Fortune at the bottom of the pyramid

రచయిత: C.K.Prahalad.
Prahalad_0131877291_PB.qxdమొదట రచయిత గురించి కొంత సమాచారం: సి.కె.ప్రహ్లాద్ ప్రవాస భారతీయుడైన ఓ మేనేజ్‍మెంట్ గురు. ప్రముఖ విద్యాసంస్థల్లో పాఠాలు చెప్పడమే కాక కన్సల్టెంట్ గా మంచి పేరున్న వారు. కార్పోరేట్ ప్రపంచం లోని మెళుకువల గురించి ఆయన చాలా పుస్తకాలే రాసారు. వీటిలో చాలా పుస్తకాలు బెస్ట్ సెల్లర్లుగా పేరొందినవి కూడానూ. ఆయన పుస్తకాల్లో కొన్ని: The core competence of corporation, competing for the future, the future of competition మరియు Fortune at the bottom of the pyramid. ప్రస్తుతం రాబోయే కొత్త పుస్తకం – The new age of innovation.

అసలింతకీ “Bottom of the pyramid” అంటే? – ఈ పదం తరుచుగా ఆర్థిక స్థాయిల ప్రకారం అట్టడుగున ఉన్న అతి పెద్ద సంఖ్యలో ఉండే ప్రజలను ఉద్దేశించి వాడుతూ ఉంటారు. ప్రపంచ జనాభా ని వారి వారి ఆర్థిక స్థాయిని బట్టి విభజిస్తే, ఓ పిరమిడ్ ఆకారంలో పైనున్న కొద్ది మంది అతి ధనిక వర్గం,అక్కడ్నుంచి కాస్త కాస్తగా ఆర్థిక స్థోమత తగ్గుతూ కింద ఉండే ఆ పెద్ద వెడల్పైన భాగం ఉంటుందే – ఆ bottom of the pyramid మనం ఇక్కడ చెప్పుకునేది. ఈ పదాన్ని మొదట 1932లో రూజ్‍వెల్ట్ ఓ రేడియో ప్రసంగంలో వాడారు. తరువాతి కాలం లో తొంభైల్లో ప్రహ్లాద్, stuart hart దీనికి ప్రాచుర్యం కల్పించారు.

ఇంతకీ కథేంటి? : ఇప్పుడు మాట్లాడుతున్న పుస్తకం ఈ అట్టడుగు వర్గంలో ఉన్న ప్రజలను consumers గా చూసి వ్యాపారపరంగా లాభాలు తెచ్చుకోడంతో పాటు సంఘసేవ చేయడం ఎలా? అన్న అంశం మీద చర్చిస్తుంది. వినడానికి విషయం కాస్తంత సామాజిక స్పృహ ఉన్న ఏ మనిషికైనా కాస్త ఆసక్తికరంగా అనిపించడమే కాక చదవాలి ఈ పుస్తకం – ఎలా చేయొచ్చో తెలుసుకోవాలి అన్న కుతూహలం కూడా కలిగిస్తుంది. ఇంతకీ, పుస్తకం నేను పూర్తిచేయలేదు కనుక ఇంతకంటే ఎక్కువ వ్యాఖ్యానించలేను. ఏదో ఓరోజు దొరికితే కొన్ని పేజీలు చదివాను. నిజాయితీగా రాసినట్లే అనిపించింది చదివినంతలో.

ఈ పుస్తకం గురించి ఆన్లైన్లో ఉన్న లంకెలు:
1. Bottom of the pyramid అంటే? – ప్రహలాద్ వివరణ
2. Bottom of the pyramid – ప్రహ్లాద్, హార్ట్ ల వ్యాసం
3. పుస్తకం గురించి ప్రహ్లాద్ ఇంటర్వ్యూ ఇక్కడ.

సమీక్షలు:
1. వార్టన్ సైటు సమీక్ష ఇక్కడ
2. Barnes & Nobel వారి సమీక్ష ఇక్కడ.
3. Powells వారి సమీక్ష ఇక్కడ.
4. చిల్లీ బ్రీజ్ Dr Rupa Viswanathan సమీక్ష ఇక్కడ.
5. మరో సమీక్ష.
6. ఓ MBA విద్యార్థి అభిప్రాయాలు.

కౌంటర్లు:
1. Fortune at the Bottom of the Pyramid: A Mirage – అనిల్ కర్నాని పేపర్ ఇక్కడ.
2. Fortune at the Bottom of the Pyramid – An Alternate Perspective – ప్రహ్లాద్, కర్నాని కాక మూడో మార్గం, ఓ IIM ప్రొఫెసర్ సిద్ధాంతం గురించి ఇక్కడ.
3. ఓ చిన్న సైజు విమర్శ ఇక్కడ.
4. Skeptical సమీక్ష ఇక్కడ.
5. Greed at the top of the pyramid.

గూగుల్ బుక్స్ లో ప్రీవ్యూ ఇక్కడ.

ఈ పుస్తకాన్ని గురించి పరిచయం చేద్దామని ప్రయత్నించానే కానీ, మరే ఉద్దేశ్యం లేదని గమనించగలరు.

You Might Also Like

2 Comments

  1. Asooryampasya

    రేరాజ్ గారికి:
    వ్యాఖ్యకి ధన్యవాదాలు.
    వ్యాసంలోనే చెప్పినట్లు – అనుకోకుండా, ఈపుస్తకం కనిపిస్తేనూ, కొన్ని గంటలు దానితో గడిపాను. అంతే. తరువాత కుతూహలం కొద్దీ నెట్లో వెదికాను. తరువాత, ఆ పుస్తకం చదివే అవకాశం దొరకలేదు. దొరికిన పక్షంలో మళ్ళీ ఒక సవివర పరిచయం రాస్తాను.

  2. rayraj

    ఈ కంపైలేషన్ ఐడియా బావుంది. లింకుల్లో ఇచ్చినవి మంచి మెటీరియల్ ఐతే, బాగానే ఇచ్చినట్టు భావిస్తాను.

    కానీ,
    ౧.పుస్తకం ఎందుకు సగంలొ వదిలేశారు?
    ౨.మీకు బ్లాగు ఉంటే, ఆ పుస్తకంలో ప్రతి విషయం మీద మీ ఆలోచనలని కూలంకషంగా చర్చించమని అర్ధిస్తున్నాను.

    ఈ పుస్తకం నేనూ చదవలేదు. బహుశా చదివే తీరికాలేదు. కానీ, ఏం చెప్పాడో చెప్పి, అవి ఎందుకు ఆచరణయోగ్యమో/ లేక కావో చర్చిస్తే బావుంటుంది. చదవక పోయినా, నాకు ఈ బేసిక్ ఐడియామీద కొన్ని ఆలోచనలు, అభిప్రాయాలు ఆల్రెడీ ఉన్నాయి. ఎవరన్నా రాస్తే చదివేద్దామని కోరిక.అందుకని అడుగుతున్నాను.

Leave a Reply to rayraj Cancel