది. ఇప్పుడే “గోదావరి కథలు” లో మొదటి కథ చదివాను. &..

  32. sandeep

    Salinger’s Catcher in the Rye. Don’t think there is any need to introduce the book!

    Also in the queue was Nasim Taleb’s “Fooled by randomness”. A clever book about our tendency to see patterns where none exist. A must read for MBAs!

  33. శ్రావ్య

    పుస్తకం పేరు : The Old Man & His God
    రచయిత్రి : Sudha Murty

  34. rAm

    పుస్తకం పేరు:నిలువు చెంబు
    రచయిత:శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కధలు