నేనూ-నా పుస్తకాలూ అను ఫోకస్

చాన్నాళ్ళయ్యిందిగా ఫోకస్ పెట్టుకొని, అందుకని మాట.

ఈ నెల ఫోకస్ “నేనూ-నా పుస్తకాలూ!”.

ఇందులో మీరేమైనా రాసుకోవచ్చు, ప్రతి రెండు లైన్లకూ ఒక ’నేనూ’, ఒక ’నా పుస్తకాలూ’ ఉంటే చాలు.

ఒకే! నో జోక్స్!

ఇది అచ్చంగా మీ పుస్తకాలతో మీ అనుబంధం గురించి. అది ఏ విధంగానైనా ఉండచ్చు. కవితవ్వచ్చు, వ్యాసం అవ్వచ్చు. పది పేజీలుండచ్చు. మీ ఇష్టం. పుస్తకాలతో మీ సహవాసాన్ని తెలిపేదిగా ఉండాలి.

కొన్ని స్లిప్పులు అందిస్తున్నాం.. ఇవే రాయాలని కాదు. ఊరికే, తెల్ల కాగితం చూస్తూ తెల్లబోకుండా..

పుస్తకాలు చదవటం ఎప్పుడు మొదలెట్టారు? ఎలా జరిగింది?
పుస్తకాల విషయంలో మీకు చాలా సహాయపడ్డ వ్యక్తులు, ప్రదేశాలు?
పుస్తక పఠనమనే హాబీని / అవసరాన్నీ మీరెలా మానేజ్ చేస్తారు?
పుస్తకాల విషయంలో మీరు మర్చిపోని, మరువలేని చేదు లేక సంతోషపు అనుభవాలు?
ఏయే సమయాల్లో పుస్తకాలు చదవటానికి ఇష్టపడతారు? ఏయే ప్రదేశాల్లో?
మీరు చదివిన పుస్తకాల గురించి ఎక్కడ, ఎవరితో, ఎలా పంచుకుంటారు?
పుస్తకాలు ఎక్కడ కొంటారు?
మనకి నచ్చిన పుస్తకం, బయట దొరకని పుస్తకం ’మళ్ళీ ఇచ్చేస్తానండి” అని తీసుకున్నాక ఎగ్గొట్టడంలో చిట్కాలు?
పుస్తకం అసలు నచ్చకపోతే ఏం చేస్తారు? ఆ పుస్తకం బాగుందని కొనిపించినవారి సంగతో?
కేవలం పుస్తకాల వల్ల మీకు ఏర్పడ్డ స్నేహితులు?
మీకు చాలా ఇష్టమైన వ్యక్తి మీ పుట్టినరోజుకని ఓ దిక్కుమాలిన పుస్తకం ఇస్తే?
అదేదో అంటారే.. ఏంటబ్బా అదీ.. అదే… బుక్స్ ఆర్ బెస్ట్ కండక్టర్స్ ఆఫ్… ఏంటీ? వినిపించటం లేదూ.. ఘాట్టిగా?
పుస్తకాలు చదవటంలో పద్ధతి ఉంటుందా? పద్ధతి లేకపోవడమే పద్ధతి అంటారా?
మీ స్టడీ రూంకి దిష్టి పెట్టి పోయిన వాళ్ళని ఎలా తిట్టుకుంటారు?
పుస్తకాలు చదవటం దాదాపుగా మర్చిపోయారా? అయితే విరహ గీతాలేవి మరి?
ఏ భంగిమల్లో కూర్చొని, పడుకొని, నించొని చదువుతారు పుస్తకాలను?

ఈ పాటికి మీకింకా బోలెడు ఐడియాలు వచ్చేసుంటాయని మా అనుమానం. నిజమని నిరూపించండి.

ఎక్కువ-తక్కువ, అవీ-ఇవీ, అన్ని-ఇన్నీ, అక్కడ-ఇక్కడ, వాళ్ళవి-వీళ్ళవి, కొన్నవి-కొననవీ అన్న తరతమబేధాలు లేకుండా మీ పుస్తకాల గురించి మీరు చెప్పే కబుర్ల కోసం ఇక్కడ అందరం వేచి చూస్తున్నాం.

ముఖ్య గమనిక: అంశం కాస్త తేలికపాటిది కాబట్టి మీ-మీ చిన్నారులు ఒక మాదిరి నిడివి ఉన్న వ్యాసం మీరు రాయించగలిగితే ఎంచక్కా వారి ముద్దు ముద్దు మాటలతో ముచ్చటగా ఉంది. ఆడియో ఫైల్స్ అయినా పర్లేదు. అవి వినిపించడానికి ప్రయత్నిస్తాం.

You Might Also Like

6 Comments

  1. అహింస

    @pustakam.net

    పై వ్యాఖ్యను ప్రచురించటం అవసరమా?కనీసం ఎడిట్ చెయ్యకుండా?అంటే మీరు పైన కామెంటుతో ఏకీభవిస్తున్నారా?వ్యాఖ్య రాసే ప్రతి వాళ్ళకి తెలుగులో రాయలని వున్నా రాయలేకపోవటం కి సావాలక్ష కారణాలు వుండచ్చు. మీకు “హింస” లా అనిపిస్తే అటువంటి వ్యాఖ్యను ,యీ నా వ్యాఖ్యను కుడా ప్రచురించవలసిన అవసరం లేదు. వ్యాఖ్యలు తెలుగు ఇలా రాయగలరు అని ఒక లంకే కుడా ఇచ్చిన “హింస” నుండి మీకు/చదువు వారికి కొంత వెసులుబాటు దొరకును.

    1. సౌమ్య

      అహింస గారికి: ఏ వ్యాఖ్య ప్రచురించాలో, ఏది ప్రచురించకూడదో అన్నది సైట్ అడ్మిన్ బాధ్యత, ఈ విషయంలో వాళ్ళదే తుది నిర్ణయమూనూ. అప్రూవ్ అయిన ప్రతి వ్యాఖ్యతోనూ అడ్మిన్ ఏకీభవిస్తారు అనుకుంటున్న మీ అమాయకత్వానికి ఆశ్చర్యపడుతూ, ఒక ప్రశ్న: పేర్రాసుకునేందుకు కూడా జంకే వాళ్ళ దబాయింపులకి విలువ ఇవ్వాలి అంటారా? దయచేసి ఇలాంటి అనవసర చర్చలు మాని, వ్యాసానికి సంబంధించిన విషయాలు మాట్లాడగలరు.
      -సౌమ్య.

  2. dvenkat

    @srinivasarao garu
    ఈ హింస మాకేందుకండి. దయచేసి రాస్తే ఇంగ్లిష్ లో నైనా , లేకపోతే తెలుగులోనే రాయండి

  3. పుస్తకం.నెట్

    మల్లిన గారు: మీరలా క్లుప్తంగా తేల్చేస్తే ఎలా? మీ నుండో పూర్తి నిడివి వ్యాసం కోసం ఎదురుచూస్తున్నాం. 🙂

  4. narasimharao mallina

    నేను పుస్తకాలకు ఎలా అలవాటు పడ్డానంటే–
    చిన్నప్పుడు మా ఇంటికి ఆంధ్ర సచిత్ర వారపత్రిక వస్తూండేది. మా ప్రక్కింటి స్నేహితురాలికి(సుశీల) వాళ్ళ నాన్నగారు చందమామ తెప్పిస్తూండేవారు.కేశవరావు అనే ఇంకో పక్కింటి స్నేహితుడూ నేనూ ఆ చందమామ చదవటం కోసం పోటీ పడుతుండేవాళ్ళం.అలాగే ‘ఆంధ్రప్రభ’వీక్లీ కోసం కూడా పోట్లాడుకునేవాళ్ళం, నేను ముందంటే నేను ముందని.అలా ప్రారంభం.
    తరువాత మా ఊర్లో ఓ గ్రంథాలయం నిర్మాణం జరిగింది.’నేటి న్యాయం’ అనే ఓ నాటకాన్ని టిక్కట్లు పెట్టి వేసి ఆ వచ్చిన డబ్బుకు చందాలు కూడా జోడించి కట్టారు ఆ గ్రంథాలయాన్ని మా ఊఱ్లో వాళ్ళు.మా మండువాలో ఏడెనిమిది వఱకూ చదువుకుని చదువుమానేసి ఇంటిపట్టున ఉంటున్న అక్కయ్యలకూ వాళ్ళకూ గ్రంథాలయం నుంచి పుస్తకాలు తెచ్చి పెట్టడం అనే వ్యాపకం నాకు పుస్తకాలు చదవటంలో ఎంతగానో ఉపయోగ పడింది.ఆ రోజుల్లో ‘టామ్ సాయర్’ ‘హకల్ బెరీఫిన్’ ‘శరత్ సాహిత్యం’ వగైరా వగైరాలు ఇంకా ఎన్నెన్నో పుస్తకాలు ఆ విధంగా గ్రంథాలయంలో చదువుకున్నవే.ఆంధ్ర ప్రభ వీక్లీలోని మాలతీ చందూర్ గారి జవాబులు అంటే పడిచచ్చేవాళ్ళం.తఱువాత తఱువాత ఆమె వ్రాసిన ఆంగ్ల సాహిత్య గ్రంథాల పరిచయం ఎంతో ఇష్టంగా చదివేవాడిని. ఆ ఆంగ్ల నవలలు దొరకపుచ్చుకొని చదవటం అలవాటయ్యింది. నేను చదివిన మొదటి ఆంగ్ల నవల గాన్ విత్ ది విండ్- మార్గరెట్ మిఛల్ వ్రాసినది.తఱువాత నా పెళ్ళప్పుడు నా స్నేహితులంతా కలసి చాలా పుస్తకాల్ని పెళ్ళిలో బహుమతిగా చదివించారు. వాటిలోవి మాలతీ చందూర్ గారి నవలలూ నారీమణులూ అనే మూడు పుస్తకాలు. అవి కూడా నా పుస్తక పఠనాన్ని వేగవంతం చేసాయి.తఱువాత ఉద్యోగం చేస్తున్నప్పుడు కర్ణాటకలోని కార్వార్ కు వెళ్తూ వస్తూ హిగిన్ బాథమ్ పుస్తకాల షాపుల్లో ఆంగ్ల నవలలు కొని చదువుతుంటేవాడిని.ఇలా క్రమ క్రమంగా ఓ చిన్నపాటి పుస్తకాల సేకరణ ఓ పుస్తకాల బీరువాను టేకుతో చేయించుకోవటం వఱకూ వచ్చింద.తఱువాత ఉద్యోగం మాని వేసి పరిశ్రమ స్థాపించినపుడు తఱువాత పరిశ్రమ మూతపడ్డాక ఖాళీగా ఉన్నపుడూ తెలుగు భారత భాగవతాలూ ఇతర తెలుగు కావ్యాలూ వగైరా చదవటం మొదలయ్యింది. తఱువాత్తఱువాత ఇంటర్నెట్ పరిచయంతో ఇప్పుడిప్పుడు గ్రంథాలను ముఖ్యంగా తెలుగు పురాతన గ్రంథాలను డౌనులోడ్ చేసికొని చదవటం మొదలయ్యింది. ఇదీ క్లుప్తంగా నా పుస్తకాలు చదవటం గుఱించి.

  5. srinivasaraov

    pustakalu chadavadam chinnappudu chandamama,detective novels to alavatu ayyundi.chuttala illaku vedite pustakala vetaku annatle. kotta vishayalu
    telisevi.kondaru rachayutala shaili kallku kattinatluga vundedi kanaka vadalaleka poyye vanni.
    pustalu chadivevallu challa adrushtavantulani na abhiparayam.
    naa kento ishtamin pani pustalu koni(veelaitene) chadavam. ishtamina coffee tagutu unnatlu untundi pustalu chaduvutu unte.
    ee madhya kaalamlo goppa vishayam emante (naaku telisi) goppa,goppa
    world famous books telugu loki chakka ga translate ayyu vastunnayu.
    pustala valla naa alochana vidhanam -ve to +ve ayyundi.
    able to understand others nore.
    I advise to youth(But I doubt to how far they know the value)
    pustakam chadivinta sepu vere lokamlo viharaistam kada. enta baguntundi.
    naku nachhina pustakalu thakkuna cheppamante ee kindavai chebutanu.
    oka yogi atmakadha(yogananda),mahendra(souris),books on/by ramanamaharshi,geetanjali(Chalam),mroyu tummeda(viswanadha),andolana chendaku anadamga jivinchu(karnegie),secret(Ronda byrne),yandamuri books,malladi(karma-janma),parusavedi etc
    nijhanja pustakalu na nestalu.
    srinivasaraov 9441481014

Leave a Reply to narasimharao mallina Cancel