We’re back!

గత పది రోజులుగా పుస్తకం.నెట్ అందుబాటులో లేదన్న సంగతి తెలిసినదే! పదిరోజుల క్రితం వర్డ్-ప్రెస్ మీద జరిగిన దాడి మూలంగా సైటును మూయాల్సి వచ్చింది. ఆ హడావుడి సద్దుమణిగాక, ఇప్పుడు పుస్తకం మీ ముందుకు వచ్చింది.

ఈ పదిరోజుల్లో ’పుస్తకం’ గురించి ఓపిగ్గా ఎదురుచూసిన పాఠకులకు, వారి వారి వ్యాసాల ప్రచురణలో జాప్యం అయినా సహృదయంతో అర్థం చేసుకున్న మా వ్యాసకర్తలు ధన్యవాదాలు.
ప్రస్తుతానికి మాకున్న పరిమితులకు లోబడి, పుస్తకం.నెట్‍లోని కొన్ని ఫీచర్స్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. వాటిలో ముఖ్యంగా, ఎక్కువ ఆదరణ పొందిన ఈ కింది పేజీలుండబోవు:
౧. ’మీరేం చదివారు?’
౨.’చెప్పాలని ఉందా?’
ఇది తాత్కాలికమేనని, వీలువెంబడే వీటిని ఉపయోగించడానికి సరైన, సరళమైన పద్ధతుల్ల్లో ప్రవేశ పెడతామని గ్రహించగలరు. అలాగే, ఈ కొత్త థీంలో మరికొన్ని చిన్న చిన్న మార్పులు (ఉదా: పోస్టుకి వచ్చిన తాజా వ్యాఖ్య పైన ఉండడం, వ్యాఖ్య చేయడానికి కొంచెం కిందకు స్క్రోల్ అవ్వాల్సి రావడం) లాంటివి గమనించగలరు.
ఈ కొత్త పుస్తకాన్ని వాడడంలో మీకెలాంటి ఇబ్బంది ఉన్నా మాకో వేగు పంపండి. దాన్ని పరిష్కరించడానికి మా ప్రయత్నాలు మేం చేస్తాం. అలానే, మీ సలహాలూ, సూచనలూ కూడా!
రాబోవు రెండు, మూడు వారాల్లో బాక్‍గ్రౌండ్ పనుల వల్ల పుస్తకం.నెట్ స్వల్ప వ్యవధుల్లో అందుబాటులో ఉండకపోవచ్చు. అసౌకర్యానికి చింతిస్తూ, ఓపిక పట్టమని అభ్యర్థిస్తున్నాం.
పుస్తకం.నెట్‍ను అభిమానించి, ప్రోత్సహించి, ఆదరిస్తున్న ప్రతి ఒక్కరిక్కీ, మరో మారు ధన్యవాదాలతో,
మీ,
పుస్తకం.నెట్

You Might Also Like

3 Comments

  1. gks raja

    మీరు మళ్లి వెనక్కు వచ్చారు అదే సంతోషం! ఏం జరిగిందబ్బా! అని ఆందోళనలో ఉన్నాం. ఇటువంటి మంచి కార్యక్రమానికి ఈ మాత్రం అడ్డంకులు అర్ధం చేసుకోదగినవే.
    రాజా.

  2. K.Candrahas

    I’m so glad the blog has returned. You mentioned, ‘… వర్డ్-ప్రెస్ మీద జరిగిన దాడి మూలంగా సైటును మూయాల్సి వచ్చింది.’ I don’t get this. Why at all anyone attempted to hack such a harmeless blog? I’m curious. Would you please amplify?

    1. పుస్తకం.నెట్

      Thanks for your comment, Sir.

      No, the hack wasn’t pustakam.net specific. Almost all sites using wordpress across the globe have been a victim of the attack. As a precautionary measure, we had to shut our site and then because of so many other factors, we have taken our time to bring it back.

Leave a Reply