మా గురించి / About us

పుస్తకం.నెట్ గురించి:పుస్తకం.నెట్ ప్రపంచ సాహిత్యంపై పుస్తకప్రియుల వ్యాఖ్యానాన్ని తెలుగు, ఆంగ్ల భాషల్లో అందించే అంతర్జాలపత్రిక.పుస్తకాల పై సమీక్ష, విమర్శ, పరిచయ వ్యాసాలే కాక రచయితలతో ఇష్టాగోష్టి, ప్రచురణకర్తలతో, పుస్తకవిక్రేతలతో మాటా-మంతీ, పుస్తకప్రియత్వాన్ని చాటి చెప్పే వ్యాసాలెన్నో ఇక్కడ చోటు చేసుకుంటాయి.

పుస్తకం.నెట్‍ ముఖ్యోద్దేశ్యం పాఠకులు తమ మాటల్లో తాము చదివిన పుస్తకాల గురించి అందరితో పంచుకోవడం. పుస్తకాలను ఇష్టంగా చదువుకోవడమనేదే ఇక్కడ ప్రాధమిక అర్హత. మా ఆంతర్యం, జార్జ్ ఆర్వెల్ మాటల్లో.

Nearly every book is capable of arousing passionate feeling, if it is only a passionate dislike in some or the other reader, whose ideas about it would surely be worth more than those of a bored professional. – George Orwell

పుస్తకం.నెట్‍లో  రాసేవాళ్ళల్లో వృత్తిరిత్యా  ఇంజినీర్లు, డాక్టర్లు, రచయితలు ఉన్నా వారంతా ముందుగా పుస్తకాభిమానులు.

పుస్తకం.నెట్ జనవరి ఒకటి, 2009న ప్రారంభమయ్యింది.  సౌమ్య వి.బి, పూర్ణిమ తమ్మిరెడ్డి దీన్ని నిర్వహిస్తున్నారు. సాంకేతిక సాయం చేస్తున్నవారు పొద్దు.నెట్.

మమల్ని సంప్రదించాల్సిన చిరునామా:  editor@pustakam.net

About pustakam.net:

Pustakam.net is a web magazine dedicated to commentaries -primarily in Telugu and occasionally in English- on world literature, by booklovers.

Apart from the book reviews and book introductions, the site also covers interactions – personal or email – with writers, booksellers, book publishers and  news about the book world.

The prime motivation behind the pustakam.net has been to provide a platform to a common reader to voice his opinion of the books (s)he has read and showcase his love for books.

The regular contributors to pustakam come from varied professional backgrounds including engineers, doctors, writers, journalists and many more. Regardless what they do for a living, they all are book lovers.

pustakam.net has gone live on Jan’01, 2009. Sowmya VB and Purnima Tammireddy do the needful to keep the site running, while poddu.net provides necessary technical support background.

Contact us: editor@pustakam.net


155 Comments

  1. మాలతి ని,

    పుస్తకం.నెట్ వారికి నా విన్నపం.
    నేను ప్రముఖ రచయిత త్రిపురగారి కథ ఒకటి అనువాదం చేస్తున్నాను. నాకు కొన్ని సందేహాలు వున్నాయి. వారి కాంటాక్టు ఇన్ఫో ఎవరేనా ఇవ్వగలిగితే సంతోషం.
    ఈసందర్భంలో ఇలాటి ప్రశ్నలకి సమాధానాలకోసం విడిగా ఒక వర్గమో, టాగ్ లైనో సృష్టించగలరా? మీపాలసీకి విరుద్ధం కాకపోతేనే.
    మాలతి

  2. నెటిజన్

    ఇక్కడ ఒక ఇంగ్లిష్ పుస్తకం Who moved my cheese పరిచయం (?)ఉంది. పరిశీలించగలరు.

    http://krishnababug.blogspot.com/2009/03/who-moved-my-cheese-book-review.html#comments

    ఇలా బ్లాగులలో వ్రాసింది కూడా మీరు ప్రచురించే అవకాశం ఉందా?

  3. సౌమ్య

    @Netizen:
    మీరే రాయొచ్చు కదండీ మరి? 🙂
    అందుకే కదా పుస్తకం.నెట్ ని పెట్టింది…

  4. నెటిజన్

    పతంజలి మీద వ్యాసాలు ఏవి ఇక్కడ కనపడలేదు. దృష్టి లోపం?

  5. Aravinda

    Nenu, Rentala Kalpana(blog) nunchi afsar(blog) daaka velli ee website gurinchi kanukkunanu, chala goppa ga anipinchindi ee pustakam.net.

    Manchi prayathnam.

    Aravinda

  6. కన్నగాడు

    మీ ఆలోచన ఆచరణా బాగుంది, నేను సైతం నా వంతు సహాయం చేస్తాను.

  7. aswinisri.wordpress.com

    ఈవేళే చూసాను. బాగుంది.

  8. Saikiran Kumar

    చాలా మంచి ప్రయత్నం సౌమ్యగారు. చాలా శ్రమతో కూడిన వ్యవహారమైనా, మీ పట్టుదల మిమ్మల్ని నడిపిస్తుంది. ‘ఆవకాయ’ సహకారం కావాలంటే తెలియజేయగలరు.

    అభినందనలతో – సాయికిరణ్ కుమార్ కొండముది

  9. kusumakumari

    chaalaa maMchi prayatnamu,sir!

    eMtO Srama ,niraMtara kRshii avasaramaina I pustaka samiikshaa,parichayamula kaaryakramamunu chEpaTTina miiku mana@h puurvaka kRtaj~natalu.

  10. శైలజ

    పుస్తకం సైటు చాలా బాగుంది. ఎవరైన సమీక్షలు పంపవచ్చా? ఏ భాషలో చదివిన పుస్తకం గురించైన పంపవచ్చా?

    1. pustakam.net

      @శైలజ గారు: మీ సమీక్షలను editor@pustakam.net కు పంపగలరు. ఏ భాషలో చదివిన పుస్తకం గురించైనా రాయవచ్చు. రాసే భాష తెలుగైతే బాగుంటుంది.

  11. narasimha rao mallina

    గొప్ప నూతన సంవత్సర కానుక.అభినందనలు.
    ఒక సూచన.పరిశీలించ మనవి.
    మన బ్లాగరులందరూ మొదటగా వారి వారి దగ్గరనున్న పుస్తకాల లిస్టును ఈ పుస్తకం బ్లాగులో ఉంచితే…
    ఆలిస్టులో పుస్తకం పేరు,రచయిత పేరు,పబ్లిషరు వివరాలు,ఇంకా ప్రచురణ సంవత్సరం,దొరకే చోటు వగైరా వివరాలను పొందు పరిస్తే బ్లాగరులందరికీ ఎన్నో, ఎన్నెన్నో పుస్తకాల వివరాలు లభ్యమౌతాయని నా ఊహ. ఈ ప్రయత్నం ఉపయోగ పడుతుందంటే,నావంతుగా నాదగ్గరనున్న పుస్తకాల వివరాలు అందజేస్తాను.అందరూ ఆలోచించి చూడండి.
    నేను చదివిన, నాకు నచ్చిన పుస్తకాలను గురించి నేను కూడా వీలువెంబడి తెలియజేస్తాను.

  12. కొణతం దిలీప్

    తెలుగు పాఠకులకు గొప్ప నూతన సంవత్సర కానుక అందించారు. సైట్ చక్కగా ఉంది. పుస్తకం బృందానికి అభినందనలు.

  13. sujatha

    ఆలస్యంగా చూసాను ఈ సైటు! మంచి ప్రయత్నం! అభినందనలు.

  14. కారణి నారాయణ రావు

    పుస్తకప్రియులకు ఓ మంచి సైటు ఆరంభిచినందుకు అభినందనలు.
    రచయితలు, వారి బ్లాగులు, వారి విశేషాలు మొ//విషయాలను వివరాలను Kitabkhana (http://kitabkhana.blogspot.com)లో లాగా క్రమ క్రమంగా చేరుస్తే బాగుంటుంది.

    http://www.avkf.org/BookLink/book_link_index.phpలో తెలుగు పుస్తకాల పరిచయం దొరుకుతుంది, కాని దానికంటె ఇంకాస్త మరెక్కువే ఈ సైటులో, ఇప్పటివరకు పరిచయం చేసిన పుస్తకాలగురించి ఉంది.
    Keep it up!Get the good work going!

  15. Audisesha reddy. K.

    మంచి ప్రయత్నము. కొన్ని మంచి పుస్తకాల గురించి తెలుసుకునే అవకాశము వుంది.

  16. రఘు బుర్రి

    చాలా మంచి ప్రయత్నం, ఇంత మంచి నూతన సంవత్సర కానుక ఇచ్చినందుకు కృతజ్ఞతలు.

    మరమరాలు

  17. -రవికుమార్

    పుస్తకానికి స్వాగతం. ఒక దారుణ నిర్లక్ష్యానికి గురైన ప్రాంతంలో కృషి చేయ సాహసించిన పుస్తకం యజమానులకు హృదయపూర్వక స్వాగతం. మీ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటూ…

    -రవికుమార్

  18. Yuva

    మీ పాత పుస్తక సమీక్ష టపాలన్నింటినీ పుస్తకం లోకి తీసుకురండి, కనీసం లింక్ లైనా…

  19. John Hyde

    Best wishes

  20. ysreddy

    మీ ప్రయత్నం చాలా బాగుంది…ధన్యవాదములు…

  21. సతీష్ కృష్ణ

    ప్రియమైన పుస్తకం బృందమునకు,

    నా పేరు ఐ.సతీష్ కృష్ణ నేను తెలుగు అనువాదకుడని. మీ సైటు చూశాను చాలా బాగుంది, అలాగే వాటి ఫీచర్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి కానీ నేను గమనించినది ఏమంటే శీర్షిక పేర్లను బహుశా ఏరియల్ యూనికోడ్ ఫాంట్లో టైపు చేసినట్లున్నారు అందుకనే అక్షరాలు సరిగా రాలేదు అందుకే మీరు ఏమి అనుకోనంటే నాది ఒక చిన్న సలహా వాటిని గౌతమి యూనికోడ్ ఫాంట్లో టైపు చేస్తే శీర్షిక లోపలి టెక్స్ట్ లాగే చక్కగా ఉంటుంది. ఇంత మంచి సైటు ఇచ్చినందుకు ధన్యవాదములు.

    ఇట్లు,
    మీ శ్రేయోభిలాషి సతీష్.

  22. నాగరాజు పప్పు

    అభినందనలు. గతేడాది జనవరి ఒకటిన నవతరంగం, ఈ సారి పుస్తకం – చాలా సంతోషంగా ఉంది. మీ ప్రయత్నం నిరాఘాటంగా, నిర్విఘ్నంగా సాగుతుందని ఆశిస్తాను.

  23. కుమర్

    అభినందనలు మంచి ప్రయత్నం
    నేను కూడా పంపడానికి ప్రయత్నిస్తాను

    కుమర్

  24. కామేశ్వర రావు

    బావుందండీ! చాలా మంచి ప్రయత్నం!

  25. శరత్

    మీ ప్రయత్నం చాలా బాగుంది. నా లాంటి పుస్తక ప్రియులకు నెట్ విహారం లోఇది ఒక మంచి మజిలీ .

  26. కె.మహేష్ కుమార్

    మంచి ప్రయత్నం. అభినందనలు.
    ఒక చిన్న సూచన. “వర్గాలు”లో కొంత అసృష్టత అనిపించే ప్రమాదం కనిపిస్తోంది. ఈ వెబ్సైటు ‘పుస్తకం’గురించి కాబట్టి పుస్తకాల వర్గాలు ఉదా: నవల,కథ (సంకలనం),కవిత(సంకలనం),నాటకం,సాహితీవిమర్శ మొ” ఉండాలా! పుస్తకం గురించి సైట్లో రాసే వర్గం ఉదా:పరిచయం, సమీక్ష,విమర్శ,విశ్లేషణ మొ” ఉండాలా!! లేక రెండూ ఉండాలా అనే స్పష్టత అవసరమేమో.

  27. యన్.సీతారాంరెడ్డి

    చాలా సంతోషం. తెలుగులో ప్రత్యేకంగా ఇలాంటి ఒక సైటుని నిర్మిస్తున్నందుకు అభినందనలు. నేను కూడా నేను చదివిన కొన్ని తెలుగు పుస్తకాల సమీక్షలని పంపించడానికి ప్రయత్నిస్తాను.

  28. పూర్ణిమ

    పవన్ గారు, శ్రీధర్ గారు: ధన్యవాదాలు!

    నెటిజన్ గారు: ఈ సైటు నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఇక హెడర్ ఫొటో రాండమ్ గా పిక్ చేసినదే!
    తెలుగు పుస్తకాలకి పెద్ద పీట వేయ్యాలని ఉన్నా, అందుకు తగ్గ “కంటెంట్” / విషయం మా దగ్గర ఉండాలి కదండీ. వీలైనంతవరకూ ప్రయత్నిస్తాం.

    మీరు మీ సూచనలూ, సలహాలనూ తెలియజేస్తూ ఉంటారని ఆశిస్తున్నాం!

    -పూర్ణిమ

  29. నల్లమోతు శ్రీధర్

    సౌమ్య గారు, పూర్ణిమ గారు చాలా మంచి ప్రాజెక్ట్. ఎన్నో మంచి పుస్తకాల పట్ల పాఠకుల్లో ఆసక్తి మీ ప్రయత్నం ద్వారా కలుగుతుందని అన్పిస్తోంది. ఆల్ ది బెస్ట్.

  30. నెటిజన్

    మంచి ప్రయత్నం.
    అన్ని భాషల పుస్తకాలు అన్నారు. తెలుగు మీద అభిమానం కాబట్టి, తెలుగుకి పెద్ద పీట వేస్తారని అనుకోవడంలో తప్పులేదు.
    హేడర్‌లో ఉన్న పుస్తకాల రాక్‌లో ఒక్క తెలుగు పుస్తకం కూడ కనబడటం లేదు.
    ఒక గుటెంబర్గ్ లాగున, ఒక అమేజాన్ లాగున తెలుగు వారికి ఇది ఒక ఒయాసిస్సు ఐతే అంత కంటే కావల్సింది ఏముంది?
    2008 లో వెలువడిన “మీరు మెచ్చిన ౧౦ పుస్తకాలు” లాంటి శీర్షికలు మొదలు పెట్టండి.

  31. పవన్

    మంచి ఐడియా అండి.నవతరంగం సినిమా రివ్యువ్స్ కి కొత్త ఊపిరి నింపితే మీ పుస్తకం .నెట్ పుస్తక ప్రియులను ఒకచోట చేర్చి చేర్చవేదిక లాగ పనిచేయాలని ఆశిస్తూ …

  32. సౌమ్య

    రావు గారికి:
    ధన్యవాదాలు. త్వరలో ఈ వివరాలన్నీ తెలిపే పేజీ అప్డేట్ చేయబడుతుంది. సైటు నిర్మాణం ఇంకా జరుగుతూ ఉంది.

  33. పుస్తకం.నెట్ ? « sowmyawrites ….

    […] బ్లాగులోనూ, పుస్తకం.నెట్ సైటు “మా గురించి” పేజీ లోనూ కావాల్సినంత రాసేసారు. […]

  34. cbrao

    మంచి ప్రయత్నం. సినిమాలకు నవతరంగం, పుస్తకాలకు పుస్తకం బాగున్నాయి. కొద్ది కాలంలోనే ఇది ప్రాచుర్యం పొందాలని, తెలుగు వారికి దూరమైన పుస్తక పఠన అలవాటు, పుస్తకం సైట్ ద్వారా మరలా వెల్లివిరియాలని అభిలాష. ఇందుకు కాను interactive గా ఉండే గుణాలుకల కొత్త రూపురేఖలను ప్రవేశ పెట్టాలి. పాఠకులను సైట్ లో భాగస్వాములను చెయ్యాలి.

    పుస్తకాలకు సంభందించిన సమాచారం తో నింపాలనుకుంటున్న, ఈ పుస్తక సమాచార భాండాగారంలో, ఇదివరలో వెలువడ్డ కొన్ని ఉత్తమ పుస్తక సమీక్షలు మరలా ప్రచురిస్తారా? లేక సరికొత్త వ్యాసాలు ఎక్కడా ప్రచురించబడనివి మాత్రమే ఇందులో చేరుస్తారా అనే విషయంలో స్పష్టత కావాలి.

    ఈ ప్రయత్నం విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాను.

Leave a Reply