ఇంటర్నెట్‌లో తెలుగు నిఘంటువులు : TANA వారి ప్రకటన

మన తెలుగు భాష రక్షణకు, పోషణకు, అంతర్జాతీయవ్యాప్తికి అత్యవసరమైన కార్యక్రమం

 

TELUGU Dictionaries On-Line  

ఇంటర్నెట్‌లో తెలుగు నిఘంటువులు

మీకు ఎప్పుడైనా ఒక తెలుగు మాటకు అర్థం వెంటనే తెలుసుకోవాలనిపించిందా?
లేక ఒక ఇంగ్లీషు మాటకి తెలుగు అర్థం?
కాకపోతే ఒక తెలుగు మాటకు సరిపడే ఇంగ్లీషు పదం?
సంస్కృత పదానికో, ఉర్దూ మాటకో, హిందీ పాటకో తెలుగు అర్థం?
మనకు అంతగా పరిచయం లేని మాండలికపదానికో వృత్తిపరమైన పదానికో అర్థం కావలసివస్తే?
పురాణాల్లో ఉన్న పేర్ల గురించి వివరాలు తెలుసుకోవాలనిపిస్తే?
సంగీత, నృత్య, చిత్ర, శిల్పకళలలో ఎదురుపడే పదాలకు అర్థాలు కావాలంటే?
తెలుగు మాటకి పర్యాయ పదాలు  (thesaurus) అవసరం వస్తే?

ఈ అవసరాలన్నీ తీర్చేందుకు వీలుగా, ఇంటర్నెట్‌లో అనేక రకాల తెలుగు నిఘంటువులను ఒక్కచోటే తరతరాలకూ అందుబాటులో ఉంచటానికి,  ఇటీవలే ముగిసిన 18వ తానా మహాసభల సందర్భంగా, మన తానా తన సహకారం అందించ నిశ్చయించింది. ఇప్పటికే ఇంటర్నెట్‌లో  ఎనిమిది నిఘంటువులు (తెలుగు –తెలుగు, తెలుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెలుగు, ఉర్దూ-తెలుగు, సంస్కృతం – తెలుగు) ఆంధ్రభారతి.కాంలో అందుబాటులోకి వచ్చాయి. మనకు కావలసిన మాటల అర్థాలు, పర్యాయ పదాలు చాలా సులువుగా ఇక్కడ వెతుక్కోవచ్చు.

 

ఇప్పటికి అందుబాటులో ఉన్న నిఘంటువులు (dictionaries already available on-line in a searchable format):
శబ్దరత్నాకరము (బహుజనపల్లి);
బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీషు  (2nd Ed.);
బ్రౌన్ ఇంగ్లీషు-తెలుగు;
శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీషు;
శంకరనారాయణ ఇంగ్లీషు-తెలుగు;
శ్రీహరి నిఘంటువు;
ఆధునిక వ్యవహారకోశం;
ఉర్దూ-తెలుగు నిఘంటువులు
ఇక ముందు అందుబాటులోకి రానున్న నిఘంటువులు (dictionaries that are being added):
సూర్యరాయాంధ్ర నిఘంటువు (6 volumes);
తెలుగు పర్యాయపద నిఘంటువు;
సంస్కృత-తెలుగు నిఘంటువు(వావిళ్ల);
శబ్దార్థచంద్రిక;
సంగీతశబ్దార్థచంద్రిక;
పురాణనామచంద్రిక;
తెలుగు నిఘంటువు – విద్యార్థులకు (సాహిత్య అకాడెమి);
ఆంధ్రవాచస్పత్యము;
ఆంధ్రశబ్దరత్నాకరము (3 volumes);
తెలుగు వ్యుత్పత్తి కోశం (8 volumes);
వావిళ్ల నిఘంటువు (4 volumes);
శబ్దార్థ దీపిక;
మాండలిక పదకోశము (సాహిత్య అకాడెమి);
మాండలిక పదకోశము (తెలుగు అకాడెమి);
మాండలిక వృత్తిపదకోశములు (9 volumes);
బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీషు  (1st Ed.);
పదబంధ పారిజాతము (2 volumes);
క్రియాస్వరూప మణిదీపిక

ఇప్పటికి దాదాపు 15 వేల పేజీలను కంప్యూటరీకరించటం జరిగింది. ఇంకా 25,000 పేజీలను కంప్యూటర్‌కు ఎక్కించవలసి ఉంది. ఆ తరువాత తెలుగులో ఉన్న మిగతా నిఘంటువులను కూడా చేర్చాలని ప్రయత్నం. తెలుగును తరతరాలకూ అందుబాటులో ఉంచటానికి తానా సంకల్పించిన ఈ బృహత్కార్యానికి మీ అందరి చేయూత అవసరం. మీ విరాళాలను ఈ క్రింది చిరునామాకు పంపండి. తానాకు ఇచ్చిన విరాళాలకు అమెరికాలో పన్ను రాయితీ సౌకర్యం ఉంది.

Please donate Today. Checks can be written in the name of TANA and mailed to V. Chowdary Jampala, Chairperson, TANA Publications Committee, 20374 Buckthorn Ct, Mundelein, IL 60060.  You can also donate with a credit card at https://www.tana.org/donate/.  Please contact cjampala@gmail.com of you need more information. Donations to TANA are tax-deductible in US.

Support the efforts to PRESERVE and PROPAGATE Telugu language!

You Might Also Like

One Comment

  1. డా. మూర్తి రేమిళ్ళ

    request to the pustakam.net owners/authors:

    ఇంటర్నెట్‌లో తెలుగు నిఘంటువులు : TANA వారి ప్రకటన lo ichina WEBLINK is wrong. kindly change it to: http://www.andhrabharati.com

Leave a Reply