Book Recommendation: ఆంధ్రుల సాంఘిక చరిత్ర

రాసిన వారు: చావాకిరణ్
*************

bookఆంధ్రుల సాంఘిక చరిత్ర (Andhrula Sanghika Charitra)

-సురవరం ప్రతాపరెడ్డి (Suravaram Pratapareddy

ఓరియంట్ లాంగ్మన్

ISBN 81 250 1036 X

ఓరియంట్ లాగ్మన్ ప్రేవేట్ లిమిటెడ్
3-6-752, హిమాయత్ నగర్,
హైదరాబాద్ – 500 029

అహో ఏమి నా భాగ్యము. నేనొక చక్కని పుస్తకము చదవగలిగితిని. అదియే ఆంధ్రుల సాంఘీక చరిత్ర. ఇది సురవరం ప్రతాప రెడ్డి విరచితము. ఇది చదువుతుంటే ఒక ‘300’ అనే ఆంగ్ల సినిమా ఆంధ్రుల కథ అయితే ఎలా ఉంటుందో పలు ట్రోజన్ వార్ సినిమాలుగా ఆంధ్రుల కథలు తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఆంధ్ర జాతి వీరత్వం, భీరత్వం, సొగసు, హొయలు, ఉత్తాన పతనాలు, కష్టాలు, కన్నీరు, కట్టుబాట్లు, ఆటపాటలు, ముచ్చట్లు, నగలు, నాటకాలు, బొమ్మలు, బొమ్మంచు చీర ముచ్చట్లు, ఒకటేమిటి ఒక్క వెయ్యి వత్సరాలు అలా కాలయంత్రంలో ప్రయాణింపచేసి, మోహింపచేస్తారు, ఆలోచింపచేస్తారు.

ఇందు మొత్తం ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి. తొలి అధ్యాయం తూర్పు చాళుక్య యుగం. రెండవ అధ్యాయం కాకతీయుల యుగం, మూడు రెడ్డి రాజులు, నాలుగు – ఐదు, విజయనగ సామ్రాజ్య కాలం ఆ తరువాతి మూడు అధ్యాయాలూ 1600 నుండి 1907 వరకూ ఆంధ్ర జాతి సామాజిక చరిత్రను వివరిస్తాయి. యాబై సంవత్సరాల క్రితమే బహు లెస్సగా, చక్కని వచహంలో లిఖించిన బొత్తమిది. ఆనాడే ప్రతి అధ్యాయం చివరా ఉపయుక్త గ్రంథాల చిట్టా ఇచ్చి ఉండిరి. ఈ విషయంలో ఇప్పటి రచయతులకూ ఈ పుస్తకం ఆదర్శప్రాయం.

కొన్ని విశేషాలు.

మొదటి జాతీయ బహుమతి పొందిన తెలుగు పుస్తకం.

కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన తొలి తెలుగు పుస్తకం.

1949లో తొలి ప్రచురణ.
2007 ప్రస్తుత ప్రచురణ.
1930-50 మధ్య సుజాత, శోభ మొదలైన సాహిత్య మాస పత్రికలలో వచ్చిన వ్యాసాలు.
(ఈ పత్రికల గురించి ఎవరన్నా వివరిస్తే బాగుంటుంది. నేనయితే వీటి పేర్లు కూడా ఇప్పుడే వినటం)

పుస్తకంలో ఇంకొన్ని విశేషాలు.

painting brush  కు వర్తిక అని చక్కని తెలుగు పదం కలదు.
(మనమీ చక్కని తెలుగు పదాన్ని పునర్వినియోగంలోకి తీసుకొని రావచ్చు)
టోపీ అనే పదం వెయ్యేళ్ల నుండే వినియోగంలో ఉంది.
గొల్లెనలు అంటే డేరాలు.
ఓరుగంటి నగరాన్ని ఆంధ్ర నగరం అని పిలిచారు.
ఇండ్ల గోడలపై మన వాళ్లు చిత్రాలు ఎక్కువగా గీయించుకునేవారట.
మయ్యెర అంటే వెంట్రుకలతో చేసిన వర్తిక.
నిర్మల్ నుండి కత్తులు డెమస్కస్ (దిమిష్క) నగరానికి కూడా ఎగుమతి చేసేవారు కాకతీయుల కాలం నాడే.
కాకతీయుల కాలం నాడే రంకు రాట్నం ఉపయోగంలో ఉంది. (రంగుల రాట్నం)
కాకతీయుల కాలం నాడే పులి-మేక, చదరంగాలు, పాచికలాట ఆడేవారు.
ఈ విధంగా ఈ పుస్తకంలో పెక్కు ఆసక్తికరమైన విషయాలుండి సామాన్య పాఠకునికి కూడా ఆసక్తికరమే ఉండును.
తప్పక చదవదగ్గ పుస్తకం.
వెల 150 రూపాయలు.

You Might Also Like

8 Comments

  1. Ramakrishna

    మీ కృషి అమోఘం సర్

  2. ఆనంద్

    ఈ పుస్తకం ఇంటర్నట్ ఆర్కైవ్ లో చదువుకోవచ్చు.

    http://archive.org/stream/andrulasangikach025988mbp

  3. Pavan

    ఈ మహద్రచన గురించి ఇంత సవివరముగా తెలియచేసిన మీకు నా ధన్యవాదములు.. వ్రుత్తిరిత్యా పనిలో తలమునకలౌతూ, ఎప్పుడో ఖాలీ దొరికినప్పుడు నెట్లో తిరుగుతూ, తెలుగు, తెలుగువారు, తెలుగు చరిత్ర, గురించి చదివే నాకు, ఈ పుస్తకం గురించి వివరాలు దొరకడం మహదానందం గా ఉంది..
    వర్తిక, మల్లెనలు, మయ్యెర లాంటి తెలియని (మర్చిపోయిన) తెలుగు పదాలను తెలుసుకొన్నాను..
    వెంటనే ఆ పుస్తకం తెచ్చుకుని, చదవటం మొదలుపెడతాను..

  4. మాలతి

    పై వ్యాఖ్యలో పేర్కొన్నట్టు, ఈ బృహత్ గ్రంథానికి సాటి మరొకటి లేదు. ఇటువంటి పుస్తకాలను పాఠకులదృష్టికి తెచ్చిన రచయితకీ, పుస్తకం.నెట్ కీ అభినందనలు.
    మాలతి

  5. Dr.Acharya Phaneendra

    ఆరుద్ర తన ’సమగ్రాంధ్ర సాహిత్యం’ రచనలో, అధ్యాయాలను ఎలా విభజించుకోవాలా? – అని మథన పడుతున్నప్పుడు, ఈ గ్రంథమే ప్రేరణగా నిలిచి, మార్గం చూపిందని పేర్కొన్నారు.
    ’సుజాత’ స్వాతంత్ర్యానికి పూర్వం ‘నిజామ్’ సంస్థానంలోని తెలంగాణనుండి వెలువడిన పత్రిక. ఆనాటి తెలంగాణ ప్రజల ’శిష్ట వ్యావహారిక భాష’ ఎంత మృదుమధురంగా ఉండేదో తెలుసుకోవాలంటే ఈ పత్రిక ఉపకరిస్తుంది. ఈ పత్రిక సంచికలు కొన్ని ఇప్పటికీ హైదరాబాదు – చిక్కడపల్లిలో ఉన్న ’నగర కేంద్ర గ్రంథాలయం’లో ఉన్నాయి. ఈ పత్రిక వెలువడుతున్న కాలంలోనే, సురవరం ప్రతాప రెడ్డి కూడ, బహుళ ప్రసిద్ధమైన ’గోలకొండ’ పత్రికను నడిపేవారు. తలచుకొంటే ఈ వ్యాసాలన్నీ ఆయన తన పత్రికలోనే ముద్రించుకోవచ్చు. కానీ, తన రచనలు తన పత్రికలో కాకుండా, ఇతర పత్రికలలో అచ్చయితేనే ఆయన గౌరవంగా భావించేవారు.
    స్వాతంత్ర్యం వచ్చాక, ’కేంద్ర సాహిత్య పురస్కారాల’ను ఏర్పాటు చేసినప్పుడు – జాతీయ స్థాయిలో పురస్కారం పొందిన తొలి తెలుగు గ్రంథం ఇది. ఇప్పటికీ దీనికి సాటి రాగలిగేలా తెలుగు వారి సాంఘిక చరిత్రను వివరించే గ్రంథం రాలేదంటే అతిశయోక్తి కాదు.
    – డా.ఆచార్య ఫణీంద్ర

  6. కె.మహేష్ కుమార్

    మొత్తానికి చదవాలంటారు! ప్రయత్నిస్తాను.

  7. ఒరెమునా

    మోహన్ గారు,
    క్షమించాలి. ఇప్పుడు సరిచేశాను. (ఇన్ స్క్రిప్ట్ కి మారాను, కాని మొన్న ఊరు వెళ్లినప్పుడు అక్కడ ఆర్టీయస్ లో టైప్ చెయ్యాల్సి వచ్చింది, దానితో కొద్దిగా వేళ్లు తడబడ్డాయి. )

  8. c v r mohan

    A good review for a valuable book. But mispronouncing the great author’s name is not on. PRATHPA REDDY NOT PRABHAPAKAR REDDY, Pl amend it.
    Mohan

Leave a Reply