కథాసాగర్ – జన జీవన ప్రతిబింబాల కథానిధి

కొన్నిరోజుల క్రితం ఖదీర్‌బాబు నూరేళ్ళ తెలుగు కథ పుస్తకంపై నా పరిచయానికి స్పందిస్తూ నా డేటన్ మిత్రుడు రామ గుడిమెట్ల అడిగిన ప్రశ్నకు సమాధానంగా నేను మరో మామంచి కథల పుస్తకాన్ని గురించి ప్రస్తావించాను. ఆ మామంచి కథల పుస్తకం వివరాలకోసం కొంతమంది మిత్రులు ఉత్సాహం చూపించారు. వారికోసం, ఈ పుస్తకం మొదటిసారి ప్రచురించినప్పుడు నేను అప్పటి ఇంటర్నెట్ వేదిక “తెలుసా” (తెలుగు సాహిత్యవేదిక) లో వ్రాసిన సమీక్షని కొన్ని మార్పులతో ఇక్కడ అందిస్తున్నాను (మార్పులు లేకుండా కావాలంటే ఇక్కడ). అప్పట్లో ఈమెయిల్‌లో తెలుగు సులభంగా వాడుకోవడానికి వీలుండేది కాదు; కన్నెగంటి రామారావు, ఆనందకిషోర్‌లు సృష్టించిన RIT (Rice Inverse Transliteration aka RTS – Rice Transliteration Scheme) వాడుకుంటూ తెలుగు ఇంగ్లీషు కలుపుకొని (ఇంగ్లీషు లిపిలోనే) వ్రాసుకొనేవారం. మాలో కొంతమందికి ఇంకా ఈ అలవాటు పోలేదు లెండి.

ఈ పుస్తకాన్ని నాకు ముందు అరువు ఇచ్చింది శ్రీ విష్ణుభొట్ల లక్ష్మన్న. 1998లో డల్లాస్‌లో మొదటిసారి ఆయన్ని కలిసినప్పుడు మాటల మధ్యలో ఈ పుస్తకం ప్రస్తావన వచ్చింది. మర్నాడు నేను డేటన్ తిరిగివెళుతున్నప్పుడు విమానాశ్రయంలో ఈ పుస్తకం ఇచ్చారని జ్ఞాపకం. ఈ పుస్తకం చదివే ఉత్సాహంలో ఆరోజు విమానప్రయాణం సాంకేతిక కారణాలవల్ల ఎక్కువసేపు పట్టినా పట్టించుకోలేదు 🙂 ఆరోజుల్లో అమెరికాలో ఆసక్తి ఉన్నవారికి ఈ పుస్తకాన్ని మిత్రుడు డా. కలశపూడి శ్రీనివాసరావు అందించారు.

2007లో రెండవ ప్రచురణ చేస్తున్నప్పుడు, 1997 ప్రచురణకు కొన్ని ముఖ్యమైన చేర్పులు చేశారు. మరికొన్ని కొత్త కథలు చేర్చడంటో కథలసంఖ్య 87 నుంచి 97కి పెరిగింది. ఈ పుస్తకాన్ని ప్రచురించిన కళాసాగర్ సంస్థ గురించి దాదాపు 100 పేజీల వివరాలు ఉన్నాయి (దీనివల్ల పుస్తకం తయారీ ఖర్చు, బరువు బాగానే పెరిగి ఉండాలి). కొత్త ప్రచురణ ముఖపత్రంలో మునపటి నిరాడంబరత, లాలిత్యం, ఆకర్షణ లేవు; పుస్తక ముఖపత్రంలా కాక ప్రకటనపత్రంలా కనిపిస్తుంది.

కొత్త ప్రచురణలో చేర్చిన కథలు:
ఆడెపు లక్ష్మీపతి – తిర్యగ్రేఖ
అంగర సూర్యారావు – ఏడడుగుల వ్యాపారబంధం
ఆరుద్ర – పందిట్లో పెళ్ళవుతున్నది.
భూషణం – విత్తనం
బి.కె. ఈశ్వర్ – రుద్రమ్మ కథ
డి. కామేశ్వరి – కాలాన్ని వెనక్కి తిప్పకు
గోపీచంద్ – మమకారం
జి. ఆర్. మహర్షి – పురాగానం
మహమ్మద్ ఖదీర్ బాబు – ఢాకన్
మహేంద్ర – జర్తె

ఖదీర్‌బాబు ఎన్నుకున్న కథల పూర్తి పాఠాలు తొమ్మిది ఈ పుస్తకంలో ఉన్నాయి. అతను ఎన్నుకున్న కథకులు ఇంకో 25మంది ఈ పుస్తకంలో కూడా ఉన్నారు, కాకపోతే వేరే కథలతో. అంటే ఈ రెండు ఎంపికల మధ్య సామ్యం, కథలకైతే పదిశాతం కన్నా తక్కువ; కథకులకైతే 34 శాతం ప్రాంతాల్లోనన్న మాట. ఎంపికల విషయంలో విబేధాల పరిమాణానికి ఇది ఒక ఉదాహరణ.

(Disclosure: నేను 1998లో తెలుసాలో రాసిన సమీక్షలో కొంతభాగాన్ని 2007 ప్రచురణ Inside Jacket Flapలో నా ఫొటోతో సహా ప్రచురించారు).

**********

(తెలుసా; 1998 నవంబరు 28 శనివారం)

కథాసాగర్ (తెలుగు జన జీవన ప్రతిబింబాల కథానిధి – a treasure trove of short stories that reflect Telugu lifestyles). Editor: M.A. Subhan; 752 pages, hard cover with acrylic jacket; Published by Kalasagar Cultural Trust, 5 Sir Tyagaraya Road, T. Nagar, Chennai 600 017; Price RS. 400

కళాసాగర్, a Chennai based cultural organization founded in 1972, decided to commemorate its Silver Jubilee anniversary in 1997 by publishing an anthology of 87 Telugu short stories from different writers (87 represented the time in years since the purported publication of the first modern Telugu short story, గురజాడ’s దిద్దుబాటు, in 1910). ఎం.ఏ. సుభాన్ , the founding secretary of Kala Sagar, took on the arduous task of editing this volume. He notes that the selection criteria included the writers’ integrity and desire for societal welfare, the story’s readability and its reflection of reality.

The first thing that struck me about this book is its appearance: a big, hardcover volume with a sturdy binding, an attractive green marbleized cover, protected in an acrylic jacket. Inside, the 87 stories are printed in large font on coated heavier stock and are arranged alphabetically by author’s surname in English. Every one of the stories is accompanied by a photograph and a thumbnail sketch of the author, an editorial comment about the story, and a note about its first publication. The authors’ addresses are available towards the end. In terms of form alone, this is one of the best produced books in Telugu.

And, what about the content? If you are a lover of Telugu short story in particular, or Telugu literature in general, this is a great holiday treat. I would like to list all the 87 stories in here, but constraints of time and space let me just pick the letter K which is quite illustrative of the breadth and the quality of the selections. This list includes

కాళీపట్నం రామారావు – వీరుడు మహావీరడు (1968)
కలువకొలను సదానంద – తాత దిగిపోయిన బండి
కాలువ మల్లయ్య – అమ్మ మీది సొమ్ములు (1994)
కల్యాణ సుందరీ జగన్నాధ్ – అలరాస పుట్టిళ్ళు (1962)
కాశీ విశ్వనాధ్ – పద్మశ్రీ (1992)
కె. రామలక్ష్మి – అదెక్కడ? (1995)
కాట్రగడ్డ దయానంద్ – పండుటాకు (1995)
కవనశర్మ – ఇంటి నెంబరు
కేతు విశ్వనాథరెడ్డి – కూలిన బురుజు (1988)
కొడవటిగంటి కుటుంబరావు – ఫోర్త్ డైమెన్షన్ (1968)
కొలకలూరి ఇనాక్ – బస్సు ప్రయాణం (1997)
కె. వివేకానంద మూర్తి – నేను చూసిన నక్షత్రం

An anthology containing the above dozen stories by itself would be worthwhile having it in my library. They represent different periods, different genres, different writing styles, and different views of the world. Together, they represent the breadth and depth of the Telugu short story.

Sometime back, in a note on this forum about కాళీపట్నం రామారావు, I wrote here about the brilliant వీరుడు మహావీరడు. కుటుంబరావు’s ఫోర్త్ డైమెన్షన్ is one of the best short stories by the master, celebrated for its technical excellence and the rare and innovative blend between the theory of relativity and life. There never was a love story like this one.

I rate కల్యాణ సుందరీ జగన్నాథ్ as one of our best short story writers and among her stories, అలరాసపుట్టిళ్ళు as one of the best. I was thrilled to reread this short story, after a long time, in this anthology. (After the publication of kathaasaagar, her admirers brought out a collection of her stories under the title అలరాసపుట్టిళ్ళు. More about her and that collection later when time permits).

తాత దిగిపోయిన బండి was published after the Gandhi birth centenary in 1969 and is about the celebration of the centenary by the village officials who have mandated the attendance of the school children at the event. The story narrated by a teacher attending the event abounds with irony.

There are three stories here from the 90s that look at relationships between the aging mother and her children. కాలువ మల్లయ్య’s story begins after the funeral of a mother. The deceased woman’s children and their spouses claim their rights for her jewelry. They couldn’t resolve the issue amongst themselves and have a panchaayatee to determine their fair share. దయానంద్’s story is about the relationship between a mother, her children and her native place. కె.రామలక్ష్మి’s story is not just about the relationships between parents and children, but also about the relationships between spouses and that too of different generations.

కేతు విశ్వనాధ రెడ్డి’s కూలిన బురుజు is about what faction wars have done to the villages in Raayalaseema. వివేకానంద మూర్తి’s నేను చూసిన నక్షత్రం is a tragicomic story in the ముళ్ళపూడి vein about a junior artist (extra) desparately yearning to see his name on the marquee. పద్మశ్రీ is about a chance encounter between a movie star and a stranger in a train. కవనశర్మ’s story is a humorous look at a transplanted NRI’s encounter with the police. ఇనాక్’s బస్సు ప్రయాణం is a study in psychology of a bully in the bus.

If we have all this from just the single ‘K’, what else should we expect from the rest? There are many stories here that you have probably heard of, or liked them in the past. From classics to modern. My favorites here include మధురాంతకం రాజారాం ప్రొద్దు చాలని మనిషి, శ్రీరమణ బంగారుమురుగు, స్మైల్ ఖాళీ సీసాలు, ముళ్ళపూడి ఆకలీ ఆనందరావు, సింగమనేని నారాయణ అడుసు, జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి వంజె, వాడ్రేవు వీరలక్ష్మీదేవి ప్రయాణం, చాసో ఆవెత, మునిపల్లె రాజు యశోద కొడుకు… This list can go on and on.

The authors here range from బుచ్చిబాబు to బి.ఎస్.రాములు and బోయ జంగయ్య, అబ్బూరి ఛాయాదేవి to ఓల్గా, and పద్మరాజు to సన్నవరపు వెంకటరామిరెడ్డి. Current trends in Telugu literature, particularly the feminist and dalit writers are well represented here.

An anthology like this can be criticized for its inclusions and omissions. But, that is as much an exercise in futility as would be an editor’s efforts to please everybody. There are some notable omissions here, particularly those of the early short story writers (for example, శ్రీపాద is not here). Some (very few) of the writers/stories included do not measure up to the rest, in my opinion. Some of the stories can also be found in previous such anthologies.

Anybody reading this volume will have an appreciation of not only the Telugu short story writing, but also about the Telugu lifestyles from mid-50s to the mid-90s. If you love stories, this is an irresistible feast. If you are a connoisseur of good writing, go for this volume.

**********

2007 ప్రచురణ వివరాలు:

కథా సాగర్ (తెలుగు జన జీవన ప్రతిబింబాల కథానిధి)
సంపాదకుడు – ఎం.ఏ. సుభాన్
కళాసాగర్ కల్చరల్ ట్రస్ట్,
5 సర్ త్యాగరాయ రోడ్,
టి. నగర్, చెన్నై 600 017
ముఖ్యమైన పుస్తకాల షాపుల్లో దొరకవచ్చు.
930 పేజీలు; 750 రూ. /60 డా.
A small number of copies are available in US for $60: If interested, please send an e-mail to cjampala@gmail.com.

You Might Also Like

5 Comments

  1. త్రివిక్రమ్

    ఇనాక్’s బస్సు ప్రయాణం is heavily influenced by (or, a part of?) a multi-pronged attack by a section of political and media houses on Kadapa district which could successfully create a strong negative image of the district (see kadapa.info/బస్సు-ప్రయాణం/). తమకు గిట్టనివాళ్ళ మీద రాళ్ళెయ్యడానికి సాహితీరూపాలను వాడుకోవడం ఎప్పటినుంచో ఉన్నదే. ఇక్కడ దాడికి గురౌతున్నది ఒక ప్రాంతం. అంతే తేడా. ఈ false propaganda ఎంతగా ప్రభావం చూపుతోందంటే కడపోళ్ళను సాటి తెలుగువాళ్ళెవరైనా “మీదే ఊరు?” అనడిగితే సమాధానం చెప్పడానికి నోరు పెగలనంత; కడపేతరులు, తెలుగేతర మీడియా కూడా సాహిత్య, కళా రంగాల్లో ప్రసిద్ధి చెందిన కడప జిల్లా వ్యక్తులను, ప్రాంతాలను సైతం కడప జిల్లాకు చెందినట్లు గుర్తించడానికి నిరాకరించేంత.

  2. manjari.lakshmi

    నేను ఇదివరకెప్పుడో రచనలో ఒక కధ చదివాను. మొన్న మొన్నటి వరకూ దాని పేరు “అలరాస పుట్టిళ్ళు” అనుకొనేదాన్ని ఆ కధ పేరు అది కాదని ఈ మధ్యనే తెలిసింది. ఆ కధా రచయిత పేరు సుశీలా దేవి(నందుల? వేదుల?) అనుకుంటాను. ఆ కధ చలం ఇన్స్పిరేషన్‌తో, ఆయన కధల మోడల్ లో రాసినట్లుంటుంది. ఆ కధ సంక్షిప్తంగా: ఒక భార్య, భర్త, వాళ్ళకు విధవరాలైన (బాలవితంతువా?) ఒక కూతురు. తల్లికి కూతురు జీవితం ఇలా అయిపోయిందని, ఆమె ముందర తనూ, భర్త సుఖంగా ఉంటే ఆ అమ్మాయి బాధపడుతుందనీ అనుకుంటుంటే, ఆమె భర్త మాత్రం తన సుఖం తక్కువకావటానికి వీల్లేదన్నట్లుగా భార్యని పడక గదిలోకి రావలసిందేనని పట్టు పట్టటం, ఆ పిల్లకి రొండో పెళ్ళి చెయ్యటానికి ఒప్పుకోక పోవటం అలా ఉంటాడు. ఆ అమ్మాయి తల్లీ, తండ్రీ పడకగదిలో ఉంటే దొంగతనంగా చూడటం, ఇంకా ఇలాంటివన్నీ చేస్తుంటే చూసి తల్లి భాధ పడుతూ ఉంటుంది. ఒక నాడు ఎవరో రిపైర్ చేసే కుర్రాడు ఇంటికొస్తే అతనితో కూతురు చనువుగా ప్రవర్తించటం చూసి, ఆమె తండ్రి ఆమెను కొట్టి, తలకాయ గొరిగిస్తానని చెప్పి, ఎదో పని మీద ఊరెళతాడనుకుంటా. అప్పుడా తల్లి ఆమె పుట్టిన రోజని చెప్పి తలంటిపోసి, జడేసి, బొట్టు, పూలు, నగలు అన్నీ పెట్టి, పుట్టినరోజు సందర్భంగా పాయసం చేసానని చెప్పి, అందులో విషం కలిపి కూతురు చేత తినిపిస్తుంది. ఈ కధ పేరూ, రాసిన రచయిత పూర్తి పేరూ, ఈ కధ ఏదన్నా కధా సంకలనంలో ఉంటే దాని గురించీ ఎవరికైనా తెలిస్తే చెప్పండి.

  3. కొత్త పాళీ

    నా దగ్గర మొదటి సంకలనం ఉన్నది. మంచి కథలు. తెలుగు పుస్తకాల్లో అరుదుగా కనిపించే చక్కటి ముద్రణ విలవలతో ప్రచురించారు. దాచుకోదగిన పుస్తకమే కాదు, దాచుకుంటే నిలిచివుండే పుస్తకం కూడా.

  4. ramachary bangaru

    kathaasaagar andarivaddaku cheraalante velanu konchem thagiste baaguntudemo aalochichandi.idi oka paatakudigaa abhyardana matrame.

  5. Manasa

    చౌదరి గారూ : పుస్తక పరిచయానికి ముందుగా కృతజ్ఞతలు.
    మీ నుండి చక్కటి తెలుగు,చిక్కటి సమీక్షలు చదవాడానికి అలవాటు పడిన వాళ్ళం, ఆంగ్ల పదాలతో నిండిన ఈ వ్యాసం కాస్తంత నిరాశకు గురి చేసింది. చెప్పిన విశేషాలు మాత్రం ఎప్పటిలాగే ఉపయోగకరంగా ఉన్నాయి.

    ఇందులో ఎన్నో కథలు నా వరకు నాకు మళ్ళీ మళ్ళీ చదువుకోవడానికి అనువైన కథల్లానే తోచాయి. రెంటాల వారి కథ (నక్సల్స్ బాక్‌గ్రౌండ్‌తో), యశోద కొడుకు నాకు బాగా నచ్చిన కథలు. “యశోద కొడుకు” శైలి అద్భుతంగా ఉంటుంది. ఫోర్త్ డైమెన్షన్, ఆవెత వస్తుపరంగానూ, భాషాపరంగానూ ప్రత్యేకతను నింపుకున్న కథలు. ఇలా అన్ని మాండలీకాలను స్పృసిస్తూ సాగిన ఎంపిక కూడా, ఈ సంపుటాన్ని ప్రత్యేకం చేసింది.

    కళాసాగర్ వాళ్ళు స్వీయ స్తుతికి ప్రాథాన్యత నిచ్చినట్టు కనపడుతుంది. వంద పేజీలంటే తక్కువేం కాదు కదా..! కొన్ని మంచి ఫొటోలు, కొన్ని అరుదైన విషయాలు కాస్తంత ఆసక్తికి గురిచేసినా, మొత్తం మీద అవి ఈ పుస్తకానికి అదనపు బరువే.
    కొందరు కథకుల/కథల ఎంపికలో వాళ్ళు పాటించిన ప్రాథమిక సూత్రాలేమిటో అర్థం కావు. ఉదాహరణకు, మధురాంతకం కథల్లో, వీళ్ళు ప్రచురించిన కథ చప్పగా తోస్తుంది నాకు.
    ఆయన రాసిన అన్ని కథల్లో ఇదే ఎందుకు ఎంచుకున్నారో బోధపడలేదు. యండమూరి కథను పెట్టాలి కాబట్టి పెట్టినట్టు ఉందే తప్ప, ఈ కథలతో పాటు చేర్చదగినదిగా ఏ మాత్రం అనిపించలేదు. అత్యుత్తమ కథలంటూ ఒక స్థాయిని నిర్ణయించుకున్నాక, ఆ అంచనాలతో పుస్తకాన్ని కొనే పాఠకులను, అలాగే ముందు తరం వాళ్ళ గొప్ప కథలను చదవాలన్న తహతహ ఉన్న వాళ్ళను, ఇటువంటి కథలతో నిరాశ పరిస్తే, సాహిత్యాభిమానులు చిన్నబుచ్చుకోవడమూ, మంచి కథల గురించి ఏ మాత్రం అవగాహన లేని వాళ్ళు – తెలుగు కథల స్థాయి ఇదేనేమో అన్న భావనకు గురి కావడమూ జరిగే ప్రమాదం ఉన్నట్టుగా తోస్తుంది.

    కథల ఎంపికలో మాత్రం చక్కటి వైవిధ్యం ఉంది. ఎన్నో కథాంశాల మీద మన రచయితలు బిగి సడలకుండా అల్లిన కథలు దాచుకోవాలనిపించేలా ఉన్నాయి. మనలో చాలా మంది చదవని అరుదైన కథలు కూడా కొన్ని ఉన్నాయి. ఇంకొకటి, నాకు నచ్చినదీ ఏమిటంటే, ప్రతి రచయితకీ, కథ మొదట్లో ఇచ్చిన చిరు పరిచయం. వాళ్ళ ఇతర రచనలు, అవార్డులు, కొన్ని సార్లు సంకలానాల నుండీ తీసుకున్న కథలకు వాటి వివరాలు – ఇవి బాగున్నాయి. కథను మెచ్చిన వారికి, రచయితల ఇతర రచనలను గురించి కూడా చిన్నపాటి అవగాహన వచ్చేందుకు సాయపడుతుంది.

Leave a Reply