పుస్తకాలు చదవడం ఎలా వచ్చిందంటే

(చాన్నాళ్ళ క్రితం మీకు పుస్తకాలు చదవడం ఎలా అలవాటైందో చిన్న వ్యాసం రాయొచ్చుగా అంటే మాలతి గారు ఇది పంపారు. ఇప్పుడు ఫోకస్తో సంబంధం ఉందని ఇన్నాళ్ళకి ప్రచురిస్తున్నాం…. – పుస్తకం.నెట్)

చెప్పడం కష్టం కానీ కొంతవరకూ ఇంట్లో అందరూ చదివేవాళ్ళే కావడం కావచ్చు. మానాన్నగారు హైస్కూలు హెడ్ మాస్టరుగా స్కూల్ లైబ్రరీకోసం పుస్తకాలు కొంటూ ఇంటికి కూడా కొని పడేసేవారు. ఆకాలంలో పత్రికలు ప్రతిఇంట్లో ఉండేవి కనక మాయింటికి కూడా ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతితోపాటు భారతి కూడా వచ్చేవి. అలాగే బాల, చందమామ కూడా కొన్నాళ్ళు వచ్చేయి. మానాన్నగారిచేతిలో పుస్తకం చూసినగుర్తు లేదు కానీ మాఅమ్మ మాత్రం భోజనాలయేక మధ్యాహ్నాలూ పుస్తకం పట్టుకు కూర్చునేది నడవలో. ఆదృశ్యం నాకు ఇప్పటికీ కళ్ళకి కట్టినట్టుంది.

భారతిలో కథలు నాకు చాలా నచ్చినవి ఒకసారి చింపి దాచుకున్నాను. ఆతరవాత మాఅన్నయ్య ఎవరు భారతి చింపింది అని అరిస్తే గుప్‌చిప్శగా అక్కడ్నించి పారిపోయేను. ఇప్పటికీ ఆ ఘనకార్యం చేసింది నేనేనని నాకు నేనై చెప్పలేదు. మరి తనే గ్రహించుకున్నాడో లేదో నాకు తెలీదు. (ఇది చూస్తే తెలుస్తుందేమో).

మాఅక్కయ్య ఒకసారి నాపుట్టినరోజుకి, బహుశా 16, 17 ఉండొచ్చు, Readers Digest చందా కట్టింది నాపేరుమీద. నాపేరుమీద ఆ పత్రిక నెలనెలా వస్తుంటే సరదాగా ఉండేది. అందులో కథలూ, laughter is the best medicine, your slip is showingలాటి కాలాలు నాకు చాలా సరదాగా ఉండేవి చదవడానికి.

ఆరోజుల్లో నాకు మరో గొప్ప కాలక్షేపం వెబ్స్టర్స్ డిక్ష్నరీ. ఏదో ఒకమాటకోసం కాక ఊరికే పేజీలు తిప్పుతూ మాటలకి అర్థాలు చూస్తూండేదాన్ని. మీకు నవ్వులాటగా ఉంటుందేమో కానీ నాకు మాత్రం చాలా సరదాగా ఉండేది అప్పట్లో. ఇప్పుడు కూడా అలా చేద్దాం అనుకుంటాను కానీ ఇంకా మొదలెట్టలేదు. నాకు ఇంగ్లీషంటే ద్వేషం అని ఎవరైనా అనుకుంటే కాదని చెప్పడానికి ఇది చాలదూ? హాహా.

You Might Also Like

One Comment

  1. D.L.vidya

    ఎనిమిదేళ్ల వయసులో చందమామ చదవడంతో అలవాటయింది నాకు పుస్తకాలు చదివే అలవాటు.అంతవరకూ పెద్దవాళ్లో పిల్లలో కధలు చెబుతూఉంటే వినడం ఇష్టం.అమ్మఓ నాన్నో చదివి వినిపిస్తూ ఉంటే ఊహించుకుంటూ వినేదాన్ని.నాన్న జుఆలజీ
    లెక్చరర్ అయినా సాహిత్యం అంటే ఇష్టపడేవాడు.కాలేజీలో పని అయిపోగానే సాయంత్రం 5గంటలలోపే ఇంట్లో ఉండేవాడు.అమ్మ పని చేసుకుంటూఉంటే వెనకాలే తిరుగుతూ చదివి వినిపించేవాడు.ఇంగ్లీష్ పుస్తకాలైతే చదువుతూనే వెంటవెంటనే ట్రన్స్లటె చేశేశేవాడు.అలాంటి ఇంగ్లీష్ పుస్తకాలలో టాగొర్ కాబూలీవాలా ఒకటి.స్కూల్ పెట్టె ఒళ్లో పెట్టుకుని హోం వర్క్ చెసుకుంటూ వంటింట్లోనే కూర్చునేబాన్ని నేను, ఓ పక్కనించి నాన్న చదివేవి వింటూ.కాబూలీవాలా త్రన్స్లతిఒన్ వింటూఅందరం ఏద్చేశాం ,చదువుతున్న నాన్నతో సహా,ఇంకా మాటలురాని మా తమ్ముడు తప్ప.అలా ప్రారంభమయింది
    నా సాహిత్యాభిమానం అది సాహిత్యాభిమానం అని నాకు తెలియని వయసులో.నా అంతత నేను చదువుకోడం మాత్రం అప్పటికి నాకు రాదు.ఇంకా ఇంకా ఏవేవో వినెయ్యాలనిపించేది, చదివేవాళ్ళకి అలసట కానీ నాకేం అలసట?అమ్మ పక్కన పడుకుని ఊ కొదుతూ ఇంకా చదవమనేదాన్ని.నాకు నోరు నొప్పి పుడుతుంది నువ్వు చదవడం నర్చుకో అంది అమ్మ. నా ఈడు పిల్లే చందమామ చ్దివేస్తూ ఉండడం చూశేను, నేనూ కూడబలుక్కుని చదవడం మొదలెట్టేసరికి కొద్ది రోజుల్లోనే బాగా చ్దవడం వచ్చేశింది.చందమామ చదవడం ఒక్క రోజులో అయిపోయేది,నెలంతా కధలేకుండా గడిచేదెలా.ఆంధ్రప్రభ వీక్లీలో బాల ప్రభ చదివేదాన్ని కొన్నాళ్ళు.అది చదవడానికి పావు గంట కూడా పట్టదు.వీక్లీలో కధలూ,సీరియల్లూ చదివెయ్యడం మొదలెట్టాను.లెండింగ్ లైబ్రరీ నుంచి నవలలు తెచ్చుకునేవారు.తొమ్మిదేళ్ళ వయసులో నేను చదివిన మొదటి నవల రంగనాయకమ్మగారి స్వీత్ హొం.పన్నెండేళ్ళ వయసులో రామాయణ విషవ్రుక్షం చద్వేను.క్రమక్రమంగా నాకే తెలియకుండా సాహిత్యాభిమానినీ,రంగనాయకమ్మ అభిమానినీ అయిపోయాను.

Leave a Reply