మహాశ్వేత – సుధామూర్తి

రాసి పంపిన వారు : మేధ

23121సుధామూర్తి — టెక్నాలజీ రంగంలోని వారికీ, సేవారంగంలోని వారికీ, సుపరిచితమైన పేరు.. Infosys Foundation తరపున చేసే సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ఈ నవల మొదట ఆంగ్లంలో రచించారు — తరువాత అనేక భాషల్లోకి (తెలుగు, కన్నడ, తమిళం) లోకి అనువదించారు.

కథ విషయానికి వస్తే:
ఎప్పటినుండో ఎదురుచూస్తున్న దీపావళి – లక్ష్మీపూజ రానే వచ్చింది.. ఈ పూజా కార్యక్రమం అంత అయిపోతే, లండన్ వెళ్ళిపోవచ్చు ఆనంద్ దగ్గరికి.. దాంతో ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించాలని అనుపమ తెల్లవారుఝామునే లేచి పనుల హడావిడితో ఉంది.. వంట చేసే క్రమంలో అనుకోకుండా కాళ్ళ మీద నూనె పడుతుంది.. అయినా దాన్ని లెక్క చేయకుండా వచ్చిన అతిధులందరినీ సాదరంగా ఆహ్వానించి ఆ కార్యక్రమన్ని చక్కగా పూర్తి చేస్తుంది అనుపమ.. వాళ్ళ అత్తగారు కూడా లక్ష్మీ పూజ నిర్విజ్ఞంగా జరిగినందుకు చాలా ఆనందపడతారు..

ఇక లండన్ కి వెళ్ళే రోజు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.. నూనె పడిన చోట ఏవో క్రీములు అవీ రాస్తూ ఉంటుంది.. మొదట్లో కాస్త తగ్గినట్లే అనిపించినా, రెండు రోజులకి ఆ ప్రదేశంలో “wహిటె పట్చ్” లాగా కనిపిస్తుంది.. దాంతో కంగారు పడిన అనుపమ, డాక్టర్ దగ్గరికి వెళుతుంది. ఆమె భయపడినట్లే ఆ వ్యాధి లూకో డెర్మా అని కన్ఫర్మ్ చేస్తారు డాక్టర్.. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మందులు క్రమం తప్పకుండా వాడితే, ఇది మరింత పెరగకుండా ఆపచ్చు అనడంతో కాస్త స్థిమితపడుతుంది. రెండు వారాలపాటు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తుంది. ఈ విషయం ఇంట్లో తెలిసితే పరిస్థితులు ఎలా ఉంటాయో అని భయం ఒక వైపు, ఆనంద్ ఎప్పుడు రమ్మంటారా లండన్ కి అనే ఎదురుచూపులు ఒక వైపు.. ఇలా రెంటి మధ్య కొట్టుమిట్టాడుతుండగా, ఆ వారం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది.. అయితే ఈ సారి అదృష్టం ఆమె పక్షాన లేదు.. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది తెలిసిపోతుంది వాళ్ళ అత్తగారికి…

విషయం తెలిసిన ఆవిడ, అనుపమని ని బాగా తిట్టి, నీకు ఈ వ్యాధి పెళ్ళికి ముందే ఉన్నా మమ్మల్ని మోసం చేసి ఆస్తి కోసం పెళ్ళి చేసుకున్నావు అని వాళ్ళ పుట్టింటికి పంపేస్తుంది.. పుట్టింట్లో సవతి తల్లి.. ఆ బాధలు భరించలేక, చనిపోవడానికి కూడా ప్రయత్నిస్తుంది.. అయితే చివరి నిమిషంలో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటుంది.. ఆ తరువాత అనుపమ జీవితానికి ఎలా ఎదురొడ్డి నిలిచిందో, ఆమె జీవన నౌక ఏ తీరాలకి చేరిందో తెలుసుకోవాలంటే పుస్తకం చదవాల్సిందే.. 🙂

ఈ నవల లో ఉండే కధాంశం, దాదాపు మన చుట్టూ జరుగుతున్న విషయమే.. కారణమేదైతేనేమి, భార్యలని పుట్టింటికి తరిమేసే భర్తలు ఎందరో! అలాగని ఆడవాళ్ళ బాధలని వ్రాసే క్రమంలో మగవారిని ఎక్కడా క్రూరంగానో, అతిగానో చిత్రించలేదు. పుస్తకం అంకితంలో చెప్పినట్లు, బాధల్లో ఉన్నవారికి ముఖ్యంగా లూకో డెర్మా ఉండి, సమాజం చేసే వెక్కిరింపులు తట్టుకోలేక లోలోపల కుమిలిపోయేవారికి ఈ కథ ఆశని, నమ్మకాన్ని కలగజేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.

ఇతర మాధ్యమాల కంటే పుస్తక ప్రభావం చాలా ఎక్కువ. ఏదన్న పుస్తకం చదివినప్పుడు, కథ పూర్తైన తరువాత కూడా, అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.. అయితే పుస్తకం వ్రాసినవారికి, అది ఎంతమంది జీవితాలని ప్రభావితం చేస్తుందో తెలిసే అవకాశం చాలా తక్కువ. కానీ సుధామూర్తి గారికి ఆ అదృష్టం కూడా దక్కింది! ఈ నవల చదివి మారిన ఒక మనిషిని, దాని వల్ల నిలబడ్డ ఒక నిండు జీవితాన్ని మనసారా ఆశీర్వదించే అవకాశం కలిగింది.

So, అసలు అనుపమ-ఆనంద్ ఎవరు? వాళ్ళ జీవితాల్లో సంభవించిన ఘటనలు, పుస్తకం చదివి మారిన వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు, తొందరగా పుస్తకం చదవడం మొదలెట్టండి.. 🙂

పుస్తకం: మహాశ్వేత (Mahaswetha)
రచన: సుధామూర్తి (Sudhamurthy)
పేజీలు: 154 (ఆంగ్లమూలం)
ప్రచురణ: పెంగ్విన్ బుక్స్

You Might Also Like

9 Comments

  1. పుస్తకం » Blog Archive » నాలుగు నెలల పుస్తకంలో..

    […] మంచి పరిణామం. మేధగారు పరిచయం చేసిన “మహాశ్వేత“  వ్యాసానికి ఫణిగారి వ్యాఖ్య, “truth […]

  2. laxminarayana

    your great sir and your wife your wife is having confident so she had marry so lucky sir enjoy your life and you should be good with her because she make desire on you

  3. mohan

    leukoderma or vitiligo is neither inherited nor transmitted by infection, but still causes a lot of unnecessary trouble to the indivduals affected by the people ignorant about facts. In India it is a big issue during matchmaking , even if any elders in the family is affected.
    There are other diseases where lack of awareness plays a role and ruins lives. I had a lady senior to me in medical college whose life both professional and personal got affected and ended in a tragic suicide

  4. Purnima

    One of those occasions where you wonder “Truth is stranger than fiction!”

    Thanks Medha for a very comprehensive introduction to the book. And Thanks a ton Phanibabu, for choosing to respond here. We are touched! Best Wishes to you and the family!

    Regards,
    Purnima

  5. Swathy

    First of all.. Thanks to Pustakam for introducing very interesting books :).
    @Phanibabu: Really your wife is great sir.
    @Medha: ofcourse meeku kooda 😛 for introducing this book.

  6. Sowmya

    @Phanibabu: Hats off to your wife sir.
    @Medha: Thanks for introducing a very interesting book. I have been an admirer of Sudhamurthy but, never read this particular book. Now,I will.

  7. మేధ

    @ఫణిబాబు గారు: మీరు చాలా అదృష్టవంతులు.. అన్నీ చక్కగా అమర్చిపెడుతున్నా కూడా, ఇంకా ఏదో కావాలని సాధించేవారున్న ఈ కాలంలో– అవతలి వారి మనసుని అర్ధం చేసుకుని, వాళ్ళ జీవితంతో పాటు, తమ జీవితాన్ని కూడా ఆనందమయం చేసుకోవడం చాలా గొప్ప విషయం…Your wife is so great..

    @వంశీ గారు: వివరణ ఇచ్చే ముందు ఒక చిన్న కధ…
    మాలతి, రవికి పెళ్ళి నిశ్చయమైంది.. అయితే, నిశ్చితార్ధం జరిగిన తరువాత, మాలతి కి లూకోడెర్మా ఉందని తెలిసి, రవి పెళ్ళి చేసుకోవడానికి నిరాకరిస్తాడు.. కానీ, దానికి రవి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు.. అటు ఇంట్లో వాళ్ళని ఒప్పించలేకపోవడంతో, అతను కొంచెం డిప్రెషన్ కి లోనై, ఎక్కువ భాగం లైబ్రరీ లోనే గడుపుతూ ఉండేవాడు.. అలాంటి సమయంలో ఈ నవల (మహాశ్వేత) చదవడం జరిగింది.. ఇది చదివిన తరువాత, అతను మారి మాలతి ని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు.. రవి మారడానికి కారణం తెలుసుకున్న మాలతి – సుధామూర్తి గారిని కూడా పెళ్ళికి ఆహ్వానిస్తుంది..

    అలా, ఆవిడ వ్రాసిన పుస్తకం వల్ల మారిన వాళ్ళని చూసే అవకాశం కలిగింది సుధామూర్తి గారికి..

  8. Vamsi

    >>> కానీ సుధామూర్తి గారికి ఆ అదృష్టం కూడా దక్కింది! ఈ నవల చదివి మారిన ఒక మనిషిని, దాని వల్ల నిలబడ్డ ఒక నిండు జీవితాన్ని మనసారా ఆశీర్వదించే అవకాశం కలిగింది.

    wat do u mean?

  9. భమిడిపాటి ఫణిబాబు

    ఈ కథ నేను కూడా చదివాను. నేను ఒక సంగతి చెప్పమంటారా ?ఇలాంటి నవలలు/కథలు చదవకుండానే ఎన్నో సంవత్సరాల క్రింద ఒక అమ్మాయి, తను వివాహం చేసికొనే అబ్బాయి కి లూకోడర్మా ఉందని తెలిసి కూడా( అతని తల్లితండ్రులు, ఆ విషయం దాచాలని ప్రయత్నించారు), ఎటువంటి సంకోచం లేకుండా అతనిని వివాహం చేసికొంది. మనసా వాచా తనని సమర్పించుకొంది.ఇద్దరు మాణిక్యాల లాంటి పిల్లల్ని ప్రసాదించింది. వాళ్ళని పెంచి పెద్దచేయడం లో అంతా ఆమె

    పూర్తిగా లీనమయ్యి ,వాళ్ళ వివాహాలు చేసిన గొప్ప మనసు కల స్త్రీ. ఇన్నాళ్ళ వివాహ జీవితం లో ఒక్కసారి కూడా భర్త తో ఈ విషయం గురించి ప్రస్తావించ లేదు.

    వాళ్ళ పిల్లలు గాని,మనవరాళ్ళు గాని,మనవడు గాని, అల్లుడు గానీ, కోడలు గానీ ఎప్పుడూ ఈ విషయమై పట్టించు కొన్నట్లుగాలేదు. పూర్తి ఆనందం ఇచ్చారు.

    ఈ విషయమై ఇంత గ్యారంటీ గా ఎలా చెప్పుతున్నానంటే– ఇందులో అబ్బాయి నేను. మా వివాహం అయి 37 సంవత్సరాలు అయ్యింది. నా భార్య ఋణం ఎలా తీర్చుకోగలనో తెలియదు. నాకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చి ” నేనున్నాను నీతో ” అని భరోసా ఇచ్చింది.

Leave a Reply