మీరేం చదువుతున్నారు? – 1

పుస్తకాలు తరచుగా చదువుతున్నా, పేజీలకి పేజీలు సమీక్షలు రాసే ఓపికా, తీరికా లేని వారి కోసం ఈ పేజీని నిర్వహిస్తున్నాము. ఈ వారంలో మీరే పుస్తకాలు చదివారు, వాటిని గురించి ఓ రెండు ముక్కలు ఇక్కడ కమ్మెంట్ల రూపంలో పంచుకోవచ్చు.   ఈ నమునాలో వివరాలు చెప్తే సులువుగా ఉంటుంది.

పుస్తకం పేరు:
రచయిత:
భాష:
వెల:
అంతర్జాలంలో ఈ పుస్తక వివరాలు:
పుస్తకం పై మీ అభిప్రాయం:

  1. రమణ

    బుచ్చిబాబు గారి కధలు ‘నిరంతర త్రయం’, ‘దేశం నాకిచ్చిన సందేశం’, ‘నేను-మీరు-మాఘం’, ‘ఎల్లోరాలో ఏకాంత సేవ’ రెండవ సారి చదివాను. ఇప్పుడు మరింతగా నచ్చాయి.

  2. rAm

    కన్యాశుల్కం నాటకం మీద వచ్చిన విమర్శ ,ప్రతి విమర్శ మరే నాటకం మీద రాలేదు ఏమో.నూరు సంవత్సరాలకి పైబడి నిరంతరం గా సాగిన విమర్శలని ఒకచోట చేర్చగా రూపొందిన పుస్తకం “కన్యాశుల్కం నూరేళ్ళ సమాలోచనం”
    గురజాడ జన్మదినాన 21-9-1999 వెలువరించి..జనం నాల్కల మీద గురజాడ సాహిత్యం నిలిచేలా కౄషి చేసిన సెట్టి ఈశ్వర రావు,అవసరాల సుర్యా రావు,k.v రమణా రెడ్డి , బం.గో.రె(బండి గోపాల రెడ్డి) కి అంకితం చేసారు.

    కన్యాశుల్కం గురజాడ రచనేనా నుంచి మొదలు అయి..కన్యాశుల్కం పుట్టు పుర్వోత్తరాలు..అసలు నాటక కర్త గా గురజాడ,కన్యాశుల్కం భాష..కన్యాశుల్కం లో పాత్రల మీద మహా మహుల వాడి వేడి గా విమర్సాస్త్రాలతో రూపొందిన యి పుస్తకం wonderful!!

    యి పుస్తకం కి సంపాదకులుగా వున్న ఆచార్య మొదలి నాగభూషణ శర్మ గరు,Dr.ఏటుకూరి ప్రసాద్ గారుకి కృతఙ్ఞతలు!

  3. Anand

    sri sri gaaru raasina mahaprastanam chaduvutunnanu…chadive koddi inka chadavali anipistundi…ee mahaprastananni inta late ga chaduvutunnana ani baadapaddanu..johar comrade sri sri…

  4. మెహెర్

    సలింగర్ రచనల్లో “సేమోర్: ఏన్ ఇంట్రడక్షన్” నచ్చింది నాకొక్కడికేనా అనుకునేవాణ్ణి, అంతర్జాలంలో దానిపట్ల సర్వత్రా కనిపించే వ్యతిరేకత చూసి. ఇవాళ ఇంకో వంతపాట వినపడింది. ఇప్పుడే చదివాను. ఇందులో చెప్పింది ఒప్పుకుంటాను. ఈ రచనతో సలింగర్ రచయితగా తన అబిట్యురీ తనే రాసుకున్నాడన్న వాదన కూడా నిజమే అనిపిస్తుంది. 1963లో ఈ పుస్తకం తర్వాత ఆయన ఇంకేం ప్రచురించలేదు. ప్రచురించకపోయినా ఏవో రాస్తూనే వున్నాడని కొన్ని వదంతులు మాత్రం వినపడేవి. ఇప్పుడాయన చనిపోయాకా ఇంకా గట్టిగా వినిపిస్తున్నాయి. నిజంగానే వీళ్ళంతా అనుకుంటున్నట్టు (ఆశపడుతున్నట్టు) ఆయన ఇంకా రాసివుంటే, నిజంగానే కోర్నిష్‌లో తన ఒంటికాయి సొంఠికొమ్ము జీవితంలో ఆయన రాసినవి పదిహేను చిత్తుప్రతులుంటే——— ఈ ఒక్కసారికీ వదంతులు నిజమైతే బాగుండనిపిస్తుంది. ఓ వ్యాసకర్త చెప్పినట్టు. . .:

    “It’s spooky and a bit thrilling to think the increasingly chatty and slightly insane-sounding narrative voice that we saw in his last published works — “Seymour, an Introduction,” and “Hapworth 16, 1924,” — has, like a river gone underground, continued to flow all these years, pouring itself into a reservoir whose contents we may or may not have the pleasure of encountering (and which may or may not be pleasurable; based on “Hapworth,” I am not counting on it).”

    సలింగర్‌కు నివాళిగా టైమ్స్ వాళ్ళు ఓ మంచి వ్యాసం ప్రచురించారు. పొద్దున్న చదివాను.

    ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ సలింగర్‌ని చదవాలనిపిస్తోంది. చదవటమంటూ జరిగితే “సేమోర్. . .”తోనే మొదలు పెడ్తాను. చెప్పకపోవడవే, అది మొదట కంగారెత్తిస్తుంది; Get to the point Buddy, will ya! అని అరవబుద్దేస్తుంది. కానీ చదవగా చదవగా, ఒకసారి చదివేయటంతోనే అందని ఆత్మేదో దానికుందనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ చదవాలి.

    కానీ అంతకంటే ముందు “వేయిపడగలు” పూర్తి చేయాలిగా! దాందుంపతెగ! ఓ పట్టాన పూర్తీ కాదు, అలాగని పక్కన పెట్టబుద్ధీ కాదు. ఒక్క రామేశ్వర శాస్త్రి వంశవృక్షాన్ని గుర్తు పెట్టుకోవటానికే పెన్సిలుతో పెద్ద పటం గీచి భాగాలు గుర్తించవలసి వచ్చింది. అప్పుడో మోతాదూ ఇప్పుడో మోతాదూ అన్నట్టు నెట్టుకుంటూ వస్తున్నాను. కానీ బాగుంది చదవటానికి, ఓ పురాణంలా. ఆ కాసేపూ cosyగా సుబ్బన్నపేటలోనే జీవిస్తున్నట్టు వుంటుంది.

  5. సౌమ్య

    కాఫ్కా రచనల సంకలనం – ’ది సన్స్’
    నామిని రచనల సంకలనం – ’పచ్చనాకు సాక్షిగా’ – చదువుతున్నాను.
    విశ్వనాథ గారి ’ఆంధ్ర ప్రశస్తి’ – మొదలుపెట్టి చేతులెత్తేశాను.

  6. Purnima

    టోటో చాన్ అనే పుస్తకం. నాషనల్ బుక్ ట్రస్ట్ వారి ప్ర్రచురణ. జపానులో రైలు బడి అనే కాన్‍సెప్ట్ తో పిల్లలకి వైవిధ్యభరితమైన ప్రాధమిక విద్యను అందించే ప్రయత్నాన్ని తెలుసుకునే వీలుంటుంది.

    ఆంగ్ల పుస్తకం లంకె: http://en.wikipedia.org/wiki/Totto-chan,_the_Little_Girl_at_the_Window

    తెలుగులో వాసిరెడ్డి సీతాదేవి గారి అనువాదం.

    “నూతిలో గొంతుకలు” – ఆలూరి బైరాగి కవితా సంపుటి

    Six characters In Search of An Author – దీని గురించి వికీలో ఇక్కడ:
    http://en.wikipedia.org/wiki/Six_Characters_in_Search_of_an_Author

  7. చంద్ర మోహన్

    ప్రస్తుతం ‘Built To Last – Successful habits of Visionary Companies’ అన్న పుస్తకం చదువుతున్నాను. గొప్ప కంపెనీలు ఎలా పనిచేస్తాయని మనకు అపోహలుంటాయో, నిజానికి అవి ఎలా పనిచేస్తాయో పరిశీలించి వ్రాసిన గొప్ప మానేజిమెంట్ పుస్తకం.

  8. చంద్ర మోహన్

    @సౌమ్య: అడవి బాపిరాజు గారి ’నారాయణ రావు’ నవల చదవండి. ఇంకా ’కోణంగి’ కూడా.

  9. Purnima

    Have been extremely lazy to update this page.

    List of books I’ve been reading:

    a) In the land of Invented languages – One hell of a book! 🙂 Must read for any one who can fascinate languages.

    b) కథాశిల్పం – వల్లంపాటి వెంకట సుబ్బయ్య. ఇది మరో అద్భుతం. పాత సినిమాల్లో, మరెక్కడో ఉన్న మనుషులని ఒక మాయావి అద్దంలో చూపించినట్టుగా, యావత్త్ ప్రపంచ కథనూ ఇందులో చూడవచ్చును. మీకు కథలంటే ఇష్టముంటే, బోలెడు కథల గురించి తెల్సుకోడానికి చదవండి. మీకు కథలు రాయటమంటే ఇష్టమయితే ఈ పుస్తకం మీకు MUST READ!

    c) ఆగమగీతి – బైరాగి కవితలు! అలా సగం నడుం వాల్చి, పక్కనే దండిగా తినుబండారాలు పెట్టుకొని సగం మూసుకుపోతున్న కళ్ళతో ఈ పుస్తకం తెరుస్తాను. కొన్ని వాక్యాలు చదివే సరికి లేచి నుంచొని, గెంతులేస్తూ ఈ కవితలు గట్టిగా చదివి వినిపిస్తుంటాను. సచిన్ బౌండరీల మీద బౌండరీలు కొడుతుంటే ఒక్కళ్ళమే టీవీ చూడాల్సి రావడంలా ఉంది నాకైతే ఈ పుస్తకం చదవటం. Reading is a solitary activity.. agreed! But few books demand company! 🙂

    d) కనుపర్తి వరలక్ష్మమ్మ – క్రేంద్ సాహిత్య ఆకాడెమీ ప్రచురణ. ఆవిడ గురించిన అన్ని విషయాలూ ఉంటాయి. గుడ్ రెఫెరెన్స్! అంత కన్నా ముఖ్యంగా ఆవిడ రచనల గురించి తెల్సుకునే అవకాశం.

    ఇవి కాక, చదువుతున్న పుస్తకాలూ, ఆన్‍లైన్ వ్యాసాల చిట్టా మరో సారి! 🙂

  10. rAsEgA

    Woody Allen and Philosophy చదువుతున్నాను. ఇది బేసిగ్గా అలెన్ సినిమాల్ని De-construct చేస్తూ కొంతమంది ఫిలాసఫీ ప్రొఫెసర్లు రాసిన వ్యాసాల సంకలనం. అలెన్ సినిమాల్లో తరచుగా కనిపించే ధీమ్స్ అయిన meaning of life, death, god, morality లని చర్చించారు. ఇప్పటిదాకా చదివినంతవరకూ, పైకి కిసుక్కున నవ్వించే అలెన్ one-liners లో, లోతుగా వెళ్ళేకొద్దీ ఉన్న అర్థాలు తెలుసుకుంటుంటే, Its scary.

    Link: http://www.amazon.com/Woody-Allen-Philosophy-Whole-Fallacy/dp/0812694538

  11. సౌమ్య

    అడివి బాపిరాజు ’నరుడు’ చదువుతున్నాను. ’అంశుమతి’ అంత గ్రిప్పింగా లేదు. కానీ, దాదాపు సగం నవల అయ్యాక కొంచెం ఊపందుకుంది…కానీ అసంపూర్ణంగా ముగిసిపోయినట్లనిపించింది…

  12. ప్రవీణ్ రంగినేని

    నండూరి వారి “విశ్వ దర్శనం ” , పాశ్చాత్య చింతన , మొదలు పెట్టాను. చాల బాగుంది.
    కంచ అయిలయ్య గారి ” నేను హిందువు నెట్లయిత” సగం చదివాను.

  13. బ్లాగరి

    Glimpse of World History చదువుతున్నాను.

    ఇంతకు ముందు పుస్తకం తెరిచి ఏదో ఒక పేజీతో మొదలు పెట్టి చదువుతూ వెళ్ళాను.
    ఇప్పుడు పుస్తకం వారు రాసే సమీక్షలు చూసి ఉత్సాహంతో, నేనే సమీక్ష రాయ దల్చుకుంటే, అన్న ఊహతో మొదటినుండీ చదవడం మొదలు పెట్టాను.
    నెహ్రూ గారి పుస్తకాలు Glimpses …, Discovery, Autobiography మూడూ చాలా నచ్చేసాయి.
    అన్నిటికన్నా నాకైతే జీవిత చరిత్రే ఎక్కువ నచ్చింది.
    పెరిగే పిల్లల్ను ఉద్దేశించి రాశారు అన్నదే సగం కారణం Glimpses … నచ్చడానికి.
    ఆ వయసులో చదివి ఉంటే ఎలా స్పందించే దాన్నో తెలియదు.
    ఇప్పుడు మాత్రం చరిత్ర మీద ఆసక్తి పెరగటం వల్ల చదవడం ఇష్టపడుతున్నాను.
    ఇది చదువుతుంటే చర్చిస్తున్నట్లు ఉండడం వల్ల (ఆయన ఉద్దేశ్యం కూడా అలా ఉండాలనే) మరింత ఆసక్తిగా ఉంది. ఒకే సమయంలో ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో జరిగిన విశేషాలను, నేర్చుకోదగ్గ విషయాలు, ఆలోచించదగ్గ విషయాలు, వ్యక్తిత్వాలు, జాతి తత్వాలు ఒక దానితో మెలి వేసుకుంటూ, మళ్ళీ మళ్ళీ కలిపి చూసుకుంటూ పరిచయం చెయ్యడం ప్రత్యేకించి నచ్చిన విషయం.
    రాసింది తన కూతురికే అయినా, అక్కడక్కడా స్వంత విషయాలు తప్ప ఎక్కడా వ్యక్తిగతంగా లేదు.

  14. సౌమ్య

    అడివి బాపిరాజు రాకింగ్. మీకేవన్నా ఆయన ఇతర రచనలు తెలిస్తే రికమెండ్ చేయండి.
    ’డే ఈజ్ నైట్’ అని ఓ కామెడీ కథల సంకలనం చదవడం మొదలుపెట్టి రెండు-మూడు కథలు చదివా. బాగా నవ్వుకోవచ్చు..

  15. బ్లాగరి

    ఎన్నెమ్మ కతలు చదువుతున్నాను.

  16. సౌమ్య

    అడవి బాపిరాజు నవల ’అంశుమతి’ చదువుతున్నాను. భాష తో మహా కష్టంగా ఉంది కానీ, కథ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది.

    Kurt Vonnegut – “A man without a country”, Ogden Nash కవిత్వం మళ్ళీ తిరగేస్తూ ఉన్నా రెండు రోజులుగా.

  17. Purnima

    On the revisiting spree…

    బోలెడన్ని పుస్తకాలు చుట్టూ పర్చుకొని, ఒక్క లైను కోసం వెతుకుతూ కొన్ని పేజీలు చదువుతూ ఉండిపోవటం, ఒకటి అనుకొని ఇంకోటి చదవటం, ఆలోచనల వేలు పట్టుకొని అవి ఎటు తీసుకుపోతుంటే అటే పుస్తకాల మధ్య తోవ చేసుకుంటూ పోవటం.. ఏం గొప్ప అనుభవంలే! 🙂

    ఈ నెలకి నేను కొత్తగా ఏం చదవనేమో!

  18. Ruth

    present – sense and sensibility by Jane Austen (probably reading for the nth time)
    next in line: an autobiography of a sex worker (nalini jameela)

  19. Vasu

    నేను ప్రస్తుతం The Fountain Head (by Ayn Rand) చదువుతున్నా. సగం లో ఉన్నా. ఎప్పుడో మొదలుపెట్టా. అప్పుడొక కొంచం ఇప్పుడొక కొంచం చదివే నాకు ఇంకో రెండు నెలలు పట్టేడట్టు ఉంది.

    ప్రతీ చోట ఈ పుస్తకం గురించి తెగ విని కొని చదువుతున్నా.
    అర్థమయినంత వరకూ Howard Roark, Dominique పాత్రల చిత్రీకరణ అబ్బురపరించింది. Toohey పాత్ర స్వభావం మాత్రం ఇంకా అంతుపట్టట్లేదు. ఈ పుస్తకం చదవడం కంటే దాన్ని జీర్ణించుకోవడానికి సమయం పట్టేడట్టు కనిపిస్తోంది.

    తెలుగులో శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారి కథలు (మార్గదర్శి, వడ్లగింజలు), శ్రీశ్రీ సిప్రాలి చదువుతున్నా.
    శ్రీపాద వారి కథలు అబ్బబ్బా మా ఊర్లో వాళ్ళు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటె వింటున్నట్టు, తెలియకుండా బోలెడు విషయాలు బుర్రలోకి వెళ్తున్నట్టు, కథ అయితే కానీ పుస్తకం వదిలిపెట్టబుద్ది కానట్టు ఉంది చదివినప్పుడల్లా. కొత్తపాళీ గారికి బోలెడు థాంక్సులు చెప్పాలి ఈ పుస్తకం సూచించినందుకు.

    సిప్రాలి మాత్రం కొంచం నిరాశ పరించింది అనే చెప్పాలి. సిరిసిరి మువ్వలు బావున్నాయి కానీ ఆ తరువాత, వాళ్ళని తిట్టా వీళ్ళని తిట్టా ఇదే సరిపోయింది అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే నేను మహా ప్రస్థానం తరువాత ఇదే చద్వుతున్నానేమో “రాబందుల రెక్కల చప్పుడు పయోధర ప్రపంచ ఘోషం ఝంఝానిల షడ్జధ్వానం” ముందు సిప్రాలి అసల చప్పుడులాగే అనిపించట్లేదు. ఇది శ్రీశ్రీ సరదాగా రాసినదేమో అని సరిపెట్టుకున్నాను.

    వాసు.

  20. మెహెర్

    “Days of Reading” by Marcel Proust: ఈ పుస్తకం మళ్ళీ రెండోసారి చదువుతున్నాను. ప్రోస్ట్ రాసిన నాన్‌ఫిక్షన్ వ్యాసాల సంకలనం ఇది. నాలుగు పెద్ద వ్యాసాల్లో పాఠకునిగా తన అనుభవాలు, అనుభూతులూ పంచుకుంటాడు. “చదవడా”న్ని గురించిన పుస్తకం చదవడం భలే అనుభవం. పైగా రాసింది ప్రోస్ట్ లాంటి రచయిత కాబట్టి భల్భలే అనుభవం. ఇలా మన కిష్టమైన రచయితల పఠనానుభవాలు చదివేటప్పుడు కొన్ని ఉపయోగాలుంటాయి. ఆ రచయితలు పాఠకులుగా ఏ దృక్పథంతో పుస్తకాల్ని చదువుతారో మనకు తెలుస్తుంది కాబట్టి, మనం పాఠకులుగా ఏ దృక్పథంతో వారి పుస్తకాల్ని చదవచ్చన్నది బోధపడుతుంది. అంతేకాదు, వారి పఠనాభిరుచులేవిటో తెలుస్తాయి కాబట్టి, మనకు ఖచ్చితంగా నచ్చబోయే మరికొంతమంది రచయితలు పరిచయం అవుతారు. ఖచ్చితంగా నచ్చబోవడం ఎలాగంటే: మన మిత్రుని మిత్రుడు మనకూ మిత్రుడే తరహా సమీకరణం ప్రకారం అన్నమాట. ఏమో, ఈ syllogism అందరి విషయంలో పన్చేస్తుందో లేదో తెలీదు గానీ, నా విషయంలో మాత్రం బానే పన్చేసింది. నా అభిమాన రచయితలకు నచ్చిన రచయితలెప్పుడూ నాకూ నచ్చుతూ వచ్చారు. కాఫ్కా ఇష్టపడ్డాడు కాబట్టి ఫ్లొబేర్, దాస్తొయెవ్‌స్కీల్నీ; నబొకొవ్‌ ఇష్టపడ్డాడు కాబట్టి సలింగర్, బోర్హెస్‌లనీ; బోర్హెస్‌ ఇష్టపడ్డాడు కాబట్టి స్టివెన్‌సన్, చెస్టర్‌టన్‌లనూ; చెస్టర్‌టన్‌‌ ఇష్టపడ్డాడు కాబట్టి డికెన్స్, బ్రౌనింగ్‌లనూ. . . ఇలా లంకెలేసుకు పోతూ వచ్చాను ఇప్పటివరకూ. ప్రస్తుతం పుస్తకాల విషయంలో ప్రయోగాల వెల ఎక్కువ కాబట్టి ఇదే సురక్షితమైన పద్ధతి అనిపిస్తుంది నాకు. అయితే ఇలా వెనక్కి లంకెలేసుకుంటూ పోవడంలో నా పఠనం సమకాలీన రచనలకి బొత్తిగా దూరమైపోతోందే అనే బాధ వుంది. ఇప్పుడీ పుస్తకం ద్వారా John Ruskin పరిచయమయ్యాడు. ప్రోస్ట్ ఈయన గురించి ఎంత ప్రేమతో రాసేడంటే, ఇప్పుడు ఈయన వెంట పడక తప్పేట్టు లేదు. ఇలాగే కొనసాగితే, నా పఠనం వెనక్కి వెనక్కి పోయి, చివరకు ఏ hieroglyphs దగ్గరకో వెళ్ళి ఆగేట్టు వుంది 🙁

    ఈ పుస్తకం అనువాదం మీద మాత్రం నాకు అనుమానంగా వుంది. చేసిందెవరో బాగా చేయలేకపోయారనిపిస్తోంది. అసలే ప్రోస్ట్ వాక్యాలు ఈ వీధిలో మొదలై మెలికలు తిరిగి తిరిగి రెండుమూడు వీధులవతల తేలే రథం ముగ్గుల్లా చాలా పొడవుగా వుంటాయి. దానికి తోడు అనువాదం ఇలా వుండటంతో మరీ ఇబ్బందిగా అనిపించింది.

    అమెజాన్ లింకు: http://www.amazon.co.uk/Days-Reading-Penguin-Great-Ideas/dp/0141036737

    “A History of Reading” by Alberto Manguel:: నిన్ననే ఏడొందలు పోసి కొన్నాను ఒడిస్సీలో. కొనీకొనంగానే మిగతా పుస్తకాలన్నీ పక్కన పెట్టేసి దీన్ని మొదలు పెట్టాను. ఎందుకంటే, ప్రస్తుతం ఒక పాఠకునిగా నా ఉనికికి అర్జెంటుగా అవసరమైన జస్టిఫికేషనేదో ఈ పుస్తకం ఇవ్వగలుగుతుందనిపించింది. “మేం పాఠకులమంటే అల్లాటప్పా కాదు, మాకూ ఓ చరిత్రుందోయ్” అని విర్రవీగేట్టు చేయగలుగుతుందనిపించింది. ఇప్పటిదాకా మొదటి వ్యాసం ఒక్కటే చదివాను కాబట్టి, నిండా బొమ్మలతో పుస్తకం చూట్టానికి ముచ్చటగా వుందని మాత్రమే చెప్పగలను (ముఖ్యంగా ఓ కాఫ్కా ఫోజు).

    అమెజాన్ లింకు: http://www.amazon.com/History-Reading-Alberto-Manguel/dp/0140166548

  21. Purnima

    In the land of invented languages – అద్భుతమైన పుస్తకం! మానవ మెదడు పని చేసే తీరుని ఆవిష్కరిస్తుందీ పుస్తకం!

  22. సౌమ్య

    “Lucene in action” అని ఓ టెక్నికల్ పుస్తకం. చదువుతున్నా. ఇప్పటిదాకా ఆసక్తికరంగానే ఉంది.

  23. రంజన్

    చాలా రొజుల్నుంచి నేను అనుకుంటున్నాను నేను చదవిన పుస్తకల్లో విషయాల్ని నలుగురితో పంచుకోవలని.ఇన్నాల్లకి నా నిరీక్షణ ఫలించింది.ఈ మద్యే బి.వి.పటాభి రాం “మాటే మంత్రము” చదవటం పూర్తి అయుంది.మిగతా వివరాలు త్వరలొ రాస్తాను

  24. budugoy

    మట్టి దీపం (అగళ్ విళక్కు)-
    ఈ సాహిత్య అకాడమీ వాళ్ళ అనువాదాలు నాతో కొన్ని అద్భుతమైన పుస్తకాలను చదివించాయి. ఉదాహరణకు మలయాళీ రచయిత తకళి శివశంకరపిళ్ళై గారి “రొయ్యలు”, గుజరాతీ రచయిత పన్నాలాల్ పటేల్ గారి “కలసిన జీవితాలు”. కన్నడలో అనంతమూర్తి గారి “సంస్కార”. అదే ఉత్సాహంతో ఈ తమిళ అనువాదం “మట్టి దీపం” కొనుక్కున్నాను. మట్టిదీపం ప్రముఖ తమిళ రచయిత వరదరాజన్ గారి “అగళ్ విళక్కు” కు అనువాదం. 1958లో ప్రచురించబడింది. రెండు వైరుధ్యం గలిగిన జీవితాలను బాల్యం నుండి తుదికంటా పరిశీలించి ఏది తనకు నచ్చిందో చెప్పుకుంటారు.
    చంద్రం, వేలు ఒకే బళ్ళో చదువుకుంటూ స్నేహితులవుతారు. చంద్రం ఒక పల్లెటూల్లో భూస్వామి కుటుంబానికి చెందినవాడు. తెలివైన వాడు. ఎవరితోనైనా ఇట్టే చొరవగా కలిసిపోగలడు. అందంగా ఉంటాడు. వేళు తండ్రి చిన్నపాటి నగరంలో ఒక పచారీకొట్టు నడుపుతుంటాడు. మధ్యతరగతి కుటుంబం. చంద్రంతో సాంగత్యం వల్ల వేలు తన చదువుని ఎంతో మెరుగుపరచుకుంటాడు. పదోతరగతి చివర్లో వేలుకు జబ్బు చేసి ఫెయిలాడంతో చంద్రం మదరాసుకు వెళ్ళిపోతాడు. అక్కడనుండి వాళ్ళ జీవితాలు వేరు దార్లు తొక్కుతాయి. ఎంతో ఆత్మవిశ్వాసం కొంచెం గర్వం గల చంద్రం ఒక అమ్మాయి ప్రేమలో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. వేలు బుద్ధిగా చదివి సమాజ కట్టుబాట్లకులోబడి బతుకుతూ ఒక స్థాయికి చేరుకుంటాడు. చంద్రాన్ని గన్నేరు చెట్టుతో పోలుస్తాడు. చూపరులను ఆకర్షించే అందం, సువాసన నిండిన పువ్వులున్నా తోడుగా విషంలాంటి వ్యతిరేకగుణాలుంటాయి. వేలు జీవితాన్ని తులసితో పోల్చుకుంటాడు. అందంగా లేకపోయినా అపాదమస్తకం సువాసనలిస్తుంది, ఉపయోగకారి అని.
    నవలలో కథనం నింపాదిగా సాగుతుంది. మధ్య మధ్యలో భాగ్యమ్మ పాత్ర ద్వారా స్త్రీవిద్య మీద రచయిత అభిప్రాయాలు చొప్పిస్తాడు. రచయిత చెప్పదలచుకున్న విషయం గట్టిగానే చెప్పినా ఆ విషయాన్ని కేవలం రచయిత దృక్కోణంతోనే చూసినట్టుంటుంది. మొత్తానికి నాకయితే నచ్చలేదు. ఆవరేజ్ నవల.
    మరి ఈ నవల నేను పైన చెప్పిన నవలల స్థాయిలో ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్తాను.

    (పుస్తకం వారికి చిన్న సూచన. ఈ శీర్షికలో కొత్త పోస్టు చూడాలంటే పేజి క్రిందకు వెళ్ళి చూడాల్సొస్తుంది. దానిబదులు కొత్త పోస్టులు పైన ఉండేట్టయితే బాగుంటుంది.)

  25. perugu

    “weeping wonmbs” by P.L.Sreedharan Parokode
    పంపిన ఆంగ్ల కవితల సంపుటి చదువుతున్నాను. జీవితంలోని
    ఎన్నో అంశాలను..సందర్భాలను,మినీ కవిత్వంగా చాల బాగా
    రాసారు.బాగా మజా వస్తుంది..
    ఉదాహరణకు కొన్ని :

    1 .అర్థ రాత్రి స్వాతంత్ర్యం..!

    ఆధునిక
    దేసభక్తులు
    చీకట్లో విరాళాలు
    ప్రోగుచేస్తారు
    పగలు నినాదాలుగా
    అమ్మేస్తారు..!

    2 .నూరు శాతం ..!

    మాతృ భాష = ౦
    గణితం = ౦
    నైతిక విలువలు =1
    మొత్తం =100

    3 .కదలని ప్రయాణం..!

    నిండిన సీట్లతో
    నిండు గర్భవతిలా
    కదిలెల్తున్న బస్సులు
    ఖాళీ అయిన సీట్లతో
    ఒంటరిగా
    బస్స్టాండ్..!

    4 .కాలింగ్ బెల్ ..!

    దాని వింత భాద్యత ఏంటో..?
    అల్లరి చేసి అందరినీ పిలుస్తోంది..
    సున్నితంగా
    స్విచ్ నొక్కితే చాలు..!

  26. చంద్రిత

    నవీన్ “అంపశయ్య”,కొమ్మూరి వేణుగోపాల్ రావు “హౌస్ సర్జన్” చదివాను. రెండూ బాగున్నాయి. “హౌస్ సర్జన్” మనో వైజ్ఞానిక నవల అయితే “అంపశయ్య” ఒక క్లాసిక్ అనిపించింది.

  27. చంద్ర మోహన్

    తమిళ కవి వైరముత్తు కవితల సంకలనం “కొంజం తేనీర్ – నిరైయ వానం” (కొంత తేనీరు – బోలెడంత ఆకాశం) చదువుతున్నాను. వైరముత్తువి గనుక బాగానే ఉన్నాయి కానీ, ఇంత కంటే మంచి కవితలు ఆయనవే చాలా చదివాను. ఇది పూర్తి చేస్తే తప్ప మరోటి అందుకోకూడదని నియమం పెట్టుకొన్నాను కాబట్టే నిదానంగా ఐనా చదువుతున్నాను.

  28. అరిపిరాల

    పైనెక్కడో “ఫైవ్ పాయింట్ సంవన్” చదివానని చెప్పి సమీక్ష వ్రాస్తానని చెప్పాను..! అక్కడితో ఆగక “2 స్టేట్స్” చదివాను. అదీ బాగుంది. రచయిత రచనా శైలిలో ఒక గమ్మత్తు వుంది. ముఖ్యంగా ఆపకుండా చదివించగలిగిన నేర్పు వుంది. కాబట్టి ఒక్క పుస్తకం గురించి కాకుండా చేతన్ భగత్ అనే రచయిత గురించి, అతని రచనా శైలి గురించి పుస్తకంకోసం వ్రాయాలని నిర్ణయించుకున్నా. అందువల్ల సమీక్ష సంగతి పక్కన పెట్టి “ఒన్ నైట్ ఎట్ కాల్ సెంటర్” మొదలుపెట్టా.. వచ్చే వారం “త్రీ మిస్టేక్స్..” చదివి మొత్తంగా ఒక వ్యాసం వ్రాస్తాను..!!

  29. RK

    P.V.Narasimha Rao – The Insider.
    Style – average
    Content – very good.

  30. Purnima

    ఆలూరి బైరాగి కథల సంపుటి – దివ్యభవనం – నాకు విపరీతంగా నచ్చాయ్! కవులు కథలు రాస్తే, కథలకే ఓ కొత్త అందం వస్తుందనుకుంట, అందుకే నాకీ కథలు బా నచ్చాయి.

  31. Hari

    read “2 states”, an excellent one, the only english novel I read without a break.
    also read “keep of teh grass” by Karan bajaj a good one on IIM life and rat race.

  32. సౌమ్య

    Chetan Bhagat – 2 States of my marriage – చదివాను. బాగుంది. ఈ నవల్లో మిగితా చేతన్ నవల్లతో పోలిస్తే కథనంలో కాస్త హాస్యం జోడించడంతో, ఎక్కడా ఆపాలనిపించలేదు.

  33. సౌమ్య

    ఇప్పుడే “గ్రీన్ కార్డ్” అని మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల ఒకటి చదివా… హుం.. ఏం చెప్పేది…. దిమ్మ తిరిగి మైండు బ్లాకైంది…ఆ ఇమాజినేషన్ కి…తెలుగు లో సినిమాల్లో తప్ప నాన్‌సెన్స్ కనబడ్డం లేదని నాకెప్పుడూ ఏడుపు….ఈ పుస్తకం ఆ ముచ్చట తీర్చింది. ఎటొచ్చీ, నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు.

  34. శైలజామిత్ర

    నేను ఈ మద్య “సుదీర్ఘ హత్య” అనే ఒక కవిత సంపుటిని ఆంగ్లంలోకి అనువదించే నిమిత్తమై పూర్తిగా చదివాను. ఈ పుస్తకం రచించినది జ్వలిత విజయకుమారి. కవిత్వం అంటే వ్యాసాన్ని ముక్కలు చేయడమే అనుకుంటున్న ఈ రోజుల్లో చక్కటి చిక్కటి భావాలు కల పుస్తకం ఇది. అందరూ చదవదగినది. స్త్రీని అనేక కోణాల్లో చూపుతూ వారు పడే ఆవేదనను అక్షరీకరించిన పుస్తకం. అయితే భావం అంత త్వరగా చదివేవారికి అర్థం కాకున్నా చదువుతున్న కొద్ది ఒక కొత్తదానాన్ని ఆశ్వాదించగలుగుతాము. అనువాద విషయంలో నేను చాలా ఆనందిస్తున్నాను. మచ్చుకు కొన్ని వాక్యాలు ” తీగలు తెగిపోతున్నాయి…మహా సముద్రపు తీగలు.. మానవ సంభందాలలో తీగలు…తెగిపోతున్నాయి….తెంపబడుతున్నాయి…అన్నదాత మేడలో ఉరితాడై .. అబలల మేడలో పసుపుతాడై .. చేనేతల మగ్గాలపై బ్రతుకుతాడై … మనుషుల మధ్య నమ్మకం పలుచబడి తీగలు తెగుతున్నాయి.. అంటూ ప్రతి ఆవేదనను అక్షరీకరించారు. సమకాలీన సమాజంలో ఇదొక మంచి పుస్తకం.