పుస్తకం
All about booksపుస్తకభాష

September 23, 2014

మొరక్కోకు మాయా తివాచి.. In Arabian Nights

More articles by »
Written by: Purnima
“And as he spoke, I was thinking, ‘the kind of stories that people turn life into, the kind of lives people turn stories into.’ – Philip Roth

తాహిర్ షాహ్ రాసిన ’ఇన్ అరేబియన్ నైట్స్’ అన్న ఆంగ్ల పుస్తకానికి మొక్కుబడిగా పరిచయం రాయాల్సి వస్తే, లండన్ లాంటి మహానగరాన్ని వదిలి ఆఫ్రికా ఖండంలో మెరక్కో దేశంలో కాసబ్లాంకా నగరంలో ఒక నాలుగైదేళ్ళు నివసించి, అక్కడి వింతలూ విశేషాలనూ పరిచయం చేసే పుస్తకంగా చెప్పుకోవచ్చు. ఒకానొక ’ట్రావెల్’ పుస్తకం అనుకోవచ్చు.

కాకపోతే మనం జీవిస్తున్న కాలంలో చాలా వాటికి అర్థాలు మారిపోతున్నాయి. ప్రేక్షకులంటే, ఒకప్పుడు, సభకు వచ్చి సుఖాసీనులై కార్యక్రమాలను వీక్షించేవారు. ఇప్పుడు: మునివేళ్ళపై నిలబడి డిజి కామ్‍లను ’క్లిక్’ మనిపించటానికి ఉబలాటపడుతున్నారు. కుటుంబసమేతంగా గడపాల్సిన సమయం ఇప్పుడు టివిలూ, సినిమాల పరమైపోతుంది. ఒక ప్రదేశాన్ని సందర్శించి రావటమంటే అక్కడున్న నయనాందకరమైనవన్నీ ఫోటోలు తీసి, అక్కడ కొనుగోళ్ళు బాగా చేసి తిరిగొచ్చి చూపడం. ఒక కొత్త ఊరిలో నివాసం ఏర్పరచుకోవడమంటే అక్కడి ట్రాఫిక్, అక్కడి సౌకర్యాలను, అక్కడి కాస్ట్ ఆఫ్ లివింగ్ బారేజి వేసుకోవడం, దేని గురించైనా ఎవర్నైనా అడిగితే “గూగుల్ చేసుకో.. లక్షల పేజీల ఇన్ఫో వస్తుంది” అని జవాబివ్వటం, మనిషి పక్కపక్కనే చాట్లాడుకోవడం.. ఇలాంటివెన్నో..

అలాంటి కాలంలో, ఒక రచయిత ఒక దేశంలో తన వ్యక్తిగతానుభవాలు రాస్తూ, తన తండ్రి ఇచ్చిన ఒక సలహా / శిక్షణను గురించి మాట్లాడుతూ,

ON OUR CHILDHOOD TRAVELS TO MOROCCO, MY FATHER USED TO say that to understand a place you had to look beyond what the senses show you. He would tell us to stuff cotton in our nostrils, to cover our ears and to close our eyes. Only then, he would say, could we absorb the essence of the place. For children the exercise of blocking the senses was confusing. We had a thousand questions, each one answered with another question.

అన్నప్పుడు ఇది సామాన్య రీతిలో రాసిన పుస్తకం కాదని తెల్సిపోతుంది. ఆ సంగతి మరుపు రాకుండా ప్రతి పేరాగ్రాఫు అరచి అరచి చెప్తుంది, ఇదో అసమాన్య పుస్తకం అని.

తాహీర్ షా గురించి:

రచన కన్నా ముఖ్యంగా రచయితను గూర్చి తెల్సుకొని మొదలెట్టాల్సిన పుస్తకాల్లో ఇదొకటి. తాహిర్ కుటుంబం సమస్తం కథాప్రేమికులు. ఊ.. కథలు. మామూలు కథలు. మనం వినివిని ఉన్న కథలు. మన అలక్ష్యంతో మరుగున పడిపోయిన కథలు. అరేబియన్ కథలు. విక్రమ బేతాళ కథలు. పంచతంత్ర కథలు.. ఇలాంటి కథలని ప్రేమించి, ఆరాధించి, అవి మూలన పడిపోకుండా ఉద్ధరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేయడమే కాక, కథలంటే కాలక్షేపమో, వినోదభరితమో మాత్రమే కావు, అవి మనిషి వ్యక్తిత్వ వికాసానికి*, మానసికోల్లాసానికి, తనని తాను అర్థం చేసుకోడానికి ఉపయోగపడే మహత్తర సాధనాలు అని బలంగా నమ్మిన మనుషులు వాళ్ళంతా.

(* వ్యక్తిత్వ వికాసాలంటే నిచ్చెనలూ, రేస్‍లూ, యూ కాన్ విన్‍లూ కాదు!)

తండ్రి నుండి వారసత్వంగా గ్రహించిన ఈ కథారాథనను రచయిత తన వంతుగా ఆవిష్కరించిన రచన ఇది.

కథగా.. కల్పనగా..

కథనీ, వాస్తవాన్నీ వేరు చేయడానికి ఏదైనా సరిహద్దుంటే ఆ సరిహద్దును చెరిపివేయటానికి చేసిన తాండవం ఈ పుస్తకం. నిజం కథలా సాగుతుంది. కథ నిజమై ఎదురొస్తుంది. మొరక్కో ఆఫ్రికా ఖండంలో ఒక దేశం కాదు, అదో మాయాప్రపంచం అనిపిస్తుంది. అక్కడికి చేరుకోడానికి విమానం కాదు, ఊహారెక్కలుంటే సరిపోతుందనిపిస్తుంది. అక్కడి మనుషులు ఆధునికపోకడలు పోయినా కూడా శతాబ్దాల కిందటి కథల్లో పాత్రల్లా అనిపిస్తారు.

ఇహ అచ్చంగా ’కథల పుస్తకం’ అన్న శీర్షికున్న పుస్తకంలో కూడా ఇన్ని కథలుండవు. అబ్బబ్బబ్బా ఎన్నేసి కథలు. కన్నీళ్లను మరిపించడానికి కథలు. నవ్వుల్ని పూయించడానికి కథలు. బుద్ధిమందగిస్తే మొట్టికాయవేయడానికి కథలు. నీరసమొస్తే బలాన్నిచ్చే కథలు. పొగరెక్కువై విర్రవీగుతుంటే బుద్ధి చెప్పే కథలు. అసలు, సమయం-సందర్భం, వయసు-వృత్తి, స్థలం-కాలం, మంచి-చెడు ఇలాంటివేవీ పట్టించుకోకుండా ఎక్కడబడితే అక్కడ కథలు. రచయిత చెప్పిన కథలు. చెప్పించుకున్న కథలు. గుర్తొచ్చిన కథలు. గుర్తుకుతెచ్చుకున్న కథలు. ఎదురొచ్చిన కథలు. రచయిత వెంటపడి వెతికి మరీ కనుగొన్న కథలు. కథలు. కథలు.

కథల్లో కబుర్లు:

ఏం రాయడానికి తోచక కథలన్నీ చెప్పి తప్పించుకున్న బాపతు అనుకునేరు. ఈ కథల్లో, వీటి మధ్యనా ప్రస్తుత మొరక్కోను పరిచయం చేసారు. ఈ పుస్తకంలో మొరక్కో వెళ్ళాలంటే ఏ విమానం ఎక్కాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏం కొనుక్కోవాలి, ఏం చూడాలి లాంటి విషయాల పట్టిక కనిపిస్తుందనుకుంటే పొరపాటే. ఉపోద్ఘాతంలో పేరా మళ్ళీ చదువుకోండి. ఇది ఒక దేశాన్ని, దాని ఆచారవ్యవహారాలని నిండు మనసుతో స్వీకరించిన విధానం. మొరక్కో ఆత్మను కథల ద్వారా కథగా చెప్పిన తీరు.

చాలా విషయాలు తెలుసొస్తాయనడంలో వింత లేదు. అక్కడ జినీలను ఇంకా నమ్ముతారు. వాటిని శాంతింపజేయటం కోసం జంతుబలి ఇస్తుంటారు. అక్కడ మగవాళ్ళంతా కాఫెలో చాలా సమయం గడిపేస్తుంటారు, కబుర్లతో. అక్కడి వారికి కథలు చెప్పటం, వినటం అంటే ప్రాణం. ఇప్పుడు మీడియా వల్ల అదంతా నశించిపోతోంది అని ఆందోళన పడుతున్నారు. వారికి పుస్తకాలంటే సదభిప్రాయం లేదు. ఏదైనా సరే కళ్ళతో కాక, చెవి ద్వారా మెదడులోకి ప్రవేశించాలని అనుకుంటారు. ఒక చోట, ఒక మనిషి, “మాకో ఆచారం ఉంది.” అంటాడు రచయితతో. ఏంటని అడిగితే “బుర్రను ఉపయోగించటం” అంటాడు. మనం పుస్తకాలను, కంప్యూటర్లను, గాడ్జెట్స్ ను ’మెమరీ’గా వాడ్డం వాళ్ళకి చిరాకు కలిగించే విషయం. వారి దృష్టిలో స్నేహమంటే ఒక బాధ్యత – స్నేహితుని కోసం ఏమైనా చేస్తారు, స్నేహితుని నుండి ఏదైనా ఆశిస్తారు.

అక్కడివారిలో పాశ్చాత్య సంస్కృతికి ప్రభావితులైనవారూ ఉన్నారు. మొరక్కో వదిలి సముద్రం దాటి అమెరికా ముంగిట్లో వాలడానికి పాతతరం అందించిన భవంతులను అమ్ముకోడానికి సిద్ధపడేవారూ లేకపోలేదు.

ఈ పుస్తకం వల్ల నాకు రిచర్డ్ ఎఫ్ బర్టన్ గురించి కొన్ని విశేషాలు తెలిసాయి. ఈయన రెండు శతాబ్దాల క్రిందటే అరేబియన్ నైట్స్ ను ఆంగ్లంలోకి తర్జుమా చేసారన్న విషయం తప్పించి నాకింకేం తెలీదు. రచయితకూ ఈయనంటే ఆసక్తి, గౌరవమూ ఉన్నాయి కాబట్టి వారి విశేషాలు చాలా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా, అరేబియన్ నైట్స్ అంటే చిన్నపిల్లల కథలనుకున్నాను, ఇన్నేళ్ళు. అందులోని అభ్యంతరకర విషయాలను చాలా వరకూ తొలగిస్తే చిన్నపిల్లల సాహిత్యం అయ్యిందని చదివి విస్తుపోయాను. అలాగే, బర్టన్ అంటే పండితుడన్న సంగతి తెల్సున్నా, అరేబియన్ నైట్స్ అనువాదం విషయంలో సెన్సార్ బారిన పడకుండా ఆయన తీసుకున్న జాగ్రత్తలు నన్ను అబ్బురపరిచాయి.

వెస్ట్ వెస్టే కానీ ఈస్ట్ ఈస్ట్ కాదు..

‘I see the East through one eye and the West through the other,’ I said. ‘I understand how they both feel, but I don’t know how to tell one about the other.’

నా ఈడు స్నేహితులతో పోలిస్తే, ఆన్‍సైట్లకు వెళ్ళటంలో కానీ, గాడ్జట్స్ కొనటంలో గానీ, అక్కడి టివి సీరీస్, సినిమాలు చూడ్డంలో గానీ, వాళ్ళ భాష వంటబట్టించుకోవటంలో గానీ నేనే తక్కువ western..! ఈ పుస్తకంలో రచయిత, “అదే వెస్ట్ లో అయితే” అన్నప్పుడల్లా మాత్రం అచ్చంగా నన్నే అంటున్నారేమోనని అనిపించింది. ప్రాశ్చాత్య దేశాల్లో చదవడానికున్న ప్రాధాన్యత అర్థం చేసుకునేందుకు ఉండదు, స్నేహితులంటే సరదాగా కాలక్షేపానికి గానీ లేనిపోని బాధ్యత కాదు, ఇంటికొచ్చిన అపరిచితులని ఆహ్వానించటం అటుంచి అనుమానంగా చూడ్డం పరిపాటి లాంటివన్నీ చదువుతుంటే “హమ్మయ్య! వెస్ట్ కు నేను మరీ దూరంగా లేను” అని ఊపిరి పీల్చుకున్నాను. 😉

చివరిగా..

నచ్చితే బ్రహ్మాండంగా నచ్చే పుస్తకం ఇది. లేకపోతే అసలు నచ్చదు. ఒకసారి చదివి చూస్తే, నచ్చుతుందో లేదో అదే తెలుస్తుందిగా! 🙂
In Arabian Nights

Tahir Shah

TravelogueAbout the Author(s)

Purnima

Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..One Comment


  1. sreekrishna

    రివ్యూ చాలా బావుంది. వీలుంటే ఇద్రీస్ షా పుస్తకాలూ రివ్యూ చేయగలరు.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

నా కథ – చార్లీ చాప్లిన్

వ్యాసకర్త: Sujata Manipatruni ******** నా కథ – చార్లీ చాప్లిన్ అనువాదం : శ్రీ వల్లభనేని అశ్వినీ కుమార...
by పుస్తకం.నెట్
0

 
 

The Book of Joy

వ్యాసకర్త: Naagini Kandala ***************** The Book of Joy:Lasting Happiness in a Changing World by Dalai Lama XIV, Desmond Tutu, Douglas Carlton Abrams కొన్ని పుస్తకాలు దా...
by అతిథి
0

 
 

జోలెపాళెం మంగమ్మగారితో పుస్తకం.నెట్

పరిచయం: జోలెపాళెం మంగమ్మ గారి పేరు వింటే ఒకతరం వారు  “ఆలిండియా రేడియో తొలి తెలుగు మహ...
by పుస్తకం.నెట్
2

 

 

విస్మృత జీవుల అంతశ్శోధనకు అక్షరరూపం “మూడవ మనిషి”

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ ************* ఆధునిక కవిత్వంలో హైకూలు, నానీలు, మినీ కవితల్లానే మ...
by అతిథి
2

 
 

గాయపడ్డ ఆదివాసి సంధించిన ‘శిలకోల’

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ [రచయిత మల్లిపురం జగదీశ్ ‘శిలకోల’కి డాక్టర్ మాడభూషి రంగాచార...
by అతిథి
4

 
 

The Immortal Life of Henrietta Lacks – Rebecca Skloot

వ్యాసకర్త: Naagini Kandala ************** కొన్నిసార్లు ఒక పుస్తకం చదవాలనే ఆసక్తి కలగడానికి పుస్తకం పేర...
by అతిథి
1