పుస్తకం
All about booksపుస్తకలోకం

December 13, 2011

పుస్తక ప్రియుడు…శ్రీ మోదు రాజేశ్వర రావు

More articles by »
Written by: అతిథి

రాసిన వారు: శ్రీనిక
(ఒక రచయిత తన రచనల ద్వారా సమాజాని కి సేవ చేయచ్చు. కానీ సాటి రచయితలను ప్రోత్సహించే వారిలో అరుదైన వ్యక్తి..శ్రీ మోదు రాజేశ్వర రావు. అటువంటి వారిని పుస్తకం.నెట్ ద్వారా పరిచయం చేయాలని ఆశిస్తూ ఈ వ్యాసం.-సాయి శ్రీహిత)

****************
ఏదో ఒక పుస్తకం అతన్ని ఎంతగానో కదిలించి ఉండవచ్చు …
ఏదో ఒక పుస్తకం అతనికి లేపనమై లోపలి పొరలను సుతారంగా తాకిందేమో….
ఏదో ఒక పుస్తకం అతనికి సంకల్ప శక్తినిచ్చి ఉండవచ్చు
ఏదో ఒక పుస్తకం వేల ప్రశ్నలకు ఒక సమాధానమై నిలిచిందేమో…
ఏదో ఒక పుస్తకం సాంత్వనమై అతనిని ఆలింగనం చేసుకుందేమో…
అందుకే పుస్తకాన్ని అతను ప్రేమగా స్పృశిస్తాడు..
పుస్తకానికి అతను పాదాభివందనం చేస్తున్నాడు…
పూవులలో పెట్టి పూజిస్తాడు, కన్న బిడ్డలకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు, జన్మనిచ్చిన తల్లి తండ్రుల తర్వాత ప్రపంచంలో అతను ప్రేమించేది పుస్తకాన్నే. అతని మనసులో పుస్తకం గురించిన ఆలోచన లేని క్షణం అతని జీవితంలో లేదంటే అతిశయోక్తి కాదు. పుస్తకానికి పూర్తి స్థాయిలో సేవలందించడానికి విశాఖపట్నం పోర్టు ట్రస్టులో ఉన్నత పదవికి స్వఛ్ఛంద పదవీ విరమణ చేసారు.

అతని పేరు: మోదు రాజేశ్వర రావు(చిత్రకారుడు, కవి, కార్టూనిస్టు,జర్నలిస్ట్,కధా, నాటక రచయిత,సంపాదకుడు,సమీక్షకుడు,గ్రంధపాలకుడు)
నివాసం : విశాఖపట్నం

ఒక రచయితగా…

అక్షరలక్షలు (మినీ కవితలు)…1984
అక్షరోదయం (మినీ కవితలు)…1989
అమృత వర్షిణి (దీర్ఘ కవిత)…1991
అద్దం (మినీ కవితలు)….1995
అరణ్యనేత్రం (కవితలు)….2003
అరవైరెళ్ళు 120 హైకూలు…. 2003
అశిపుత్రి (స్త్రీవాద మినీ కవితలు)….2003
అసమాన్య విశాఖలో విశాఖ మాన్యులు ….2004
జాతీయ పురస్కార గ్రంధం (వివిధ రంగాలలో విశాఖకు వన్నె తెచ్చిన 133 గరు కళాస్రస్టల విశేషాల వ్యాసమంజరి)
అట్టమీద కవిత (మినీ కవితలు)….2010
ఆది మృగాడు (స్త్రీవాద కవితలు) …2010
అర్ధనూట పదహార్లు (మినీ కవితా సంఫుటి )….2011

రాబోయే పుస్తకాలు…
అసమాన్య విశాఖలో విశాఖ మాన్యులు
(150 మంది కళాస్రష్టల జీవిత విశేషాలు కూర్పుతో మలిముద్రణ)
అసిపుత్రి (స్త్రీ వాద మినీకవితలు)
(మలి ముద్రణ మరియు హిందీ అనువాదం)
అసుర హాస (కార్టూన్లు)
అనావర్తి (కధల సంపుటి)

ఒక సంఘ, సాహితీ సేవకుడిగా

* సత్య – మూర్తి చారిటబుల్ ట్రస్ట్ (రి) క్రీడా, సాహితీ, సాంస్కృతిక స్వచ్చంద సంస్థ నిర్వహణ
* శ్రీశ్రీ శత జయంతి గ్రంధాలయం నిర్వహణ (మహాకవిపై గల సాహిత్యాభిమానంతో విశాఖలో ఆయన పేరుమీద గ్రంధాలయాన్ని నిర్వహిస్తున్నారు)
* ప్రతి సంవత్సరం నవంబర్ 19 న కవికి, కష్టజీవికి తమ తండ్రిగారి పేరున స్మారక పురస్కారాల ప్రదానం.
* పుస్తకం మీది..ఆవిష్కరణ మాది.అంటూ రచయితల పుస్తకాలను ట్రస్టు ఉచితంగా ప్రచురించి ప్రముఖ సాహితీవేత్తలచే ఆవిష్కరింప జేయడం.
* ప్రతి ఏటా సందర్భానుసారంగా వివిధ సాహితీ, సాంస్కృతిక, క్రీడా పోటీలు నిర్వహించడం
* రచయితలకు సాయం..రచనలకు జీవం పుస్తక ప్రపంచం..రచయితల పుస్తకాలు కొని అమ్మడం.
* ప్రతినెలా మొదటి గురువారం శాఖా గ్రంధాలయంలో ఒక సాహితీ సమావేశం నిర్వహణ
* ప్రతి సంవత్సరం ఎంపిక చేయబడిన ఒక రచయిత అముద్రిత రచన ఉచిత ముద్రణ, మరియు ఆవిష్కరణ

ఒక సంపాదకుడుగా

* “కావ్య సమీక్ష” తెలుగు మాస పత్రిక నిర్వహణ (సాహితీ విమర్శల పెద బాలశిక్ష )
-ప్రతీ నెలా 25 (ముద్రితాలు, అముద్రితాలు) పుస్తకాల సమీక్షలను తెలుగు భాషలో అందిస్తున్న ఏకైక పత్రిక.
* వార్షిక కవితా సంకలనం .. (2005)
* శ్రీశ్రీ కి అక్షర నీరాజనం (శ్రీ చాయారాజ్ రచన)…(2010)
* రేపటి శూన్యాన్ని .. (శ్రీ కె.వి.ఎస్. నరసింహం రచన)…(2011)

ఒక సాహితీ ప్రియుడుగా

రాష్ట్ర తెలుగు సాహితీ ప్రయాణం: ప్రతి జిల్లా నుండి ఒక కధా సంకలనం, ఒక కవితా సంకలనం తీసుకు వస్తున్న మహాసంకల్పం. ప్రతి జిల్లాలోనూ కధకులను, కవులను సమావేశ పరచి రచనలను స్వీకరించి సంకలనాలను ప్రచురించి, ఆవిష్కరించి ఆయా రచయితలను ఆహ్వానించి సన్మానించి, సత్కరించి చేతినిండా ఉచిత ప్రతులను నింపి సాగనంపే ఆయన గురించి ఇక్కడ చెప్పడం అప్రస్తుతం కాదనిపిస్తుంది. ఇప్పటి వరకూ ఏ భారతీయ భాషలోనూ ఇటువంటి బృహత్తర కార్యక్రమం నిర్వహించబడలేదు.

నవంబర్ 19 .. 2010 నుండి ఇప్పటి వరకూ విడుదలైన పుస్తకాలు..

విశాఖ పట్నం: కథకుల కథాశిఖరం,కవుల కవితాసాగరం
విజయనగరం: కథకుల కథలజాడ, కవుల కవితలకోట
శ్రీకాకుళం: కథకుల కథావళి, కవుల కవితల ధార
తూర్పుగోదావరి: కథకుల కథా గోదారి, కవుల కవితలరాదారి
పశ్చిమ గోదావరి:కథకుల కథా వాశిష్టం, కవుల కవితాభారతం
కృష్ణా: కథకుల కథా కృష్ణ, కవుల కవితామజిలీ

యువ కవులను ప్రోత్సాహి స్తూ ఇంకా అనేక సంకలనాలు … మచ్చుకు కొన్ని..ప్రతి సంవత్సరం ఉగాది, సంక్రాంతి లకు ఔత్సాహిక కవులను ప్రోత్సహిస్తూ కథలనూ కవితలనూ ఆహ్వానించి సంకలనాలు ప్రచురిస్తారు.

ఉత్తరాంధ్ర గుండుసూదులు (మినీ కవితలు)
అరవై దాటిన స్వాతత్ర్యం (మినీ కవితలు)
మహాత్మా ! మన్నించు (కవితలు)
నాన్న (కవితలు)


అభ్యర్ధన: సాహితీ ప్రి యులెవరైనా వీరి గ్రంధాలయానికి పుస్తకాలు విరాళంగా అందించాలనుకుంటే ఒక్క ఫోను 9391811226,9396447227 చేయండి. వారే స్వయంగా
వచ్చి తీసుకెళతారు. (డా. అక్కినేని నాగేశ్వర రావు గారు సుమారు మూడు వేల పుస్తకాలు విరాళమిచ్చారు.)About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.2 Comments


  1. 9391811226-ఈ నంబరు పని చేయుటలేదు
    9396447227 -ఈ నంబరు ఏకారణముచేతో ఆయన లిఫ్ట్ చేయటములేదు.ఇవ్వాళ వేరే పని ఉండి ఆయనకు ఫోను చేయాల్సివచ్చింది.


  2. మోదు రాజేశ్వరరావు గారి అరుదైన వ్యక్తిత్వానికి ఈ మాధ్యమం ద్వారా శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Ngugi Wa Thingio’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Nguigi Wa Thiongio) రాసిన Education for a national culture అన్న వ్యాసం గు...
by అతిథి
0

 
 

నీల :: కె. ఎన్. మల్లీశ్వరీ

వ్యాసకర్త : జయశ్రీ నాయుడు దాదాపుగా ఆరు వందల పేజీల కథా గమనాన్ని సమీక్ష గా కుదించాలంటే ...
by అతిథి
0

 
 

గడ్డి పూలు – గుండె సందుక

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ************** పూల మనసుల్లోకి … శాంతి ప్రబోధ కథా సంపుటి “గడ్డి పూల...
by అతిథి
1

 

 

On Writing: Stephen King

Written by: K.S.M Phanindra Books that teach writing are often very dry and I deliberately avoid them. I have read a couple of them and liked some of them a lot. Two of my favorites are “Telling Writing” by Ken Macr...
by అతిథి
1

 
 

నా 2017 పుస్తక పఠనం

మరో ఏడాది ముగుస్తోంది. ఈ ఏడాదిలో చదివిన పుస్తకాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవడాన...
by సౌమ్య
1

 
 

పుస్తకం.నెట్ తొమ్మిదో వార్షికోత్సవం

ఇవ్వాళ్టితో పుస్తకం.నెట్ మొదలుపెట్టి తొమ్మిదేళ్ళు పూర్తవుతుంది. ముచ్చటగా పదో ఏట అడ...
by పుస్తకం.నెట్
0