నాన్న- నేనూ..

వ్యాసకర్త: వర ముళ్ళపూడి

తొలి ప్రచురణ: తెలుగు పలుకు; తానా 18వ మహాసభల ప్రత్యేక సంచిక (2011)

ఈ వ్యాసాన్ని పునర్ముద్రించటానికి అనుమతించిన వర ముళ్ళపూడి గారికి పుస్తకం.నెట్ ధన్యవాదాలు.

______________________________________________________________________________________

మా నాన్నకీ నాకూ మధ్యన- నేను చూసినవి, నాకు తెలిసినవి- చాలా “ఒక్కసారి” లు ఉన్నాయి. వాటి గురించి తర్వాత చెప్తా. కానీ నేను ఓడిపోతున్న ప్రతీసారీ- ఆయన నన్ను మళ్ళీ సరైన దారిలో నడిపించడం మాత్రం- చాలాసార్లు. వాటి గురించి కూడా తర్వాత చెప్తా. “ముళ్ళపూడి వెంకటరమణ” పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది- సున్నితంగా, నాజూగ్గా చురకలేసే హాస్యం. దాని గురించి నేనేమీ చెప్పను- ఎందుకంటే దాని గురించి అందరికీ నాకంటే ఎక్కువ తెలుసు కాబట్టి. మామ [అంటే బాపు గారు] తో ఆయన స్నేహం గురించి నేనస్సలు చెప్పను- ఎందుకంటె ఆ బంధం గురించి పుస్తకాలే రాసేసారు కాబట్టి.
మరింకేం చెప్తాననా? ఏమో- చూద్దాం. రాస్తూంటే- ఏం వస్తుందో.. ఎలా మొదలుపెట్టాలి? ఎక్కడ మొదలుపెట్టాలి?

నాన్నకీ మామకీ గొప్ప background లేదు. ఒకళ్ళకి ఒకళ్ళు background అయ్యారు.

మా ఇంట్లో మొత్తం పదిహేను మంది ఉండేవాళ్ళం. పైన మామ ఇంట్లో అయిదుగురు. కింద పదిమంది. గోలగోలగా ఉండేది. నాన్న భోజనప్రియులు. తినటమే కాదు- తినిపించడంలో కూడా బోల్డు ఆనందం పొందేవారు. చిన్న వంక దొరికితే చాలు- మా ఆస్థాన వంటవాళ్ళని పిలిపించి భోజనాలు పెట్టించేసేవారు. పక్కనే నించుని అన్నీ చూసుకునేవారు. షూటింగ్ లో కూడా అంతేట.

నేను చూళ్ళే కానీ- విన్నా. 1986-1989 మధ్య స్కూల్ పాఠాలు audio-visual చేస్తున్నప్పుడు- రాజమండ్రి లో షూటింగ్. యూనిట్ అందరినీ train లో first class లో తీసుకెళ్తున్నారు. భోజనాల వేళ- వడ్డనలు. నాన్న తలకి తువ్వాలు చుట్టుకుని- లుంగి పైకి కట్టుకుని- వడ్డిస్తున్నారు ట. అందరూ తినేసారు. ఒక light man కాబోలు- చెయ్యి కడుక్కుని, శ్రీరమణ గారితో అన్నాట్ట- “సార్. వడ్డించడానికి కొంచం కుర్ర వాళ్ళని పెట్టుకోవచ్చుగా. ఆ పెద్దాయన చూడండి- ఎలా అవస్థ పడుతున్నారో”. శ్రీరమణ గారు ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసారట- అతను చూపించిన “పెద్దాయన” ని. Shock. అక్కడ ఉన్నది నాన్న. “నువ్వు నోరు ముయ్యవయ్యా బాబూ- ఆయనే ప్రొడ్యూసర్” అనేసరికి- light man కి shock. నాన్న frequent గా train journeys చేసేవారు- script discussions కి. గోదావరి అంటే ఆయనకి ప్రాణం. ఆ పేరు చెప్తేనే పూనకం వచ్చేసేది. ఆయనతో కూడా శ్రీరమణ గారు- మామ chief associate director కె. వీ. రావు గారు- ఎప్పుడైనా- మామ. train లోకి భోజనాలు సద్దాలి. ఇంట్లో మా అందరికీ పని. ఒక రేకు డబ్బా ఉండేది- స్పెషల్ గా చేయించారనుకుంటా.  దాంట్లో నాలుగు భోజనం ప్లేట్లు, నాలుగు టిఫిన్ ప్లేట్లు, గరిటెలు, spoons, నాలుగ్గిన్నెల భోజనం క్యారేజీ- వీటితో బాటు కాయితాలలో చుట్టిన నాలుగు గాజు గ్లాసులు. ఆ రోజుల్లో ac compartment లు లేవు. First class cabin. మామూలుగా నాలుగు టికెట్లు బుక్ చేసేవారు. రేకు డబ్బాలో నలుగురికి సరిపడా భోజనం ఉండేది. ఒకసారి ముగ్గురే ప్రయాణం చేస్తున్నారు – భోజనం మాత్రం నలుగురికీ ఉండేది. అంతెందుకు అని అడిగితే- “మేము ముగ్గురం తింటాం. Cabin లో నాలుగో మనిషి ఉన్నారనుకో- ఆయన తిండి తెచ్చుకోలేదనుకో- ఆ రాత్రి వేళ ఇబ్బంది పడతారు పాపం” అన్నారు. [గమనిక : extra గాజు గ్లాసు కూడా [మ][అం]దుకే. నాన్న మాటల్లో “మందోబస్తు”].

చాలా రోజుల తర్వాత- నేను ఒక్కడినీ train లో ప్రయాణం చేస్తున్నప్పుడు- ఎవరో తెలియని ఒకాయన నాదగ్గిరకి వచ్చి- పరిచయం చేసుకుని- “ఓ తిండి లేని రాత్రి”- నాన్నతో భోజనం చేసిన experience గురించి చాలా గొప్పగా చెప్పారు. అప్పుడు అర్ధమైంది- ఆ “నాలుగో మనిషి” concept. చాలా గర్వంగా feel అయ్యాను- అక్కడికి ఏదో నేనే ఆయనకి భోజనం పెట్టినట్టు.. పండగ వచ్చిందంటే చాలు- ముందు ఇంట్లో ఉండే 7-8 పని వాళ్లకీ హోటల్ నించి స్పెషల్ టిఫిన్లు తెప్పించేవారు. పాఠాల షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా- ఆరింటికి హోటల్ కి వెళ్లి- యూనిట్ కి టిఫిన్ ఆర్డర్ చేసి- చట్నీలూ, సాంబార్ రుచి చూసి- పోపు ఎక్కువగా వెయ్యమనీ- గట్టి చట్నీ మాత్రమే కట్టమనీ పురమాయించి- అప్పుడు లొకేషన్ కి బయలుదేరేవాళ్ళం.

ఎన్ని సమస్యలున్నా- ఎక్కడ ఉన్నా- మామ షూటింగ్ లో ఉంటే మాత్రం- నాన్నకి ధ్యాస అంతా మామ మీదే. “పాపం- మామ ఎండలో ఎంత కష్టపడుతున్నారో. బండ. కొంచం కూడా రెస్ట్ తీసుకోరు. సరిగ్గా తిన్నారో లేదో” అని. ప్రతీదీ మామకే లింక్ పెట్టేవారు. ఎక్కడికెళ్ళినా- “ఇది బాపుకి ఇష్టం” అనీ- “బాపు ఇక్కడ ఉంటే భలే enjoy చేసేవారు” అనీ.. అలా constant గా మామ గురించీ, మామ family గురించే ఆలోచించేవారు. సాధారణంగా- పక్కన ఉన్న మన గురించి కాకుండా- పక్కన లేని వాళ్ళ గురించే ఆలోచిస్తూంటే- కోపం వస్తుంది. కానీ- అదేం సిత్రమో- మాకు ఎప్పుడూ రాలేదు. పైగా- అదే అలవాటు మా అందరికీ వచ్చింది. ఆ అలవాటు ఇప్పటికీ ఉందంటే- అదేదో మా గొప్పతనం కాదు- నాన్న,మామకి ఒకళ్ళమీద ఒకళ్ళకున్న పిచ్చి ప్రేమ. భయంకరంగా తిట్టుకునే వాళ్ళు ఇద్దరూ. నేను మామ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేటప్పుడు [గమనిక 2: నేను ఎప్పటికీ మామ దగ్గర అసిస్టెంట్ నే]- నేనూ, ఇంకో అసిస్టెంట్ గాంధీ [ఇప్పుడు దర్శకులు]- స్టూడియో నించి లేట్ గా- పదింటికి గెస్ట్ హౌస్ చేరుకున్నాము. దూరంనించే అరుపులు వినిపిస్తున్నాయి. గేటు లోంచి తొంగి చూస్తే- నాన్న, మామ బయట కుర్చీలు వేసుకుని- భీకరంగా అరుచుకుంటున్నారు. మేము హడిలిపోయాము. “ఇంక అంతా అయిపొయింది- వీళ్ళిద్దరూ విడిపోతున్నారు” అనుకుని- లోపలికి వెళ్ళడానికి భయం వేసి- మళ్ళీ రోడ్ చివరకి వెళ్ళిపోయాము. 11:30 pm కి, ఆకలికి తట్టుకోలేక, మళ్ళీ వచ్చాము. Silence. ఇద్దరూ పడుకున్నారు. మర్నాడు పొద్దున్న, ఏం చూడాలో, ఏం వినాలో అని భయపడుతూ బయటకి వచ్చాము. Shock. ఇద్దరూ కూచుని టిఫిన్ తింటున్నారు. మామ నాన్నకి వడ్డిస్తున్నారు. నాన్న మామకి వడ్డిస్తున్నారు. “ఈ చట్నీ తిను. బావుంది”..

వాళ్లిద్దరిలాగే- మేమెవరమూ నాన్న, మామ ని వేరుగా చూడము.

మామ పెద్దబ్బాయి వేణు పదేళ్ళు అమెరికా లో ఉండి, వస్తూ అక్కడనించి ఒక అరవ అమ్మాయిని తీసుకొచ్చాడు. ఫ్రెండ్ అని పరిచయం చేశాడు. వాళ్ళు దిగిన రోజే, మామ హిందీ సినిమా షూటింగ్ కి రాజమండ్రి వెళ్ళిపోయారు. వేణు- మామకి ఎలా చెప్పాలో తెలియక- ఎప్పటిలాగే నాన్న కి ముందుగా చెప్పాడు- ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నట్టు- ఎప్పుడో ఏడాదికో, రెండేళ్లకో. నాన్న ధైర్యం చెప్పి- రాజమండ్రి పంపించారు. అందరమూ వెళ్ళాము. అక్కడ నాలుగు రోజులు ఉన్నాకూడా, వేణు కి ధైర్యం చాలలేదు- మామకి చెప్పటానికి. మర్నాడు తిరుగు ప్రయాణం. అప్పుడు ధైర్యం తెచ్చుకుని- వెళ్ళి చెప్పాడు. మామ react అవలేదు. “ok రా. మీరు మద్రాస లో  ట్రైన్ ఎక్కిన వెంటనే మామ నాకు ఫోన్ చేసి చెప్పారు. no problem” అన్నారు. actual గా వేణు- భువన ని పరిచయం చేసి- విషయం చెప్పి వెళ్ళిపోదామని వచ్చాడు. కానీ నాన్న, అమ్మా, అత్తా, మామా మాట్లాడుకుని- అంత దూరంనించి అస్తమానమూ రావడం కుదరదు కాబట్టి- పెళ్ళి చేసుకునే వెళ్ళమన్నారు. ఈ decision తీసుకున్న రోజు- January 22nd 1992. పెళ్ళి ముహూర్తం- January 26th 1992.
[ఈ పెళ్ళికి మామ వెంటనే ఒప్పుకోడానికి ఇంకో కారణం- భువన పుట్టినరోజు june 28th కావడం కూడా అని ఎవరో అన్నారు. ఎందుకంటే ఆరోజే నాన్న పుట్టినరోజు కూడా. పెళ్ళి అయిన రోజు- నాన్న, అమ్మ పెళ్ళి రోజు]

నాన్న అల్పసంతోషి. చాలా చిన్న చిన్న విషయలాకే చాలా సంతోషించేవారు. ఆయన ఎన్ని గొప్ప పనులు చేసినా, ఎంత సాధించినా- కొన్ని విషయాలలో చిన్న పిల్లాడు [రు]. నాకు దోశెలు వెయ్యటం బాగా వచ్చు. Paper దోశ లో expert. నాన్న thrill అయిపోయి అమ్మని పిలిచి “చూస్కో చూస్కో” అనేవారు. Fan గాలికి దోశ ఎగిరిపోయేది. ఇంకా thrill అయిపోయేవారు. తింటూ తింటూ మామకి ఫోన్ చేసి- “రావయ్యా. బుజ్జి దోశలు భలే వేస్తున్నాడు”. మామ వెంటనే వచ్చేవారు. కానీ దోశలు మాత్రం సరిగా వచ్చేవి కావు. 1984 లో మద్రాస్ లో పెద్ద తుఫాను వచ్చింది. ఊరంతా నీళ్ళమయం. మా ఇంటికి కొంచం దూరంలో ఒక slum ఉండేది. మొత్తం మునిగిపోయింది. తుఫాను వారం రోజులూ- 30 మంది దాకా వచ్చి మా ఇంట్లో రెండు car sheds లోనూ- వరండా లోనూ ఉండిపోయారు. టీ /కాఫీ లూ- టిఫిన్లూ అన్నీ నాన్న చూసుకున్నారు. భోజనాలు వాళ్ళే వండుకునే వారనుకుంటా. వరదలు తగ్గాక వాళ్ళంతా వెళ్ళిపోయారు. తుఫాను దెబ్బకి ఇల్లూ, compound-మొత్తం ఛ౦డాలంగా తయారయ్యాయి. Clean చెయ్యటానికి రెడీ అయ్యాము. ఇంతలో, పది మంది ఇంట్లోకి వచ్చేసారు. చీపుళ్ళూ, తట్టలతో.. అయిదారు గంటలు పని చేసి- ఇల్లంతా శుభ్రం చేసేశారు. నాన్న చాలా సంతోషించేసి- వాళ్లకి డబ్బులివ్వబోతే తీసుకోలేదు. వారం రోజులు ఇంట్లో చోటు ఇచ్చినందుకు thanks చెప్పి వెళ్ళిపోయారు. చెప్పలేనంత గొప్ప సంతోషం మా అందరికీ. గాల్లో తేలుతున్న feeling. కానీ, ఆ సంతోషానికి కారణం అయిన మనిషి మాత్రం- మామూలుగా- మూల ఉన్న తన కుర్చీలో కూచుని- పేపర్, కాఫీ, సిగరెట్..

నాన్న కొన్నేళ్ళు full sleeves చొక్కా వేసుకునేవారు- మోచేతి దాకా మడతపెట్టి. ఆయనకు “ఇవ్వడం” అంటే చాలా చాలా ఇష్టం. ఆ చొక్కా sleeves మడతలో డబ్బు పెట్టుకునేవారు. గోదావరి దగ్గర షూటింగ్ కి వెళ్ళినప్పుడు- కొంత మంది వచ్చి కష్టాలు చెప్పుకునేవారు. [మిగతా చోట్ల నేను చూడలేదు]. నాన్న ఓపిగ్గా వినేవారు. ఆ వచ్చిన వాళ్లకి- sleeve మడతలో ఎంతుంటే అంత- లెక్క చూసుకోకుండా- ఇచ్చేసేవారు. ఎంత అనేది వారి వారి అదృష్టాన్ని బట్టి ఉండేది. వందలూ- వేలూ.. ఆ డబ్బుతో ఏవో చిన్న వ్యాపారాలు పెట్టుకుని- టీ కొట్టో- టిఫిన్ బండో- బాగుపడ్డవాళ్ళు ఎంతో మందిట. నాన్న మామూలుగా కోపం రాదు. వస్తే? అరిచేవారు. ఫోన్ లో ఎవరిమీదనో అరవడం విన్నాను. కానీ- రెండో నిమిషానికి మళ్ళీ మామూలే.

నేను ఆరంభంలో రాసిన మాట ““ఒక్కసారి”లు” కి ఇక్కడ link. నాన్న- నన్ను “ఒక్కసారే” తిట్టారు- నేను చేసిన వెధవ పనికి. స్కూల్లో రిపోర్ట్ కార్డు ఇవ్వలేదని- ఇంట్లో అబద్ధం చెప్పినందుకు. 5 నిమిషాలు చాలా కోపంగా ఉన్నారు. ఆ రాత్రి మాట్లాడలేదు కూడా. తెల్లారాక తగ్గింది. కానీ- ఆ రాత్రి ఆయన ఎంత బాధ పడి ఉంటారో.. marks సరిగా రాలేదన్న బాధకన్నా- అబద్ధం చెప్పానన్న బాధే ఎక్కువ. ఆ వయసులో నాకు బుర్రకెక్కలేదు. అలాగే- నాకు life లో “ఒక్కసారే” ఉత్తరం రాశారు. అది 1986 లో. నేను California లో commercial pilot training చేస్తున్నప్పుడు, నాకు outstanding grades వచ్చాయి. అప్పుడు, నన్ను మెచ్చుకుంటూ రాశారు. ఆ  ఉత్తరం చదువుకుని- చాలా రోజులు సంతోషంతో ఏడ్చాను.

మూడవ “ఒక్కసారి”- నాన్న దుఖ్ఖం తో ఏడవడం ఒక్కసారే చూశాను. మా బామ్మ పోయినప్పుడు ఏడ్చారుట. నేను చూళ్ళేదు. కానీ బాగా ఏడ్చింది మాత్రం- k.v.mahadevan గారితో బాటు కొన్ని decades ప్రయాణం చేసిన music director పుహళేంది గారు పోయినప్పుడు. నాన్నని నేనే తీసుకెళ్ళాను అక్కడకి. అప్పుడు, నాన్న ఏడవడం చూసి నాకు భయం వేసింది. నేను చూసిన ఇంకో “ఒక్కసారి”- నాన్న సంతోషం తో ఏడవడం. కోతి కొమ్మచ్చి book release function లో- బాపు-రమణ లకి సన్మానం జరిగినప్పుడు- రవీంద్రభారతి మొత్తం లేచి నించుని చప్పట్లు కొట్టినప్పుడు.. నేను మరీ దగ్గిర లేకపోయినా- నాకు కనిపించింది.

నేను గొప్ప grades commercial pilot license తెచ్చుకుని కూడా pilot కాలేని పరిస్థితి వచ్చినప్పుడు- [అప్పుడు నేను మళ్ళీ California లోనే ఉన్నాను] “ఏం ఫర్లేదు. వచ్చేయ్. We’ll find a new life for you”- అని కొంచం కూడా బాధ పడకుండా- ఒకవేళ పడినా- ఆ బాధని ఫోన్ లో నాకు తెలియనివ్వకుండా- ధైర్యానిచ్చారు.

కష్టాలని face చెయ్యడం నేర్చుకోమనేవారు. షూటింగ్ లో ఓ సారి మామ నన్ను తిడితే- నేను కాసేపు దూరంగా వెళ్ళిపోయా. నాన్న పిలిచి- “నువ్వు తప్పు చేసావు. Face the consequences. మళ్ళీ జరగకుండా చూసుకో”- అన్నారు.

February 23rd గానీ- ఆ తర్వాత గానీ- నేను ఏడవలేదనుకుంటారు చాలామంది. కారణం ఉంది. నేను ఏడవడం నాన్న “ఒక్కసారి” కూడా చూడకూడని.. కానీ- వల్ల కావట్లేదు. అందరి ముందూ కాకపోయినా- నాన్న ని తలచుకుని నేను ఏడుస్తూనే ఉన్నాను- ఇది రాస్తూంటే కూడా. మళ్ళీ కానీ- నాన్నే లేరు అని నేను accept చెయ్యను. ఆయన ఎప్పుడూ ఇక్కడే- మాతోనే ఉంటారు. అందుకే ఇంట్లో ఏదీ మార్చనివ్వలేదు. నాన్న కూర్చునే కుర్చీలు- రాసుకునేటప్పుడు వేరే- పేపర్ చదువుకునేటప్పుడు వేరే- టీవీ చూస్తున్నప్పుడు వేరే.. ఆయన desk- ఆయన పూజ చేసుకునే చోటు- ఏవి ఎక్కడ ఉండేవో- అవన్నీ అలాగే ఉన్నాయి. ఉంటాయి. ఇంకా ఏదో train journey లో రాజమండ్రి వెళ్లారనే feeling తోనే ఉంటాను.

మళ్ళీ మళ్ళీ కానీ-
శ్రీనాధ కవిసార్వభౌముడన్నట్టు-
“డివిజ కవివరు గుండియల్ సంతసించగ-
అరిగినారు ముళ్ళపూడి రమణపురికి”.

You Might Also Like

16 Comments

  1. kesava

    Vara garu,

    Excellent book, particularly last para as u mentioned still ur father on train journey, i remembered my father ( i am writing this with tears)… a good rememberence. my father name is Seetham Raju Rama Krishna who is the “yekalavya sishya” of EELAPATA Raghu Ramaiah, My father is a drama artiste, I am a TV artiste,

    Thanks sir,
    Kesava

  2. voleti srinivasa bhanu

    aalasyamgaa spandistunnaanu..manninchandi vara gaaru..

    ilaa raayadam, intagaa hattukunelaa raayadam meeku maatrame saadhyam. ramana gaaru meeku garapina hitavaakyaalu chadiveka ‘goranta deepam’ lo vaanishree to kaantaarao cheppina maatalu gurtukocchyaai.Mee tandri gaari aatmaku shaanti kalagaalani,mee kutumbaaniki aatma sthairyam chekuraalani parameswarunni praarthisthoo…
    voleti srinivasa bhanu

  3. శివరామప్రసాద్ కప్పగంతు

    అద్భుతం వర గారూ. రమణ గారి గురించి మీరు వ్రాసిన వ్యాసం చదువుతుంటే, రమణ గారు కనిపించారు.

    కోటి కొమ్మచ్చి అసంపూర్ణంగా ఉన్నాడని చాలా బాధపడుతున్నాను. మీరు పూనుకుని రమణ గారి జ్ఞాపకాలు మొత్తం పుస్తక రూపంలో తెస్తారని నేనే కాదు, రమణగారి అభిమానులందరూ ఎంతో ఎదురుచూస్తున్నారు, ఆవు వేల వేల కళ్ళతో. మీరు వ్రాసి చూడండి, రమణ గారి “ఈల” వినపడి తీరుతుంది.

  4. జయలక్ష్మి అయ్యగారి

    కళ్ళల్లో నీళ్ళు….కాయితం మీద రాయడానికి కాయితం కనపడడం లేదు….భాష కందని భావం. వర గారు కృతజ్ఞతలు,మరచి పోలేని మీ నాన్నగారిని మరో సారి కంటి ముందు కనిపింప చేసేరు.

  5. డా. మూర్తి రేమిళ్ళ

    బంధు మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

    బాపు- రమణ గారి audio-visual పాఠాల cassettes యెక్కడ దొరుకుతాయో చెప్పగలరా ప్లీజ్?

  6. డా. మూర్తి రేమిళ్ళ

    హాస్యరసంలొ అందరినీ అలరించిన ముళ్ళపూడి వెంకట రమణ గారిని ఆచరణలొ అమలు చేసి చూపించిన ఒక మానవతా వాదిగా మరో కోణంలొ చూపించిన “వర” గారికి ధన్యవాదాలు.

    బాపు- రమణ లంటే మాట-అర్థం లాగ విడదియ్యలేని జంట అనీ, వారి స్నేహం గురించీ, వారు తెర మీద + కాగితం మీద చూపించిన విన్యాసాల గురించీ చాల మంది చెప్పేరు గానీ నిత్య జీవితంలో వాళ్ళు చూపించిన సున్నితత్వం, సాటి మనుషుల మీద చూపించిన ఆప్యాయతా ఇవన్నీ పరిచయం చేస్తూ రాసిన వాళ్ళు నాకు తెలిసినంత వరకూ లేరు.

    ఇది వాళ్ళతో అతి దగ్గరగా మసలిన వాళ్ళకీ, ఇంకా సునిశితంగా పరిశీలించిన వాళ్ళాకే ఇది సాధ్యం …ఇది వర గారు సాధించేరు.

    ఇందులొ మూడు-నాలుగు “ఒక్కసారి” లు రాసిన వర గారు మరిన్ని ” ఒక్కసారి” లు అక్ష రూపం చేసి అందిస్తారని, దీనికి ఆ రమణ గారి ఆశీర్వచనం వుంటుందనీ ఆశిస్తూ ……

  7. venkat

    చాలా ఆత్మీయం గా రాసారు వర గారు. మనసు ని టచ్ చేసిందీ వ్యాసం

  8. murali batchali

    giving shelter to the 30 poor people for two days is great. This event we have missed in kothi kommachhi thanks vara garu

  9. రాజా పిడూరి

    Hello Sirs,

    ….
    నేను చూళ్ళే కానీ- విన్నా. 1986-1989 మధ్య స్కూల్ పాఠాలు audio-visual చేస్తున్నప్పుడు….
    వీటి గురించి ఎన్నో సార్లు వినడమే గాని ఎప్పుడూ చూడలేదు.

    ఈ కాసెట్లు ఎక్కడ దొరుకుతాయో ఎవరైనా చెప్పగలరా ? దయచేసి raja@rishivalley.org కి కానీ rajapiduri@gmail.com కి కానీ తెల్పండి.

    ధన్యవాదాలు.

    రాజా పిడూరి .

  10. Purnima

    @rama:

    “What really knocks me out is a book that, when you’re all done reading it, you wish the author that wrote it was a terrific friend of yours and you could call him up on the phone whenever you felt like it. That doesn’t happen much, though.”
    — J.D. Salinger (The Catcher in the Rye)

    బుడుగు చదివినప్పుడు నాకిలానే అనిపించింది. కానీ, అప్పుడు ధైర్యం చాల్లేదు.కోతి కొమ్మచ్చి బాలూగారు వినిపిస్తున్నారని తెల్సినప్పుడు మాత్రం పట్టలేని ఉద్వేగంతో ఆ సైటులో గంతులేసినంత పనిజేసాను. నా అదృష్టం బాగుండి, అనురాధ (రమణగారి అమ్మాయి) ఆ కమ్మెంటుకి బదులిచ్చారు. కొన్నాళ్ళకు ఫోన్ చేసారు. మాటల్లో రమణగారిని కలవమన్నారు. “నా వల్ల కాదు బాబోయ్.. నాకంత ధైర్యం లేదూ” అన్నాను. ఆవిడ ఇంటి నెం. ఇచ్చి, ఒక్కసారి మాట్లాడి చూడమన్నారు. ఆ నెం. మోగుతుంటే గుండెల్లో శతాబ్ది రైళ్ళు పరిగెట్టాయి. కానీ, మాట్లాడ్డం మొదలెట్టిన కొన్ని క్షణాలకే కబుర్లు మొదలెట్టాం. కొన్నాళ్ళకు వాళ్ళ ఇంటికెళ్ళాం. బోలెడు కబుర్లు చెప్పుకున్నాం, బాపూ-రమణలతో, శ్రీదేవి గారితో, వాళ్ళ మిగితా కుటుంబ సభ్యులతో. మరుపురాని, మరువలేని రోజున్నర, అవి మా జీవితాల్లో..

    బాపూ-రమణల స్నేహం గురించి చాలా మంది, చాలా విధాలుగా చెప్పారుగాని, నా స్వానుభవం బట్టి నాకు తెల్సిన విషయమేమిటంటే.. వాళ్ళ స్నేహాన్ని వాళ్ళ దగ్గరే అంటిపెట్టుకోరు. ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా జీవితకాలం ఉండడమే గొప్ప అనుకుంటే, వాళ్ళ కుటుంబాలను చూస్తే “అర్రె.. వీళ్ళంతా స్నేహితులే! బాపూ-రమణలంత గాఢ స్నేహితులే!” అనిపిస్తుంది. ఆ తర్వాత, వాళ్ళని కల్సిన ఏ ఒక్కరిని పలకరించినా, మీలాంటి, నాలాంటి, మనలాంటి అనుభవాలకు దగ్గరగా ఉన్నవే చెప్పుకొస్తారు. బాపూ-రమణలు తమ స్నేహాన్ని అందరికీ పంచిపెట్టారు. రాముడే వేళ్ళతో నిమిరిన ఉడతెంత ధన్యజీవో.. ఆయన ఆప్యాయతానురాగాలను చవిచూసిన మనకే తెలుస్తుంది.

    ఇప్పుడు సలింజర్ మాటలనే నేను చెప్పాలంటే, “ఓ రచన మిమల్ని అంతగా కుదిపేస్తే, ఆ రచయిత ఫోన్ నెం. మీ దగ్గరుంటే వెంటనే ఫోన్ చేయండి. ఏమో, అతడిలో మీకో స్నేహం దొరకచ్చు. అలా జరిగే అవకాశాలున్నాయి. నా విషయంలో జరిగింది.” అని చెప్తాను.

    సచిన్‍కు వికెట్ వస్తే గుప్పెటిని మూసి, గిరగిరా తిప్పుతాడు. రోజర్ తనకే నచ్చిన షాట్ కొట్టగానే “కమాన్” అని అరుస్తాడు. ఏదో ఒక సందర్భంలో వాళ్ళని అనుకరించాలని ఎదురుచూస్తూ ఉంటాను. అలాగే, సినిమాలు వదులుకొని, ఆనక వాళ్ళే వెంటపడి రమణగారి ఎక్కువ పారితోషకం ఇచ్చి మరీ రాయించుకున్నప్పుడు, రమణగారన్న “ఫిఫ్టీన్ బ్లడీ థౌసండ్స్” అన్న మాట నాలో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది.

    కమ్మెంట్ రాసినందుకు థాంక్స్!

  11. rama

    swathi lo kothi kommachhi vachhe rojulalo o sari ramana gari phone number tesukuni phone chesanu. mana meda manaki nammaka munnappudu ,ekkada evariki tala vanchakkara leddu ani nenu nammmindi nijamani me life chebuthondi…happy ga vundi sir…chaduvu tunte annanu..a tarvata o 15 nimishalu ma eddari madya kaburlu..edo friend tho matladinattu anipinchidi kani ramana gari lanti o goppavyakti tho matladutunna nu anna bayam ,kalaga ledu..

    appati nunchi appudappudu nenu phone cheyatam ..peru cheppagane ayana apyayamga palakarinchatam…okkasari ramana garini kalavali ani nenu na friend bavana anukunnam. ayanaki cheppagane santhosham ga randi ..ma entlone digandi.nenu ma musalame tappa evaru leru annaru. kani appudu vellaleka poyam. o sari nenu pani meda madras velli nappudu phone cheste appudu ayanaki health baga ledu. dantho kalava leka poyanu.

    o roju udayanne bavana nunchi phone..rama manam ramana garini e life ki miss aypoyam..he is no more antu..em vintunnano ardam kaledu. a nijam eppatiki na mind accept cheyaledu. ayana rachanalu na eduruga pranam posuku vundaga ramana garu lekunda ela vuntaru?

    vayasulo peddavaru anipinchaledu…pedda rachayata anipinchaledu, enkoti enkoti…ramana gari goppatanalevi kanipinchaledu…kevalam he is my friend.good friend. eppudu phone chesina apyayamga cheppandi …elavunnaru antu modalu petti ….ekkadekkadi ko velli vachhi ..namaskarala tho end ayyedi.

    anukokunda e roju e site chusanu..ramana gari gurinchi chadivanu. okkasari anipistondi..ayanani swayamga kalise chuse adrustam lekapoyinde ani..nijamgane ramana garini e life ki miss ayipoyam.

    rama

  12. శ్రీరాం వేలమూరి

    మంచి వ్యాసం. మొన్న ఆగస్ట్ ౩ న బాపు గారిని మిత్రులతో
    కలిసాం,నిజంగానే గోడ లేని చిత్తరువు లా ఉన్నారాయన, వర గారు
    మంచి రచన ఇచ్చారు,ధన్యవాదాలు

  13. సౌమ్య

    “నాన్నకీ మామకీ గొప్ప background లేదు. ఒకళ్ళకి ఒకళ్ళు background అయ్యారు.”
    -ఈ వ్యాసం మొదటిసారి చదివినప్పటి నుంచి ఇప్పటిదాకా, బాపు-రమణ గార్లను తల్చుకోగానే గుర్తొచ్చే వాక్యం ఇదే నాకు. classic! అద్భుతంగా చెప్పారు…

    1. Sowmya

      మూడేళ్ళవుతున్నా నేనింకా ఈ వాక్యాన్ని తల్చుకుంటూనే ఉన్నానండి 🙂

  14. Ram Prasad MVS

    vara gaaru

    Thanks for the article. Its great !!
    This is totally different perspective about Ramana garu, which others cannot write.

    Ram Prasad

    1. jagannadha rao. kolluru

      chala bagundi. Mullapudi varini eduruga chustannattu undi chaduvutunnathasepu. vara gariki dhanyavadalu.

Leave a Reply to rama Cancel