రంగనాయకమ్మగారి నవల – “జానకి విముక్తి” – పురుష పీడన నించి స్త్రీల విముక్తి

రాసిన వారు: మంజరి లక్ష్మి
****************
ఙ్ఞానం అభివృద్ధి చెందిన కొద్దీ, ఆత్మ గౌరవానికి కూడా విలువ ఇవ్వటం అనేది అర్ధం అవుతుంది.

ఈ మధ్యనే “నవ్య” వారపత్రికలో రంగనాయకమ్మ గారి, ‘కళ్ళు తెరిచిన సీత’ అనే సీరియల్ ప్రారంభమైంది. దానిలో హీరోయినైన సీత, పెళ్ళి విషయం వచ్చేటప్పటికి, ప్రతిదాన్లోనూ ఫ్యూడల్ ఆచారాలకు లొంగిపోతూ వుంటాన్ని చూపిస్తూ, రంగనాయకమ్మ గారు “పది సార్లు జానకి విముక్తి చదివిన సీత” ఇలా చేసిందీ, అలా చేసిందీ అంటూ వ్యంగ్యంగా సంబోధిస్తూ రాశారు. అది చూసి, ఎప్పుడో చదివిన “జానకి విముక్తి” పుస్తకాన్ని, ఇప్పుడు మళ్ళా చదివాను. ఎప్పుడు చదివినా, ఈ పుస్తకంలో, ఏదొ ఒక కోణంలో, మనం నేర్చుకోవలసిందీ, తెలుసుకోవలసిందీ వుంటూనే వుంటుంది.

రంగనాయకమ్మగారు “జానకి విముక్తి”ని, తన భావాలన్నిటినీ అత్యుత్తమ స్థాయిలో రంగరించి, తన నవలన్నిటిలోకీ మిన్నగా, తీర్చి దిద్దారని నా అభిప్రాయం. ఈ నవల, మొత్తం మొదట మూడు భాగాలుగా వచ్చింది. మొదటి భాగం 1977 లో, రొండవ భాగం 1980 లో, మూడవ భాగం 1981 లో వచ్చాయి. 2005 లో ఈ మూడు భాగాలూ కలిపి, ఒకే పుస్తకంగా ప్రచురించారు.

అమాయకురాలైన జానకి, మూర్ఖుడైన తన భర్త వెంకట్రావు చేతిలో తిట్లూ, తన్నులూ తింటూ ఉంటుంది. అది చూసి, వాళ్ళ అన్న సత్యం ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళి పోతే, మళ్ళా ఆమె భర్త వెంకట్రావు వచ్చి ఏవో మాయమాటలు చెప్పి వెనక్కి తీసుకెళ్ళిపోతాడు. దాంతో సత్యానికి కోపం వచ్చి, తన స్నేహితుడైన మూర్తికి ఉత్తరం రాస్తే, దానికి సమాధానంగా మూర్తి రాసే ఉత్తరం ఈ నవలలో హైలెట్. స్వతంత్ర ఆలోచన, ఎదిరించే చైతన్యం వాళ్ళలో కలిగించకుండా, మన భావాలను వాళ్ళ మీద రుద్దితే అది సరైన ఫలితాన్ని ఇవ్వదనీ, జానక్కి పరిస్థితుల్ని ఎదిరించే చైతన్యాన్ని కలిగిస్తూ, తనకు అండగా నిలబడటమే మన పని అనీ ఎంతో గొప్పగా చెపుతాడు. జానకి చిన్న, చిన్నగా తన చైతన్య స్థాయిని పెంచుకుంటూ, ఆ నికృష్టుడైన భర్త కబంధహస్తాల్లోంచి బయట పడి, స్వతంత్రంగా ఉద్యోగం చేసుకుంటూ, తన కాళ్ళ మీద తను నిలబడి, పిల్లవాణ్ణి తనే పెంచుకుంటూ, తన భావాలను అభివృద్ధి చేసుకుంటూ, అటువంటి భావాలు కల వ్యక్తినే మరల ఎన్నుకుంటుంది. ఆమె తన చైతన్యాన్ని మెల్ల మెల్లగా ఎలా పెంచుకుంటూ వచ్చినదీ, ఆమె అన్న సత్యం దానికి ఎలా దోహద పడిందీ, ఈ నవలలో రంగనాయకమ్మగారు చాలా చక్కగా రాశారు.

మాకు తెలిసున్న వాళ్ళ కుటుంబంలో కూడా ఒక ‘వెంకట్రావ్’ ఉన్నాడు. మా బంధువు లావిడ మొగుడు. వాళ్ళిద్దరూ ఒకే ఆఫీసులో పని చేస్తూ, ప్రేమించి(?), పెళ్ళి చేసుకున్నారు. మగ పెళ్ళి వాళ్ళు తిరుపతిలో పెళ్ళి చేయించమంటే, అలాగే చేయించి, వాళ్ళ ఊళ్ళో విడిదిలో ‘సత్యన్నారాయణ వ్రతం’ చేసుకున్నారు. దాని చివర బహుమతులు చదివించేటప్పుడు, పెళ్ళికొడుకు బంధువు లెవరో ఆవిడను, “ఏం చదువుకున్నావమ్మాయీ?” అని అడిగారు. ఆవిడ, “ఎం.ఏ.” అని చెప్పింది.
దాన్తో వాడు కాస్తా అలిగి, ఎంతమంది బతిమిలాడినా వినక, ఆవిడ అడిగితే, “నీకు పొగరు. నా కన్నా ఎక్కువ చదువుకున్నానని అహంభావం. నాకన్నా నువ్వు ఎక్కువ చదువుకున్నావనీ, నన్ను నలుగురిలో చులకన చెయ్యాలనీ, అలా చెప్పావూ?” అని తిట్టి తిట్టి పోశాడు. దానికి ఆవిడ, “అడిగారు కాబట్టి చెప్పాను. వాళ్ళడిగితే నిజం చెప్పకుండా ఎట్లా ఉంటానూ?” అని ఒకటే గోల. చివరకి, పెద్దదయిన వాళ్ళ నాయనమ్మ వెళ్ళి, క్షమాపణ అడిగితే, ‘మూడు నిద్రలకు’ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.

ఆ చివరి రోజు, నేను, నా స్నేహితులెవరికో వాళ్ళని పరిచయం చేస్తూ, వాళ్ళడిగితే, ” ఆయన ఫలానా చోట ‘ఎల్.డీ.సీ’ గా పనిచేస్తాడూ, ఆవిడ అక్కడే ‘యూ.డీ.సీ.’ గా పనిచేస్తుందీ” అని చెప్పాను.
అంతే! ఆ రోజు వాళ్ళ ఇంట్లో శివరాత్రే. మళ్ళా వాళ్ళ నాయనమ్మే ఎట్లాగో సర్ది చెప్పింది.

“జానకి విముక్తి” చదివిన తరువాత, మా ఇంట్లో మేము మా వాళ్ళతో పోరాడి, ఆ మూడు రోజులూ ‘వాకిట ఉండే’ కార్యక్రమాన్ని తీసేయించాము. మా బంధువు లింట్లోనూ అదే పరిస్థితి. మా బంధువు లావిడ అత్తారింటికి వెళ్ళేటప్పటికి, వాళ్ళత్త గారికి ‘మడి’ కాబట్టి, తమ ఇంట్లో ఉండటానికి వీల్లేదన్నారు. మొగుడు కూడా దానికే వత్తాసు పలికాడు. మా బంధువు లావిడ అత్తగారి కోసం, వాళ్ళ ఇంట్లో అలవాటు లేకపోయినా, పొద్దున్నే లేచి ‘మడి’తో వంట చేసి పెట్టి, ఆఫీసుకు వెళ్ళేది. ఆ మూడు రోజులూ మాత్రం, ఆవిడను, వాళ్ళ ఇంటికి పంపించేసే వాళ్ళు. మిగతా రోజుల్లో “రోగమని” చెప్పి వంట చెయ్యని మా బంధువు లావిడ అత్తగారు, ఆ మూడు రోజులూ మాత్రం ‘మడి’తో వంట చేసుకుని, తన కొడుకూ, తనూ, సుబ్బరంగా మింగి, కూచునే వాళ్ళు.

మా బంధువు లావిడ భర్తకి పదిహేను రోజులకో, నెల రోజులకో ఒక సారి పూనకం వస్తూ వుండేది. ఇంక పొద్దున్నే, నిద్ర మంచం మీద మొదలెట్టేవాడు స్త్రోత్రం. “పెళ్ళినాడు ఆడ పెళ్ళి వాళ్ళు వాళ్ళకి తిరుపతిలో సరయిన ఎకామడేషన్ చూపించలేద”నీ, “భోజనాలు ఆలస్యంగా పెట్టించార”నీ, “అవి ఛండాలంగా ఉన్నాయ”నీ, “వాళ్ళ అప్ప చెల్లెళ్ళకి మర్యాదలు సరిగా జరపలేద”నీ, “కట్నాలు నాసిరకంవి ఇచ్చార”నీ, తిట్టేవాడు. అప్పటికీ, అంతకుముందే, వాళ్ళ నాయనమ్మ, “మా వూళ్ళో చేసుకుంటే అన్నీ సవ్యంగా జరిపించే వాళ్ళం నాయనా! మీరే తిరుపతిలో చెయ్యాలన్నారు. పరాయి చోట మేము మాత్రం ఏం చేస్తాం?” అని చాలా సార్లు చెప్పింది.

“మా బంధువు లావిడకు ‘తను ఎక్కువ చదువుకున్నా’ ననీ, ‘ఉద్యోగంలో తనకన్నా ఎక్కువ గ్రేడ్లో ఉంద’నీ, గర్వం, పొగరూ అనీ, ‘ఆ రోజు అది చెయ్యలేదు, ఈ రోజు ఇది చెయ్యలేదూ'” అంటూ దండకం రాత్రి పడుకునే వరకూ నడిచేది. కొన్నాళ్ళకు ఆవిడ డిపార్ట్మెంట్లోనే వాణ్ణి కూడా వేశారు. ఇకంతే! మూడు నెలలు సెలవు పెట్టి, ఆవిడ నగలు తనఖా పెట్టి, తన చేత లోన్లు పెట్టించి, మొత్తం డబ్బులు తీసుకొని, హైదరాబాద్ వెళ్ళి, ‘యూ.డీ.సీ.’ పోస్టు తెచ్చు ‘కొన్నాడు’. ఆ తరవాత, కొన్నాళ్ళు, కొంత ప్రశాంతంగా నడిచింది ఆ కాపురం. ఈ లోపల ఆవిడ ప్రమోషన్ మీద ‘సూపరిండెంటు’ అయింది. ఇంకేముంది? మళ్ళా నిత్య నరకం. మాక్కూడా వాళ్ళతో తగాదా అయి, మేం వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళింటికి వెళ్ళటం మానేశాం.

ఈ మధ్యనే ఆవిడ రిటైర్ అయితే, వీడ్కోలు పార్టీ ఇస్తే, దానికి మేం కూడా వెళ్ళాం. ఆ సభలో ఆవిడ కొలీగ్స్, ఉద్యోగం పట్ల ఆవిడ చూపించిన సిన్సియారిటీని మెచ్చుకొంటూ, ఆవిడని కూడా మాట్లాడమన్నారు. అప్పుడు ఆవిడ “నేను ఉద్యొగంలో, ఇంత అభివృద్ధి లోకి రావటానికీ, నేను నా ఉద్యోగాన్ని ఇంత బాధ్యతాయుతంగా నిర్వర్తించటానికీ నా భర్తే కారణం. ఆయన ఇచ్చిన తోడ్పాటూ, ప్రోత్సాహం తోనే నేను నా బాధ్యతల్ని ఇంత సక్రమంగా నిర్వర్తించగలిగాను. ఈ విషయంలో ఆయనకు నా జీవితాంతం రుణపడి ఉంటాను” అని చెప్పింది.

ఈ పుస్తకం ఎలాంటి మనుషులతో జీవించ కూడదో మాత్రమే కాదు, ఎటువంటి మనుషులతో జీవించాలో కూడా చెబుతుంది. ఇందులో సత్యం, శాంతల మధ్య పరిచయం, స్నేహం, ప్రేమా, సహ జీవనం చాలా స్పష్టంగా వివరించారు. స్త్రీ, పురుషుల మధ్య ఎటువంటి సంబంధాలు వైరుధ్యాల కతీతంగా వుంటాయో కూడా ఈ పుస్తకం చెబుతుంది.

బఫే భోజనాలంటి వర్ణనలు చాలా నవ్వు పుట్టిస్తాయి. వెంకట్రావు గురించి చదువుతూ వుంటే, మనకి కూడా వాణ్ణి పట్టుకుని చితక బాదాలని అనిపిస్తుంది. అయినా, జానకి వాణ్ణి వదిలెయ్యడమే వాడికి తీరని శిక్ష లెండి. ఇంటా, బయటా సమానంగా పని చేయని భార్యాభర్తల మధ్య సమానత్వం కుదరదని ఈ కధ స్పష్టంగా చెబుతుంది. మంచి భర్త/భార్య దొరికితే జీవితం మంచి గానూ, చెడ్డ భర్త/భార్య దొరికితే జీవితం చెడ్డ గానూ వుండటం లాగా కాకుండా, ప్రతీ స్త్రీ/పురుషుడూ తనకి సరైన స్త్రీని/పురుషుణ్ణి తానే ఎన్నుకోవాలి అని ఈ పుస్తకం నేర్పిస్తుంది.

“జానకి విముక్తి” వచ్చిన కొత్తల్లో, మా ఇంటికి ఎదురుంగా ఒక కుటుంబం అద్దెకు వచ్చారు. ఆ ఇంట్లో నా ఈడమ్మాయే ఉండేది. ఆ అమ్మాయి పేరు పార్వతి. ఆ అమ్మాయికి రంగనాయకమ్మగారి పుస్తకాలంటే ప్రాణం. నాకూ అంతే కాబట్టి, ఆమెతో బాగా స్నేహం కుదిరింది. వాళ్ళింట్లో రంగనాయకమ్మగారి అన్ని పుస్తకాలతో పాటు, ఆవిడ సంపాదకీయంలో వచ్చిన “ప్రజాసాహితి” పుస్తకాలు కూడా ఉండేవి. ఆ అమ్మాయి చెవుల దుద్దులు మాత్రం ఉంచుకుని, మిగిలిన నగలేవీ పెట్టు కోకుండా తిరిగేది. ‘అందం’ కోసమని చెప్పి, చిన్న బొట్టు కూడా ఉంచుకునేది. ఉండటానికి, కావలసినంత నాస్తికత్వం వుంది ఆ అమ్మాయి దగ్గర.

నేను కుతూహలంతో, “ఎందుకలా ఏ నగలూ పెట్టుకోకుండా ఉంటారు? బంగారంవి లేకపోతే రోల్డుగోల్డువైనా, పెట్టు కోవచ్చు కదా?” అని, ఆ అమ్మాయి అభిప్రాయం తెలుసు కోవాలని అడిగాను. దానికి పార్వతి, “రంగనాయకమ్మగారు స్వీట్ హోమ్ లోనూ, ముఖ్యంగా జానకి విముక్తి లోనూ ‘నగలనేవి బానిసకాలం నాటి చిహ్నాలని, అవి పెట్టుకోవటం ఆడవాళ్ళకు అవమానమని’ చెప్పారు. అది చదివి నప్పటి నించీ నగలు తీసెయ్యాలని అనిపించింది” అని చెప్పింది.

“మరి దిద్దులు మాత్రం వుంచుకున్నారెందుకూ? బొట్టు సంగతేమిటీ?” అని అడుగుదామనుకున్నాను గానీ, ఆ అమ్మయిలో చూసిన ఆ కాస్త చైతన్యానికే ముచ్చటేసి, ఆ అమ్మాయిని చిన్నబుచ్చ కూడదని, వూరుకున్నాను. తర్వాత కాలంలో ఆ అమ్మాయికి ఒకబ్బాయితో పరిచయం అయింది. ఆ పరిచయం ఒక చిన్న సైజు ప్రేమ లోకి దారి తీసింది.

ఆ అబ్బాయి, “చేతికి గాజులందమూ, ముక్కుకు పుడక లందమూ” అని సినిమా పాట పాడేటప్పటికీ, ఆ ప్రేమకి మురిసి పోయి, పారేసిన గాజులూ, ముక్కు పుడకా తెచ్చుకుంది.

ఆ తర్వాత నెమ్మదిగా మెడలో గొలుసూ, వేలికి వుంగరమూ తిరిగి వచ్చాయి. ఆ అబ్బాయి వడ్డాణం కోసం కూడా ప్రయత్నించాడు గానీ, మరీ నాటుగా వుంటుందని పార్వతి ఒప్పుకోలేదు. నీరసంగా వూరుకున్నాడు.

ఆ తర్వాత అమ్మ కోసం పీటల మీద పెళ్ళీ, నలుగురిలో గొప్ప కోసం కట్నమూ కావాలని కోరాడు. ఇంకా చాలా సినిమా పాటలు పాడాడు. ఒంటి మీద నగలన్నీ అతని ఆస్తి కోసం అని అప్పుడు అర్థం అయింది. అప్పటికి కళ్ళు తెరుచుకున్న పార్వతి, ముందరగా వాణ్ణి వదిలేసింది. విప్పారిన కళ్ళతో, జానకి విముక్తి మళ్ళీ చదవడం మొదలు పెట్టింది.

ప్రజాసాహితిలో రంగనాయకమ్మ గారి “ప్రశ్నలూ‌-జవాబులూ” శీర్షికకి, ఎవరో ఒక అమ్మాయి, “నగలు తీసెయ్యాలనే ఉంది కానీ, అలా ఒక్కసారే తీసెయ్యటం చేతకావటం లేదు, ఎలాగా?” అని ఉత్తరం రాస్తే, అప్పుడు రంగనాయకమ్మగారు, “ఒక సారి తీసి, ఒక సారి పెట్టు కుంటూ, కొన్నాళ్ళు తీసి, కొన్నాళ్ళు పెట్టుకుంటూ, ఒక్కక్కటే తీసేస్తూ అలవాటు చేసుకోమని” జవాబు చెప్పారు.

కళ్ళు తెరుచుకున్న వాళ్ళు అలాగే వుండిపోరు కదా? పార్వతి కొన్నాళ్ళు సాధన చేసి అన్నీ, దిద్దులతో సహా, బొట్టుతో సహా, తీసేశానని చెప్పింది. “రంగనాయకమ్మ గారు చెప్పిందాన్ని, అలా తూ.చా. తప్పకుండా పాటించే వాళ్ళున్నారా?” అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది.

ఇది తప్పక చదివి తీర వలసిన పుస్తకం.

పుస్తకాలకు:

అరుణా పబ్లిషింగ్‌ హౌస్‌,
ఏలూరు రోడ్డు,
విజయవాడ – 520 002
(ఫోన్‌: 0866 – 2431181)

You Might Also Like

47 Comments

  1. లోటస్

    మంజరి లక్ష్మి గారి may-10-2011- రంగనాయకమ్మ గారి పాఠకులలో నేను ఒక పాఠకురాలిని. miru

  2. anamika

    Nenu navya “Kallu terichina Seetha” chaduvutunnanu. Aa story anta naa life ni oka serial ga rasinattu undi. Almost chala incidents kalustayi. Kakapote aa serial lo seethaki okka adapaduchu naku iddaru. Nenu ippudu tananunchi(husband) duram ga job cheskuntu naa babuni chuskuntunnanu. Kani ila vachesi, babu kemanna tandri lekunda chesi anyayam chestunnana ani chala bhadha padtuntanu. Kani ee serial chadivinappatnunchi nenu chesindi correct anipistundi.

    Chuddam, naa babu pedda ayina tarvata nannu ardham cheskuntado leka nenu tanaki anyayam chesanani nannu niladestado.

  3. nagamurali

    This story is related to my comments published above: http://poddu.net/?q=node/835

  4. Praveen Sarma

    కాలేజ్ డ్రాపౌట్ అయిన బిల్ గేట్స్ బిలియన్లు ఎలా సంపాదించాడు? ఇదంతా మార్కెట్ మాయాజాలం. కొన్ని రకాల హార్డ్‌వేర్ పరికరాలు అతని కంపెనీ తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్‌లతోనే పని చేస్తాయి. ఆ హార్డ్‌వేర్ పరికరాలు వాడేవాళ్ళు మైక్రోసాఫ్ట్ కంపెనీ తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్‌లు తప్పనిసరిగా కొంటారు కాబట్టే మైక్రోసాఫ్ట్ కంపెనీకి బిలియన్లు లాభాలు వచ్చాయి. అంతే కానీ బిల్ గేట్స్ చదివిన చదువుతో అతనికి లాభాలు రాలేదు.

  5. M. Lakshmi

    గొప్ప సైంటిస్టయిన పి భార్గవ్ అనే ఆయన, స్వేచ్చాలోచన అనే హేతువాద పత్రికలో, ప్రవీణ్ శర్మ గారు చెప్పినట్లుగానే “చదువుకున్న వాళ్ళు ధనవంతులనీ, చదువుకోని వాళ్ళు పేద వాళ్ళని” రాశాడు. “చదువురాని వాళ్ళు కూడా వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించటం లేదా? చదువుకున్న వాళ్ళు కూడా, వెనకటి కాలంలో ఉద్యోగాలు లేక పేదవాళ్ళుగా ఉన్నవాళ్ళున్నారు. ఇప్పుడు ఐ.టీ. బూమ్ లో చదువుకున్న వాళ్ళు కొంత మంది ఎక్కువ జేతాలు సంపాదిస్తుంటే, సంపాదిస్తూ ఉండివుండచ్చు. కానీ, అంత మాత్రాన చదువుకున్న వాళ్ళందరూ ధనవంతులని ఎలా అంటారు?” అని నేను కూడా అప్పట్లో ఆయనకు సమాధానంగా రాశాను.

    నాస్తికత్వం, హేతువాదం రెండూ ఇదివరకు కొంత తేడాగా ఉండేవి కానీ, ఇప్పుడు రెండింటి గురించి చెప్పే వాళ్ళు ఒకటిగానే చెపుతున్నారు. నాస్తికులైతే “భగవంతుడనే వాడెవడూ లేడూ, ఈ సృష్టికి మూలం భౌతిక పదార్ధమే” అనే విధంగా దేవుడి కోణంలో నుంచీ చెపితే, హేతువాదులు “ప్రతి దానికి హేతువనేది ఉంటుంది, ఈ సృష్టికి మూల కారణం భౌతిక పదార్ధమే” అని చెపుతారు. ఇప్పుడు ఇద్దరూ కూడా మానవ పరిణామ సిధ్ధాంతాన్ని ఒప్పుకుంటున్నారు. వీళ్ళని భౌతిక వాదులని కూడా అనవచ్చు. అయితే వీళ్ళందరూ, సమాజం విషయంలో కొచ్చేటప్పటికి, ఇప్పుడున్న పెట్టుబడి దారీ వ్యవస్థ, పరిణామ క్రమంలో బానిస వ్యవస్థ, ఫ్యూడల్ వ్యవస్థల నుంచే వచ్చిందనీ, దీని తరువాత సోషలిస్టు వ్యవస్థ వస్తుందంటే మాత్రం ఒప్పుకోరు. సమాజంలో ఉన్న కష్టాలన్నిటికీ మూలం అఙ్ఞానం, మత మౌఢ్యం అనే చెపుతారు. అది పోతే సరిపోతుంది, ఈ పెట్టుబడిదారి సమాజం మంచిదే, ఇదేం మారక్కరలేదు అంటారు. అఙ్ఞానం అనేది కూడా ఒక భావమే కదా? దానికి మూలమైన, సమాజంలో ఉన్న, ఏదో ఒక భౌతిక కారణాన్ని చూపించాలి కదా! వాళ్ళు అదేం చెప్పరు. మార్క్సిష్టులు కూడా భౌతిక వాదులే. అయితే మార్క్సిజం తర్కం ప్రతి దాన్ని సంబంధాలలో పెట్టి చూపించి తర్కిస్తుంది. ఈ సమాజంలో ఉన్న కష్టాలకు మూల కారణం “శ్రమదోపిడీ” (వస్తువు) అనే భౌతిక కారణమనీ, సమజానికి శ్రమ సంబంధాలే పునాది అనీ చెపుతుంది. మానవ సంబంధాలన్నీ సమ సంబంధాలు కావనీ, యజమానీ, శ్రామిక సంబంధాలేనని నిరూపిస్తుంది. చారిత్రక పరిణామ క్రమం లో సమాజాలు మారుతూ వస్తున్నాయని చెపుతుంది. పెట్టుబడి దారీ వ్యవస్థకు వ్యతిరేకంగా కార్మికుల పక్షాన నిలబడుతుంది.
    కాబట్టి మనం చెప్పే తర్కాన్ని మార్క్సియన్ హేతువాదం అనో, మార్క్సియన్ భౌతిక వాదం అనో లేక పోతే గతి తార్కిక భౌతిక వాదమనో విడిగా స్పష్టంగా చెప్పాలి. అందులో నాస్తిక వాదం, హేతువాదాల గురించి చెప్పేటప్పుడు, మార్క్సిష్టు భౌతిక వాదం _ బూర్జువా హేతువాదం, బూర్జువా భౌతిక వాదాలకు _ భిన్నమైనదిగా సెపరేట్ ఎంటిటీతో తేటతెల్లంగా చూపిస్తేనే గందరగోళం లేకుండా ఉంటుంది.

  6. Praveen Sarma

    సమాజం విషయంలో మనిషికి చాలా మూఢనమ్మకాలు ఉంటాయి. నాస్తికులకి కూడా సమాజం విషయంలో చాలా మూఢ నమ్మకాలు ఉంటాయి. కొందరు డబ్బున్నవాళ్ళు అవుతారు, కొందరు పేదవాళ్ళు అవుతారు ఎందుకు అని అడిగితే చాలా మంది సింపుల్‌గా వాళ్ళు చదువుకున్నారు, వీళ్ళు చదువుకోలేదు అని సమాధానం చెపుతారు. కాలేజ్ డ్రాపౌట్ అయిన బిల్ గేట్స్ బిలియన్లు ఎలా సంపాదించాడు? అతను పెద్దగా చదువుకోలేదు కదా. కొంత మందైతే ఇలా సమాధానం చెపుతారు “కొంత మంది పుట్టుకతో తెలివైనవాళ్ళుగా పుడతారు, కొంత మంది తెలివితక్కువవాళ్ళుగా పుడతారు, తెలివైనవాళ్ళు డబ్బున్నవాళ్ళవుతారు, తెలివితక్కువవాళ్ళు పేదవాళ్ళు అవుతారు” అని. ఒకడు తెలివైనవాడా, కాదా అనేది అతని ముఖం చూసి చెప్పలేము. ఒక వ్యక్తిని నమ్మి అతనికి బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం ఇస్తారు. అతను లంచం కోసం ఎంకంబ్రెన్స్ సర్టిఫికేట్ (ఆ ఆస్తులని ఇంతకు ముందు ఎవరికీ అమ్మలేదని రిజిస్ట్రార్ ఇచ్చే సర్టిఫికేట్) లేని ఆస్తులకి లోన్ ఇచ్చి ఉద్యోగం పోగొట్టుకుంటే అతని తెలివితక్కువతనాన్ని ఎవరు ముందు ఊహించినట్టు? ఆ ఆస్తులకి ఎంకంబ్రెన్స్ సర్టిఫికేట్ లేదనే విషయం బ్రాంచ్‌లో ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు తెలుస్తుంది కానీ ఆన్లైన్ కోర్ బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్‌లో తెలిసే అవకాశం లేదు. ఒకవేళ లంచం కోట్లలో ముట్టి ఉంటే ఇన్స్పెక్షన్ జరగకముందే మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పారిపోగలడు. మేధాశ్రమలు చేసేవాళ్ళందరూ తెలివైనవాళ్ళనుకోలేము అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. కాపిటల్ గ్రంథంలో నేను మేధాశ్రమల గురించి చదివాను. ఇతర మార్క్సిస్ట్ పుస్తకాలలోనూ నేను మేధాశ్రమల గురించి చదివాను. ఒక ఫార్మా కంపెనీవాళ్ళు తమ కంపెనీలో పని చేసే సైంటిస్ట్ చేత కొత్త మందు కనిపెట్టించి దాని పేటెంట్ తమ కంపెనీ పేరు మీద రిజిస్టర్ చేసుకుంటారు. పెట్టుబడి కంపెనీ యజమానుల చేతుల్లో ఉంటుంది కానీ ఉద్యోగి అయిన సైంటిస్ట్ చేతిలో ఉండదు. ఇక్కడ మేధాశ్రమ చేసినది సైంటిస్టే కానీ అతని మేధస్సుతో కనిపెట్టబడిన మందుని అంగట్లో అమ్ముకోగలిగేది చేతిలో పెట్టుబడి ఉన్న కంపెనీ యజమానులే. మేధాశ్రమలు చేసేవాళ్ళ కంటే వాళ్ళ చేత పనులు చెయ్యించేవాళ్ళకే ఎక్కువ లాభం వస్తుంది. ఇక్కడ పెట్టుబడిదారులు లాభపడినంతగా మేధాశ్రమలు చేసేవాళ్ళు లాభపడలేదు. శారీరక శ్రమలు చేసేవాళ్ళకైతే వాళ్ళ శ్రమకి పెట్టుబడిదారులు చాలా తక్కువ విలువ ఇస్తారు. అందుకే పెట్టుబడిదారీ వర్గంపై శారీరక శ్రమలు చేసే వర్గం నుంచే ఎక్కువ వ్యతిరేకత వస్తుంది. సైంటిస్ట్‌కి తనకి అనుకున్నంత లాభం రాకపోయినా అతనికి ఎసి రూంలో హాయిగా పని చేసే సౌకర్యమైనా ఉంటుంది. కానీ కార్మికులకి అటువంటివేమీ ఉండవు. అందుకే మేధాశ్రమలు చేసేవాళ్ళకంటే శారీరక శ్రమలు చేసేవాళ్ళు ఎక్కువ alienationకి లోనవుతారు.

  7. Srinivas Vuruputuri

    ప్రసాద్ గారికి

    కాపీ రైట్లూ, స్వయంశక్తితో గొప్పవాళ్ళవటమూ – మార్క్సిస్టు సమాజంలో ఉండవా? అన్న నా ప్రశ్నకి మీ జవాబు (“ఆ ఉన్నత సమాజం వచ్చే లోపల, ఒక దశలో సోషలిజం అనే దశ వస్తుంది. అప్పుడు, ఒక రచయిత శ్రమ ఆ రచయితకే చెందడం లాంటివి ఉంటాయి. ఈ కాపీ రైట్లూ, అవీ ఆస్తి హక్కులు. ఉన్నత సమాజంలో అవి వుండవు.”) సరిపోయింది. తీరిక ఉన్నప్పుడు ఇంకా తరచి చూడాలి. 🙂

    “గొప్ప” అంటే మీ దృష్టిలో అర్థం ఏమిటీ? అన్న మీ ప్రశ్నకి జవాబు రాసేందుకు ప్రయత్నిస్తాను.

    వైయక్తిక విజయాల గురించి, వాటి ప్రేరణల గురించి ఆలోచిస్తూ రాసానా మాటను.

    From Each According to his ability, To each, according to his needs అనే అర్థం వచ్చే మాటలను జానకి విముక్తిలో చదివాను. ఆ మాటలు చదవగానే Atlas Shrugged పుస్తకం జ్ఞాపకం వచ్చింది (ఆ నవలలో, కొందరు ఆ సిద్ధాంతాన్ని ఒక ఫాక్టరీలో అమలు చేసి భూతల నరకాన్ని సృష్టిస్తారు).

    Anthem అనే నవలిక కూడా జ్ఞాపకం వచ్చింది (అందులో ఓ ఆగామి “కలెక్టివిస్టు సమాజం”లో పుట్టిన కథానాయకుడు తనకి అప్పజెప్పిన “రోడ్లు ఊడ్చుట” అనే పని మానేసి విద్యుద్దీపాన్ని రీ-డిస్కవర్ చేసి అధికారులతో గొడవ పడతాడు. నిర్బంధం లోంచి తప్పించుకున్న కొంతకాలానికి వ్యక్తివాదిగా మారతాడు)

    ఇలాంటి కథలూ, నవలలూ చదివి కొంత మేరకి internalize చేసుకున్నాక, మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టి మార్క్సిజం బేసిక్స్ ఏవిటో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తున్నాను. నాగ మురళి గారు అన్నట్లు, ఇంకా చదవాలి. స్పష్టత వచ్చేదాకా.

    శ్రీనివాస్

  8. Praveen Sarma

    సంగీతంలో భక్తిపరమైనదని నేననుకోను. కర్నాటక సంగీత విద్వాంసుడైన నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు పాశ్చాత్య సంగీత వాయిద్యమైన వయొలిన్ కూడా వాయించేవారు. యూరోప్‌లో సంగీతం భక్తి నుంచి పుట్టలేదు కదా. ఇండియాలో కూడా సంగీతం భక్తి నుంచి పుట్టిందనుకోను. తరువాత క్రమంలో సంగీతాన్ని భక్తిలో కలిపి ఉండొచ్చు.

  9. ప్రసాద్‌

    నాస్తికత్వం వేరూ, హేతువాదం వేరూ.
    నాస్తికులకు ప్రకృతి జ్ఞానం మాత్రమే వుంటుంది. హేతువాదులకి, ప్రకృతి జ్ఞానంతో పాటు, సమాజ జ్ఞానమూ వుంటుంది. ప్రతీ హేతువాదీ ఒక నాస్తికుడే. అయితే, ప్రతీ నాస్తికుడూ ఒక హేతువాది కానక్కర్లేదు. నాస్తికులుగా మాత్రమే చలామణీ అయ్యేవారు, సమాజం గురించి పట్టించుకోరు. వీరికి శ్రమ దోపిడీ తెలియదు.

    రిచర్డ్‌ డాకిన్సు ఒక గట్టి నాస్తికుడు మాత్రమే. ఆయన హేతువాది కాదు. ఆయన, క్రిస్‌మస్‌ కేరెల్స్‌ లోని సంగీతాన్ని ఆనందించినంత మాత్రాన, ఆయన నాస్తికత్వాన్ని ఎవరూ అపార్థం చేసుకోనక్కర్లేదు. ఆయన ఒక గట్టి సైంటిస్టు కూడా. ఒక కళ లోని గొప్ప దనం సరిగా అర్థం కాకపోతే, దానికి ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఒక్కొక్కరి హృదయం ఒక్కో కళకి ఒక్కో లాగా స్పందింస్తుంది. దాన్నే భక్తి లాగా కొందరు అపార్థం చేసుకుంటారు.

    ఇక వివరణలంటారా? ఎవరిచ్చుకోవడం లేదూ, ఎవరి విషయాలకి.

    ప్రసాద్‌

  10. nagamurali

    వేణుగారూ,

    అవును, తేలికైన వ్యాఖ్య రాద్దామనే నా ఉద్దేశ్యం. దేని గురించీ నాకు బ్లాక్ అండ్ వైట్ అభిప్రాయాలు లేవండీ. ఆ పుస్తకం చదివాకా దాని గురించి రాద్దామని ప్రయత్నించాను కానీ తృప్తికరంగా లేదని ఆగిపోయా. విషయం పరిధి విస్తృతమైనది. ఇంకా చాలా చదవాలి.

    నేను హాస్యధోరణిలో రాసిన వ్యాఖ్యని మీరు సీరియస్ గా తీసుకోనక్కరలేదు. నా ధోరణి అసందర్భమనిపిస్తే పట్టించుకోకండి.

  11. వేణు

    నాగమురళి గారూ!
    మీరు స్మైలీలు పెట్టి, వ్యాఖ్యలోని విషయాన్ని తేలిక చేయటానికి ప్రయత్నించటం తెలుస్తోంది కానీ… మీ అభిప్రాయమే తెలియటం లేదు, స్పష్టంగా!

    ముఖ్యంగా ‘కాపిటల్’ తర్వాత ‘బ్లాంక్ స్లేట్’ చదివితే మజా వస్తుందనే వ్యాఖ్య! ‘కాపిటల్ (పరిచయం)’ ఏడాది దీక్షగా చదివిన మీరు దాని గురించి మీ అభిప్రాయాలను కాస్త వివరంగా చెపితే బాగుంటుంది. ఇక్కడే అని కాదు, మీ బ్లాగులోనైనా!

    >>’… అప్పుడూ పాపం రంగనాయకమ్మగారిలాగే వివరణలు ఇచ్చుకుని శ్రమపడ్డారు నాస్తికులు’>>
    ఒక ప్రశ్న ఎదురైనపుడు వివరించటం, సందేహ నివృత్తి చేయటం ‘వివరణ ఇచ్చుకోవటం’ అవుతుందా?

  12. Praveen Sarma

    ఇదంతా సాంస్కృతిక వైరుధ్యానికి సంబంధించినది. యూరోప్‌లో ఆడవాళ్ళు బొట్టూ, గాజులూ పెట్టుకోరు. ఇండియాలో ఆడవాళ్ళు అవి పెట్టుకుంటారు కానీ మగవాళ్ళు పెట్టుకోకుండా ఆడవాళ్ళే అవి పెట్టుకుంటే ఆడదానికి అందమే ప్రధానం అనే అభిప్రాయం కలుగుతుంది. బొట్టూ, గాజులూ పెట్టుకోవడం తప్పు అనిపించినా పెట్టుకోకపోతే ఇతరులు ఏమనుకుంటారేమోనని పెట్టుకుంటారు. భూస్వామ్య సంస్కృతిని వ్యతిరేకించే మార్క్సిస్ట్ స్త్రీలు కూడా అవి పెట్టుకుంటే ఆచరణ కంటే కబుర్లు ముఖ్యమా అనే ప్రశ్న ఉదయిస్తుంది.

Leave a Reply to Srinivas Vuruputuri Cancel