పుస్తకం
All about booksఅనువాదాలు

May 3, 2009

సాకేత రామాయణం (గేయ కావ్యం)

More articles by »
Written by: జ్యోతి

pustakam1

మానవజీవనము ఉన్నంత కాలం రామాయణముంటుంది. కొండలూ, కోనలూ, వాగులూ, వంకలూ , సూర్యచంద్రాదులు ఈ జగాన ఉన్నంత కాలం రామాయణముంటుంది. అంతే కాదు. ఎప్పటికి నిత్యనూతనంగా తోస్తుంది. అదే ఆ రామకథలోని మహత్తు, మాధుర్యం. ఈ మహనీయ కథామాధుర్యాన్ని సాకేత రామాయణం పేరుతో శ్రీ గజానన్ తామన్ గారు గేయరూపంలో మనకు అందిస్తున్నారు. ఇది ఒక అద్భుతం, మనోజ్ఞమైన గేయకావ్యం. ఇందులో వివిధ రగడజాతికి చెందిన యాభై రెండు గేయాలు పొందుపరచబడ్డాయి. కథాసూత్రాన్ని పాత్రలే తమ మనోభావాల్ని గేయరూపంలో వ్యక్తం చేస్తాయి. మహారాష్ట్ర కవి శ్రీ గజానన్ దిగంబర్ మాడ్గూళ్కర్ రాసిన ఈ గేయకావ్యం గీత్ రామాయణ్ ని తెలుగులొ అనుసృజన చేసినవారు  శ్రీ గజానన్ తామన్. వారు  తెలుగు, సంస్కృతంతో పాటు ఆంగ్లభషలో ఆచార్యులు, మరాఠీ భాషలో పండితుడు. ఆయన రచించిన మానస సరోవరం కవితా సంకలనం తెలుగు సాహితీ ప్రపంచంలో బహు ప్రశంసలందుకున్నది.

సాకేత రామాయణం గేయరూపంలో ఉంది. ఇందులో కథనంతా పాత్రలే నడిపిస్తాయి. కథలోని ముఖ్య పాత్రలు ఎక్కడా బిగి సడలకుండా ఏ పాత్రకా పాత్ర స్వభావం ఏమాత్రం భంగం కలగకుండా ప్రధాన సన్నివేశాలన్నీ అలా అలలుగా గేయరూపంలో  సాగిపోతుంటాయి. అప్పుడప్పుడు రచయిత నివేదకుడిలా మధ మధ్యలో కనిపిస్తాడు.  బాల్యకాండ, అయోధ్యకాండ మొదలగు కథాంశాలు పాత్రల ద్వారా సులభమైన గేయాలుగా మనకు సాక్షాత్కరిస్తాయి. లవకుశుల రామాయణగాణం తన్మయత్వంతో రాముడు వినుచుండే అని కథ ప్రారంభమవుతుంది.
శ్రీరఘువర్యుడు తన్మయుడై విను
శిశువులు పాడగ రామాయణమును.

అశ్వమేధయాగం చేసిన పిమ్మట శ్రీరామజనన విషయం తెలుసుకున్న అయోధ్యావాసులు ఇలా మాట్లాడుకున్నారంట.

చైత్రశుద్ధనవమి నేడు ఎంత పోడిమి?
సౌరభాల వాయు వైన ఎంత వేడిమి?
రెండు ప్రహరులైన పొద్దు నెత్తి మీదను,
శ్రీరాముడు పుట్టినాడు చెల్లెలా! విను..

సీతాపహరణ విషయం తెలుసుకున్న రాముడు దుఖఃఅముతో ఇలా శోకించాడంట.

కదంబ! చెప్పవె
వినావిలంబము!
కంటివె సీతను
నదీ తటమ్మున?
కదులు తీరు రా
యంచను మించును.

అశోకమా! నా
శోకము బాపుము..
అవనిజ ఎచ్చటి
కేగెనొ చెప్పుము?
అభద్రదృశ్యము
కలలొ కంటివ?

అగ్నిపరీక్ష పిమ్మట రాముడు ఇలా అన్నాడు.

నే నెరుగన? అజ్ఞుడనా?
జానకి యొక సాధ్వి యగుట.
జనసమ్మతి వడయుటకే
అనుమతించిని పరీక్ష.

అలుక నూని రేని జనులు
నిలువ గలదె ప్రభుత?
ప్రజా హృదయ మెరుగుటయే
ప్రభుని ప్రధమ కర్తవ్యం.

సామాన్యమైన పదజాలంతో , అందమైన గేయాలతో రామయణ కథామృతాన్ని ఒక విభిన్న రీతిలోఅందించిన ఒక అపురూపమైన పుస్తకరాజం “సాకేతరామయణం.

రచయిత : శ్రీ గజానన్ తామన్
మూలం : శ్రీ గజానన్ మాడ్గూళ్కర్.. గీత్ రామాయణ్

ప్రచురణ:
శ్రీ సీతారామ సేవాసదన్
మంధని.
జి .. కరీం నగర్ (ఆం.ప్ర) 505184
ఫోన్: 08729 – 258439About the Author(s)

జ్యోతి3 Comments


  1. […] తామన్ గారు గేయరూపంలో అందించిన అద్భుత గేయకావ్యం. ఇందులో వివిధ రగడజాతికి చెందిన యాభై […]


  2. durgeswara

    ennisaarlu vraasinaa ennisaarlu chadivinaa nityanootanamee raamaayanam


  3. sAkEta rAmAyaNaM … Hmm…interesting!  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0