చెప్పాలని ఉందా?

ఏమేమి చెప్పచ్చు?
పుస్తకాల గురించిన సమాచారాలు ఏవైనా! అంతర్జాలంలో పుస్తకాలపై ఏదో వ్యాఖ్యానం మీకు నచ్చిందా? మీ అభిమాన రచయిత గురించి కొత్తగా ఏదో వార్త తెల్సిందా? మీరు ఏదైనా పుస్తకం కోసం వెదుకుతున్నారా? మీరు చాన్నాళ్ళుగా వెదుకుతున్న పుస్తకం దొరికిందా? మీరు తరచుగా వెళ్ళే పుస్తకాల షాపులో డిస్కౌంట్లు ఇస్తున్నారా? పుస్తక ప్రదర్శనలు ఎక్కడ, ఎప్పుడు జరుగుతున్నాయో మీకు తెల్సా?

అయితే.. చెప్పాలని ఉంది అంటూ.. మీకు తెల్సినది ఇక్కడ తెలియజేయండి. సమాచారాన్ని పెంచుకోండి.

ఎలా చెప్పాలి?
ఇక్కడో వ్యాఖ్య పెట్టేయండీ.. అంతే!

139 Comments

  1. రవి

    పోణంగి శ్రీ రామ అప్పారావు గారి నాట్యశాస్త్రము – తెలుగు అనువాదము ఎక్కడ దొరుకుతుందో ఎవరైనా తెలుపగలరా? లేదా అభినవభారతి (భరతముని నాట్యశాస్త్రానికి అభినవగుప్తుని వ్యాఖ్యానం) తెలుగు అనువాదం ఏదైనా సరే, ఎవరికైనా తెలిస్తే దయచేసి పంచుకోగలరు. ముందస్తుగానే కృతజ్ఞతలు.

    1. VSTSayee

      http://www.dli.ernet.in – search for title “naat’yashaastramu”

      శేషతల్పశాయి.

    2. రవి

      శేషతల్పశాయి గారు,

      కృతజ్ఞతలు. DLI లో అదివరకే వెతికానండి. అప్పారావు గారి ఆంగ్ల అనువాదం ఉంది. తెలుగు అనువాదం కనిపించలేదు. ఆంగ్లం కూడా చూస్తాను. అభినవభారతి వ్యాఖ్యానానికి మరొక తెలుగు అనువాదం దొరికింది కానీ చాలా కొంచంగా అసంపూర్ణంగా ఉంది.

    3. VSTSayee

      పోణంగి శ్రీరామ అప్పారావుగారి నాట్యశాస్త్రము (గుప్తభావప్రకాశికాసహితము)
      జమ్ములమడక మాధవరామశర్మగారి నాట్యవేదము (అభినవభారతీ వివృతి – అభినవభాష్యము) 2 భాగములు
      నావద్ద పీ.డి.యఫ్‌.లుగా ఉన్నాయి. ఈమైల్‌ పంపండి.

      శేషతల్పశాయి.

  2. varaprasad

    అన్నీ కన్పిస్తున్నయ్ కాసింత మా వంశీ పసలపూడి కధలు కూడా పుస్తకం లోకి రప్పించండి,తూ;గో ;జిల్లా యాస,బాష,మాండలికాలు,వ్యావహారికాలు, కోణంగి పడచులు,కొంటె కుర్రాళ్ళు,పెద్దరికాలు,తగాదాలు,గోదారి అందాలు,అబ్బ ఒకటేన్టండి బాబు చానా చానా ఉంటై,ఒక్క సారి చదవటం మొదలుపెడితే అయ్యేదాకా కదిల్తే ఒట్టు,అదో వెరయిటీ ప్రపంచం అందరికీ రుచి చూపించండి.

  3. varaprasad

    1970=90 ల మద్యలో రెండు మూడు నెలలకో కొత్త నావల వచ్చేది దానికోసం ఎదురుచూట్టం,వచ్చాక రెంట్ బుక్స్ స్టాల్ ఓనర్ ను బ్రతిమాలి మనకే ముందు ఇచ్చేట్టు ఒప్పించుకొని ఆ పుస్తకం మొదట్నుంచి చివరిదాకా ఏకబిగిని చదివి ఆ మైకం లోంచి బయటకు రావాలంటే నా సామిరంగా ఓ నెల పట్టేది,మళ్లీ చదవాలున్నా,మన వంతు రావటానికి చాలా కాలం పట్టేది,అప్పట్లో లైబ్రేరియన్,బుక్స్ స్టాల్ ఓనర్లు దేవుడితో సమానం,ఎందుకంటే పావలా పదిపైసల కర్చుతొ అంత గోప్పోళ్ళ పుస్తకాలు చదవ గలిగే అవకాశం వాళ్లవల్లే కలిగేది,ఆ పావలా పదిపైసల కోసం పాకెట్ మనీ సరిపోక పొతే అరువు సౌకర్యం కూడా కల్పించే వారు.అందుకేనేమో అప్పటి పుస్తకాల్లోని గుజ్జు మన బుర్రలో పెర్మనెంట్ గా ఉండిపోయింది.నిజానికి ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళు కూడా తెలుగు పల్లకీ మోసిన బోయీలనీ అందుకే ఈనాటికీ తెలుగు బాష ఇలా నిలిచిందని “మా తెలుగు తల్లికి మల్లెపూదండ ” .

  4. varaprasad

    మేము చిన్నోళ్ళం,సౌమ్య గారిలాంటి వాళ్ళు పూనుకొని,యండమూరి,మల్లాది లాంటి పెద్దలను పుస్తకంలో రాసేట్టు చేస్తే చాలా బావుంటుంది.

    1. pavan santhosh surampudi

      నాకు తెలిసున్నంతవరకూ పుస్తకం.నెట్ చిన్నోళ్ళ(ఏదో మీరన్నారు కదాని అదే వాడేశాను) కోసమే. వాళ్ళంతటి వాళ్ళు అప్పుడప్పుడూ వచ్చిపోయే అతిథుల వంటి వారే. ఒక పాఠకుడిగా నాకు అర్థమైన పుస్తకం.నెట్ పాలసీ ఇదేనండీ వరప్రసాద్ గారూ.

  5. sailesh nimmagadda

    ఫ్రజాశక్తి బుక్ హౌస్ కొత్త వెబ్ సైట్
    ఎన్నో ఉపయోగకరమైన పుస్తకాలను ఉచితంగా చదువుకోచ్చు
    ఒకసారిటు చూడండి.
    http://psbh.in/download-free-ebooks

  6. sandhya

    sep nela telugu velugu dwara ee website gurinchi telusukunnanu.ippativarakuu prthyaksha pusthakalake parimithamaina nenu ippudippude antharjala pusthaka prapanchamloki adugupeduthunnanu.chaalaa aaswadisthunnanu ee websiteni(telugulo emantaro evaraina theliyacheyagalaru)

    1. valaludu

      స్వాగతం. తెలుగులిపిలో రాయడానికి ఈ కిందున్న వెబ్సైటు వినియోగించండి.
      lekhini.org

  7. rama kishore

    Hi,

    Marry Tailor Rasina “Na Jailu Jeevitham”…Book yekkadaina untye Chopandi

  8. B.Padmaja

    pustakam o guruvu
    pustakam o nestam
    pustakam o amma
    pustakam o nanna
    anna akka annee
    mari nenu?
    andulo o aksharam, o chitram o bhavam
    anubhuthi prayanam lo o majili…………..

    1. varaprasad

      చాలా బాగా చెప్పారు,పుస్తకం గురించి,సౌమ్య గారు,పూర్ణిమ గారు,జంపాల చౌదరి గారు ముఖ్య పాత్రదారులు మనం వారు రాసేది చదువుతూ పోతేచాలు చాలా విషయాలు తెలుస్తాయి

  9. KOVVALI LAKSHMINARAYANA

    I am happy to know about pusthakam.net thro Telugu Velugu Sep 2013 issue. Your efforts are commendable. I am son of Sri Kovvali Lakshminarasimharao who was the
    author of ONE THOUSAND novels. I will be happy to share information regardinrg my
    father and his books. Regards

  10. sekharksp

    నబకోవ్…………………………

    http://www.youtube.com/watch?v=TnvvBL6set4

  11. డింగు

    ఈమధ్యే Just Books CLC అనే పుస్తకాలు అద్దెకు ఇచ్చే వెబ్‌సైటు చూశాను. ఇండియాలోని 11 నగరాల్లో అందుబాటులో ఉంది. Hyd, Vizagలలో ఉంది. ఐతే ఎక్కువ ఇంగ్లిష్ పుస్తకాలు ఉన్నాయి. తెలుగు పుస్తకాల కొరకు catalog->Languages->Teluguలో చూడండి. Good for readers.

    JustBooks is a new generation community library chain that provides a unique reading experience to book lovers with a wide range of books for every type of reader. JustBooks provides unlimited reading to its members without charging a late fee. Members can visit the library to borrow and return or choose to get home delivery of books.

    http://justbooksclc.com

  12. mothi mohanaranga

    neno kavithala pusthakam rashanu ekkada upload chesukovachemo …theliyacheyagalara

    1. సౌమ్య

      Mohanaranga garu: Pustakam.net is not a website to upload your books.

  13. సౌమ్య

    “కె.శివారెడ్డి తో మూడు సాయంత్రాలు – ‘దాలప్ప తీర్థం’ కథా సంపుటి ఆవిష్కరణ”
    http://vihanga.com/?p=9224

  14. డింగు

    To pustakam.net Admin:

    కొన్ని కామెంట్లలో సమాచారం బావుంటుంది. కావున పుస్తకం.నెట్ సెర్చ్‌లో కామెంట్లు కూడ include చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది.

    1. సౌమ్య

      Thanks Dingu garu. We will work on it when we can. Until then, one work around: google search works better than pustakam.net search, for searching pustakam.net articles and comments 🙂

  15. సౌమ్య

    Lifco Publishing House గురించి ఇవ్వాళ హిందూ పత్రికలో వచ్చిన వ్యాసం… చిన్నప్పుడు వాడుకున్న లిఫ్కో నిఘంటువులు, చదివిన లిఫ్కో రామాయణం గుర్తు చేసింది.
    http://www.thehindu.com/features/metroplus/a-synonym-for-success/article4736091.ece

  16. Vijayavardhan

    A book on Phalke with a lot of rare pictures has come. “Tracing Phalke” by Kamal Swaroop is available for sale. You may not find it in book stores. It costs Rs 3000. If any one is interested in buying the book, then please let me know. Mr Kamal Swaroop is visiting Bangalore. I am meeting him on 11 June. If we inform the number, then Mr Kamal will carry the books to Bangalore. For more details on the book, please visit:

    http://dearcinema.com/article/how-tracing-phalke-came-into-being/4624
    http://moifightclub.wordpress.com/2013/05/02/excerpts-from-kamal-swaroops-tracing-phalke/

  17. n vamsikrishna

    sir navalalu,kathalu ala rayali any amshalu kuda meru endhulo unchuthy badhuntadhi pls sir
    navala anty ala rayali (first man) lo chypandi

  18. Anil Atluri

    మీరు కథకులా?
    ఐతే మీకోసం ఒక శుభవార్త ఎదురుచూస్తున్నది!!
    జాలంలో (Webzine / blog) మాత్రమే ప్రచురించిన మీ తెలుగు కథ లంకెని..మీ పేరు, ఊరూ, ఈమైల్ ఐడితో నాకు పంపండి!
    నా ఈమైల్ ఐడి ఇది;
    http://scr.im/theachievers

  19. సౌమ్య

    2013లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరగబోయే పుస్తక ప్రదర్శనల వివరాలు: (వివరాలు తెలిపిన వారు: జగదీశ్ నాగవివేక్ పిచిక)

    44th Cairo International Book Fair 2013
    Jan 23 – Feb 05, 2013
    Cairo, Egypt
    http://www.cairobookfair.org

    Taipei International Book Exhibition
    Jan 30 – Feb 04, 2013
    Taipei, Taiwan
    http://www.tibe.org.tw

    37th International Kolkata Book Fair 2013
    Jan 30 – Feb 10, 2013
    Milan Mela Prangan,
    Kolkata, India
    http://www.kolkatabookfair.net

    New Delhi World Book Fair 2013
    February 04 – 10, 2013
    Pragati Maidan, New Delhi
    http://www.newdelhiworldbookfair.com

    26th Jerusalem International Book Fair 2013
    February 10 – 15, 2013.
    Jerusalem, Israel
    http://www.jerusalembookfair.com

    14th International Vilnius Book Fair
    February 21-24, 2013
    Vilnius,
    Lithuania
    http://2013.vilniunknygumuge.lt

    The Leipzig Book Fair
    March 14 – 17, 2013
    Leipzig, Germany
    http://www.leipziger-messe.de

    Paris Book Fair 2013
    March 22 – 25, 2013
    Paris, France
    http://www.salondulivreparis.com

  20. సౌమ్య

    Vijayawada Book Fair dates: Jan 1st to 11th 2013
    News here

  21. Geervani

    I want to grab the copy of “Mithunam” by Sri Ramana. Where can I get that book? If anybody knows, please tell me.

  22. Geervani

    Last week I read two books which were written by Sudha Murthy.
    They are “Mahasweta” and “Gently falls the Bakula”.
    I like her writings. She presents the stories very nicely. Her language is very simple and very touching.

  23. Geervani

    I want to in touch with Telugu and telugu books. I want myself engaged with in these books.

    1. varaprasad

      pl give me some references of chalam&sree sree book sellers,…….varaprasad.

  24. సౌమ్య

    వేటపాలెం గ్రంథాలయం, గౌతమి గ్రంథాలయం-రాజమండ్రి, ఏఫీ ఆర్కైవ్స్-తార్నాక, కాకినాడ సాహిత్య పరిషద్ లైబ్రరీ -వీటన్నింటిలోని పుస్తకాల జాబితాలు Press Academy Archives లో ఉన్నాయి. లంకె ఇక్కడ.

    లంకె ఇచ్చిన వారు: జగదీశ్ పిచిక

    1. Sreenivas Paruchuri

      Well, the lists are there since more than 7 years and they list journals ONLY. And (majority of) these journals are available for viewing/downloading from the same site.

  25. kompella sarma

    మయూర మహాకవి కృతం – శ్రీ సూర్య శతకమ్
    సూర్యస్తుతిరూపమగు మనోహర సంస్కృతకావ్యం. సుప్రసిద్ధ సంస్కృత కవి మయూరుడు కాశ్మీరదేశీయుడు అనియు,అతడు హర్షవర్థనుని (శీలాదిత్యుని) ఆస్థానమున ఉండెనని ఐతిహాసికములగు ప్రమాణములచే సంస్కృత సాహిత్యేతిహాసజ్ణులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. క్రీ.శ. ఏడవ శతాబ్ది కాలమునాటి కవిశ్రేష్ఠుడుగా పేరుపొందినట్లు వివరించబడింది. శతక సంప్రదాయంలోలాగ, 102 సంస్కృత శ్లోకాలతో, సూర్యద్యుతి(ప్రభా)వర్ణనము, సూర్యాశ్వవర్ణనము, సూర్యరథసారథి(అరుణ)వర్ణనము, సూర్యరథవర్ణనము, సూర్యమండల వర్ణనము, సూర్యవర్ణనము అని ప్రకరణములుగా సుప్రసిద్ధ పండితులు బ్రహ్మశ్రీ పాతూరి సీతారామాంజనేయులు గారి అన్వయ, ప్రతిపదార్థ,భావార్థ వివరణములతో సవిస్తరంగా అందజేసిన గ్రంథం చదువుతున్న అనుభూతి వర్ణనాతీతం. ప్రతీ శ్లోకం ‘మీకు క్షేమము కలుగవలయును’ అని పఠితలును శ్రోతలను ఆశీర్వదించే విధానాన్ని బట్టి, మయూరుడు సకలజనుల శ్రేయమునకే ఈ శతకకావ్యమును రచించినట్లు తెలుస్తోంది. మయూరుడు తనకు కలిగిన కుష్ఠువ్యాథిని నివారించుకొనుటకై సూర్యోపాసనలో భాగంగా రచించినట్లు కూడ కొందరు భావిస్తున్నట్లు గ్రంథంలో వివరించబడింది.
    ‘ఆరోగ్యం భాస్కరా దిచ్చేత్ – శ్రియ మిచ్చే ద్దుతాశనాత్, జ్ణానం మహేశ్వరా దిచ్చేత్ – మోక్ష మిచ్చే జ్జనార్దనాత్’ అన్న పెద్దలమాటల్ని బట్టి భాస్కరుడు ఆరోగ్యప్రదుడు; అగ్ని శ్రీని (వర్చస్సును, సంపదను) ఇచ్చునని, శివుడు జ్ణానప్రదాత, విష్ణువు మోక్షదాత అని చెప్పబడుతోంది. అట్టి ఆరోద్యదాతయగు మహానుభావుని బహువిధముల వర్ణించుచు, స్తుతించబడిన ‘సూర్యశతకం’ అవశ్యం పఠనీయం.
    కాళిదాసాది మహాకవులతో సరిసమంగా ఆదరము పొందు స్థానమును సంపాదించి పెట్టిన ‘సూర్యశతకం’, తత్త్వమును ఎరిగి కావ్యాధ్యాయనం చేసిన, సూర్యుని స్తుతించిన ఆనందమును, పవిత్రతను సూర్యభగవానుని అనుగ్రహమును, ఆరోగ్యమును, సౌభాగ్యమును, ముక్తిని కూడ సాధించుకోవచ్చు అని కూడ పలువురి విశ్లేషకుల భావన. ఈ గ్రంథాన్ని టాగూరు పబ్లిషింగ్ హౌస్ వారు (2005) ప్రచురించారు.
    (కొంపెల్ల శర్మ)
    Kompella Sarma

  26. satyanarayanamurthy

    పాత చందమామలు రెండు లింకు లు దొరికాయి నేను డౌన్లోడ్ చేసుకున్నాను. కావలిసిన వారు ప్రయత్నించండి..
    https://rapidshare.com/#!download|603p1|227539379|Chandamama_September_1948.pdf|10620|0|0
    https://rapidshare.com/#!download|664p6|227530818|Chandamama_October_1948.pdf|13101|0|0

    1. rv

      అలనాటి చందమామలు మరికొన్ని పొందాలంటే info[ఎట్]teluguthesis[డాట్][కామ్‌]కి మెయిలు చేయండి

  27. సౌమ్య

    “శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఉత్తమ కథలు ఆవిష్కరణ”
    details -http://vihanga.com/?p=6093

  28. Rayala

    Hi,

    I am looking for a book ( if one exists at all) in Telugu that consists of COMPLETE works of Saint Tyagaraja (I mean his compositions and dramas). If any of you have ever came across such a volume, could you please share the information (Title, publications, contact address etc) here. Many thanks – Rayala

  29. సౌమ్య

    Here is a news item (via an email from an acquaintance) about Sahitya Academy exhibition in Bengaluru:
    “The National Book Week exhibition is on till November 21 from 10 am to 8 am at Udayabhanu Kala Sangha at Gavipuram”

    “The exhibition features a wide array of original and translated works of a crosssection of Indian writers.

    Book lovers can pick from Sahitya Akademi awardwinning works such as Poornachandra Tejaswi’s The Inscrutable Mystery, Michel Larneuil’s Begam Samru of Sardhana, short story collections and a numerous works on modern Indian literature and drama.”

    http://newindianexpress.com/cities/bangalore/article1340127.ece

    1. విజయవర్థన్

      There are not many books there. You may see about 100 books. That is all they have there. Also, they have only English & Kannada there. I could see a lot translation works of Telugu Literature.

  30. సౌమ్య

    డ్రాకులా నవల రాసిన బ్రాం స్టోకర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన రాసిన వాటిల్లో గుటెంబర్గ్ ప్రాజెక్టులో ఉచితంగా లభించే పుస్తకాల వివరాలు –
    http://www.mediabistro.com/galleycat/bram-stoker-books-for-his-birthday_b60451

  31. సౌమ్య

    “On November 6, 1856, thirty-six-year-old Mary Ann Evans, a well-regarded intellectual and essayist, submitted a manuscript to Blackwood’s Magazine. It would run, in three installments, throughout the next year. And under the title Scenes of Clerical Life, the three stories would become George Eliot’s first published work of fiction.”
    http://www.theparisreview.org/blog/2012/11/06/on-this-day/

  32. సౌమ్య

    ప్రసిద్ధ జర్నలిస్టు ధర్మవరపు సీతారాం గారు ఇవ్వాళ మరణించారు.
    ఆయన గురించి భండారు శ్రీనివాసరావు గారి బ్లాగులో వ్యాసం ఇదిగో.
    http://bhandarusrinivasarao.blogspot.de/2012/11/blog-post_5231.html

Leave a Reply