పుస్తకం
All about booksపుస్తకభాష

November 21, 2011

V.A.K. “ఆలాపన” కు “జై” అన్న ముళ్ళపూడి వేంకటరమణ

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్రాసిన వారు: కాదంబరి
****************

వేంకట ఆనంద కుమార కృష్ణ రంగారావు అవిరళ కృషికి మహోద్గ్రంధ రూపమే 513 పుటల “ఆలాపన”. శ్రీమతి భార్గవి గారికి ‘పుస్తకప్రపంచం’ ఋణపడి ఉంటుందనడంలో సందేహం లేదు.ఎందుకంటే సాహిత్యము అనే మొక్కకు నీరు పోసి, సంరక్షణ చేసే వరద హస్తములు ఎప్పుడూ వందనీయాలే! డాక్టర్ భార్గవి గారితో:”మాట మాట” (436నుండి 495 పేజీల వఱకు) ఇంటర్వ్యూ ఈ పుస్తకమునకు హైలైట్.

భార్గవి గారు 200 పేజీలు ఔతుందని అనుకుని, ప్రచురణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కానీ తీరా చూస్తే 400 పేజీలని మించి, ఇంకా, ఇతర హంగులతో…….
అనగా ఇంటర్వ్యూ ఇత్యాదులతో- అదనంగా 70 పేజీలు అయ్యేటట్లుగా ఉన్నది, ఎలాగ? ఏమి చేతుము?”- అనుకుంటూ భార్గవి మథనపడుతూన్నారు. ఆ తరుణంలో ఒక ఫోన్ వచ్చినది. అది ముళ్ళపూడి వేంకట రమణ నుండి!!

“అమ్మా! నువ్వు V.A.K. ని ఇంటర్వ్యూ చేసిన కాసెట్టును విన్నాను. చాలా థ్రిల్లింగుగా ఉన్నది. 30 ఏళ్ళుగా వి.ఎ.కె. నాకు తెలుసు. అయినా నీ ఇంటర్వ్యూ విన్నాక నాకు తెలీని విషయాలు కొన్ని తెలుసుకున్నాను అనీ” -ఆ రోజే నిర్ణయించుకున్నాను, ఇంటర్వ్యూ పుస్తకానికి అదనపు ఆకర్షణగా ఉంచాల్సిందేనని- అనుకునారు భార్గవి.
ఇలాగ ఒక ఫోన్ కాల్ ఒక మంచి పుస్తక స్వరూపాన్ని తీర్చిదిద్దడానికి కారణమైనది.

వి.ఎ.కె.రంగారావు అనేక ప్రముఖ పత్రికలలో వ్యాసాలు రాసిన కాలమిస్టు. శ్లేష చక్రవర్తి ముళ్ళపూడి మాటలలో వీరి వ్యక్తిత్వాన్ని వీక్షించగలము.

“వి.ఎ.కె. రంగారావు మ్యూజికాలమిస్టే కాదు, మ్యూజికాలజిస్టూ, లిటరేచరాలజిస్టూ కూడా. మల్లాది శాస్త్రి గారి సాహిత్యాన్ని మధించి, నవనీతాన్ని సాధించాడు. అన్నమయ్య పదాలు నూటికి పైగా పరిశీలించి, పరిశోధించి, ఎన్నోవిషయాలను తెలియజెప్పాడు. సంగీత సాహిత్యాలనే కాక నాట్య కళను కూడా ఆజన్మాంతం ఆరాధించే’త్రివేణీ సంగమేశ్వరుడూ ఈ ఆనంద క్రిష్ణ రంగరాయలు’. ఏడు పదులు దాటినా ముక్కాలి ముదుసలి కాకుండా నిత్య యవ్వనుడై, నేటికీ శక్తి చైతన్యవంతమైన నాట్యం చేస్తాడు.
ప్రతి ఏటా తిరుపతి-శ్రీనివాస మంగాపురంలో ఆషాఢ శుద్ధ సప్తమి నాడు కళ్యాణ వేంకటేశ్వరుని ఎదుటనూ, శ్రావణ మాసంలో లో శ్రీ కృష్ణ జయంతి నాడు కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామివారి ఆ దివ్య మంగళ విగ్రహం ఎదుటనూ రెండేసి గంటలు నాట్య నివేదనం చేస్తాడు. ఆలయ మంటపంలో దేవదాసీలు స్వామికి నృత్య నివేదన చేసే ఆనాటి సంప్రదాయాన్ని- ఈ నాటికీ మన్నించి, మధుర భక్త్యావేశంతో నివేదించేది ఈ ఒక్క మహా మనీషే.”

ఇంకా ముళ్ళపూడి వాక్కులలోనే వి.ఎ.కె. పర్సనాలిటీ సాక్షాత్కరిస్తుంది, అందుకే మక్కికి మక్కీగా అవే పద వల్లరి ఇక్కడ…..

“త్యాగరాజ స్వామి ‘ప్రక్కల నిలబడి…’ కీర్తనలో ప్రభువుతో చిన్న సరాగమాడాడు. “హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కొలువు తీరిన శ్రీరామచంద్రుని వైభవాన్ని కన్నులారా తిలకించి తరించే భాగ్యం మాకే ఉందయ్యా! సభలో కూర్చుని నిన్ను చూసే అదృష్టం మాకే వుందయ్యా! సింహాసనం మీద కూర్చుని- నన్ను చూస్తున్న నీకు లేదు కదా!”- అన్నాడు. అలాగే వి.ఎ.కె. రంగారావు కళ్యాణ వేంకటేశ్వర, వేణుగోపాల స్వామి వారల సమక్షంలో నృత్య నివేదన చేస్తూంటే ఆ దృశ్యాన్ని, ఆ వైభవాన్ని సందర్శించే అదృష్టం ఆ ఎదురుగా కూర్చున్న ప్రేక్షకులు అందరికీ వుంటుంది గాని ఆయనకు లేదు. ఆని ఆయన దాన్ని సందర్శించేది ప్రేక్షక నేత్రాలలో- రాగ రంజిత హృదయ దర్పణాలలో. ధన్యహో!”

‘ఆలాపన ‘ అనబడే ఈ ఎన్ సైక్లోపేడియాలో – నిజంగా ఆ పేరుకు తగినన్ని విశేషాలూ, వివరాలూ, వింతలూ ఉన్నాయి.
(ఈ పుస్తకంలో వున్నవి రెండేళ్ళ సంగతులే కాని ఆయన రాసినవి నలభై యేళ్ళపాటు. దీర్ఘ కాలమ్.)

వి.ఎ.కె. ఆదినుంచి హిందీ సంగీత దర్శకుడు “సి.రామ చంద్ర” భక్తుడు. బాపు, పి.బి. శ్రీనివాస్ లు రామచంద్ర చితల్కర్ మూలంగానే- “ముగ్గురు మిత్రు”లయ్యారు.
అలాగే మదన్ మోహన్, సలీల్ చౌధురి మన వి.ఎ.కె. కి చాలా ఇష్టం. వారి పాటలు – ఏనాటివో ఈయన ప్రస్తావించి వల్లిస్తూంటే ఆ హిందీ మ్యూజిక్ డైరెక్టర్ లే ఆశ్చర్యపోయేవారు. ఈ తరం వారికి తెలియని సరదా సంగతులు ఎన్నో ఈ ఆలాపనలో అందంగా- ముత్యాలహారంలో సైజు వారీ ముత్యాల వలె పొందుపరచి వున్నాయి. ఇలాగ సాక్షాత్తూ ముళ్ళపూడి వేంకటరమణ కలం “జై” అంటూ- (8 pages) అక్షరాలా ఎనిమిది పేజీలు “మున్నుడి” రాసారంటే వి.ఎ.కె. రంగారావు గారి “కలం కష్టమ్”
సాహితీ సేద్యంలో ఆయన మొలకెత్తించిన “ఆలాపన” కల్పవృక్షపు అమూల్య పుష్పము- అని నిర్ద్వంద్వంగా పేర్కొనవచ్చు.

 

“ఆలాపన”
రచన: వి.ఎ.కె.రంగారావు
(ధర:- రూ.250/-) (ప్రచురణ- 2003)
“ఆలాపన”;
ప్రతులకు:-
బదరీ పబ్లికేషన్స్
భార్గవీ నర్సింగ్ హోమ్
పామర్రు;- 521157; క్రిష్ణా జిల్లాAbout the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.5 Comments


 1. ఆలాపన,మరో ఆలాపన, కూడా చదివాను.సంగీతప్రియులందరూ చదవవలసిన పుస్తకాలడానికి ఎలాంటి సందేహం లేదు.


 2. సత్యనారాయణ గారూ!
  ఇలాటి మంచి సాహిత్య వ్యాసంగాలు,
  పత్రికల ప్రత్యేక ఆసక్తి, కృషి-లవలననే సుసాధ్యమౌతున్నాయి.
  మీ అభిప్రాయాలను తెలిపినందుకు ధన్యవాదాలు.

  (kadanbari)


 3. Satyanarayana Piska

  కాదంబరిగారూ!

  నా విద్యార్థిదశలో ఆంధ్రసచిత్రవారపత్రికలో సీరియల్ గా వచ్చిన “ఆలాపన” క్రమం తప్పకుండా ఎంతో ఆసక్తిగా చదివేవాణ్ణి. ఆ వ్యాస సమాహారం పుస్తకరూపములో వచ్చాక, దానిని చదివే అవకాశం దొరకలేదు. ఇప్పుడు మీ సమీక్ష చదివాక, “ఆలాపన” చదవాలనే కోరిక మరింత బలీయమయింది.


 4. చంద్రహాస్ గారూ!
  డాక్టరైన భార్గవిగారు సాహిత్య ప్రియులు మాత్రమే కాక,
  సంగీత రాణి కూడా- అని మీద్వారా తెలిసినది.
  ఆమె గానమాధుర్యాన్నివినే అవకాశం,
  మనకు రావాలని కోరుకుంటున్నాను.
  ఇలాటి సాహితీ సేద్యకారులూ,(రచయితలు),
  సాహితీ సంరక్షకుల వలననే
  ఇంకా మన మాతృ భాషా సస్యకేదారములు
  పచ్చగా ఉన్నవి .

  కాదంబరి;కుసుమ;


 5. చంద్రహాస్

  వ్రుత్తిరీత్యా డాక్టరైన భార్గవిగారు సంగీత సాహిత్య ప్రియులు. వారు మధురంగా పాడుతారు. ఎంత మధురంగా అంటే వారు నండూరి గారి ఎంకి పాటలు పాడితే ఎంకి నాయుడు బావలు శ్రోతలముందు ప్రత్యక్ష్యమౌతారు. వారు Dr. గురవారెడ్డి గారి “గురవాయణం”లో కనిపిస్తారు. Dr. నక్కా విజయరామరాజు గారి “భట్టిప్రోలు కథలు” లో వారి ప్రోత్సాహం కనిపిస్తుంది. “ఆలాపన” తెలుగు సినిమా సంగీతానికి authentic commentary అయితే ఆ పుస్తకానికే తలమానికం వి.ఏ.కె.రంగారావు గారితో Dr.భార్గవి గారి interview. ఈ పుస్తకాన్ని ప్రచురించిన భార్గవిగారు నిజంగా అభినందనీయులు.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వెండివెన్నెల: మళ్లీ మళ్లీ నిర్మించిన సినిమాల ముచ్చట్లు

వ్యాసకర్త: కాదంబరి ************* వెండి తెరకు శీతల వెన్నెల భాష్యాలు వెలయించిన పుస్తకం ‘వెండ...
by అతిథి
0

 
 

సాహితీ నీరాజనం – శ్రీ చీమకుర్తి శేషగిరిరావు

వ్యాసకర్త: కాదంబరి ******* ఆంధ్రస్య మాంధ్ర భాషా చ| న అల్పస్య తపసః ఫలం|| అని అప్పయ్య దీక్షిత...
by అతిథి
2

 
 

“శృంగార నైషధము” విశ్లేషణ – కొల్లా శ్రీకృష్ణారావు

వ్యాసకర్త: కాదంబరి ****** “కవికీ, కంసాలికీ సీసం లోకువ.” అని నానుడి. కంసాలి లోహమైన ‘సీ...
by అతిథి
0

 

 

పద్మావతి కృషి

వ్యాసకర్త: కాదంబరి ******* పోట్లూరి పద్మావతి అనేక ఆధ్యాత్మిక పుస్తకములను రచించారు. అన్న...
by అతిథి
1

 
 

మధుబిందువులు

వ్యాసకర్త: కాదంబరి ****** “మధు బిందువులు” పేరు చూడాగానే బోధపడ్తుంది, ఇవి సున్నిత భావాల క...
by అతిథి
0

 
 

కాళికాంబా సప్తశతి

వ్యాసకర్త: కాదంబరి *********** “ముడుమాల” ఒక మారుమూల పల్లెటూరు. ఐతే ఆ చిన్ని కుగ్రామం గొప్ప అ...
by అతిథి
2