సాల్స్బుర్గ్ నగరంలో రెండు పుస్తకాల షాపులు…

నా స్నేహితురాలిని కలిసేందుకు ఆస్ట్రియాలోని సాల్స్బుర్గ్ నగరం వెళ్తూ, అక్కడ చూడ్డానికి ఏమున్నాయి? అని వెదుకుతూ ఉండగా, ఒక పుస్తక దుకాణం గురించి తెలిసింది. “Buchhandlung Höllrigl” అన్నది ఆస్ట్రియా లోనే అతి పాత పుస్తకాల దుకాణమట. 1598లో స్థాపించారట. ఎన్నో చేతులు మారుతూ, ఇన్నేళ్ళ దాకా నిలిచిందట. ఈ షాపును గురించి ఆంగ్లంలో ఆట్టే సమాచారం దొరకలేదు కానీ, కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాలేదు. అదే ప్రాంతంలో మోజార్ట్ పుట్టిన ఇల్లు వగైరా ఉండటం కూడా వెదుక్కోవడానికి దోహదం చేసింది. సరే, షాపులోకి వెళ్తే, ఆ వీథిలో వీళ్ళవే రెండు షాపులున్నాయి. ఒకదానిలో కలెక్టర్స్ ఎడిషన్ల వంటివి ఎక్కువ కనిపిస్తే, మరొక దానిలో కొత్త పుస్తకాలూ అవీ కనిపించాయి. ఏదైనా, కొనే స్థాయిని మించి ఉన్నాయి కనుక కొనలేదు, అది వేరే సంగతి.

మరొక పుస్తకాల షాపు – ఒక పెద్ద సంగీతానికి సంబంధించిన పుస్తకాలది. ఇది మోజార్ట్ జన్మస్థలం వద్ద కాక, ఆయన నివసించిన స్థలం పక్క వీథిలో ఉంది. ఇలా పూర్తిగా సంగీతానికే అంకితమైన పుస్తకాల షాపు చూడ్డం ఇదే కొత్త కావడం వల్ల, కాసేపు లోపల తిరిగాను. కానీ, బొత్తిగా అవగాహన లేదు, పైగా అంతా జర్మన్ మయం. కనుక, చేసేదేం లేక వెనక్కొచ్చేసాను.

షాపుల తాలూకా ఫోటోలు కొన్ని…ఇక్కడ పొందుపరుస్తున్నాను.

మొదటగా – సంగీతం పుస్తకాల షాపు:

ఇక, Höllrigl ఫొటోలు:

(వీటి గురించి వివరాలు కనుక్కునేందుకు ప్రయత్నించాను కానీ, కుదర్లేదు. తెలిసినప్పుడు మరో టపా రాస్తానేమో!)

You Might Also Like

Leave a Reply