పరిశోధన – పుస్తక ప్రచురణకోసం అభ్యర్థన

వివరాలు పంపిన వారు: విజయవర్ధన్ బి.
********************

మీలో చాలా మందికి “అక్షర” పుస్తకం తెలిసే వూంటుంది. ఎందరో సాహిత్యాభిమానుల మన్ననలను పొందిన పుస్తకం అది. దాంట్లో ఎన్నో అరుదైన బొమ్మలు (మొక్కపాటి వారి బొమ్మలను కూడా చూడవచ్చు), వ్యాసాలు ప్రచురించారు. ఆ వ్యాసాల వివరాలు జతపరచిన ఈ పీడీఎఫ్ ఫైలులో చూడవచ్చు. అదే ఒరవడిలో “Years of Vision” పుస్తకాన్ని ప్రచురించారు. దాంట్లో ప్రచురింపబడ్డ వ్యాసాలు ఇక్కడ చూడవచ్చు. ఐతే ఈ పుస్తకాలన్నీ సాహిత్యాభిమానులకు ఉచితంగా ఇవ్వబడ్డాయి. దుకాణాల్లో అమ్మలేదు.

అంతటి విలువైన మరియు అరుదైన వ్యాసాలతో మరో పుస్తకాన్ని ప్రచురొంపబోతున్నారు “Society for social change” వారు. ఈ క్రొత్త పుస్తకం శీర్షిక “పరిశోధన”. దీంట్లో ప్రచురింపబడుతున్న వ్యాసాల పట్టిక Parishodhana-contents చూడవచ్చు. 800పైగా పేజీలు. Hardbound. 1000 కాపీలు. Packing + postage కూడా ఉచితమే. దుకాణాల్లో అమ్మబడదు. ఒక్క పుస్తకానికి (printing + packing + postage) 600 నుంచి 700 దాకా ఖర్చు అవుతుందని అంచనా. ఐతే ప్రచురణ కావలసిన వనరులు ఇంకా సమకూరలేదు. ఇంతటి విలువైన పుస్తక ప్రచురణలో పాలు పంచుకునే అవకాశం వచ్చింది. ఈ పుస్తకంలో ప్రకటనలు వేయవచ్చు/వేయించవచ్చు (ప్రకటనల వివరాలు ఇక్కడ చూడవచ్చు). లేదా మనలాంటి సామాన్య పాఠకులు వెయ్యి రూపాయలకు తగ్గకుండా విరాళం పంపవచ్చు. వెయ్యి రూపాయలకు తగ్గకుండా పంపిన వారికి పుస్తకం పంపబడుతుంది. ఈ డబ్బు అంతా Society for Social Change వారు చేసే పుస్తక ప్రచురణలకు వెళ్తుంది. ఈ పుస్తకానికి అవసరమయ్యే దానికన్నా ఎక్కువ నిధులు సమకూరితే, తర్వాతి పుస్తక పుస్తక ప్రచురణకు పుయోగించబడుతాయి.

ఈ పుస్తకం తర్వాత మరో రెండు పుస్తకాలు (శంకరన్ గారి commemoration volume మరియు ముళ్లపూడి వెంకటరమణ commemoration volume) తీసుకురావాలని అనుకుంటున్నట్టు శ్రీ రమణయ్య గారు అన్నారు.

ఈ పుస్తకం భారతదేశంలో వున్నవారికే పంపబడుతుంది. మీరు విదేశంలో వున్నట్టైతే, భారత్ లో మీ బంధువుల/స్నేహితుల చిరునామా ఇవ్వవచ్చు. మీ నిధులు పంపవలసిన విధానం:

1. Online Payment: Online bank transfer చేయవచ్చు. ఈ క్రింది ఖాతాకు చేయవలసి వుంటుంది:
Society for Social Change
State Bank of India
Town Branch, Kavali
SB Acc: 31021996936

Online transfer చేసిన వారు, జత చేయబడ్డ xls file లో వివరాలు నింపి bvijay@gmail.com కు పంపగలరు (మీకు పుస్తకం అందాలంటే ఇది తప్పనిసరి)

2. Money order/ DD : Money order చేసేవాళ్ళు MO formలో message వ్రాసే చోట మీ చిరునామా (పుస్తకం ఈ చిరునామాకు పంపబడుతుంది), ఫోన్ నెంబరు తప్పక వ్రాయండి. (Outstation cheques దయచేసి పంపవద్దు). MO/DD పంపవలసిన చిరునమా:
Society for Social Change
South End Park, Vengala Rao Nagar,
Kavali – 524 202
Ph: 08626 – 250333

ఈ పుస్తకం వీలైనంత త్వరలో తీసుకురావాలని రమణయ్య గారు తపిస్తున్నారు. మనము మన నిధులను ఆగస్టు నెలాఖరులోగా పంపుదాము.

ఈ పుస్తకం గురించి “సొసైటీ ఫర్ సోషల్ చేంజ్” వారి మాటల్లో ఇక్కడ వినండి.

You Might Also Like

13 Comments

  1. Satyabhama

    Nachaki garu,

    There is a website called xoom.com that provides wire transfer service to India from US. The fees for the direct bank deposit are none, or at the most 5 dollars in some cases. Please explore that option.

    Regards
    Satyabhama

  2. విజయవర్ధన్

    ఇప్పటి దాకా వచ్చిన స్పందనలు – 1 (నా ఐదుగురి మిత్రులతో కలిపి ‍6). నేను అత్యాశతో రమణయ్య గారికి ఎంత లేదన్నా లక్ష రూపయల వరకు రావచ్చని చెప్పాను. మా ఆశ అడియాసే అయ్యేలాగుంది.

    నిధులు ఇచ్చే స్థోమత లేకుంటే, ఈ పుస్తకం లో ప్రకటనలు వేయించవచ్చు. (పుస్తకం వారికి: ఆ ప్రకటనల రేటు లింకు సరిచేయగలరు).

    ఈ పుస్తక ప్రచురణ కోసం రమణయ్య గారితో పాటు కొంతమంది ఎంతో అంకితభావంతో పని చేస్తున్నారు. బహుశా ఇదే చివరి పుస్తకం కావచ్చు అన్నారు రమణయ్య గారు. ఇంకా ఎన్నో మంచి వ్యాసాలు దొరికాయని ఈ పుస్తకం పేజీలు పెంచారు. 1400 పేజీలు అవుతాయి (అవును వెయ్యి పైగానే). ఐనా 1000 లేదా అంతకన్నా ఎక్కువ నిధులు పంపేవారికి పుస్తకం reserve చేయబడి, ముద్రణ పూర్తవగానే పంపబడుతుంది.

    Bank Name STATE BANK OF INDIA
    Branch KAVALI TOWN BRANCH
    IFSC Code SBIN0012950

    కినిగే వారు ebook కావాలనుకుంటే, ఈ పుస్తక ప్రచురణలో సాయపడి, ebook rights తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. సదుద్దేశంతో, ఎన్నో అరుదైన వ్యాసాలను వెలికితెస్తున్న వారికి మనవంతు తోడ్పాటు అందిద్దాం. వారి కృషికి ఇంకా ఏ విధంగా తోడ్పడవచ్చో మీ అభిప్రాయాలు, సలహాలు తెలుపగలరు (bvijay@gmail.com)

  3. విజయవర్ధన్

    నచకి గారు, మీ email id నాకు (bvijay@gmail.com) పంపగలరా.

  4. నచకి

    నాకు తెలిసినవాళ్ళు, నేను కబురందించగలవాళ్ళు తక్కువగానే ఉంటారు కదా… మఱేదైనా మార్గముంటే చెప్పండి. (నేను అడిగినంత పరిధిలో ప్రతిస్పందన కఱువయింది. మార్గమంటూ ఉంటే నేనయినా పంపగలను.)

  5. విజయవర్ధన్

    నచకి గారు, మీరు నిధులు పంపడానికి ఇంకా ఏమి మార్గాలు వున్నాయో తెలియదు. మీ దేశంలో మీలాంటి వారి నుంచి నిధులను మీరే సేకరించి ఒక పెద్ద మొత్తం పంపితే బాగుంటుందేమో.

  6. నచకి

    విజయవర్ధన్ గారూ, నా ప్రశ్న పుస్తకం తెప్పించుకోవటం కోసం కాదు… ప్రచురణానిధికి నా వంతు చేయుతనందించటం కోసమే. భారతదేశంలోని ఖాతాలలోకి విదేశాలలో ఉన్నవారు నేరుగా డబ్బు జమ చేయాలంటే కట్టవలసిన రుసుము దాదాపు పంపే సొమ్ము అంత ఉంటుంది.

  7. విజయవర్ధన్

    @సౌమ్య

    కినిగే వారు రమణయ్య గారితో మాట్లడి ebook తిసుకొచ్చే ప్రయత్నం చేయవచ్చు.

  8. విజయవర్ధన్

    @నచకి
    మీరు Online transfer చేయలేరా? విదేశాలకు ఈ పుస్తకం post చేయాలంటే బాగా ఖర్చుఅవుతుంది (800 పేజీల బరువు). భారత్ లో మీ మిత్రుల/బంధువుల చిరునామా ఇస్తే అనువుగా వుంటుంది. ఇంకా వివరాలు కావలిస్తే రమణయ్య గారితో మాట్లాడండి: Ph: 08626 – 250333.

  9. నచకి

    విదేశాలలో ఉన్నవాళ్ళు నేరుగా నిధులు పంపగలిగే మార్గమేదైనా ఉందా?

  10. సౌమ్య

    నాకొక సందేహం: ఈ వ్యాసాలన్నీ ఈబుక్ గా రిలీజ్ చేస్తే ప్రచురణ ఖర్చులు మిగుల్తాయి కదా. ఇంత పెద్ద పుస్తకం, అంత ఖర్చు పెట్టు ముద్రించే బదులు, పుస్తకాన్ని ఈబుక్ గా అమ్మి (కినిగె.కాం వంటిస్ సైట్లలో, ఉదాహరణకి) అదే ఖర్చుకి ఇలాంటివి మరిన్ని పుస్తకాలు తేవొచ్చు కదా?

    అందరూ కంప్యూటర్లు వాడరు అనొచ్చు అనుకోండి… అది వేరే విషయం. నాకు అనిపించింది చెప్పానంతే.

  11. పారదర్శి

    Society for Social Change వారి పుస్తకాలు గురించి మంచి సమీక్షలు చదివాను కాని చూడలేదు. క్రొత్త పుస్తకం “పరిశోధన” లో ప్రచురించబోయే వ్యాసాల ఎంపిక బాగుంది. పుస్తకం చక్కటి ముద్రణ, బైండింగ్ తో రాగలదని ఆశిస్తాను.

  12. విజయవర్ధన్

    “దీంట్లో ప్రచురింపబడుతున్న వ్యాసాల పట్టిక ఇక్కడ చూడవచ్చు.”
    ఆ వ్యాసాల పట్టిక link ఇవ్వగలరు. ధన్యవాదాలు.

    1. సౌమ్య

      Added now.

Leave a Reply