Who moved my cheese?

వ్యాసం పంపినవారు: కృష్ణ

Who moved my cheese? – An Amazing Way to Deal with Change in Your Work and in Your Life” ఇది నిజంగా ఒక అద్బుతమైన పుస్తకం. ఆదీ కాక ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ప్రతీ ఉద్యొగీ చదివి తీరాల్సిన పుస్తకం. ఎందుకు అలా అన్నాను అంటే? ప్రస్తుత అర్దికమాంద్యం వల్ల, ఉద్యోగం పట్ల మరింత అభద్రతా భావంతో ఎంతో మంది తమ బంగారుజీవితాలని పాడుచేసుకుంటున్నారు కనుక కనీసం కొంతమందికైనా ఇది ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశ్యంతో ఈ వివరణ.

ఇటీవలే నేను ఈ పుస్తకాన్ని చదివాను, పుస్తకాన్ని చదవటం పూర్తి చేసిన మరుక్షణం నా మనసులో ఒకే ఒక్క ప్రశ్న – “నా నమ్మకాన్ని కదిలించింది ఎవరు?” అని. కాని ఈ ప్రశ్న కి సమాధానం ఒక పెద్ద అంతర్మధనం…
ఇక ఈ పుస్తకం గురించి చెప్పాలి అంటే – దీని టాగ్ లైన్ సూచించినట్టు ఇది నిజంగా “మన జీవితంలో గాని మన ఉద్యోగంలో గాని వచ్చే పెనుమార్పులని ఎదుర్కోవటానికి ఒక మహత్తరమయిన మార్గం “.

స్పెన్సర్ జాన్సన్ దీనిని ఒక “Parable”(జంతువులు పాత్రధారులుగా ఉన్న నీతి కథ) గా రాసారు. ఈ పుస్తకం అంతా కూడా మన జీవితంలో లేదా మన ఉద్యోగంలో వచ్చే మార్పుల గురించి దానికి మనం అనుసరించాల్సిన వ్యూహం గురించి మాత్రమే చెపుతుంది. ఎక్కడా కూడా విసుగు రాకుండా చెప్పాల్సిన విషయాన్ని మరింత సూటిగా – ముఖ్యోద్దేశాలని మరింతగా గుర్తు ఉండే విధంగా చిత్రాలపైన రాస్తూ కధని ముందుకి నడిపిస్తారు రచయత.

ఈ పుస్తకం మనల్ని జీవితంలో వచ్చే మార్పుతో సమానంగా ఉరకలు – పరుగులు తీసేలా తయారుచేస్తుంది అనటంలో ఏ సందేహం లేదు. ఇది మనపై మనకున్న నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది. రచయత పాత్రల నామకరణంలోనే తన నేర్పుని చూపించారు, కథ లో “Sniff” మరియు “Scurry” రెండు ఎలుకలు ఇంకా “Haw” మరియు “Hem” చిన్న జీవాలు – (ఎలుకల కన్న తెలివైనవి). కథలో ఈ నాలుగు పాత్రలూ కూడా వెన్న(మనం వెన్నని  ఆనందం తో పొల్చి చూడాలి )కోసం వెతుకులాడుతూ ఉంటాయి.మొదట ఆహారం లేని పరిస్థితులలో ఎలుకలు మరియు చిట్టిమనుషుల వ్యుహాలు, వ్యవహారాలు ఎలా ఉన్నాయి; ఒక విధంగా మాంద్యం ఏర్పడినప్పుడు అలాంటి పరిస్థితులను ఎవరెవరు ఎంత బాగ అధిగమించారు అన్నదే కథ. కథలో మనుషుల అలోచలని ప్రతిబింబించేందుకు గాను 2 పాత్రలని చిట్టిమనుషుల్లాగా చిత్రికరించారు రచయత, ఇది అలా ఉంటే జంతువులకి మనుషులకి ఉన్న వ్యత్యాసాలు మనకి పూర్తి గా ఈ నాల్గు పాత్రల ఆలోచనా ధోరణి లో బాగా అర్దం అవుతాయి.

కథలో నాకు “హా” అనే పాత్ర తీరు బాగా నచ్చింది. ఒక్క సారి మార్పుని ఎదుర్కోవాలి అన్న పాఠం తెలిసిన తర్వాత తను నేర్చుకున్న ప్రతీ చిన్న విషయం తన మిత్రుడుకి ఉపయొగపడాలనే సదుద్దేశ్యంతో వాటిని గోడ మీద రాస్తూ ముందుకు సాగుతుంది. ఈలాంటి సాటి మనిషికి సహాయం చేయాలనే గుణం, తను పడిన కష్టం మరొకరు పడకూడదు అనే భావాలని చెప్పటంలో రచయత నేర్పు అమోఘం.

ఈ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరూ మన జీవితంలో మార్పులు సహజం అని గుర్తించి ఆ మార్పుకి తయారుగా ఉండటమే కాకుండా ఆ మార్పుతో ముందుకి ఎలా సాగాలో తమ తోటి వాళ్ళకి కూడా తెలియచేస్తారు. ఇంత మంచి పుస్తకం చదివి ఉత్తేజితులు కాని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అంటే నమ్మండి.

కథ చిన్నదే అయినా వ్యథ మాత్రం పెద్దదే, కథ కావలిసినంత వేదాంతాన్ని మిళితం చేసారు రచయత. కథ చదివిన ప్రతీ ఒక్కరూ కథలోని ఏదో ఒక పాత్రతో తమని తామే అన్వయించుకుని తన జీవితంలో జరిగిన సంఘటనలని మననం చేసుకుంటూ; మార్పుకి స్వాగతం చెప్తారు.

ఆన్నట్టు ఈ పుస్తకం లో నాకు బాగా నచ్చిన కొన్ని పంక్తులు (ఆంగ్లం లో)

1.If you do not change… You can become extinct
2. When you stop being afraid you feel good.
3. Imaging yourself enjoying new life leads you to it.
4. Noticing small changes early helps adapt to the bigger changes that are to come
మొత్తానికి మార్పు ని బాగా అర్దంచేసుకొటానికి అయినా ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం చదివి తీరాలి.

You Might Also Like

8 Comments

  1. p.babji

    I would like study this book, please tell me tell me, where available this book telugu version. pl infrm me.

  2. సౌమ్య

    ఈ పుస్తకం చదివినప్పుడు నాకు చాలా నచ్చింది – కథ చెప్పిన విధానం. అంటే, కాన్సెప్టు పాఠకుల బుర్రకెక్కించడానికి ఎంచుకున్న విధానం నచ్చింది. కానీ, ఏమిటో, నాకో పట్టాన ఈ మేనేజ్మెంట్, వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు ఎవర్నైనా ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం కాదు. ఇలా ఆసక్తికరమైన కథలుంటాయని చదువుతూ ఉంటానంతే!

  3. kvrn

    పుస్తకాన్ని వెంటనే కొనే విధంగా చాల బాగ పరిచయం చేసారు. యెక్కడ దొరుకుతుందో ! ధర యెంతో?

  4. Vamsi

    Hmm…
    Read it very very long back and in fact, one of my early reads..Thanks for reminding it once again…

  5. pssrao

    meeru cheppina puskamloni vishayalu baaunnai.dadapugaa ede katha mana telugu `PANCHATANTRAM` kthaluloo MOODU CHEPALU katha saripolchavachu.pity yemitante mana vagmayaanni manam gurthinchaleni dourbhagyam manadi.

    1. vishnu

      జ్ఞానం ఎవరు చెప్పిన ఒకటే అండి . మన వాళ్ళు పక్క వాళ్ళు అన్నది ఇక్కడ వర్తించదు అని నా అభిప్రాయం . . .

  6. Nagarjuna

    This is my favorite book. Good intro to readers.

    cheers…

  7. sarita

    ఈ పుస్తకం నేను ఇదవరకే చదివేసాను.చాల చిన్న పుస్తకం.కానీ చాలా మంచి పుస్తకం.ప్రతీ వ్యక్తీ చదివి తీరాల్సిన పుస్తకం ఇది.క్రుష్ణ గారు ఈ పుస్తకాన్ని ఇక్కడ పరిచయం చేసి చాలా మంచి పని చేసారు. క్రుతజ్ఞతలు

Leave a Reply to sarita Cancel