పుస్తకం
All about booksపుస్తకలోకం

July 3, 2011

” గుడివాడ వైభవం ” పుస్తక ఆవిష్కరణ విశేషాలు

More articles by »
Written by: అతిథి

రాసిన వారు: తాతా రమేష్ బాబు
(తాతా రమేశ్ బాబు గారి “గుడివాడ వైభవం” పుస్తక ఆవిష్కరణ సందర్భంగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు చేసిన ప్రసంగ సారాంశం)
*******************
“గత కాలపు అనుభవాలు,జ్ఞాపకాలు,సంఘటనల సమాహారమే చరిత్ర ” అని ఆంధ్ర ప్రదేశ్ హిందీ అకాడెమీ చైర్మన్ పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ అన్నారు. ఈ నెల ఇరవైన సోమవారం గుడివాడ క్లబ్ ఆవరణ లో , విద్యా,కళారంగ పోషకులు కాజ వెంకట్రామయ్య ద్వారం లోపల ,నవయుగ వైతాళికుడు కవిరాజు త్రిపురనేని రామస్వామి కళా వేదిక పై తాతా రమేశ్ బాబు రచించిన “గుడివాడ వైభవం” పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ పై విధంగా స్పందించారు. అనంతరం మాట్లాడుతూ,పుస్తక ఆవిష్కర్త తానైనందున తాను మాత్రమే ఆవిష్కరించానని ,వేదిక పైనున్న అందరికి పుస్తకాలు ఇచ్చి చూపిస్తే అది సాముహిక ఆవిష్కరణ అవుతుందని ,సినిమా వాళ్ళు కాసేట్ రిలీజ్ చేస్తూ అందరి చేతుల్లో ఉంచే చెడ్డ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారని అన్నారు. జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత డా. సి.నారాయణ రెడ్డి గారి అంక్ష ఏమిటంటే గ్రంధావిష్కరణ ఎవరూ చేస్తే వారు మాత్రమే ఆవిష్కరించాలని …..పురోహితుడు మంత్రాలు చదువుతుంటే పెళ్లి కుమారుడు మాత్రమే తాళి కట్టాలని,మిగిలిన పెద్దలు అక్షతలు వేయలే గానీ తాళి పట్టుకోకూడదని చమత్కరించారు.

కొన్ని థ్రిల్లింగ్ విషయాలు చెపుతానంటూ ..” యాభై సంవత్సరాల క్రితం ౧౯౬౧ లో అక్కినేని నాగేశ్వర రావు మొదటిసారిగా అమెరికా వెళ్లి వచ్చిన తరువాత గుడివాడ కాలేజికి వచ్చారు. అప్పుడు నాకు ఎనిమిది సంవత్సరాలు ,మా పిల్ల జట్టంతా ఆయన్ని చూడాలని వెళ్ళాం. ఆ జనంలో ఊపిరి ఆడక నలిగిపొయినా ఆయన్ని చూసిన సంతోషంతో ఇంటికి వెళ్ళాను. అలాంటి అక్కినేని నాగేశ్వర రావు గారితో ,కొన్ని సంవత్సరాల అనంతరం ఒకే చోట కలిసి భోజనం చేయటం,కబుర్లు చెప్పుకోవటం థ్రిల్లింగ్. అలాగే ౧౯౭౧ లో నందమూరి తారక రామారావు ,ఇక్కడి బాలరాజు థియేటర్ ను ప్రారంభించటానికి వచ్చారు. గుడివాడ మునిసిపల్ ఆఫీసు లో వారికి పౌర సన్మానం చేసారు. అప్పుడు పద్దెనిమిది సంవత్సరాల వయసు నాది . ఆఫీసు వెనుక నున్న పైపు పట్టుకుని వెలది పాకుతూ రామారావు,సావిత్రి లను చూసాను. అప్పుడు కాతరి సత్యన్నారాయణ మునిసిపల్ చైర్మన్. అలా ఆ సభలో పాల్గొని జీవితం ధన్యమై పోయిందని భావించిన మహత్తర సన్నివేశం అది. అదే ఎన్టిఆర్ తో నాలుగున్నర సంవత్సర పాటు ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం తొమ్మిది గంటల వరకు తిరగటం ,తాకటం,ఎంత ఉద్వేగాభరితంగా ఉంటుందో ఊహించండి. మీలో ఎవరన్నా సినీ నటులు నాగార్జున ,బాలకృష్ణ -అలా చేయి ఊపుతూ వెళ్ళిన తరువాత ఓ పది సంవత్సరాల తరవాత మీ ఇంటికి వారు,వారింటికి మీరు వెళ్ళేంత చనువు ఏర్పడితే ఎంత థ్రిల్లింగ్ గా వుంటుంది?

అనుభవాలే చరిత్ర . మేధామేటిక్స్ లో వృత్తం అంతం . మధ్యబిందువు గుడివాడ గా మనం అనుకుంటే ,అక్కడ నుండి చుస్తే గత శతాబ్దాల ఆంధ్ర దేశాన్ని ప్రభావితం చేసిన విశిష్ట వ్యక్తులంతా ఈ యభై కిలోమీటర్ల రెడియస్ పరిధిలో పుట్టరనేది ఒక చారిత్రక సత్యం. మీరు ఏ రంగం అయినా తీసుకొండి ,సినీ చరిత్రలో గూడవల్లి రామబ్రహ్మం,నందమూరి తారక రామారావు,అక్కినేని నాగేశ్వరరావు ,దుక్కిపాటి మధుసూధనరావు ,ఘంటసాల వెంకటేశ్వరరావు -పత్రిక రంగంలో కాసినాథుని నాగేశ్వరరావు ,ముట్నూరి కృష్ణారావు ,నార్ల వెంకటేశ్వరరావు ,రామోజీ రావు ఆ రంగాన్ని ప్రభావితం చేసిన విశిష్ట వ్యక్తులు . సాహిత్య రంగం తీసుకుంటే , కవిరాజు త్రిపురనేని రామస్వామి గొప్ప సంఘ సంస్కర్త . భారత దేశంలో ఆధునిక కాలంలో సమాజ ఉద్దరణకు కంకణం కట్టుకున్న తొలివ్యక్తి . ఈరోజున మద్రాసులో వున్న ఎంకే,డీకే ,ఏడీఎంకే, రాజకీయ పార్టీలకు మూల కారణం రామస్వామి నాయకర్ . అలాంటి రామస్వామి నాయకర్ కు కూడా ప్రేరణ మన కవిరాజు రామస్వామి. అటువంటి వాడు పుట్టింది మన గుడివాడలో . “బ్రహ్మపురం మనదేరా -పర్లాకిమిడి మనదేరా- కాదని వాడుకు వస్తే కటకం కూడా మనదేరా అన్నాడు కవిరాజు. బ్రహ్మపురం అంటే బెర్హంపూర్ . ఒరిస్సా దగ్గర బెర్హంపూర్ లో వి.వి.గిరి గారు పుట్టారు. “బెంగుళూరు మనదేరా -బళ్ళారి మనదేరా- కాదని వాడుకు వస్తే కన్నడ మొత్తం మనదేరా అన్నాడు. బెంగుళూరు మనదే అక్కడ గాలి జనార్ధన రెడ్డి, నాయుడు, మొదలైన మనవాళ్ళు అక్కడ సగం మంది వున్నారు. “చెన్న పట్నం మనదే-చెంగల్పట్టు మనదే- కాదని వాడుకు వస్తే తంజావూరు మనదే “అన్నాడు. చెన్నపట్నం అంటే మద్రాసుగా మరి చెన్నై అయిందిప్పుడు. తంజావూరు సరస్వతి మహల్లో ఇప్పటికి వున్నా తెలుగు తాళపత్రగ్రంథాలూ తెచ్చుకోలేక పోతున్నాం .
ఇంకా ” వీర గంధము తెచ్చినారము -వీరుడెవ్వడో తెల్పుడీ పూసిపోదుము ,మెడను వైతుము -పూలదండలు భక్తితో “-అని అద్భతమైన స్వాతంత్రోద్యమ గీతాన్ని రాస్తే, , ఆచార్య ఎన్ జి రంగ, బెజవాడ గోపాలరెడ్డి గార్లు ,ఆ గీతాన్ని ఆలపిస్తూ ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని జిల్లాకు వెళ్ళారని, అంత స్పూర్తిని రగిలించిన గీతాన్ని రాసిన కవిరాజు ఇక్కడ జన్మించాడని కొనియాడారు.

ఉ. ఇమ్ముగ కకులమ్ము మోడ్లీ వారకుం గల యాంధ్ర పూర్వ రా
జ్యంముల పేరు చెప్పినా హ్రుడంతారమే లో చాలించి పోవు నా
ర్త్రమగు చిట్టా వృత్తుల పురాభవ నిర్ణయమేనని , నేనని జ
న్మమ్ములు గాక నీ తనువున్ బ్రవహించు నో నందర రక్తముల్ “

– అని చెప్పిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యన్నారాయణ ఇక్కడకు ఇరవై కిలోమీటర్ల దూరంలో వున్న మన నందమూరులో జన్మించారు. . ఇంతమంది విజ్ఞులు,కవులు, కళాకారులు – ఒక శతాబ్దాన్ని ప్రభావితం చేసిన మహనీయులు జన్మించిన నేల ఇది. ఈ నేల ఇంత గొప్పదని, తాతా తల్లిదండ్రులింత గొప్పవారని తెలియచేసే భాద్యత అందరిమీద ఉంది. అటువంటి మహత్తరమైన భాద్యతను చేపట్టాడు మన తాతా రమేశ్ బాబు . అభినందనలు.

వైతాళికులు కవిత సంపుటి ముద్దుకృష్ణ కనక లేకపోతే ఎంతోమందిని మరచిపోయే వారము . ” -అంటూ తనదయిన శైలిలో ఆకట్టుకొనే ప్రసంగం చేసి ,మన సంస్కృతి ,సంప్రదాయాలును పుస్తకాలు ,కలలే కాపాడుతున్న విషయాన్ని తేల్చి చెప్పారు. ” గుడివాడ చరిత్ర ” ను భావి విద్యార్థులకు తెలియ చేయటానికి ప్రతి ఏట పట్టణ చరిత్ర ,ప్రముఖుల జీవిత విశేషాలపై వ్యాస రచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించాలని సూచించారు.

సభకు అధ్యక్షత వహించిన ఎర్నేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, త్రేతాయుగంలో శ్రీరాముడు లంక పై దండెత్తి రావణాసురిని అంతమొందించి విభీషనుడికి పట్టాభిషేకం చేసినపుడు ,స్వర్ణ మయమయిన లంక లోనే ఉండి పరిపాలించ వలసినదిగా కోరితే , “ఆపి స్వర్ణ మయి లంక నేమ్ లక్ష్మణ రోచతే ” అంటూ – ” జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరియసి ” అంటూ పుట్టిన వూరు ,కన్నా తల్లి స్వర్గం కంటే గొప్పవని ,తాను అయోధ్య కే తిరిగి వెళ్తానని అనడాన్ని చెప్తూ, మనమంతా ఏదో ఒక ప్రాంతంలో పుడతాం, ఎన్నో అనుభవాలు ,అనుభూతులు వుంటై. ఆయా ప్రదేశాల గురించి మన తాతలు ,పెద్ద వాళ్ళు చెప్పేవారు. ఈ చెరువు ఫలానా వారిది ,ఇప్పుడీ స్టేడియం కట్టారని, ఈ చెట్టు, పుట్టల చరిత్ర ఇది అంటూ వాటి వెనకాల కథలు చెప్పేవారు. మేము పెరిగి పెద్ద వాళ్ళం అయినపుడు, మాకవి చెట్టులు, పుట్టలు .చెరువులు గా కనపడేవి కావు. ఆత్మీయ బంధువులు గా ,మా జీవితంలో భాగంగా తోచేవి. ఇవాళ కాలం మారింది . పిల్లల్ని కిండర్ గార్డెన్ లో వేసిన దగ్గర నుండి ఇంఫర్మేషన్ టెక్నోలజిలో గొప్పవాడు కావాలనో ,డాక్టర్,ఇంజనీర్ అవ్వాలని ఆశలు పెట్టుకొంటూ -ఆడుకోవటానికి ,స్నేహంగా ఉండటానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఎప్పుడూ పాఠాలు రుబ్బుతూ, ప్లే గ్రౌండ్ అంటే ఎలా వుంటుంది,ఎక్కడ వుంటుంది అనుకొనే దురదృష్టకరమైన వాతావరణం లో పిల్లల్ని పెంచుతున్నారు. ఇలాంటి సందర్భం లో గుడివాడ చరిత్ర-భాష-సాహిత్య-కళారంగా ప్రముఖుల విశేషాలతో పుస్తక రూపంలో అందించిన తాతా రమేశ్ బాబు అభినందనీయులు అన్నారు. గుడివాడ ప్రాశస్త్యాన్ని తెలియ చేసిన బృహత్తర గ్రంథం తీసుకు రావాలని, అధ్యయన సదస్సును నిర్వహించబోతూ వేసిన తొలి పుస్తకం గుడివాడ వైభవంగా అభివర్ణించారు.

గ్రంథ రచయిత తాతా రమేశ్ బాబు మాట్లాడుతూ, గుడివాడ ప్రాంత విద్యార్థుల పాఠ్య పుస్తకాలలో గుడివాడ చరిత్రను ప్రత్యేక పాఠ్యాంశంగా చేసి ప్రభుత్వ పరీక్షలలో మూడు మార్కుల ప్రశ్నగా తప్పనిసరి చేయ గలిగినప్పుడే చరిత్రను తెలుసుకోవటానికి ఆసక్తి చూపుతారని , ఇందుకు మేధావులు , విద్యా రంగ నిపుణులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. అలాగే ఎక్కడికక్కడ స్థానిక చరిత్రలు పాఠ్యాంశం వుండాలని సూచించారు. తాను గుడివాడ వైభవాన్ని రేఖామాత్రం గానే రాసానని చెప్పారు.

తొలుత ఏఎన్అర్ కళాశాల వైస్ ప్రిసిపాల్ స్వాగతం పలుకగా ,ప్రముఖ పగటి వేష కళాకారుడు మిరియాల శేఖరబాబు బృందం ఆలపించిన దేశభక్తి ,జానపద గేయాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ సభలో ఏఎన్అర్ కాలేజి కరస్పాండెంట్ పర్వతనేని నాగేశ్వరరావు, కోశాధికారి కాట్రగడ్డ సింహాద్రి అప్పారావు, బిఇడి ప్రిన్సిపల్ ఎన్.అరుణకుమారి, వికేఅర్ అండ్ విఎంబి పాలి టెక్నిక్ కళాశాల కరస్పాండెంట్ కురుమద్దాల సుధాకర్, అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ మాటూరి రంగనాథ, పులవర్తి కోర్నేలియస్, పిన్నమనేని భూపతిరాయుడు, సజ్జ శివరామకృష్ణయ్య ,రక్తకన్నీరు ఫేం దాసరి పూర్ణ మొదలయిన వారు పాల్గొనగా పెద్ద సంఖ్య లో విద్యార్థులు, సాహితీ వేత్తలతో సభ ప్రాంగణం కిక్కిరిసి పోయింది .

మన సంస్కృతి సంప్రదాయాలను పుస్తకాలు, కళలు కాపాడు తయనే నమ్మకాన్ని కలుగ చేసింది ఈసభ.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.5 Comments


 1. I appreciate your frantic efforts for bringing out “GUDIVADA’ history


 2. Sekhar babu

  naa peru miriyala sekhar babu,
  nenu pagativesha kalakarudanu. ee sabhalo nenu ,maa brundam konni janapada patalu padamu. aa thomdaralo sabhalo jarigina prasamgaalu vinaleka poyanu. aa lotu ee vyasam dwara teerinadi. chakkati prasamgaanni vina leka poyinamduku badha ga vundi.
  “pagati veshalu-samajika amsalu” ane pusthakaanni tata ramesh babu garu tayaru chesaru.indulo pagati vesha kalalu venuka vishayalu,prasthutam vesha vidhanam, samajika amsalu parishodhana ga rasaru. aa pusthakam twaralo vidudala cheyalani ,anduku andari sahaya sahakaralu amdimchalani, aa jaganmathanu pradhisthunnanu.
  Miriyala Sekhara babu
  cell:9848220221


 3. kothapalli ravibabu

  local history is important to write a comprehensive history of an area. a year ago we read BUNDAR history and now GUDIVADA history.I have not yet read it. The news about releasing of the book is quite interesting.
  ravibabujs@yahoo.co.in


 4. గుడివాడ వైభవ సభ విశేషాలు వైభవంగా ఉన్నాయి.. మనగురించి మనం తెలుసుకోవడం
  ముందు ఇంట గెలవడం లాంటిది. అది మృగ్యమయి పోతోందేమో ననిపిస్తున్నది. తనగురించి
  తెలుసుకోడు, తన కుటుంబంలోని విశిష్ట వ్యక్తులు తెలియదు.. తన ఊరి గురించి అక్కర
  లేదు… ఇక దేశమంటే అవగాహన ఎక్కడ.. ప్రేమ ఎక్కడ. ప్రేమ లేనిదే దేశభక్తి గురించి ఏం
  చెప్పగలం.. చరిత్ర చెప్పే వైభవాలు పిల్లలకు తెలియాలంటే..కవులు దృఢ సంకల్పంతో
  ఇలాంటివి దేశానికి అందీయాలి…ఉపాధ్యాయులు అందమైన భాషలో విద్యార్థులకు
  విశదపరచాలి… చదువులు పోటీ పరీక్షల కోసం కాదు, పొట్టకూటికోసం కాదు…ఙ్ఞానాన్ని
  పెంచేవిగా ఉండాలి..అప్పుడే చరిత్ర వైభవాలు జాతి వైభవానికి మార్గదర్శకాలౌతాయి.


 5. p.chandra sekhara Azad

  vyaasam bagumdi. akkadakkada mudra rakshasalu vunnaa,avishkarana sabhalo jarigina visheshalu aakarshaneeyam ga vunnai. avishkarthe avishkarimchadam,chinna nati gnapakalu teliya cheyatam bagumdi. aa sabha lo kurchuni vinnamtha anubhuthini kaligimchimdi ee sameeksha.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0