ఫైజ్ అహ్మద్ ఫైజ్ : ఒక నివాళి

ఈ సంవత్సరం Faiz Ahmed Faiz (1911-1984) శతజయంతి. Faiz Ahmed Faiz Urdu భాషలో గొప్ప కవి. ఆయన కాలంచేసి 27 సంవత్సరాలైంది కాని ఆయన కవిత్వం అజరామరం. Last Night అన్న నాలుగు లైన్ల (quatrain) Urdu poem రాసిన కవి Faiz Ahmed Faiz. ఆ గేయం Roman script లో ఇలా వుంటుంది:

“Raat yun dil mein teree khoee huee yaad ayee
Jaise veeraaney mein chupke sey bahaar aa jaaye
Jaise saharaan mein haule sey chale baad-e-naseem
Jaise beemaar ko bewaja qaraar aa jaaye”

తెలుగు script లో ఇలా —

రాత్ యూ దిల్ మే తెరీ ఖొయీ హుయీ యాద్ ఆయీ
జైసే వీరానే మే చుప్కే సే బహార్ ఆజాయే
జైసే సహారన్ మే హౌలెసే చలే బాద్-ఇ-నసీం
జైసే బీమార్ కో బెవజా కరార్ ఆజాయే

పై నాలుగు పాదాల poem ని 30 మంది కవులచేత ఇంగ్లీష్ లోకి అనువాదం చేయించి four corners పబ్లిషర్స్ Last Night అనే title తో పుస్తక రూపంలో అందచేశారు. (అందులో నలుగురు రెండు అనువాదాలు చేసారు. అంటే మొత్తంగా 34 అనువాదాలన్నమాట). ఈ పుస్తకాన్ని ఎలా print చేసారో చెప్పాలి. ఎడమ పేజీ లో ముందు Urdu script లో poem ని print చేసారు. దాని కింద అదే Urdu poem ని Roman script లో ప్రింట్ చేసారు. అంటే అంతా 8 పాదాలు. ఎదుటి పేజిలో ఆ poem English అనువాదం print చేసారు. మధ్యన అక్కడక్కడా ఎడారుల photo లు, కన్నుల పండువుగా. ముద్రణ మంచి art పేపర్ మీద.

అనువాదకులు కుష్వంత్ సింగ్, విక్రం సేఠ్, శివ్ కుమర్, ఆబ్దుస్ సత్తార్, సర్వార్ రహ్మాన్, రాకేష్ మని, Francis Pritchett, K C Kanda, Zahra Sabri, Keki N. Daruwalla. ఇంకా చాలామంది. ఇంకా ఎంతోమంది ఎన్నో భాషల్లోకి దీనిని రకరకాలుగా అనువాదం చేసే వుంటారు. నాలుగు లైన్ల poem కి ఎంత పట్టం కట్టారో చూడండి. ఈ వైభవం కవులందరికీ దక్కదు. Faiz లాంటి కొద్దిమంది కవులకుమాత్రమే పరిమితం. ఈ గౌరవం అన్ని గీతాలకూ దొరకదు. Last Night లాంటి అరుదైన గేయాలకే లభిస్తుంది. విక్రం సేథ్ Last Night అనువాదం ఇలా వుంది:

Last night your faded memory came to me,
As in the wilderness spring comes quietly,
As, slowly, in the desert, moves the breeze,
As to a sick man, without cause, comes peace.

Keki N. Daruwalla అనువాదం:

Night found your lost memories and swept them in,
Like spring alighting on scrub by stealth,
Like the stir and rustle of cool desert winds,
Like a fevered brow cooling to sudden health.

Shiv K. Kumar అనువాదం ఇలా వుంది:

Last night a fugitive memory of you slid into my heart
as though a wilderness was quietly touched by springtide,
as though some breeze came soughing through a desert,
as someone sick, for no reason, felt reclaimed.

నాలుగు పాదాలు ఎన్నో ఆలోచనలకు తావిస్తుంది. రకరకాల అనుభూతులకు ఆస్కారం కలిగిస్తుంది. ఇక ఈ బృహత్కార్యం successful గా నిర్వహించిన editors: K. K. Mohapatra, Leelawati Mohapatra and Paul St-Pierre.

పుస్తకం Preface లో K. K. Mohapatra says: “If I am allowed just one poem to take with me here to hereafter, wherever that is, it will be this…I have always been a firm believer in the power of poetry to move mountains; changing human lives is nothing in comparison…The effect of reciting it out loud is so wonderful that I wholeheartedly recommend it to everyone, ardent poetry-lover or not, to every troubled, tortured, tormented person: it’s like a mantra, a chant that calms the soul.”

Leelawati says: “It (the poem) is our morning laughter, our afternoon blues, our fear and hope, the tangled skein of our joy and sorrows.”

Paul St-Pierre has this to say: ‘…This is the essence of the quartrain, functioning through memory and metaphor, which taken together are perhaps only another way of signalling tranference, a carrying over, a speaking of and after. Renewal and revival too — the wilderness blossoms, the desert cools, the ill regain strength; a new life, an afterlife — essence of translation itself. The text lives on these multiple reiterations.’

Last Night గేయాన్ని ఇప్పటికే చాలామంది తెలుగులోకి అనువదించేవుంటారని అనుకుంటాను. ఇప్పటికిప్పుడు నా కవికానిమిత్రుడొకాయన (Anon మహాశయుడనుకోండి) ఈ గేయాన్ని ఇంగ్లీష్ లో వినిపిస్తే ఇలా అనువదించాడు.

రాత్రి నీ జ్ఞాపకాలు సవ్వడి చేసాయి,
గాలిచొరని నిశ్శబ్దావనిలో వసంతవీచికలా,
ఎడారిలో వూహించని పిల్లగాలిలా,
ఏమందూ లేకనే రోగి స్వస్థుడైనట్లుగా.

కవుల చేతుల్లో ఇది రూపాంతరం చెంది, కొత్త అందాలు సంతరించుకుంటాయి. “Last Night” ప్రయోగం బావుందికదా? తెలుగు కవిత్వానికి ఇలాంటి గౌరవం దక్కితే ఎంత బాగుంటుందో!

ఈ పుస్తకాన్ని Mumbai Mirror లో Eunice de Souza 22 September న సమీక్ష చేస్తూ ఇలాంటి ప్రయోగం India లో ఇదే first అని చెప్పారు. తెలుగువారు గర్వించదగిన విషయమేమిటంటే ఇలాంటి ప్రయోగం మనవాళ్లు 2003 లోనే చేసారు. Faiz గేయం కాదు; రవీంద్రులది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన Prayer గేయం తెలియని భారతీయుడు లేడని నా వూహ. Prayer అంటే వెంటనే గుర్తురాని వాళ్లకు, ఆ గేయం ఒకటి, రెండు పాదాలు చెపితే చప్పున గుర్తొస్తుంది.

“Where the mind is without fear and the head is held high
Where knowledge is free
Where the world has not been broken up into fragments By narrow domestic walls
…………………………….
Into that heaven of freedom, my Father, let my country awake.”

కొన్ని దశాబ్దాలుగా ఎంతోమంది తెలుగు కవులు ఈ గేయాన్ని తెలుగులోకి అనువదించారు. ప్రఖ్యాత నటులు, సాహితీ స్రష్ట కొంగర జగ్గయ్య అవన్నీ వెతికి సేకరించారు. కొత్తగా మరికొంతమంది కవులచేత అనువాదం చేయించారు. ఒక గేయాన్ని, ఒకరు కాదు, ఇద్దరు కాదు — ఏకంగా 42 మంది అనువదించారంటే ఆ గేయం ఎంత గొప్పదో కదా? ఆ ప్రయత్నం చేపట్టడం, సాధించడం కూడా మామూలు మానవులుకు సాధ్యమయ్యేదేనా? అలా మొత్తంగా 42 మంది కవుల తెలుగు అనువాదానాలను ఒక చోట చేర్చడం జరిగింది. జగ్గయ్య గారు ముందుమాట రాయగా, సాహితీ ప్రియులు B. S. R. Krishna గారు ఈ గేయాలను పుస్తకరూపంలో తీసుకువచ్చారు. పుస్తకం title “నివేదన”. ప్రచురణ 2003 లో. అదొక మహాయాగం. కవిత్వానికి పట్టాభిషేకం.

You Might Also Like

14 Comments

  1. చంద్రహాస్

    Frances Pritchett కొలంబియా యూనివర్సిటీ(అమెరికా)లో ప్రొఫెసర్. ఆమె కూడా ఫైజ్ గేయాన్ని ఇంగ్లీషులోకి అనువదించారు. అది కూడా ఈ పుస్తకంలో ముద్రించారు. ఆ అనువాదం ఇది:

    Last night, your lost memory came into my heart
    The way spring would quietly come in the wilderness
    The way a breeze would gently move in the desert
    The way, for no reason, rest would come to a sick person.

    ఎడిటర్ K. K. Mohapatra ఆమెకు పుస్తకం కాపీ పంపారు. కాపీ అందిన తర్వాత పుస్తకంపై ఆమె comment (e-mail) ఇది:
    “The book has arrived, and it’s a beautiful production job. I like the subtlety of the sand dunes. It’s remarkable that you’ve succeeded in getting so many translations. Of course, some of them are more accurate, others are more like transcreations, of varying quality. It’s the perfect Faiz-celebratory year to bring it out. I congratulate you on putting together such a timely tribute to Faiz’s poetry.”

  2. సురేశ్ కొలిచాల

    నేను రాసుకున్న అనువాదం:

    నిన్న రాత్రి మర్చిపోయిన నీ జ్ఞాపకమేదో గుర్తుకు వచ్చింది
    ఆకురాలు అడవికి దరిచేరిన ఆమనిలా
    ఎడారిలో ఊహించని హాయితెమ్మెరలా
    సంక్షుభిత చిత్తునకు యదనిండు శాంతిలా

  3. కామేశ్వరరావు

    నేను సైతం:

    తప్పిపోయిన నీ జ్ఞాపకమొకటి రాత్రి పలకరించింది
    నిదురించే తోటలోకి మధుమాసం వచ్చింది
    మంద్రంగా ఎడారిలో ఓ మలయవీచి సాగినట్లు
    జ్వరంపడ్డ మనసుకెలానో కులాసా లభించింది

  4. NS Murty

    Please note: ఇది ఏ ఛందస్సుకూ చెందనిది … స్వఛ్ఛందము I forgot to mention above.

  5. NS Murty

    విపుల నీరవ నిర్జన శిశిరసీమ
    సందడించక ఆమని అడుగిడిన యట్లు
    పులినసీమల పిలగాలి పరుగిడిన యట్లు
    వ్యాధి తనుదానె రోగిని వీడినట్లు
    మరుగు బడినట్టి నీ స్మృతి శకలమొకటి
    రాత్రి నాగుండె తా జొరబడినదకట!
    .
    మూర్తి NS

  6. K. Chandrahas

    Read another version of the poem in the same collection.

    Night found your lost memories and swept them in,
    Like spring alighting on scrub by stealth,
    Like the stir and rustle of cool desert winds,
    Like a fevered brow cooling to sudden health.
    Keki N. Daruwalla

    I like, of course, Vikram Seth’s translation. K. K. Mohapatra, one of the editors of the book, told me Keki N. Daruwalla didn’t like Vikram Seth’s. Each unto himself! Let’s not judge. Instead, let us celebrate and savour the variety.

  7. హెచ్చార్కె

    Beautiful poem. Really difficult to bring in the same ease in translation. I tried several times to tear up all the attempts. Don’t know but I think vikram Seth was successful in giving it to people like me, who cann’t read Urdu even in Telugu script. Thank you, Chandrahas garu.

  8. K. Chandrahas

    మీ అనువాదం Vikram Seth అనువాదానికి ధీటుగా వుంది. సంత్యక్త పదానికి exact అర్థం నాకు తెలియలేదు. మరువు అంటే wasteland. నోవరి అంటే sufferer కదండీ? చివరిపాదం చాలా గొప్పగా వుంది. I’m sure your rendering of his poem in Telugu would have made Faiz happy.

  9. Mahek

    మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు కృతఙ్ఞతలు చంద్రహాస్ గారు.

    Last Night in my words…

    నిన్న రాతిరి మసకబారిన నీ జ్ఞాపకాలేవో చుట్టుముట్టాయి
    సంత్యక్త వనములోకి సడి లేకుండా ఆమని అడుగిడినట్టు
    వేకువ ఝామున మరువులో మలయానిలం వీచినట్టు
    కారణమేదీ లేకనే నోవరికి నిమ్మళం కలిగినట్టు

  10. Madhu

    I introduced both these about http://www.pustakam.net. Thanks to Dr Jampala Chowdary, who introduced me this web site, when I gave two books to him. I am happy my friend Chandrahas got some focus on your web site. I am sure he will burn the midnight oil and contribute more for this website.

  11. K. Chandrahas

    ‘Talks & Articles’ రచయిత పేరూ C. సుబ్బారావుగారని నాకు మీరు చెబితేనే తెలిసింది. నేను చెప్పిన Prof. C. Subbarao గారి sur name చిరుమామిళ్ల. ఆయనతో ఇప్పుడే మాట్లాడాను మీరు కదిపిన విషయమై. Dr. వైదేహి నాన్నగారు చేపూరు సుబ్బారావు గారు. ‘Talks & Articles’ రచయిత. ఆ పుస్తకానికి కాకతాళీయంగా నేను చెప్పిన Prof.C.Subbarao గారు Introduction రాసారట. పుస్తకం release కుడా ఆయనే చేసారట. అంటే మీరిద్దరూ ఆయనని చూసారన్న మాట. ఆరోజు నేను అక్కడ లేను. పుస్తకం.నెట్ ఆయనకు తెలుసు. అప్పుడప్పుడూ చూస్తారట. నిజంగా ఇదెంత చిన్న ప్రపంచమో కదా? Dr. వైదేహి మంచి కవిత్వం రాసారని,రాస్తారనీ Prof.C.Subbarao గారు చెప్పారు.

  12. Purnima

    చంద్రహాస్ గారు: మీరన్న ప్రొ.సుబ్బారావుగారు ’టాక్స్ ఆండ్ ఆర్టికల్స్’ అనే పుస్తక రచయిత? వైదేహి గారి నాన్నగారా? ఆ పుస్తకావిష్కరణ సభకు నేనూ, సౌమ్య వచ్చాం. మిమల్ని కలిసామోమో అన్న కుతూహలం కొద్ది అడుగుతున్నాను.

    ఇక ఈ పుస్తకం గురించి తెలిపినందుకు వేలవేల థాంక్స్! ఇలాంటి అపురూప పుస్తకాల గురించి మీరు మాతో పంచుకుంటూ ఉంటారని ఆశిస్తున్నాను.

    పై కవిత అనువాదం ఎవరో ఒకరు చేస్తారులెండి. 🙂

    అన్నట్టు, ఈ నెల ఫోకస్ మీద కూడా ఓ వ్యాసం రాసి పంపకూడదూ! మీ లాండ్‍మార్క్ లూట్ కన్నాక మీ పుస్తకపఠన విశేషాలు తెల్సుకోవాలనే ఆసక్తి కలుగుతోంది.

  13. K. Chandrahas

    Thanks for your encouraging words.
    Prof.C.సుబ్బారావుగారికి సాహిత్యమంటే ఎనలేని ప్రేమ. ఆయన కవి కూడా. ఆయన తన copy నాకిస్తే దాన్ని photocopy చేసుకున్నాను. పుస్తకం షాపుల్లో ఇచ్చినట్లు లేదు. ఎందుకంటే, పుస్తకం లోపలి పేజీలో with compliments from B.S.R. Krishna అని ముద్రించి వున్నది.
    దాశరథి, బెజవాడ గోపాలరెడ్డి, శంకరంబాడి సుందరాచార్య, రాయప్రోలు సుబ్బారావు, బాలాంత్రపు రజనీకాంతరావు, గుడిపాటి వెంకటాచలం, బెల్లంకొండ రామదాసు, తిరుమల రామచంద్ర, పంతగడ శేషమ్మ, ఎన్ . ఆర్. చందూర్, కనకమేడల, మాడభూషి సంపత్ కుమార్ లాంటి వాళ్ళ అనువాదాలు ఈ పుస్తకంలో విందు చేస్తాయి.(ఇక్కడ నేను పేర్లు రాయని కవులు కూడా చాలా గొప్ప వాళ్ళే.)
    “నివేదన” గురించి మరోసారి చెప్పుకుందాం. ప్రస్తుతం Last Night గేయాన్ని ఈ site లో comment గా తెలుగులో ఎవరైనా అనువదిస్తే చదవాలి అని కోరిక.

  14. సౌమ్య

    Chandrahas garu,
    ఈ వ్యాసానికి అనేక ధన్యవాదాలు.
    ఒకటాగొర్ కవితను నలభై పైచిలుకు సార్లు తెలుగులొకి అనువదించారా!! తల్చుకుంటేనే అబ్బురంగా ఉంది. పుస్తకం దొరకదు అని నిర్ణయమైతే, స్కాన్ చేయడం కుదురుతుందా ? మీరు ఇలాగే మరిన్ని విషయాల గురించి తరుచుగా రాయాలని కోరుకుంటున్నాను.

Leave a Reply to Purnima Cancel